Thursday, December 20, 2007

 
కొమ్మ మీద కొకిలమ్మ
కుహు అన్నది
కుహుకుహు అన్నది
అది కూన విన్నది..ఒహో అన్నది


ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమవునో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానే శ్రుతి చేసి లయ కూర్చునో
అని తల్లి అన్నది
అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నది..కలలు కన్నది

ఈ లేత హ్రుదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నది
అది ఎవరు విన్నది
ఈ జిగురు చెవులకే గుర్తు ఉన్నది

సాహిత్యం: ఆత్రేయ

 
కదిలింది కరుణరధం
సాగింది క్షమాయుగం
మనిషికొరకు దైవమే
కరిగి వెలిగే కాంతిపధం

మనుషులు చేసిన పాపం
మమతల భుజాన ఒరిగింది
పరిశుద్ద ఆత్మతో పండిన గర్భం
వరపుత్రునికై వగచింది
దీనజనాళికై దైవకుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి
పాపక్షమాపణ పొందిన హ్రుదయాలు నిలివునా కరిగి నీరైనాయి

"అమ్మలార నా కోసం ఏడవకండి
మీ కోసం..మీ పిల్లల కోసం ఏడవండి"

ద్వేషం..అసూయ..కార్పణ్యం..ముళ్ళకిరీటమయ్యింది
ప్రేమ..సేవ..త్యాగం..నెత్తురై వొలికింది
తాకినంతనే స్వశ్థత నొసగిన తనువుపై కొరడా చెళ్ళంది
అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది
ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా
బెదిరిపోయిన మూగ కొనలు చెల్లాచెదురై కుమిలాయి

పరమవైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు
నెత్తురు ముద్దగ మారాయి
అభిక్షిత్తుని రక్తాభిషెకంతో ధరణి దరించి ముద్దడింది
శిలువను తాకిన కల్వరిరాళ్ళు..కలవరపడి అరిచాయి

 
ఆత్మీయత కరువైనా
అంధకారం ఎదురైనా
బ్రతకడమే బరువైనా
స్థితిగతులేవైనా

చిరునవ్వులతో బ్రతకాలి
చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ
అందరికోసం బ్రతకాలి..అందరినీ బ్రతికించాలి

బ్రతుకే నీకు భారమైతే ఆ బరువే దించుకో
కలతే లేని జీవితమంటే విలువే లేదులే
అలుపే లేక ఎ గేలుపు అవలీలగా రాదులే
నింగినంటు everst ఐనా నేల నుండి మొదలవ్తుంది
నమ్ముకోకు అద్రుష్టాన్ని..నమ్ముకో ధైర్యాన్ని
మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
ఉరకలు వేసే కిరణం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
చిరుదివ్వెలుగా వెలగాలి
లోకం నిండిన సోకం తుడిచే
వేకువగా ఉదయించాలి..వెన్నెలలే కురిపించాలి

పెరిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం
వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం

ఎది నీది కాదు అనుకో ఎదో నాటికి
ఆయిన రేపు మిగిలే ఉంది ఆశావాటికి
కొమ్మలన్ని చుక్కలవైపే కోరి కోరి చూస్తూ ఉన్న
మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా
చీడలే నీడలై వీడకున్న
అందరి బౄందావనమే జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
శ్రికరంలా బ్రతకాలి
గతమంతా కనుమరుగవుతున్నా
నిన్నటి స్వప్నం నిలవాలి..నీ సంకల్పం గెలవాలి

ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
ఆశే నీ లక్ష్యం చెరే ఆస్త్రం మిత్రమా
ఆశే నీకు ఆయువు పెంచే అమౄతం నేస్తమా
ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు నీ సొంతం
ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
నిప్పులే గుండెలో నిండుతున్నా
ఉప్పొంగే జలపాతం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి
చిగురాశలతో బ్రతకాలి
అంతిమ విజయం అనివార్యమని
ఆశిస్తూ నువ్వు బ్రతకాలి..ఆశయాన్ని బ్రతికించాలి

