Saturday, January 29, 2011

 
too much మచ్చా too much జచ్చా too much
makeup లేని faces
gossip లేని పేపర్స్
లాకౌప్ డెత్ ఒక్కటైనా లేని policestations too much
leekage లేని college
teasing లేని teenage
late అవ్వకుండా trains వచ్చేసే railway stations too much
corruption అంటూ లేనేలేని government office
donation అంటూ లేకుండనే seat ఇచ్చేసే convent
fever వస్తే tumour దాక testలు రాయని doctor
ఇల్లాంటివన్ని ఇలాతరంలో ఇవ్వాళ కూడ ఉన్నాయంటే
too much

చిరంజీవి సినిమాకి first day ticket దొరికితే too much
సిటిబసులో conductor change తిరిగి ఇస్తే too much
MTV Channel చూడక cartoon channel చూసే పిల్లలు ఉండే ఇల్లుంటుందని నమ్మావంటే too much
పక్క flatలొ ఎవ్వరున్నారో నీకు తెలిస్తే too much
చక్కెర వ్యాధే రాకుండా నీ షష్టి పూర్తి ఐతే too much
హత్యవార్తలు లేని daily
సెక్స్ ప్రశ్నలు లేని weekly
ఇల్లాంటివన్ని ఇలాతరంలో ఇవ్వాళ కూడ ఉన్నాయంటే too much

శ్రీశ్రీ ఎవరో గురజాడ ఎవరో నీకు తెలిస్తే too much
రాజధానిలో traffic rules పాటిస్తే too much
మధ్యంతరమంటూ లేక మద్దతు అవసరమే రాక మన దేశంలో ఒకే ప్రభుత్వం ఇదేళ్ళుంటే too much
సచిన్ లేకుండ cricket matchలో మనం గెలిస్తే too much
కరంట్ కోతలు లేకుండ summer గడిస్తే too much
ముష్టివాళ్ళే లేని temples
అప్పుల బాధేలేని కొంపల్స్
ఇల్లాంటివన్ని ఇలాతరంలో ఇవ్వాళ కూడ ఉన్నాయంటే too much


చిత్రం:- అనగనగా ఒక అమ్మాయి
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- మణి శర్మ
గానం:- దేవి శ్రీప్రసాద్

#too much# macchaa #too much# jacchaa #too much#
#makeup# lEni #faces#
#gossip# lEni pEpars
laakaup Det okkaTainaa lEni #policestations too much#
#leekage# lEni #college#
#teasing# lEni #teenage#
#late# avvakunDaa #trains# vacchEsE #railway stations too much#
#corruption# anTU lEnElEni #government office#
#donation# anTU lEkunDanE #seat# icchEsE #convent#
#fever# vastE #tumour# daaka #test#lu raayani #doctor#
illaanTivanni ilaataramlO ivvaaLa kooDa unnaayanTE
#too much#

chiranjeevi sinimaaki #first day ticket# dorikitE #too much#
siTibasulO #conductor change# tirigi istE #too much#
#MTV Channel# chooDaka #cartoon channel# choosE pillalu unDE illunTundani nammaavanTE #too much#
pakka #flat#lo evvarunnaarO neeku telistE #too much#
chakkera vyaadhE raakunDaa nee shashTi poorti aitE #too much#
hatyavaartalu lEni #daily#
seks praSnalu lEni #weekly#
illaanTivanni ilaataramlO ivvaaLa kooDa unnaayanTE #too much#

SrISrI evarO gurajaaDa evarO neeku telistE #too much#
raajadhaanilO #traffic rules# paaTistE #too much#
madhyantaramanTU lEka maddatu avasaramE raaka mana dESamlO okE prabhutvam idELLunTE #too much#
sachin lEkunDa #cricket match#lO manam gelistE #too much#
karanT kOtalu lEkunDa #summer# gaDistE #too much#
mushTivaaLLE lEni #temples#
appula baadhElEni kompals
illaanTivanni ilaataramlO ivvaaLa kooDa unnaayanTE #too much#


chitram:- anaganagaa oka ammaayi
saahityam:- sirivennela
sangeetam:- maNi Sarma
gaanam:- dEvi SrIprasaad

 
చుట్టూ చెంగావి చీర
కట్టాలే చిలకమ్మా
బొట్టు కాటుక పెట్టి
నే కట్టే పాటను చుట్టి
ఆశపడే కళ్ళలో ఊసులాడు వెన్నెలబొమ్మ

తెల్లచీరకి అందం నువ్వే తేవాలే చిట్టెమ్మా
నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నెమ్మా
ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా
పచ్చచీర కట్టుకుంటే పంటచేను సిరివమ్మా

నేరేడ కళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దొరాడే పరవళ్ళు
వంగపండు రంగులోన పొంగుతాయి సొగసులు
వన్నెవన్నె చీరల్లోనా నీ వోళ్ళే హరివిల్లు

సినిమా:- తూర్పు వెళ్ళే రైలు
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- బాలు
గానం:- బాలు

chuTTU chengaavi cheera
kaTTaalE chilakammaa
boTTu kaaTuka peTTi
nE kaTTE paaTanu chuTTi
aaSapaDE kaLLalO oosulaaDu vennelabomma

tellacheeraki andam nuvvE tEvaalE chiTTemmaa
nallacheera kaTTukunnaa navvaalE chinnemmaa
erracheera kaTTukunTE sandepoddu nuvvammaa
pacchacheera kaTTukunTE panTachEnu sirivammaa

nErEDa kaLLa rangu jeeraaDE kucchiLLu
oorinchE oohallO doraaDE paravaLLu
vangapanDu rangulOna pongutaayi sogasulu
vannevanne cheerallOnaa nee vOLLE harivillu

sinimaa:- toorpu veLLE railu
saahityam:- vETUri
sangeetam:- baalu
gaanam:- baalu

 
మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
రుజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా
నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట
గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా తప్పులుంటె ఒప్పనంటా
నీవెంటే నేనువుంటా చూస్తుంటా ఓరకంట
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా


నువ్వే మా మొదటి guestని
మా ఆవిడ వంట bestని
ఈ feastకి పిలుచుకొస్తిని taste చెప్పి పోరా
ఇదే మా విందు భోజనం
మీరే మా బంధువీ దినం
రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి తెలుపుతారా
అపార్ధం చేసుకోరుగా
అనర్ధం చెయ్యబోరుగా
యదార్ధం చేదుగుంటది
పదార్ధం చెత్తగున్నది
ఇది విందా నా బొందా
తిన్నోళ్ళూ గోవిందా
జంకేది లేదింక నీ టెంక పీకెయ్యక పదరకుంకా


భళారే నీలి చిత్రమా
భలేగా వుంది మిత్రమా
ఇలా రస యాత్ర సాగదా పక్కనుంటె భామా
కోరావు అసలు ట్రూతును
చూపాను సిసలు బూతును
చిక్కారు తప్పు చేసి ఇక మక్కెలిరగదన్ను
తమాషా చూడబోతిరా
తఢాఖా చూపమందురా
మగాళ్ళని ఎగిరి పడితిరా
మదించి మొదలు చెడితిరా
సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా
లాకప్పు పైకప్పు మీ కిప్పుడే చూపుతా
బెండు తీస్తా

 
ఏం కొంప మునగదోయి పక్క దారి పట్టినా
పొరపాటు కాదు భాయి
కుడి యెడమైనా
తిమ్మిని బమ్మిని చెయి
నందిని పందిని చెయి
తెలివకదే రుజువు
బొమ్మను బొరుసు చెయి
కాసును Toss వెయ్యి
విలువ మారిపోదు
సొమ్ముంటే చాలురోయి
తప్పులు ఒప్పులు అవునోయి

-----

పనేమి చేసినా పర్వా నై
money పోగు చేయి
కొనేయవచ్చును court ఆయినా
మిలీయనీరువై
to be not to be dilemma
దినం తీర్చదోయి
rupee noteపై ఏ crime
రాసివుండదోయి
legalO illegalO
మాటలెందుకు వదిలేసయి
rate ఎంతో అడగవోయి
నీతులు చేతులు కడతాయి

------

మరి సూటిగా పరిగేడితే
పైకి రావురోయి
power raceలో గెలుపొకటే
పరమ లక్ష్యమోయి
పురాణలతో ఏ పూట
పొట్ట గడవదోయి
సుఖం చూసుకో చంటబ్బాయి
సూక్తులెందుకోయి
బ్రతకడం రానప్పుడే
నీతిబోధలు మొదలవుతాయి
కంచులా gold ఎప్పుడు
మోత చెయ్యదు కద బాబాయి
templeలొ దక్షిణ వేయి
పాపాలు పరారవుతాయి

 
రోజావే చిన్ని రోజావే..రాగాలే రువ్వే రోజావే
నాలొ కదిలే ప్రాణాలే..ఒక పాటై నిన్నే చేరాలే

ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో
దారంత చలువ పందిళ్ళే వేసి..నీ కోసం నీడై ఉన్నా
నాలో నేనే లేనే లేను..నేను నిన్నే నాలో కొలువుంచాను

మెరుపంటి నీ రాకకే మనసే మెఘంలా మారిందిలే
చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెలా కరిగిందిలే
తొలిచినుకే తాకే నేలలే పులకించా నీ ఉహతో
రానే రావు ఓనమాలు..కాని నీలో చదివా ప్రియ వేదాలు

చిత్రం:- సూర్యవంశం
సాహిత్యం:- సామవేదం షణ్ముఖ శర్మ
సంగీతం:- ఎస్.ఎ.రాజ్ కుమార్
గానం:- హరిహరన్


rOjaavE chinni rOjaavE..raagaalE ruvvE rOjaavE
naalo kadilE praaNaalE..oka paaTai ninnE chEraalE

aakaaSam andaalanTU dUkE keraTamlaa prEmE naalO
aa hOru nee pErunE palikE mantramlaa naa gunDelO
daaranta chaluva pandiLLE vEsi..nee kOsam neeDai unnaa
naalO nEnE lEnE lEnu..nEnu ninnE naalO koluvunchaanu

merupanTi nee raakakE manasE meghamlaa maarindilE
chirugaalai talapE taaki kadili niluvelaa karigindilE
tolichinukE taakE nElalE pulakinchaa nee uhatO
raanE raavu Onamaalu..kaani neelO chadivaa priya vEdaalu

chitram:- sooryavamSam
saahityam:- saamavEdam shaNmukha Sarma
sangeetam:- es.e.raaj kumaar
gaanam:- hariharan

 
ఏమయ్యా ఓ రామయ్యా!
ఏమయ్యా ఓ రామయ్యా!
ఎలా సేవించాలయ్యా?
నిను ఏమని కీర్తించాలయ్యా?

