Thursday, July 16, 2009

 

Onamalu nerpalani - ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా -- iddaru iddare

ANR
ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నన్న
కలిసొచ్చిన కాలానికి..నడిచొచ్చిన కోడుకుకి
స్వాగతం చెబుతున్న..నేనే పసివాడినై నీ నీడ చెరుతున్నా
Nag
జీవితాన ప్రతి పాఠం చెదే అనుకున్నా
తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా
అనుభందపు తీరానికి నడిపించిన గురువని
వందనం చేస్తున్నా..నేనే గురుదక్షిణగా అంకితమవుతున్నా

ANR
ఉడుకునెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలని
ఆపదలో పడనీయక దీపం చూపాలని
వచ్చిన ఈ పిచ్చి తండ్రి పిత్రురుణం తీర్చి
చల్లారిన ఒంటికి నీ వేడిరక్తమిచ్చి
తోడైయిన నీ ముందు ఓడానా..గెలిచానా?
Nag
ఒకే తండ్రినుంచి రెండు జన్మలందుకున్నా
తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్నా

ANR
పగలే గడిచింది..పడమర పిలిచింది
వయసు పండి వాలుతున్న సూర్యుడ్ని నేను
కాచుకున్న కాళరాత్రి గెలిచే సులువేమిటో
కాటుకనని ఈడొచ్చిన నువ్వు చెప్పు వింటాను
Nag
రాతిరి కరిగింది..తూరుపు దొరికింది
కళ్ళు తెరిచి ఇపుడిప్పుడే ఉదయిస్తున్నాను
అచ్చమైన స్వచ్చమైన తెలుపంటే ఎమిటో
మచ్చలేని నీ మనసుని అడిగి తెలుసుకుంటాను
ANR
ఇన్నాళ్ళ మన దూరం ఇద్దరికి గురువురా
ఒకరి కధలు ఇంకొకరికి సరికొత్త చదువురా
Nag
పాఠాలు ఎమైనా నీతి ఒక్కటే నాన్న
చీకట్లు చీల్చడమే అయుధమెమైనా

Labels: ,


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]