నీడె నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా
నలుసే నిన్ను భాధపెడితే ఆ ధోషం కంటిదా
నేస్తం చూడు జీవితం నిత్యం సమరమే
సమరంలో కనుమూస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఎ ఓటమికి ప్రపంచాన్ని విడిచి
జారిపోకు పాతాళనికి బ్రతుకుబాట మరచి
వరదలా మౄత్యువే తరుముతున్నా
ఆరని అగ్నిజ్వాలే జీవితం

చిరునవులతో బ్రతకాలి
శిఖరంలా పైకి ఎదగాలి
చావుకు చూపే ఆ తెగింపుతో
జీవించాలనుకోవాలి..నువ్వు జీవించే తీరాలి


విజయం తలుపు తెరిచేవరకు విసుగే చెందకు
విసుగే చెంది నిస్పౄహతో నీ వెనుకే చూడకు
చిందే చమట చుక్కకు సైతం ఉంది ఫలితమే
అది అందే వరకు సహనంతో సాగాలి పయనమే
అంతరాత్మ గొంతే నులిమి శాంతి కొరుకుంటవా
అలజడే నిలువునా అలుముకున్నా
అలుపెరుగుని చైతన్యం జీవితం

Monday, December 17, 2007

 
నేను నా దేసం
పవిత్ర భారతదేశం
సాటి లేనిది..ధీటు రానిది
శాంతికి నిలయం మన దేశం

అశోకుడు వెలసిన ధర్మ ప్రదేశం
బుద్దుడు వెలసిన శాంతి దేశం
బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
కులమత భేధం మాపిన త్యాగి
అమర బాపుజీ వెలసిన దేశం
వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం

కదం తొక్కిన వీర శివాజీ
వీర విహారిని ఝన్సీ రాణి
స్వరాజ్య సమరుడు నెతాజీ
జై హింద్...జై హింద్..జై హింద్
కట్ట బ్రహ్మన్న పుట్టిన దేశం

అజాదు సమరులే వల్లభ పటెలు, లజపతి, తిలక్, నౌరోజిలు
అంబులు కురిపిన మన అల్లూరి
భగత్ రక్తం చిందిన దేశం
హిందుస్థాన్ హమరా హై
హిందుస్థాన్ హమరా హై
హిందుస్థాన్ హమరా హై

గుళ్ళతుపాకి చూపిన దొరలకు గుండె చూపే మన ఆంధ్రకేసరి
శంతి దూత మన జవహర్ నెహ్రు
లాలబహదుర్ జన్మ దేశం
జై జవాన్..జై కిసాన్

 
తెలుగు వీర లేవరా… దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చెయరా

దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా…
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా…
దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా…
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా…
నిదుర వద్దు బెదర వద్దు…
నింగి నీకు హద్దురా…
నింగి నీకు హద్దురా…

ఎవడు వాడు ఎచ్చటి వాడు
ఇటు వచ్చిన తెల్లవాడు
కండ బలం గుండె బలం కబలించిన దుండగీడు
మాన ధనం ప్రాణ ధనం దోచుకున్న దొంగవాడు
ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు
తగిన శాస్తి చెయ్యరా…
తరిమి తరిమి కొట్టరా…

ఈ దెశం… ఈ రాజ్యం
నాదేనని చాటించి…
నాదేనని చాటించి…
ఫ్రతి మనిషి తొడలు కొట్టి
శ్రుంఖలాలు పగలగొట్టి
చుర కత్తులు పదను పట్టి
తుది సమరం మొదలుపెట్టి
సింహలై గర్జ్జించాలీ…
సంహారం సాగించాలీ…

వందేమాతరం..వందేమాతరం

ఓ… స్వతంత్ర వీరుడా స్వరాజ్య బాలుడా…
అల్లూరి సితారామ రాజా… సితారామ రాజా
అందుకో మా పూజలందుకో రాజా…
అందుకో మా పూజలందుకో రాజా…
అల్లూరి సితారామ రాజా

ఓ… తెల్లవారి గుండెల్లొ నిదురించిన వాడా…
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా…
త్యాగాలే వరిస్తాం… కష్టలే భరిస్తాం…
నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం…

 
జనని జన్మభూమిశ్చ..స్వర్గాధపి గరియసి
ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా

నీ తల్లి మోసేది నవమాసలేరా
ఈ తల్లి మోయాలి కడవరకురా..కట్టే కాలేవరకురా
ఆ రుణం తలకొరివితో తీరెనురా
ఈ రుణం ఏ రుపానా తీరెదిరా
ఆ రూపమే ఈ జవానురా
త్యాగానికి మరో రూపు నువ్వురా

గుండె గుండెకి తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండెకోత భాదెంతో
నీ గుండె రాయి కావాలి
ఆ గుండెలో ఫిరంగులు మ్రోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషి
మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషులకోసం..నీ మనుషలకోసం ..ఈ మనుషలకోసం

 
Do love Mother India

You too love India

జనని, జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం
ఎది అది ఎక్కడో వెతకమంటున్నది గురుకులం
గుండె పిండుకొని దాగిన గుక్కెడు పాలగులుకులేనెప్పుడు
పోత పాలసీసాల కోసమై పరుగలాటలే ఎపుడూ


అకాశంలో ఆ సుర్యుడొక్కడే
అభ్యుదయంలో నా దేశమొక్కటే
ఆ సుర్యుడెప్పుడూ తూరుపు దిక్కునే ఎందుకు పుడతాడు
కళ్యాణ తిలకమై కన్న తల్లి వడిలోనే ఉంటాడు
అలంటిదేరా నా భారతదేశం
సనాతనంలో సమిష్ఠి దేశం
ఆ సనాతనంలో గల పునాదిలోనే సంకరమవుతుంటే
నా అభ్యుదయానికి సభ్యసమాజమే సమాధి కడుతుంటే
తరతారల దాస్యం తెంచుకున్న ఈ స్వరాజ్య దేశంలో
యువతరాలు మళ్ళీ పరాయి బిక్షకు పరుగులు తగునా

I Love my India
Lovely Mother India
You too love India
Do love Mother India

పరాయిదేశంలో కిరాయి కోసమని
స్వదేశజ్ఞానం సవారి కడుతుంటే
ఆ కూలి దబ్బు డాలర్లలోనే సుఖజీవనముందంటే
ఆ పాలిగాపు నీ పాలి శ్రతువై తిరిగి వెళ్ళమంటే
కడుపుతీపికే కన్నీటి రోదనై
కన్నతండ్రికే అది మూగ వేదనై
ఆ నారుపోసి నీరెత్తినొళ్ళకు ఫలితం ఏముంది
ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ప్రతిష్ఠ ఏముంది
ఆ కీర్తిప్రతిష్ఠల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి
దురాగతాల అలంకారులు చేయుట న్యాయమా..ధర్మమా

 
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో
అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో

ఒక్కటంటె ఒక్క life..ఎడిపించకు దాన్ని

పెదవులపై విరబూసే నవ్వు పువ్వులు వాడవురా
సరదాగా నవ్వేస్తె దిగులు నిన్నిక చూడదురా
రాత్రిలో సొగసు ఎమిటో చూపడానికె చుక్కలు
బ్రతుకులో తీపి ఎమిటో చెప్పడానికె చిక్కులు

నవ్వంటూ తోడుంటే చందమామవి నువ్వే
నీ చుట్టూ చీకటికి వెండి వెన్నల నీనవులే
నువ్వలా శాంతి గువ్వలా నవ్వు రవ్వలే చిందని
గల గల నవ్వగలగడం మనిషి ఒక్కడికే తెలుసని

ఒక్కటంటె ఒక్క life....నవ్వుకొని దాన్ని

 
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండని ఊపిరే నువ్వని
ఎన్నడు ఆగని పయనమే నీదని

కనురెప్ప మూసిఉన్న..నిదరొప్పుకోదు అన్న
నిను నిలువరించినా ఓ స్వప్నమా
అమవాసలు ఎన్నైనా..గ్రహణాలు ఎవ్వైనా
నీ కళను దోచెనా ఓ చంద్రమా
తన వడిలో ఉన్నది రాయో రత్నమో పోల్చదు నేల్లమ్మ
ఉలి గాయం చేయకపోతె ఈ శిల శిల్పం కాదమ్మ
మేలుకో మిత్రమా..
గుండెలో జ్వాలలే..జ్యోతిగా మారగా
చీకటే దారిగా..వెకువే చేరగా