పదములు పడదామనుకుంటే మారుతి చరణలొదలడు
పదములు పడదామనుకుంటే మారుతి చరణలొదలడు
ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు
ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు
పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయారు
పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయారు
ప్రాణాలిద్దాం అనుకుంటే పక్షి జటాయువులుంటారు

ఏమయ్యా ఓ రామయ్యా!
ఎలా సేవించాలయ్యా?
నిను ఏమని కీర్తించాలయ్యా?

కమ్మని చరితం రాద్దామంటే కవి వాల్మికిని కానయ్యా
కమ్మని చరితం రాద్దామంటే కవి వాల్మికిని కానయ్యా
గానంతో కొలవాలనుకుంటే ఘన త్యాగయ్యను కాదయ్యా
గానంతో కొలవాలనుకుంటే ఘన త్యాగయ్యను కాదయ్యా
ఆశతో కోవెల కడదామంటే తాహశిల్దారును కానయ్యా
ఆశతో కోవెల కడదామంటే తాహశిల్దారును కానయ్యా
ఆఖరికి మనసిద్దామంటే అది ఏనాడో నీదయ్యా


ఆల్బం:- శ్రీరామ గానామ్రుతం
సాహిత్యం:- ఆరుద్ర
సంగీతం:- కె వి మహదేవన్
గానం:- బాలు

Emayyaa O raamayyaa!
Emayyaa O raamayyaa!
elaa sEvinchaalayyaa?
ninu Emani keertinchaalayyaa?

padamulu paDadaamanukunTE maaruti charaNalodalaDu
padamulu paDadaamanukunTE maaruti charaNalodalaDu
phalamulu tinipinchaalanTE paapam Sabariki beduru
phalamulu tinipinchaalanTE paapam Sabariki beduru
paadam kaDagaalanukunTE padapaDi guhuDE tayaaru
paadam kaDagaalanukunTE padapaDi guhuDE tayaaru
praaNaaliddaam anukunTE pakshi jaTaayuvulunTaaru

Emayyaa O raamayyaa!
elaa sEvinchaalayyaa?
ninu Emani keertinchaalayyaa?

kammani charitam raaddaamanTE kavi vaalmikini kaanayyaa
kammani charitam raaddaamanTE kavi vaalmikini kaanayyaa
gaanamtO kolavaalanukunTE ghana tyaagayyanu kaadayyaa
gaanamtO kolavaalanukunTE ghana tyaagayyanu kaadayyaa
aaSatO kOvela kaDadaamanTE taahaSildaarunu kaanayyaa
aaSatO kOvela kaDadaamanTE taahaSildaarunu kaanayyaa
aakhariki manasiddaamanTE adi EnaaDO needayyaa


aalbam:- SrIraama gaanaamrutam
saahityam:- aarudra
sangeetam:- ke vi mahadEvan
gaanam:- baalu

 
రాయినైనా కాకపోతిని రామపాడం సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితం రాయగా
పడవనైనా కాకపోతిని స్వామికార్యం తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా

అడవిలోపల పక్షినైతే అతివసీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా
అడవిలోపల పక్షినైతే అతివసీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా
కడలి గట్టున ఉడుతనైతే ఉడత సాయం చేయనా
కాలమెల్లా రామభద్రుని వేలిగురుతులు మోయనా

కాకినైనా కాకపోతిని ఘతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా
కాకినైనా కాకపోతిని ఘతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా
మహిని అల్పజీవులే ఈ మహిమలన్ని నోచగా
మనిషినై జన్మించినాను మత్సరమ్ములు రేపగా
మద మత్సరమ్ములు రేపగా


ఆల్బం:- శ్రీరామ గానామ్రుతం
సాహిత్యం:- ఆరుద్ర
సంగీతం:- కె వి మహదేవన్
గానం:- పి సుశీల

raayinainaa kaakapOtini raamapaaDam sOkagaa
bOyanainaa kaakapOtini puNyacharitam raayagaa
paDavanainaa kaakapOtini swaamikaaryam teerchagaa
paadukainaa kaakapOtini bhaktiraajyamu nElagaa

aDavilOpala pakshinaitE ativaseetanu kaachanaa
anduvalana raamachandruni amita karuNanu nOchanaa
aDavilOpala pakshinaitE ativaseetanu kaachanaa
anduvalana raamachandruni amita karuNanu nOchanaa
kaDali gaTTuna uDutanaitE uData saayam chEyanaa
kaalamellaa raamabhadruni vEligurutulu mOyanaa

kaakinainaa kaakapOtini ghatukammunu chEyuchU
gaDDipOchanu Saramu chEsE ghanata raamuDu choopagaa
kaakinainaa kaakapOtini ghatukammunu chEyuchU
gaDDipOchanu Saramu chEsE ghanata raamuDu choopagaa
mahini alpajeevulE ee mahimalanni nOchagaa
manishinai janminchinaanu matsarammulu rEpagaa
mada matsarammulu rEpagaa


aalbam:- SrIraama gaanaamrutam
saahityam:- aarudra
sangeetam:- ke vi mahadEvan
gaanam:- pi suSeela

 
భలేవాడివి శ్రీరామ శ్రీరామ
నీ బడాయి చాలును రఘురామా రఘురామా
ప్రభావమన్నది ఉంటే ఆ ప్రతిభను ఇపుడే చూపించు

మొట్టమొదట నువ్వు చంపినది ఎవ్వరిని
అట్టహాసముగ తాటకనే
అబలను చంపుట అదేమి ఘనము
నా అహంకారమును మద్దించు

చక్కని చుక్కల ముక్కుచెవులు
టక్కున గ్రక్కున కోయిస్తావట
ఉక్కురి బిక్కిరి చేస్తూ
నాలో ఉన్నది కామం దండించు

చాటున దాగి శరములు వేసే
మేటి యోధుడవు నీవు కదా
శత్రువులు ఆర్గురు నాలో దాగిరి
చంపుము వారిని..గ్రోవుము వీడిని

ఆల్బం:- శ్రీరామ గానామ్రుతం
సాహిత్యం:- ఆరుద్ర
సంగీతం:- కె వి మహదేవన్
గానం:- బాలు

bhalEvaaDivi SrIraama SrIraama
nee baDaayi chaalunu raghuraamaa raghuraamaa
prabhaavamannadi unTE aa pratibhanu ipuDE choopinchu

moTTamodaTa nuvvu champinadi evvarini
aTTahaasamuga taaTakanE
abalanu champuTa adEmi ghanamu
naa ahankaaramunu maddinchu

chakkani chukkala mukkuchevulu
Takkuna grakkuna kOyistaavaTa
ukkuri bikkiri chEstU
naalO unnadi kaamam danDinchu

chaaTuna daagi Saramulu vEsE
mETi yOdhuDavu neevu kadaa
Satruvulu aarguru naalO daagiri
champumu vaarini..grOvumu veeDini

aalbam:- SrIraama gaanaamrutam
saahityam:- aarudra
sangeetam:- ke vi mahadEvan
gaanam:- baalu

 
పున్నమి రాత్రి..పువ్వుల రాత్రి
వెల్లువ నాలో..పొంగిన వెన్నెల రాత్రి

మగువ సోకులే మొగలి రేకులై
మత్తుగ పిలిచే రాత్రి
మరుడు నరుడిపై మల్లెలు చల్లి
మైమరపించే రాత్రి
ఈ వెన్నెలలో..ఆ వేదనలో
నాలో వయసుకు నవ రాత్రి
కలగా మిగిలే కాళరాత్రి

కోడెనాగుకై కొదమనాగిని
కన్నులు మూసే రాత్రి
కామదీక్షలో కన్నెలందరు
మోక్షం పొందే రాత్రి
నా కౌగిలిలో..ఈ రాగినితో
తొలకరి వలపుల తొలి రాత్రి
ఆఖరి పిలుపుల తుది రాత్రి


సినిమా:- పున్నమి నాగు
సాహిత్యం:- ????
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

punnami raatri..puvvula raatri
velluva naalO..pongina vennela raatri

maguva sOkulE mogali rEkulai
mattuga pilichE raatri
maruDu naruDipai mallelu challi
maimarapinchE raatri
ee vennelalO..aa vEdanalO
naalO vayasuku nava raatri
kalagaa migilE kaaLaraatri

kODenaagukai kodamanaagini
kannulu moosE raatri
kaamadeekshalO kannelandaru
mOksham pondE raatri
naa kougililO..ee raaginitO
tolakari valapula toli raatri
aakhari pilupula tudi raatri


sinimaa:- punnami naagu
saahityam:- ????
sangeetam:- chakravarti
gaanam:- baalu

 
||ప|| |ఆమె|
పిలిస్తే పలుకుతానని, పిలిస్తే పలుకుతానని,
పిలిస్తే పలుకుతానని పలు మార్లు ఇదే మాటని,
నువ్వే అన్నావని అంతా అంటే విని
ఆశగా ఆర్తిగా ఆశ్రయించాను ఆదుకోమని సాయి చేదుకోవోయి
.
చరణం:
నమ్మని వారిని సైతం వదలక నడిపిన నీ చేయి,
నాకూ అందించవా సాయి
నవ్విన వారికి సైతం వరములు కురిపించావోయి
నా పై అలకెందుకు సాయి
నిన్న దాక నా కన్నులు మూసిన అహం అలిసిపోయి
కన్నీట కరిగిపోయి
నిన్ను గాక ఇంకెవరిని వేడను అంటున్నది సాయి
పాదాలు కడగనీయి
ఏమరపాటున ఉన్నావా, నా మొర వినలేకున్నావా
నా పొరపాటును మన్నించక నువ్వ్ ఏమేమో అనిపిస్తావా
తలొంచే తలపు చాలని, క్షణం లో కరుగుతానని
జయిస్తే మాయ ప్రశ్ననీ జవాబై దొరుకుతానని
నువ్వే అన్నావని అంతా అంటే విని
గుండెలో నిండుగా ఆ అభయ ముద్రనే నింపుకున్నాను సాయి చేదుకోవోయి
.
చరణం:
నీ చిరునవ్వుల శాంతికి తానే రూపమైనదోయి
ఈ దీపాన్ని కాపు కాయి
పరుల కోసమే నిను ప్రార్ధించే నెచ్చెలి చేదోయి,
పచ్చగ బతక నీయి సాయి,
నిత్యం ను కొలువుండే ఆ మది ఆమెది కాదోయి,
అది నీ ద్వరకామాయి,
నిట్ట నిలువునా కోవెల కూలితె నష్టం నీదోయి,
నీకే నిలువ నీడ పోయి
ప్రేమను పంచే ప్రియ నేస్తం, ప్రేమను పెంచే సుమ శాస్త్రం,
ప్రేమను మించిన దైవం లేదను నీ సూక్తికి భాష్యం,
చలించని భక్తి నిండని, పరీక్షించేది నేనని,
తెలిస్తే చింత లేదని, తరించే దారదేనని
నువ్వే అన్నావని అంతా అంటే విని
ఆలన పాలన అన్నీ నీవని విన్నవించనీ సాయి చేదుకోవోయి

 
parugulu teesE vayasunTE..
urakalu vesE manasunTE..
bratukE oka railubanDi..
saradaala prayaaNamanDi

aapada undani nilabaDipotE..
aagadu samayam E nimisham
chiru chiru navvula deepam unTE..
chikkula cheekaTi maTumaayam
dikkulanni daaTukupovAli..chukkalunna majili chEraali..
bangaru merupula sampadalanni mungililOnE nilapaali
sandEhinchaka mundukupotE gelupu chikkaDam khAyam..
doosukupoyE dhairyam unTE oDakatappadu kaalam

konDalu kOnalu aDDunnaayani..
saagaka maanadu selayEru
gala gala paaTala hushaaru unTE..
alasaTa talavadu aa jOru
aakaaSapu anchulu taakaali..aanandapu lOtulu chuDaali
kOrina swargam chErina naaDE..
manishiki viluvani chaaTaali..
alOchinchaka aDugulu vestE..aDusu tokkaDam khAyam..
nElanu viDichina saamulu chestE..tagalaka tappadu gaayam


పరుగులు తీసే వయసుంటే..
ఉరకలు వెసే మనసుంటే..
బ్రతుకే ఒక రైలుబండి..
సరదాల ప్రయాణమండి

ఆపద ఉందని నిలబడిపొతే..
ఆగదు సమయం ఏ నిమిషం
చిరు చిరు నవ్వుల దీపం ఉంటే..
చిక్కుల చీకటి మటుమాయం
దిక్కులన్ని దాటుకుపొవాలి..చుక్కలున్న మజిలి చేరాలి..
బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలిలోనే నిలపాలి
సందేహించక ముందుకుపొతే గెలుపు చిక్కడం ఖాయం..
దూసుకుపొయే ధైర్యం ఉంటే ఒడకతప్పదు కాలం

కొండలు కోనలు అడ్డున్నాయని..
సాగక మానదు సెలయేరు
గల గల పాటల హుషారు ఉంటే..
అలసట తలవదు ఆ జోరు
ఆకాశపు అంచులు తాకాలి..ఆనందపు లోతులు చుడాలి
కోరిన స్వర్గం చేరిన నాడే..
మనిషికి విలువని చాటాలి..
అలోచించక అడుగులు వెస్తే..అడుసు తొక్కడం ఖాయం..
నేలను విడిచిన సాములు చెస్తే..తగలక తప్పదు గాయం

 
mitrulaaraa..ningi nEla kalipEddaamu lEvanDiraa
oTami manaku lEne lEdu raaranDiraa
idE maa aahvanam
savaalE chesindiraa jeevitam
javaabE cheppaaliraa andaram

bratikunDagaane mruti chendanEla?
gunDelalo kanDalalo
dhairyam Souryam tyaagam lakshyam ragilincharaa
manasunna neeku maraNaalu lEvu
cheekaTilo chintalalo
dharmam ardham kaamam mOksham veligincharaa
nee Orpu neekunTe padivEluraa
niTTUrputO neeku panilEduraa

biDDala kannadi manamu
vaaLLaku manamE dhanamu

ee musaloLLu asalaina paDuchOluraa
praaNaalanaina daanalu chesE
aatmabalam dharmaguNam manalo unTE
talavanchE karmElaraa
bhramalOna paDDa ee pasikandulantaa
tanDrulugaa taatalugaa marina roju
teliyaka tappadu mana vEdana
mana kanna maharaajulinkEvaruraa
mana kunna santrupti manadEnuraa
kashTamu sukhamu telusu
kalimi lEmi telusu
manakika teliyandi venukanjaraa


మిత్రులారా..నింగి నేల కలిపేద్దాము లేవండిరా
ఒటమి మనకు లేనె లేదు రారండిరా
ఇదే మా ఆహ్వనం
సవాలే చెసిందిరా జీవితం
జవాబే చెప్పాలిరా అందరం

బ్రతికుండగానె మ్రుతి చెందనేల?
గుండెలలొ కండలలొ
ధైర్యం శౌర్యం త్యాగం లక్ష్యం రగిలించరా
మనసున్న నీకు మరణాలు లేవు
చీకటిలొ చింతలలొ
ధర్మం అర్ధం కామం మోక్షం వెలిగించరా
నీ ఓర్పు నీకుంటె పదివేలురా
నిట్టూర్పుతో నీకు పనిలేదురా
బిడ్డల కన్నది మనము
వాళ్ళకు మనమే ధనము
ఈ ముసలొళ్ళు అసలైన పడుచోలురా

ప్రాణాలనైన దానలు చెసే
ఆత్మబలం ధర్మగుణం మనలొ ఉంటే
తలవంచే కర్మేలరా
భ్రమలోన పడ్డ ఈ పసికందులంతా
తండ్రులుగా తాతలుగా మరిన రొజు
తెలియక తప్పదు మన వేదన
మన కన్న మహరాజులింకేవరురా
మన కున్న సంత్రుప్తి మనదేనురా
కష్టము సుఖము తెలుసు
కలిమి లేమి తెలుసు
మనకిక తెలియంది వెనుకంజరా

 
నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికి..తేలదే ఎన్నటికి
అందుకే నీ కధకి అంతులేదప్పటికి
తీరాలు లేవే ప్రేమ నీ దారికి

కలతలే కోవెలై కొలువయే విలయమా
వలపులో నరకమే వరమనే విరహమా
తాపమే దీపమా? వేదనే వేదమా?
శాపమే దీవెనా? నీకిదే న్యాయమా?
కన్నీరభిషేకమా నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా ప్రణయమా

రెప్పలే దాటవే ఎప్పుడు ఏ కల
నింగినే తాకదే కడలిలో ఏ అల
నేలపై నిలవదే మెరుపులో మిల మిల
కాంతిలా కనపడే బ్రాంతి ఈ వెన్నెల
అరణ్యాల మార్గమా? అసత్యాల గమ్యమా?
నీతో పయనమే పాపమా ప్రణయమా


nuvvu evvari edalO puvvula Rtuvai eppuDu vastaavO
ninnu nammina jatalO navvulu chidimi enduku pOtaavO
teliyadE evvariki..tEladE ennaTiki
andukE nee kadhaki antulEdappaTiki
teeraalu lEvE prEma nee daariki

kalatalE kOvelai koluvayE vilayamaa
valapulO narakamE varamanE virahamaa
taapamE deepamaa? vEdanE vEdamaa?
SaapamE deevenaa? neekidE nyaayamaa?
kannIrabhishEkamaa niraaSa naivEdyamaa
madilO manTalE yaagamaa praNayamaa

reppalE daaTavE eppuDu E kala
ninginE taakadE kaDalilO E ala
nElapai nilavadE merupulO mila mila
kaantilaa kanapaDE braanti ee vennela
araNyaala maargamaa? asatyaala gamyamaa?
neetO payanamE paapamaa praNayamaa

 
నీకే నువ్వు అర్ధంకావా ఎన్నాళ్ళైనా..
నిన్నే నీకు చూపించాల ఎవ్వరైనా..
ఏం కోరుతుంది అన్వేషణ
మనసే మొత్తంగా వింటున్నవా ఇప్పుడైనా

నీకేం కావాలో అడగాలనుకుంటే..ప్రశ్నంటూ ఉండాలిగా..
నీ భావం ఎంటో చెప్పాలనుకుంటే..స్పష్టంగా తెలియలిగా..
ఉయ్యాలలో పసిపాపలా..కల ఆటలో అలవాటులా..
ఆరాటమే నెడుతుండగా..పరుగెందుకే తడబాటుగా..
మనసే మొత్తంగా వింటున్నవా ఇప్పుడైనా