చలికంచె కాపున్నా..పొగమంచు పొమన్నా
నీ రాక ఆపెనా వసంతమా
ఏ బండ రాళ్ళైనా..ఏ కొండ ముళ్ళైనా
బెదిరేనా ఈ వాన ఆషాడమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలొ ఉంటె చాలు సుమా
కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా
సాగిపో నేస్తమా..
నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా
ఓరిమే సాక్షిగా ఓటమే ఓడదా

 
నేను నేనుగ లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

పూల చెట్టు ఊగినట్టూ పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు ఓ చిరు నవ్వు
తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో యెవరేనువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన
మీకేవరికి కనిపించదు ఏమైనా...ఓ

చుట్టుపక్కలెందరున్న గుర్తు పట్టలేక వున్న
అంత మంది ఒక్కలాగే కనబడతుంటే
తప్పు నాది కాదన్న ఒప్పుకోరు ఒక్కరైన
చెప్పలేది నిజం ఏదో నాకు వింతే
కళ్ళ నొదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే..ఓ

 
సాహసం నా పధం..రాజసం నా రధం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం..పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చేయదా ఉడిగం
శాసనం దాటడం సఖ్యమా
నా ప్రగతిలో ఏ ప్రతిఘటన
ఈ పిడికిలిలో తనోదుగునుగా


నిశ్చయం..నిశ్చలం
నిర్భయం..నా హయం

కానిదేముంది నే కోరుకుంటే..పూని సాదించుకోనా
లాభమేముంది కలకాలముంటే..కామితం తీరకుండా
తప్పని.ఒప్పని..తర్కమే చెయ్యను
కష్టమో..నష్టమో..లెక్కలే వెయ్యను
ఊరుకుంటే కాలమంతా..జారిపోదా ఊహవెంట
నే మనసు పడితే ఏ కలలనైన..ఈ చిటిక కొడుతూ నే పిలువనా


అదరని..బెదరని..ప్రవుత్తి
ఒదగని మదగజమే మహర్షి

వెడితే లేడి ఒడి చేరుతుందా..వేట సాగాలి కాదా
ఒడితే జాలి చూపెనా కాలం..కాలరాసేసి పోదా
అంతమో..సొంతమో..బంధమే వీడను
మందలో మందలా ఉండనే ఉండను
భీరువలే పారిపోను...రేయి ఒళ్ళొ దూరిపోను
నే మొదలు పెడిటే ఏ సమరమైనా..నాకెదురు పడునా ఏ అపజయం

 
పాటల పల్లకివై ఊరెగే చిరుగాలి
కంటికి కనపడవే నిన్నెక్కెడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాశకి శ్వాశ ఆడదే
నిన్నె చెరుకొనిదే గుండెకి సందడుండదె
నీ కొసమే అన్వేషణ
నీ రూపు రేఖలెమో ఎవరిని అడగాలి

నిలాల కనుపాప లొకాన్ని చూస్తుంది
తన రూపు తానెప్పుడు చూపించలెనంది
అద్దంలా మెరిసే ఒక హ్రుదయం కావాలి
ఆ మదిలొ వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనుక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది
రెప్పలు తెరిచే మెలకువలొ కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కల్లు ఎవరిని అడగాలి

పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించె భావాల ఉనికేది
వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గూటిని చూపుమా
ఈ నిమిషంలొ నీ రాగం నా మది తాకింది
తనలొ నన్నె కరిగించి పయనిస్తూ ఊంది

 
మనసు కాస్త కలతపడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనుల నీరు తుడుచువారు
ఎవరు లేరని చితి ఒడి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి
నూరేళ్ళు నిండుగా జీవించమన్నది


కలసి రాని కాలమెంత కాటేస్తున్నా
చలి చిదిమేస్తున్నా
కూలిపోదు వేరు ఉన్న తరువేదైనా
తనువే మోడైనా
మాను జన్మ కన్న..మనిషి ఎంత మిన్న
ఊపిరిని పోసే ఆడదానివమ్మ
బేలవై కూలితే నేలపై ప్రాణముండదమ్మ


ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు
పరిమార్చవే కీడు
కాళివైతే నీ కాలికింద అణుగును చూడు
నిను అణిచేవాడు
మౄత్యువును మించే హాని ఎక్కడుంది
ఎంతటి గాయమైనా మాని తీరుతుంది
అందుకే పద ముందుకే..లోకం రాదా నీ వెనకే

 
తెలిమంచు కరిగింధి తలుపుతీయనా ప్రభూ!
ఇలగొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ!
నీ తోవ పొడవునా కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువల వందనం

ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ! పవళించు భువనాలు
భానుముర్తి! నీ ప్రాణకీర్తన విని
పలుకని ప్రణతులని ప్రణవశ్రుతిని
పాడని ప్రక్రుతిని ప్రధమక్రుతిని

భూపాల! నీ మ్రొల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు
పసరు పవనాలలొ పసికూన రాగలు
పసిడి కిరణల పడి పదను తేరిన చాలు
తలయూచు తలిరాకు బహుపారకులు విని
దొరలనీ దోరనగపు దొంతరని
తరలనీ దారి తొలగి రాతిరిని

 
ఒక అమ్మాయి గురించి

సిరివెన్నెల మా(పా)టలో

నేల్లమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ గాలమ్మ
కనరమ్మా సంబరం
మీ అందరి అందాలు ఒకటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం

అవని అందము కుదురు లేనిది
ఎడాదిఒక్కటే వసంతమున్నది
ఋతువు మారినా చెదిరిపోనిది
అమ్మయి మేనిలో అందాల పెన్నిధి
తుళ్ళకే అలా గంగవెల్లువ
సొగసు పొంగులో ఈమె సాటివా
వయ్యారి ఒంపులు నీ వంటికున్నవా


కలికి కళ్ళలో కలల మెరుపుతో
నువ్వు చిన్నబోదువే నీలాల గగనమా
చిలక సొంపులో ఇంత మైకమా
చిరుగాలి నువ్వలా స్తంభించిపోకుమా
చెలియ తనువులో వేడి తాకితే
చలికి వణకవా సూర్యబింబమా
ఆ మంచు మంటతొ జాబిలిగా మారవా

మరి వేటూరి మా(పా)టలో

పైరులోని పచ్చదనం..పట్టు చీర కట్టింది
నీరేండల వెచ్చదనం..నుదుట బొట్టు పెట్టింది
పుప్పొడి చెక్కిలుగా..పుత్తడి తన వళ్ళుగా
పున్నమి ఈ కన్యగా..పుడమిలోన పుట్టింది

తూరుపు ఉదయిస్తుంది ఎర్రని పెదవులు వెకువగా
పడమర జోకొడుతుంది నల్లని కురులే రాతిరిగా
హిమాలయం ఎదురుస్తొంది చల్లని ఆ చిరునవ్వులుగా
సాగరమే పొంగుతుంది ఆ కన్యకుమారి కులుకులుగా
దిక్కులు నాలుగు ఒక్కటి చేసి చెక్కిన చక్కెర బొమ్మను చూసి
ఉక్కిరిబిక్కిరి కదాయగా

ఆమని విరబూస్తుంది ఆమెను చూసిన కన్నులలో
వేసవి వేధిస్తుంది ఆ చెలి చేరని వెన్నెలలో
మెరుపుల తొలకరి పుడుతుంది మెలికలు తిరిగిన వన్నెలలో
చలి చలి కొరిక చిగురిస్తుంది నెచ్చలి వెచ్చని కౌగిలిలో
ఋతువులు ఆరు అతివగ మారి..జతకై చెరిన వెతలే తీరి

 
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలసి
శ్రీరామచందురుడ్ని కొవ్వేలొ ఖైదు చేసి
రాకాసి రావణుడ్ని గుండెలొ కొలువు చేసి
తల తిక్కల భక్తితో తైతక్కలా మనిషి

వెతికే మజలి దొరికే దాకా
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా..క్షణమైనా మిన్నాగునా
కట్టాలి నీలొని అన్వెషణ..కన్నిటిపై వంతెన
బెదురంటూ లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూ లేని ప్రశ్న లెదు లొకాన
నీ శొకమే శ్లొకమై పలికించరా మనిషి

అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసు వంచి దారియ్యవా
అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషెకమెగా
ఆ రామ గాధ నువ్వు రాసుకున్నదే కాదా
అది నేడు నీకు తగిన దారి చూపకుందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషి

before this song is recorded there is another version for this Song written by Sirivennela which is given below (not available in Audio)

కపికులం కపికులం మనుషుల రూపంలో
కలకలం కలకలం మనసుల మౌనంలో
కపికులం కపికులం నరుల సమూహంలో
కలకలం కలకలం భక్తి ప్రవాహంలో

సుడిగాలిలాగ రెచ్చి, గుడిలోకి తరలివచ్చి
మదిలోని బురద తెచ్చి ముదిరేటి భక్తి పిచ్చి
అది నీ పాదాలపై వదిలిందిరా దేవా…

మనిషిలో మనిషిని చూసావా దేవా?
మనసులో మురికిని భక్తని అనుకోవా?
భేరీలు పగలగొట్టి, బూరాలు ఎక్కుపెట్టి
పిలిచింది శక్తి కొద్దీ, బీభత్సమైన భక్తి
ఈ కేకల ధాటికి వైకుంఠమే దిగవా!

భజనలే చేయరా చిడతలు చేపట్టి
పూజలే జరపరా పూనకమే పుట్టి!
గుడిలోన అడుగుపెట్టి, కోరికల కూతపెట్టి
వెను తరుముంటె భక్తి గుండెల్లొ గుబులు పుట్టి
భగవంతుడే గడగడా వణకాలిరా నరుడా!

 
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటె మేఘాలరాగం ఇల చేరుకోదా

వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద

బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికిగల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద

 

వేణుమాధవా ఆ ..ఆ...వేణు మాధవా.....ఆ ..ఆ..

ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో

ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో

ఆ శ్వాసలో నే లీనమై

ఆ మోవిపై నే మౌనమై

నిను చేరని మాధవా.. ఆ.. ఆ..

మునులకు తెలియని జపములు జరిపినదా ....

మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా

తనువున నిలువున తొలిచిన గాయమునే తన జన్మకి

తరగని వరముల సిరులని తలచినదా

కౄష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది

ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది

వేణు మాధవా నీ సన్నిధి

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో

ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదోచల్లని

నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలు వైపుల నడి రాతిరి

ఎదురవదాఅల్లన నీ అడుగులుసడి వినబడక హౄదయానికి

అలజడితో అణువణువు తడబడదా ఆ.. ఆ..ఆ ..ఆ...ఆ..

నువ్వే నడుపు పాదమిదినువ్వే మీటు నాదమిది

నివాళిగా నా మది నివేదించు నిముషమిది వేణు మాధవా నీ సన్నిధి


 
» Sirivennela Lyrics--Atu America Itu India--Nuvvevaraina
నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే
అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే
మనసు తడితే నీ నా చెంపను నిమిరే వెచ్చని కన్నీరొకటే
ఏ దేశం వారికి ఐనా ఇల ఒకటే గగనం ఒకటే
ఏ భాషను పలికిస్తున్నా గొంతులు స్వరతంత్రులు ఒకటే
ఆహారం వేరైనా అందరి ఆకలి ఒకటే
ఆకారం వేరైనా ఆధారం బ్రతుకొకటే
నిన్నూ నన్నూ కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే
ఎన్నో రంగుల తెల్లకిరణమై వెలుగుతున్న జీవితమొకటే
ఏ రూపం చూపెడుతున్నా ఉలి కదలికలకు శిల ఒకటే
ఏ రాగం వినిపిస్తున్నా పిల్లనగ్రోవికి గాలొకటే
నీ నాట్యం పేరేదైనా ఆధారపు కదలికలొకటే
ఏ ప్రాంతంలో నువ్వున్నా ప్రాణాలకి విలువొకటే
నీకూ నాకూ అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే
నువ్వూ నేనూ వీరూ వారూ అంతా కలిసి మనమొకటే

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]