ఈనాటిదాక నీతొనే ఉందా..నువ్వు వెతికా ఆ పెన్నిధి
చెజారేదాక నీకే తేలిదా..పోయిందనే సంగతి
నీ గుండెలో ఈ సవ్వడి..ఇన్నాళ్ళుగా లెదేం మరి
ఏ గువ్వకో గూడైనది..కనకే ఇలా బరువైనది
మనసే మొత్తంగా వింటున్నవా ఇప్పుడైనా

 
రాళ్ళతో ముళ్ళతో నేస్తమే నాదిరా
నొక్కినా తొక్కినా నొప్పిగా లేదురా
బరువునే పరువుగా మోసేటి ఈ బ్రతుకు
నేర్పింది ఒక్కటే..
ఊపిరిండే వరకు ఉసూరుమనక
ఎప్పుడు నవ్వుతూ బ్రతకాలిరా

నోరారా నవ్వేద్దాం
ఖరీదులేదు చిన్న నవ్వుకి
కళ్ళారా నిదరోదాం
ఖర్చేమి కాదు కంటి పాపకి
నా సంగీతం గాలి పాట
నా సావాసం పూల తోట
నాకే సొంతం లొకమంత
నాకేమాత్రం లేదు చింత

వీళ్ళే బంధువులు అంటూ లేరు
జనమంతా నాకు చుట్టాలే
ఇల్లు వాకిలి అంటూ వెరే లేదు
జగమంతా నాకు సొంతిల్లే
ఆకలి తీరితే చాలునంది నా కడుపు
అందుకే మరి లేదుగా నాకు ఏ తలుపు

సంతోషాన్ని మించి ఆస్తి పాస్తి
ఇంక వెరే ఎందుకనుకున్నా
అంతే నేర్చుకోని అంతే చాలునని
అదే పంచిపెడుతున్నా
కొటలొ ఒక రాజులా ఉండలేను నేనసలు
తొటలో ఒక పువ్వులా ఉండని చాలు

 
ముద్దుకే ముద్దొచ్చే .. మువ్వకే నవ్వొచ్చే

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్విందీ సింగారం
ముద్ద మందారం .. ముగ్ధ శృంగారం

అడుగులా .. అష్ఠపదులా
నడకలా .. జీవ నదులా
పరువాల పరవళ్ళు పరికిణీ కుచ్చిళ్ళు
విరివాలు జడ కుచ్చుల సందళ్ళు
కన్నెపిల్లా కాదు కలల కాణాచి
కలువ కన్నులా కలల దోబూచి


పలుకులా .. రాచిలకలా
అలకలా .. ప్రేమ మొలకలా
మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్ళు
మల్లెపువ్వా కాదు మరుల మారాణి
బంతిపువ్వా పసుపు తాను పారాణి

 
మాయదారి క్రిష్ణయ్య ఎంతటివాడో..ఓరయ్యొ
నాటకల బూటకల నీటుకాడు వాడు..ఓరయ్యొ
ఆడదాని చూసి ఆగలేడు వాడు
జంటకోరి వెంట పడతాడు
ఆశ రేపుతాడు, ఊసులాడుతాడు, రాస క్రీడలాడు
మంత్రగాడు, తంత్రగాడు

పొరిగింటి పాలు..హరిలో రంగ హరి,
ఇరుగింటి పెరుగు..హరిలో రంగ హరి
పొరిగింటి పాలు..ఇరుగింటి పెరుగు
మరిగినాడు వెన్నదొంగ
ఆ పాలకడలి..హరిలో రంగ హరి,
యజమానుడైనా..హరిలో రంగ హరి,
ఆ పాలకడలి యజమానుడైనా
పరుల పాడి కోరనేలా?
ఎంతవారికైనా ఎదుటి సొమ్ము తీపి
ఏమి దేవుడండి..అన్యుల ఆస్తి..మోజు జాస్తి

పదహారువేల..హరిలో రంగ హరి
సతులున్నవాడు..హరిలో రంగ హరి
పదహారువేల సతులున్నవాడు
రాధనేల వీడడంట?
ఆ మేనయత్త..హరిలో రంగ హరి
తొలి వలపు కాదా..హరిలో రంగ హరి
ఆ మేనయత్త తొలి వలపు కాదా
మొదటి ప్రేమ మరువడంట
వాడి దివ్యలీల, కావ్యగీత మాల
చెప్పినాను చాలా..పాడుకోంది భక్తులారా

సినిమా:- మిస్టర్ పెళ్ళం
సాహిత్యం:- ఆరుద్ర
సంగీతం:- కీరవాణి
గానం:- బాలు

maayadaari krishNayya entaTivaaDO..Orayyo
naaTakala booTakala neeTukaaDu vaaDu..Orayyo
aaDadaani choosi aagalEDu vaaDu
janTakOri venTa paDataaDu
aaSa rEputaaDu, oosulaaDutaaDu, raasa kreeDalaaDu
mantragaaDu, tantragaaDu

poriginTi paalu..harilO ranga hari,
iruginTi perugu..harilO ranga hari
poriginTi paalu..iruginTi perugu
mariginaaDu vennadonga
aa paalakaDali..harilO ranga hari,
yajamaanuDainaa..harilO ranga hari,
aa paalakaDali yajamaanuDainaa
parula paaDi kOranElaa?
entavaarikainaa eduTi sommu teepi
Emi dEvuDanDi..anyula aasti..mOju jaasti

padahaaruvEla..harilO ranga hari
satulunnavaaDu..harilO ranga hari
padahaaruvEla satulunnavaaDu
raadhanEla veeDaDanTa?
aa mEnayatta..harilO ranga hari
toli valapu kaadaa..harilO ranga hari
aa mEnayatta toli valapu kaadaa
modaTi prEma maruvaDanTa
vaaDi divyaleela, kaavyageeta maala
cheppinaanu chaalaa..paaDukOndi bhaktulaaraa

sinimaa:- misTar peLLam
saahityam:- aarudra
sangeetam:- keeravaaNi
gaanam:- baalu

 
బెంగపడి సాదించేది ఏమిటి..మనకుంది కదా take it easy policy
what a pity..ఏం ముంచుకొచ్చింది..తమ ఫేసు మరి చినబోయిందేమిటి
ప్రాణహాని కాదు కదా ఐతే ఎమి మరి
జీవితాన ఆటుపోటులు అవి సహజం సుమతి

అవును మరి మీ సొమ్మేం పోయింది..మహ తేలికగా అనిపిస్తుంది మా గతి
ఏం sympathy..మహ బేషుగా ఉంది..దిగితేనే కదా లోతుపాటు తేలేది
మాటతోటి మాయమయేదా మంటెక్కే సంగతి
నాకు తెలియని theoryలా..చాలే నీ సుత్తి

రోజు ఎన్నో బస్సులు రైళ్ళు పల్టి కొడుతున్నా
journey చేయక కూర్చున్నారా ఇంట్లో ఎవరైనా
బోడి example అర్ధం ఎమిటి అడుక్కునే రమణ
దెబ్బ తగలితే అబ్బా అనడా ఎంతటివాడైనా
ఇలాంటివన్ని మాములే అనుకుంటే పోలే
మరి అలాగా నువ్వనప్పుడు అనుకుంటాలే
కాలికి వేస్తే వేలికి వెయ్యకు లాభం ఏముంది
బాధ చూసి బోధలు చెయ్యకు ఎదోగా ఉంది

harshad mehta కన్నా చక్రం అడ్డం తిరిగిందా
bofors ఆయినా ఏ force ఆయినా country ఆగిందా
చుట్టు అంతా OK ఐతే నాకేమి ఒరిగిందా
నా accountలో minus అంతా plus అయిపోతుందా
ఊసూరమంటూ అంటే కలిసొస్తుందా
సరే అలా అని ఆనందిస్తే బాగుంటుందా
ఈతి భాదలన్నవి ఎరుగని జీవుడి జాడేది
లేనిపోని tension దేనికి be brave ఓ సుమతి

సాహిత్యం:- సిరివెన్నెల
గానం:- చిత్ర,చక్రవర్తి

bengapaDi saadinchEdi EmiTi..manakundi kadaa #take it easy policy#
#what a pity#..Em munchukocchindi..tama fEsu mari chinabOyindEmiTi
praaNahaani kaadu kadaa aitE emi mari
jeevitaana aaTupOTulu avi sahajam sumati

avunu mari mee sommEm pOyindi..maha tElikagaa anipistundi maa gati
Em #sympathy#..maha bEshugaa undi..digitEnE kadaa lOtupaaTu tElEdi
maaTatOTi maayamayEdaa manTekkE sangati
naaku teliyani #theory#laa..chaalE nee sutti

rOju ennO bassulu raiLLu palTi koDutunnaa
#journey# chEyaka koorchunnaaraa inTlO evarainaa
bODi #example# ardham emiTi aDukkunE ramaNa
debba tagalitE abbaa anaDaa entaTivaaDainaa
ilaanTivanni maamulE anukunTE pOlE
mari alaagaa nuvvanappuDu anukunTaalE
kaaliki vEstE vEliki veyyaku laabham Emundi
baadha choosi bOdhalu cheyyaku edOgaa undi

#harshad mehta# kannaa chakram aDDam tirigindaa
#bofors# aayinaa E #force# aayinaa #country# aagindaa
chuTTu antaa #OK# aitE naakEmi origindaa
naa #account#lO #minus# antaa #plus# ayipOtundaa
oosUramanTU anTE kalisostundaa
sarE alaa ani aanandistE baagunTundaa
eeti bhaadalannavi erugani jeevuDi jaaDEdi
lEnipOni #tension# dEniki #be brave# O sumati

saahityam:- sirivennela
gaanam:- chitra,chakravarti

 
మొగుడు చెబితే వినాలి
మగమహరాజుకు జై అనాలి
మొగుడే మగడు మొంగగాడు
కండ గుండె కలవాడు
ఇంటికి lord వొంటికి guard
ఇల్లాలికి వాడే God

మందర మాటకి రామరాజ్యమే చిందర వందర అయ్యింది
ద్రౌపదివల్ల అన్నదమ్ములే తన్నుకు చావడం అయ్యింది
కుంటిసాకుతో క్రుష్ణమూర్తినే సత్యభామ తలతన్నింది
బ్రతిమాలంగా పావనగంగ పరమశివుని తలకెక్కింది
మనకే మొగుడవ్తుందిరో
కనకే మెడవంచాలి దించాలిరో

ఆడపిల్లగా పుట్టిన నాడే ఈడ కాదు ఆడ అయ్యింది
మంగలసూత్రం కట్టిన నాడే మన property అయ్యింది
మట్టెల్లు కాలికి పెట్టిన నాడే మెట్టు దాటి ఎగబాకింది
మూడు ముళ్ళతో, ఎడు అడుగులతో మెడకో గుదిబండ అయ్యింది
అసలే అది కిలాడిరా


moguDu chebitE vinaali
magamaharaajuku jai anaali
moguDE magaDu mongagaaDu
kanDa gunDe kalavaaDu
inTiki #lord# vonTiki #guard#
illaaliki vaaDE #God#

mandara maaTaki raamaraajyamE chindara vandara ayyindi
draupadivalla annadammulE tannuku chaavaDam ayyindi
kunTisaakutO krushNamoortinE satyabhaama talatannindi
bratimaalangaa paavanaganga paramaSivuni talakekkindi
manakE moguDavtundirO
kanakE meDavanchaali dinchaalirO

aaDapillagaa puTTina naaDE eeDa kaadu aaDa ayyindi
mangalasootram kaTTina naaDE mana #property# ayyindi
maTTellu kaaliki peTTina naaDE meTTu daaTi egabaakindi
mooDu muLLatO, eDu aDugulatO meDakO gudibanDa ayyindi
asalE adi kilaaDiraa

 
ANR
ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నన్న
కలిసొచ్చిన కాలానికి..నడిచొచ్చిన కోడుకుకి
స్వాగతం చెబుతున్న..నేనే పసివాడినై నీ నీడ చెరుతున్నా
Nag
జీవితాన ప్రతి పాఠం చెదే అనుకున్నా
తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా
అనుభందపు తీరానికి నడిపించిన గురువని
వందనం చేస్తున్నా..నేనే గురుదక్షిణగా అంకితమవుతున్నా
ANR
ఉడుకునెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలని
ఆపదలో పడనీయక దీపం చూపాలని
వచ్చిన ఈ పిచ్చి తండ్రి పిత్రురుణం తీర్చి
చల్లారిన ఒంటికి నీ వేడిరక్తమిచ్చి
తోడైయిన నీ ముందు ఓడానా..గెలిచానా?
Nag
ఒకే తండ్రినుంచి రెండు జన్మలందుకున్నా
తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్నా
ANR
పగలే గడిచింది..పడమర పిలిచింది
వయసు పండి వాలుతున్న సూర్యుడ్ని నేను
కాచుకున్న కాళరాత్రి గెలిచే సులువేమిటో
కాటుకనని ఈడొచ్చిన నువ్వు చెప్పు వింటాను
Nag
రాతిరి కరిగింది..తూరుపు దొరికింది
కళ్ళు తెరిచి ఇపుడిప్పుడే ఉదయిస్తున్నాను
అచ్చమైన స్వచ్చమైన తెలుపంటే ఎమిటో
మచ్చలేని నీ మనసుని అడిగి తెలుసుకుంటాను
ANR
ఇన్నాళ్ళ మన దూరం ఇద్దరికి గురువురా
ఒకరి కధలు ఇంకొకరికి సరికొత్త చదువురా
Nag
పాఠాలు ఎమైనా నీతి ఒక్కటే నాన్న
చీకట్లు చీల్చడమే అయుధమెమైనా

 
తాతలనాటి నీతుల చిట్ట
బట్టి పట్టి చేతులు కట్టుకు ఉండక..పడి ఉండక
రోజుల బట్టి లోకుల బట్టి
ఎప్పటికప్పుడు మారకపోతే దండగ..బ్రతికుండగ

ఔనన్నా..కాదన్నా
కాకుల కొట్టీ గద్దలకేసే లోకమిదిరా కన్నా
పదుగురి వోటు పొందిన రూటే రాచబాటర నాన్నా
మంచేదో చెడ్డదో తరికించేవాడి కన్నా
నలుగురికి వెనకాలే వెళ్ళిపోయేవాడు మిన్న

దొరలెవరు..దొంగెవరు
దొరికేవరకు తేలదు కనక బెంగ లేదుర బేట
అవసరమేదొ గప్ చుప్ గా కడ తేర్చుకో ప్రతి పూట
అడగనిదే అమ్మయినా పెట్టదు ఎది
సంఘంలో అందరిలా నీ వాట నీకు ఉంది
buy, beg, borrow లేకుంటే దోపిడి చేసైనా లాక్కో నీ వాట


సినిమా:- lucky chance
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- శ్రీ
గానం:- బాలు

 
చిత్రం
కోకిలమ్మ

గానం పి బి శ్రీనివాస్, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

సంగీతం ఎం ఎస్ విశ్వనాథన్‌

రచన
ఆత్రేయ


మధురం మధురం నాదం అది అమరం అమరం వేదం!
నాదం గానం సామం, స్వర కలితం లలితం రమ్యం
శ్రీ వాణీ వీణా జనితం,
సురమౌని మహతీ సరితం,
అతిలోక బ్రహ్మానందం, ఓంకారనాదం!
అమితం అమృతం నిరతం,
శిశు పశు ఫణి సహితం విదితం
శౌకం మధ్యమ దుహితం, త్రై కాల సంచారం
శ్రీ వాణీ వీణా జనితం, సురమౌని మహతీ సరితం, అతిలోక బ్రహ్మానందం, ఓంకారనాదం!

మామూలు వెదురే, మాధవ మురళియై, రాగాల సుధలే చిలికినది |2|
త్యాగయ్య గళమై, అన్నయ్య పదమై, వాగ్గేయ సిరులే కురిసినది
గీతం కవితా హృదయం, సంగీతం జనతా హృదయం, రాగం తానం మకుటం, త్రై మూర్తి రూపం

జయదేవ కవితై, గోవింద గీతై, పద్మావతేగా పలికినది |2|
ప్రియురాలి శోకమే, తొలి కావ్య శ్లోకమై, శ్రీ రామ చరితై నిలిచినది
తీరని దాహం గానం, కడతీర్చే జ్ఞానం గానం, రాగం భోగం మోక్షం, సంగీత యోగం!
శ్రీ వాణీ వీణా జనితం, సురమౌని మహతీ సరితం, అతిలోక బ్రహ్మానందం, ఓంకారనాదం!

 
ఎవ్వరో పాడారు భూపాలరాగం సుప్రభాతమయి
ఎవ్వరో పాడారు భూపాలరాగం సుప్రభాతమయి
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం..అభినందనం..అభినందనం

వాణియై..నాకు బాణియై
ఏ దయ నా హ్రుది మీటెనో
వాణియై..నాకు బాణియై
ఏ దయ నా హ్రుది మీటెనో
ఆ మూర్తికి స్త్రీమూర్తికి
అభినందనం..అభినందనం..అభినందనం

ఉషోదయాన కాంతి తానై
తుషారబిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతి
ఉషోదయాన కాంతి తానై
తుషారబిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతి

ఆ కాంతికి నా రాగమాలిక అర్పిస్తున్నా
మీ అందరి కరతాళ హారతులు అర్ధిస్తున్నా

నేడే అర్చన సమయం
మానవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం
గుడిలో ఘంటా నాదం
ఇది నా తొలి నైవేద్యం

వసంత కాల కోకిలమ్మ
జన్మాంతరాల రుణమా
నీ రుణమేరీతి చెల్లింతునమ్మా

నా జీవితమే ఇక నీ పధపీఠం
నీ దీవెనలే నాకు మహా ప్రసాదం

నేడే నా స్వర యజ్ణం
నేడే ఆ శుభలగ్నం
మదిలో మెదిలే రాగం
ఇక నా బ్రతుకే ధన్యం


సినిమా:- కోకిలమ్మ
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- విశ్వనాధన్
గానం:- బాలు

evvarO paaDaaru bhoopaalaraagam suprabhaatamayi
evvarO paaDaaru bhoopaalaraagam suprabhaatamayi
kanugonTini aa dEvini
abhinandanam..abhinandanam..abhinandanam

vaaNiyai..naaku baaNiyai
E daya naa hrudi meeTenO
vaaNiyai..naaku baaNiyai
E daya naa hrudi meeTenO
aa moortiki streemoortiki
abhinandanam..abhinandanam..abhinandanam

ushOdayaana kaanti taanai
tushaarabinduvu nEnai
saptaswaraala harivillunaiti
ushOdayaana kaanti taanai
tushaarabinduvu nEnai
saptaswaraala harivillunaiti

aa kaantiki naa raagamaalika arpistunnaa
mee andari karataaLa haaratulu ardhistunnaa

nEDE archana samayam
maanava jeevana udayam
edalO mamataa geetam
guDilO GhanTaa naadam
idi naa toli naivEdyam

vasanta kaala kOkilamma
janmaantaraala ruNamaa
nee ruNamEreeti chellintunammaa

naa jeevitamE ika nee padhapeeTham
nee deevenalE naaku mahaa prasaadam

nEDE naa swara yajNam
nEDE aa Subhalagnam
madilO medilE raagam
ika naa bratukE dhanyam


sinimaa:- kOkilamma
saahityam:- aatrEya
sangeetam:- viSwanaadhan
gaanam:- baalu

 
తెల్లరింది లెగండొయి..కొక్కొరోక్కో
మంచాలింక దిగండొయి..కొక్కొరోక్కో

పావులాంటి సీకటి పడగ దించిపోయింది
బయమునేదు బయమునేదు నిదర ముసుగుతీయంది
సావులాటి రాతిరి సూరు దాటిపోయింది
బయమునేదు బయమునేదు సాపలు సుట్టేయండి
ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది
మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనీయండి

సురుకు తగ్గిపోయింది, సెందురిడి కంటికి
సులకనైపోయింది - లోకం సీకటికి
కునుకు వచ్చి తూగింది - సల్లబడ్డ దీపం
ఎనక రెచ్చి పోయింది - అల్లుకున్న పాపం

మసక బారి పోయిందా సూసే కన్ను
ముసురు కోదా మైకం మన్నూ మిన్నూ
కాలం కట్టిన గంతలు తీసి
కాంతుల ఎల్లువ గంతులు ఏసి

----

ఎక్కిరించు రేయిన సూసి, ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుబెట్టి ఇసిరిందా, సూరిడి సూపుల బాణం
కాలి, బూడిదైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల నీడ

సెవట బొట్టు సవురుగా సూరిణ్ణి ఎలిగిద్దాం
ఎలుగు సెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
వెకువ శక్తుల కత్తులు దూసి
రేతిరి మత్తును ముక్కలు సేసి

 
స్వాతంత్ర్యం రాలేదని చెప్పింది ఎవ్వరురా
సూర్యోదయం చూడలేని గుడ్లగూబరా
స్వరాజ్యంలో కన్నీళ్ళకు కారణం ఎవ్వరురా
ధనార్జనే ధేయమైన రాజకీయ రాబందులురా

జండా ఉంచా రహే హమరా
విజయీవిశ్వ తిరంగా ప్యారా
పుట్టిపెరిగిన దేశం కోసం ప్రాణమిచ్చిన వారి గుండెరా
ఈ జండ ఈ జండ
ఇది భరతజాతి మెడలోని దండరా

ఊరితాడుని ముద్దాడిన భగత్ సింగ్ కన్నుల్లో
తూటలకు తెగిపడినా రామరాజు గుండెల్లో
అజాదు, సుఖదేవు, రాజగురు ఊపిరిలో
జలియన్ వాలాభాగులో ప్రవహించిన రక్తంలో
పుష్పించిన మందారం..ఈ జండా
వర్షించిన మకరందం..ఈ జండా
మనలాగే వాళ్ళు కూడా చదుసంధ్యలెక్కువంటే
వాళ్ళు కూడా మనలాగే కొలువేదొ చేసుకుంటే
చావంటే భయమంటే..చావచచ్చి బ్రతికుంటే
డిల్లినేలే దొరగారి కాళ్ళకాడ పడివుంటే
బానిసలై బ్రతికేవాళ్ళము..
తెల్లోడి గానుగెద్దులయేవాళ్ళము

భరతమాత పేరువింటే ఒళ్ళు పులకరించకుండా
ఎవరు ఆమె, ఎవ్వరయ్య, ఎవరి భార్య అనేవారు
august 15కు సెలవెందుకు వచ్చిందో
అర్ధంకానట్టి వాళ్ళు నెటి తరం కుర్రవాళ్ళు
ఎంత కర్మ పట్టినాదిరా..
ఈ జాతిని ఎవరు నిదురలేపుతారురా
రెడ్డి ఉండె, రాజూ ఉండె, కమ్మ ఉండె, కాపు ఉండె
అంధ్రుడన్నవాడు లేకపోయరా
హిందువుండె, ముస్లిం ఉండె, క్రిస్తవుదు సిఖ్ ఉండే
భారతీయుడన్నవాడు కానరాక పోయరా
త్యగాలు వ్రుధ ఆయరా..
మ్రుతవీరులా కన్న కలలు కల్లలాయెరా

 
జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె అల్లాడిపోదా రేయి ఆపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా

చిగురు పెదవి పైన చిరు నవ్వై చేరాలనుకున్నా
చెలియ మనసులోన సిరి మువ్వై ఆడాలనుకున్నా
ఉన్న మాట చెప్పలేని గుండెలొ విన్నపాలు వినపడలేదా
హారతిచ్చి స్వాగతించు కల్లలో ప్రేమ కాంతి కనపడలేదా
మరి అంత దూరమా కలలు కన్నా తీరమా
జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా

మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బోమ్మా
మనవి ఆలకించి మనసిస్తే చాలే చిలకమ్మా
ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా
తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహం అంటె ద్వేషమా
ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్నా నేస్తమా

 
క్లాసురూములో తపస్సు చేయుట వేస్టురా గురు
బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురు
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవరు
చేజారితే ఈలంటి రోజు రావు ఎన్నడు
అందుకే నువ్వు ప్రతిక్షణాన్ని అందుకో గురు

కాలేజిలో కాన్వేంటులో ఏం నేర్చుకున్నం మనమసలు
footpathలో foodవేటలొ నా అక్షరాభ్యాసం మొదలు
అడుగు అడుగు ఒక అవసరం
విషమ పరిక్షలే అనుదినం
ఎదురుపడిన భేతాళప్రశ్నలకు
బదులుపలకనిదే కదలవు ముందుకు
బ్రతుకు బళ్ళొ చదువంటే..వరద వొళ్ళొ ఎదురీతే


ఎంత కష్టపడి సొంత తిండి తిని..ఆకలిలో రుచి తెలుసుకున్న
కటిక నేలపడి ఒళ్ళు అలసి..నిద్దర్లో హాయిని కలుసుకున్న
జన్మలోనే తొలిసారి..చెమట పరిమాళాన్ని చూస్తున్న
freedom మన policy
మనమే మన fantasy
ఎవరివెనకనో నీడగా పడిఉండాలా మనం
యౌవనతరుణము రవ్వలు చిమ్మితే తలొంచాలి జనం
కెరాఫ్ గాలుగా బ్రతకమురా
yes we have our own dress and address


చేజారాకే తెలిసింది..గతకాలంలోని సౌందర్యం
దూరమునుంచె పిలిచింది..అనుబంధంలోని మాధుర్యం
మార్గం మన మొండితనం..దీపం మన గుండెబలం
కోరిన విలువలు చేతికి దొరకవా..అది చూద్దం చలో..చలో
జారిన వెలుగులు..తళ తళ వెలగవా..జ్వలించే కళ్ళలో
రేయే తెలియని సూర్యుడినవుతా
మాయే తగలని మెలకువనవుతా

 
స్వామి శరణం అయ్యప్పా..సర్వం నీవే అయ్యప్పా
నీ శుభచరణం అయ్యప్పా..బవభయ హరణం అయ్యప్పా

ఎమి జన్మమిది..ఎమి జీవనం..
ఇంక చాలు ఈ మాయ నటనం
పునరపి జననం..పునరపి మరణం
అంతా మిధ్య..నీవే శరణం

మడి అని..శుచి అని..నీతులు చెబుతూ
గుడిసెలలో దూరే భక్తులెందరో
దేవుని పేరిట మారణహోమం
సాగించే ఆ స్వాములెందరో
చిక్కిన పదవులు దక్కడానికి
చేయించే అభిషేకాలేన్నో
ప్రజల దోపిడికి పరిహారంగా
నిలువుదోపిడి అంతులేన్నో
జగన్నాటక సూత్రదారినని జనులంత నన్నంటారు
ప్రతి స్వార్ధపరుడి నాటకంలోన పాత్రధారినైపోయాను
అందరు నాతో మొరలిడితే
నేనెవరితో మొరలిడను
ఈ దేవునికే జరిగే మోసం..ఇంకే దేవునితో చెప్పుకోను

అలసితివేమో అయ్యప్పా..హారతి ఇదిగో అయ్యప్పా
పవళించుమైయా అయ్యప్పా..ఇది భక్తుని కోరిక అయ్యప్పా

సాహిత్యం:- సినారె
గానం:- బాలు



swaami SaraNam ayyappaa..sarvam neevE ayyappaa
nee SubhacharaNam ayyappaa..bavabhaya haraNam ayyappaa

emi janmamidi..emi jeevanam..
inka chaalu ee maaya naTanam
punarapi jananam..punarapi maraNam
antaa midhya..neevE SaraNam

maDi ani..Suchi ani..neetulu chebutU
guDiselalO doorE bhaktulendarO
dEvuni pEriTa maaraNahOmam
saaginchE aa swaamulendarO
chikkina padavulu dakkaDaaniki
chEyinchE abhishEkaalEnnO
prajala dOpiDiki parihaarangaa
niluvudOpiDi antulEnnO
jagannaaTaka sootradaarinani janulanta nannanTaaru
prati swaardhaparuDi naaTakamlOna paatradhaarinaipOyaanu
andaru naatO moraliDitE
nEnevaritO moraliDanu
ee dEvunikE jarigE mOsam..inkE dEvunitO cheppukOnu

alasitivEmO ayyappaa..haarati idigO ayyappaa
pavaLinchumaiyaa ayyappaa..idi bhaktuni kOrika ayyappaa

saahityam:- sinAre
gaanam:- baalu

 
గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ - నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ ఇన్నాళ్ళ ఊసులన్నీ

నీలిమబ్బులో నిలచిపోకలా నింగి రాగమాల
మేలిముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేల
కొమ్మ కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగ
ఇలకు రమ్మని చినుకుచెమ్మని చెలిమి కోరుకోనీ - నిన్ను కలుసుకోనీ

రేయిదాటని రాణివాసమా అందరాని తార
నన్నుచేరగ దారిచూపనా రెండు చేతులార
చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగ
తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ - నిన్ను కలుసుకోనీ

 
ఆ వన్నెలు ఎక్కడివి
తూర్పుకాంత మోములో
ప్రణయమో బిడియమో
తల్లినవుతానని గర్వమో

తల్లిని చేస్తాడని మగడిపైన వలపు
నెలతప్పిన నాటినుంచి బిడ్డడిదే తలపు
అమ్మా..అమ్మా అని విన్నప్పుడే ఆడబ్రతుకు గెలుపు
అందుకే ప్రతినిత్యం ప్రసవించును తూరుపు

నన్నయ్యకు ఏమి తెలుసు
యశోదమ్మ మనసు
ఆమె ఎదపై నిదురించిన కన్నయ్యకు తెలుసు
మగవాడికి ఆడగుండె అవసరమె తెలుసు
పాపాయికి ఆమె అమ్మతనం తెలుసు

-------------

ఆరవైకి ఆరెళ్ళకి ఎమిటి అనుబంధం
దీపానికి దెవుడికి ఉండే సంబంధం

పొద్దుగుంకిపోతున్న తరుణంలో
నేను చందమామ కావాలని కోరానా
వద్దన్న వచ్చింది వెన్నెల
కరిగిపొమ్మన్న పోకుంది ఈనాడు ఆ కల

అప్పుడు నీ అల్లరితో మురిపించావు
ఇప్పుడు నా బ్రతుకునే అల్లరి చేసావు
మనిషికి ఒక్కటే శిక్ష పెద్దతనం
తెలియని శ్రిరామరక్ష పసితనం

 
డబ్బెవరికి చేదు పిచ్చొడా..డబ్బెవరికి చేదు మంచోడా
ఈ భూమి తిరిగేది రూపాయి చుట్టూ
ఈ మనిషి కోరేది రూపాయి చెట్టు
డబ్బొక్కటే దైవము..డబ్బొక్కటే లోకము

పిసినిగొట్టువాడి శవం కాలదు ఏమిచేసినా
పచ్చనొటు పడగానే కాలుతుంది భగ్గున
లక్షలున్నవాడి మొదౌలు..బిక్షమెత్తువాడి వరకు
గుర్రాలపయి కాసి కాసి గాడిదలవుతారు కడకు
కుంటివాడ్ని గుడ్డివాడు దోచబోతే..ఇద్దరివి వేషాలే చూడబొతే
డబ్బన్నదో జబ్బురా..మందన్నదే లేదురా

కోటీశుని చావుకోసం చూస్తారు బందువులు
వీలుంటే అంత విషం పోస్తారు రాభందులు
చెట్టుకి రూపాయలే కాయగలిగితే
కాయలని వదిలేసి కోసుకుంటారు గుంపులే
రూపాయి వెంట మనిషి పరుగులెత్తితే
అది వల్లకాటి కాష్టంగా మారిపొతే
విశ్రాంతిరా నీకదే..డబ్బక్కడా బూడిదే


చిత్రం:- డబ్బెవ్వరికి చేదు
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ????
గానం:- బాలు

Dabbevariki chEdu picchoDaa..Dabbevariki chEdu manchODaa
ee bhoomi tirigEdi roopaayi chuTTU
ee manishi kOrEdi roopaayi cheTTu
DabbokkaTE daivamu..DabbokkaTE lOkamu

pisinigoTTuvaaDi Savam kaaladu EmichEsinaa
pacchanoTu paDagaanE kaalutundi bhagguna
lakshalunnavaaDi modaulu..bikshamettuvaaDi varaku
gurraalapayi kaasi kaasi gaaDidalavutaaru kaDaku
kunTivaaDni guDDivaaDu dOchabOtE..iddarivi vEshaalE chooDabotE
DabbannadO jabburaa..mandannadE lEduraa

kOTeeSuni chaavukOsam choostaaru banduvulu
veelunTE anta visham pOstaaru raabhandulu
cheTTuki roopaayalE kaayagaligitE
kaayalani vadilEsi kOsukunTaaru gumpulE
roopaayi venTa manishi parugulettitE
adi vallakaaTi kaashTangaa maaripotE
viSraantiraa neekadE..DabbakkaDaa booDidE


chitram:- Dabbevvariki chEdu
saahityam:- sirivennela
sangeetam:- ????
gaanam:- baalu

 
చిన్ని చిలకరా..వరాల చిట్టితల్లి వెన్నెలొలికెరా
చిలిపి చినుకరా..మరింత నిత్యమలె సిరులు చిల్కెరా
సాగి వచ్చెరా నిండు జాబిలి..
చిందులేసెరా గుండె లోగిలి
కిలకిల పలికెరా సెలయేరులా

పాడుబడిన పూలతోటలో పాలపిట్ట పాటలొచ్చి పలకరించెరా
మోడుచెట్టు గుండె గుమ్మలో గూడు కట్టి కమ్మనైన కధలు చెప్పెరా
తడబడే లేత అడుగులో..మొలిచేరా కొటి మెరుపులు
తల్లీ నీ రాకతో మదిలో ఉగాదులు
మళ్ళి ఎన్నాళ్ళకో మల్లెల మారాకులు
గలగల తరగల సంతోషాలు

ఎన్ని ఏళ్ళు గడిచిపోయినా..కళ్ళు వీడని నిదరలోనే ఎదురు చూసినా
గడియలోనే కరిగిపోయినా..చెలిమి జతని వెతికి వెతికి అలసిపోయినా
నీడలా ఉన్న జ్ణాపకం..నిజములా మారే ఈ క్షణం
పాప నీ నవ్వుల్లో పూచే దీపావళి
పలికే సిరిమువ్వలై తుళ్ళే ఈ అల్లరి
ఉరుకులై పరుగులై ఊరేగాలి

చిత్రం:- ప్రార్ధన
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ????
గానం:- బాలు

chinni chilakaraa..varaala chiTTitalli vennelolikeraa
chilipi chinukaraa..marinta nityamale sirulu chilkeraa
saagi vaccheraa ninDu jaabili..
chindulEseraa gunDe lOgili
kilakila palikeraa selayErulaa

paaDubaDina poolatOTalO paalapiTTa paaTalocchi palakarincheraa
mODucheTTu gunDe gummalO gooDu kaTTi kammanaina kadhalu chepperaa
taDabaDE lEta aDugulO..molichEraa koTi merupulu
tallI nee raakatO madilO ugaadulu
maLLi ennaaLLakO mallela maaraakulu
galagala taragala santOshaalu

enni ELLu gaDichipOyinaa..kaLLu veeDani nidaralOnE eduru choosinaa
gaDiyalOnE karigipOyinaa..chelimi jatani vetiki vetiki alasipOyinaa
neeDalaa unna jNaapakam..nijamulaa maarE ee kshaNam
paapa nee navvullO poochE deepaavaLi
palikE sirimuvvalai tuLLE ee allari
urukulai parugulai oorEgaali

chitram:- praardhana
saahityam:- sirivennela
sangeetam:- ????
gaanam:- baalu

 
అన్ని నీవనుకున్నా..ఎవరున్నరు నీకన్నా?
ఈ రాధమ్మ కోరేది నిన్నేనురా
కలనైనా రమ్మని పిలిచేవా?
నా కన్నుల్లో చెమ్మలు తుడిచేవా?

గుండె పగిలిపోతున్నా గొంతు విప్పలేను
కలలు చెరిగిపోతున్నా కలత చెప్పలేను
ఈ మూగ రాగమేదొ ఆలకించవా
ఆలకించి నన్ను నీవు ఆదరించవా

చందమామ రాకుంటే కలువ నిలువ లేదు
జతగ నీవు లేకుంటే బ్రతుకు విలువ లేదు
ఇన్నాళ్ళు కాచుకున్న ఆశ నీదిరా
ఆశ పడ్డ కన్నె మనసు బాస నీదిరా

చిత్రం:- భగత్
సాహిత్యం:- ????
సంగీతం:- నవీన్ జ్యొతి
గానం:- చిత్ర

anni neevanukunnaa..evarunnaru neekannaa?
ee raadhamma kOrEdi ninnEnuraa
kalanainaa rammani pilichEvaa?
naa kannullO chemmalu tuDichEvaa?

gunDe pagilipOtunnaa gontu vippalEnu
kalalu cherigipOtunnaa kalata cheppalEnu
ee mooga raagamEdo aalakinchavaa
aalakinchi nannu neevu aadarinchavaa

chandamaama raakunTE kaluva niluva lEdu
jataga neevu lEkunTE bratuku viluva lEdu
innaaLLu kaachukunna aaSa neediraa
aaSa paDDa kanne manasu baasa neediraa

chitram:- bhagat
saahityam:- ????
sangeetam:- naveen jyoti
gaanam:- chitra

 
హే పాండురంగ, పండరినాథ
శరణం శరణం శరణం

బాబా శరణం సాయి శరణు శరణం
బాబా చరణం గంగ యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయె ఆ పాండురంగడు కరుణామయుడు సాయె

విద్యా బుద్దులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపలు కోరిన వారిని కరుణించాడు సర్వేస్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై
మహల్స శ్యామకు మారుతి గాను మరికొందరికి దత్తాత్రేయుడిగా
యద్భావం తద్భవతని దర్షనమిచ్చాడు ధన్యుల చెశాడు

పెను తుపాను తాకిడిలో అలమటించు దీనులను
ఆదరించె సాయినాధ నాధుడై
అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి
అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను
పుచ్చుకొని మోక్షమిచ్చె పూజ్యుడై
పుచ్చుకున్న పాపములను ప్రక్షాలణ చెసికొనెను
దౌత్య క్రియ సిద్దితో శుద్దుడై
అంగములను వేరుచెసి ఖండయోగ సాధనలొ
అత్మశక్తి చాటెను సిద్దుడై

జీవరాశులన్నిటికి సాయే శరణం సాయే శరణం
దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం
నాస్తికులకు సాయే శరణం
భక్తికి సాయే శరణం
ముక్తికి సాయే శరణం

 
ఓ బాటసారి ఇది జీవిత రహదారి
ఎంత దూరమో ఎది అంతమో
ఎవరూ ఎరుగని దారి ఇది
ఒకరికే సొంతం కాదు ఇది

ఎవరికి ఎవరు తోడవుతారో
ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళ్ళతారో
మనసే చాలని ఉంటారో
ఎవరి పయనం ఎందాకో
అడగదు ఎవ్వరిని..బదులే దొరకదని

కడుపు తీపికి రుజువేముంది
అంతకు మించిన నిజమేముంది
కాయే చెట్టుకు బరువైతే
చెట్టుని భూమి మోస్తుందా?
ఇప్పుడు తప్పును తెలుసుకొని
జరిగేదేమిటని..క్షమంచదెవ్వరిని

పెంచుకొంటివి అనుభంధాన్ని
పెంచుకొన్నదోక హ్రుదయం దాన్ని
అమ్మలిద్దరు ఉంటారని
అనుకోలేని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని
తల్లివి కాగలవా?
తనయుడు కాగలడా?

అడ్డ దారిలో వచ్చావమ్మా
అనుకోకుండా కలిసావా
నెత్తురు పంచి ఇచ్చావు
నిప్పును నువ్వే మింగావు
అడదాని ఇశ్వర్యమేమిటో
ఇప్పుడు తెలిసింది
కధ ముగిసేపోయింది

సినిమా:- ఇల్లాలు
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- చక్రవర్తి
గానం:- జేసుదాస్, శైలజ


O baaTasaari idi jeevita rahadaari
enta dooramO edi antamO
evarU erugani daari idi
okarikE sontam kaadu idi

evariki evaru tODavutaarO
eppuDenduku viDipOtaarO
mamatanu kaadani veLLataarO
manasE chaalani unTaarO
evari payanam endaakO
aDagadu evvarini..badulE dorakadani

kaDupu teepiki rujuvEmundi
antaku minchina nijamEmundi
kaayE cheTTuku baruvaitE
cheTTuni bhoomi mOstundaa?
ippuDu tappunu telusukoni
jarigEdEmiTani..kshamanchadevvarini

penchukonTivi anubhandhaanni
penchukonnadOka hrudayam daanni
ammaliddaru unTaarani
anukOlEni pasivaaDni
balavantaana tecchukoni
tallivi kaagalavaa?
tanayuDu kaagalaDaa?

aDDa daarilO vacchaavammaa
anukOkunDaa kalisaavaa
netturu panchi icchaavu
nippunu nuvvE mingaavu
aDadaani iSwaryamEmiTO
ippuDu telisindi
kadha mugisEpOyindi

sinimaa:- illaalu
saahityam:- aatrEya
sangeetam:- chakravarti
gaanam:- jEsudaas, Sailaja

 
మా పాపలు తొలగించ దీపాలు నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మజన్మాల పుణ్యాల పంటలే నిన్ను దర్శించినామయ్యా
మేము తరియించినామయ్యా

పసిపాప మనసున్న ప్రతి మనిషిలోను పరమాత్ముడు ఉంటాడని
వాడు పరిశుద్దుడవుతాడని
గోలీల ఆటలో కొండంత సత్యం చాటవు ఓ సాయి
మమ్ము సాకవు మా సాయి
వాసనలు ఎమైనా..వర్ణాలు ఎమైనా
పూలన్ని ఒకటంటివి
నిను పూజించ తగునంటాఇవి
మా తడిలేని హ్రుదయాల దయతోటి తడిపి
కలుపుల్ని తీసేస్తివి
మాలో కలతల్ని మాపేస్తివి

పెడుతుంటే పెరిగేది ప్రేమ అన్న అన్నం
మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చును మేలైన మరు జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా
వారి బాధల్ని మోసవయ్యా
ఎనాడు పుట్టవో..ఎడేడ తిరిగావో
నీవెంత వాడైతివో
ఈ ద్వారకమాయి నివాసమాయే
ధన్యులమైనామయా
మేము తరియించినామయా



maa paapalu tolagincha deepaalu neevE veliginchinaavayyaa
mammu karuNinchinaavayyaa
janmajanmaala puNyaala panTalE ninnu darSinchinaamayyaa
mEmu tariyinchinaamayyaa

pasipaapa manasunna prati manishilOnu paramaatmuDu unTaaDani
vaaDu pariSudduDavutaaDani
gOleela aaTalO konDanta satyam chaaTavu O saayi
mammu saakavu maa saayi
vaasanalu emainaa..varNaalu emainaa
poolanni okaTanTivi
ninu poojincha tagunanTAivi
maa taDilEni hrudayaala dayatOTi taDipi
kalupulni teesEstivi
maalO kalatalni maapEstivi

peDutunTE perigEdi prEma anna annam
migilEdi ee puNyam
icchunu mElaina maru janmam
rOgulni prEminchi vyaadhulni maapi maru janma icchaavayyaa
vaari baadhalni mOsavayyaa
enaaDu puTTavO..eDEDa tirigaavO
neeventa vaaDaitivO
ee dwaarakamaayi nivaasamaayE
dhanyulamainaamayaa
mEmu tariyinchinaamayaa

 
చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు
నీవు లేక దిక్కులేని చుక్కలైనాము

మొన్న పున్నమి రాతిరి
నీ ఓడిని నిద్దురపోతిమి
తెల్లవరి లేచిచూచి
తెల్లబోయాము..ఘొల్లుమన్నాము

మబ్బు మబ్బు మాటున
ఈ మసక చీకటి చాటున
దిక్కు దిక్కున దిక్కులన్ని
తిరుగుతున్నాము..వెతుకుతున్నాము

దారి తప్పి పోతివో
నీ వారిని మరిచిపోతివో
ఏ రాణి వాసము లోన చేరి
రాజువైనావో..రాలేక ఉన్నావో

సినిమా:- భార్య బిడ్డలు
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- మహదేవన్
గానం:- సుశీల, వసంత

 
అరె ఎమిటి లోకం..పలు కాకుల లోకం
మమతన్నది ఒఠ్ఠీ పిచ్చి..మనసన్నది మరో పిచ్చి..
మన గిన తోసిపుచ్చి..అనుభవించు తెగ్గించు

గానుకెక్కి తిరిగితే కాశి దాక పోవునా
పరుల కొరకు పాటుపడితే పడుచు కోరిక తీరునా
చీమలను చూసైనా నేర్చుకోవే స్వార్ధం
వయసు కాస్త పోయినాక మనసు ఉన్నా వ్యర్ధము
ఫటా ఫట్

గీత గీసి ఆగమంటే సీత ఆగలేదుగా
సీత అక్కడ ఆగి ఉంటే రామ కధే లేదుగా
గీతలు నీతులు దేవుడివి కావులే
చెతగాని వాళ్ళు తాము వెసుకున్న కాపులే
ఫటా ఫట్

మరులు రేపు వగలు సెగలు మన్మధుని లీలలు
మన్మధుని లీలలకు ప్రేమికులు పావులు
సొగసులన్ని స్రుష్టి మనకు ఇచ్చుకున్న పాచికలు
పాచికలు పారినప్పుడే పరువానికి గెలుపులు
ఫటా ఫట్

 
అందమైన లోకమని..రంగు రంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ

గడ్డి మేసి ఆవు పాలిస్తుంది
పాలు తాగి మనిషి విషమౌతాడు
అది గడ్డి గొప్పతనమా..ఇది పాల దోషగుణమా?
మనిషి చాల దొడ్డాడమ్మ చెల్లెమ్మ
తెలివి మీరి చెడ్డాడమ్మ చిన్నెమ్మ

ముద్దు గులాబికే ముళ్ళుంటాయి
మొగలిపువ్వులోన నాగుంటాది
ఒక మెరుపు వెంట పిడుగు
ఒక మంచిలోన చెడుగు
లోకమంత ఇడె తీరు చెల్లెమ్మ
లోతుకెళ్ళితే కధే వేరు పిచ్చెమ్మ

డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా
పేదవాడు నాడే పుట్టాడమ్మా
ఆ ఉన్నవాడు తినడు
ఈ పేదను తిననివ్వడు
కళ్ళులేని భాగ్యశాలి నీవమ్మా
ఈ లోకం కుళ్ళును చూడలేవు చెల్లెమ్మ

 
శ్రీరస్తు శుభమస్తు .. శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం

అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
మసకేయని పున్నమిలా మనికినింపుకో

సినిమా:- పెళ్ళిపుస్తకం
సాహిత్యం:- ఆరుద్ర
సంగీతం:- కె వి మహదేవన్
గానం:- బాలు,సుశీల

 
aaసరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత
నా వన్నెలరాశికి సిరిజోత

ముచ్చటగొలిపే మొగలిపొత్తుకు ముల్లూ వాసనా ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు అలకా కులుకూ ఒక అందం
నీ అందాలన్నీ కలబోశా నీ కొంగుకు చెంగును ముడివేస్తా

చురచుర చూపులు ఒకమారు
నీ చిరుచిరు నవ్వులు ఒకమారు
మూతివిరుపులు ఒకమారు
నువు ముద్దుకు సిద్ధం ఒకమారు
నువు ఏ కళనున్నా మాబాగే
ఈ చీర విశేషం అల్లాగే

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]