Wednesday, April 6, 2011

 
దేవుడు ఉన్నాడో లేడో
మానవుడున్నాడురా
వాడే దేవుడు కలడో లేడని
తికమకపడుతున్నాడురా (2)
మానవుడున్నంత వరకు దేవుడు ఉంటాడురా (2)
వాడిని తలచేందుకు మానవుడుండాలిరా

తనలో మంచిని పెంచుకొనేటందుకు
తానే దేవుడు అయ్యేటందుకు
మనిషొక రూపం కల్పించాడు
అది మనిషి మనిషికొక రూపమయి
పలు మతాలుగా మారాయిరా

భయం నుంచి దేవుడు పుట్టాడు
భక్తి నుంచి దైవత్వం పుట్టింది
భయం భక్తులను మించిన స్థితినే ముక్తి అంటారురా
ముక్తి అంటారురా

మనిషికోసం బ్రతికే మనిషే దేవుడు
దేవుడికోసం మనిషిని మరిచే వాడే మూడుడు
ప్రేమ, త్యాగం
ప్రేమ, త్యాగం తెలిసినవాడే మానవుడు
దేవుడి పేరిట మూడుడైతే వాడే దానవుడు
వాడే దానవుడు

గానం:- జేసుదాస్

dEvuDu unnADO lEDO
mAnavuDunnADurA
vaaDE dEvuDu kalaDO lEDani
tikamakapaDutunnADurA (2)
mAnavuDunnanta varaku dEvuDu unTADurA (2)
vaaDini talachEnduku mAnavuDunDAlirA

tanalO manchini penchukonETanduku
taanE dEvuDu ayyETanduku
manishoka roopam kalpinchADu
adi manishi manishikoka roopamayi
palu matAlugA mArAyirA

bhayam nunchi dEvuDu puTTADu
bhakti nunchi daivatvam puTTindi
bhayam bhaktulanu minchina sthitinE mukti anTArurA
mukti anTArurA

manishikOsam bratikE manishE dEvuDu
dEvuDikOsam manishini marichE vADE mooDuDu
prEma, tyAgam
prEma, tyAgam telisinavaaDE mAnavuDu
dEvuDi pEriTa mooDuDaitE vADE dAnavuDu
vADE dAnavuDu

gAnam:- jEsudAs

Labels:


 
ఈ బంధనాల నందనాన్ని నీరు పోసి పెంచిన పైవాడు
తన కోవ్వెలంటి కాపురాన్ని చేతులార పాడుచేసి ఏం సాధించాడు

ఈ అందమైన బొమ్మరిల్లు
ఊరువాడ కళ్ళవిందు చేసిందిన్నాళ్ళు
ఏ చూడలేని పాడుకళ్ళ దిష్టి కొట్టి
కుప్పకూలిపోయింది ఈనాడు
మనిషే దేవుడై మసలే లోగిలి
కలికాలనికి తగదేమోనని
సందేహించి ఆ దైవము
చేసేడా ఈ ద్రోహము

రెండు రూపులున్నా ఒక్క ఊపిరయ్యే బంధం గొప్పదా
రెప్పపాటులోనే బుగ్గిపాలు చెసే పంతం గొప్పదా
ప్రేమంత బలహీనమా
పగసాధిస్తే ఘనకార్యమా
మమకారాలు బలిచేస్తే సంతొషమా
ఇది నీ సృష్టిలోపం సుమా
దయలేని ఓ దైవమా

మావిడాకుతోరణం, మల్లేపూలమండపం కలగా మిగులునా
పచ్చనైన పందిరే చిచ్చురేపు కక్షతో చితిగా రగులునా
కోరింది కళ్యాణమా
కానున్నది కల్లోలమా
కసికాటేసి పోయేటి ఓ కాలమా
పసిప్రాణలతో జూదమా
నీ వేట చాలించుమా

సినిమా:- శుభమస్తు
సాహిత్యం:- సామవేదం షణ్ముఖ శర్మ
సంగీతం:- కోటి
గానం:- బాలు


ee bandhanAla nandanAnni neeru pOsi penchina paivADu
tana kOvvelanTi kApurAnni chEtulAra paaDuchEsi Em saadhinchADu

ee andamaina bommarillu
ooruvADa kaLLavindu chEsindinnALLu
E chooDalEni pADukaLLa dishTi koTTi
kuppakoolipOyindi eenADu
manishE dEvuDai masalE lOgili
kalikAlaniki tagadEmOnani
sandEhinchi aa daivamu
chEsEDA ee drOhamu

renDu roopulunnA okka oopirayyE bandham goppadA
reppapATulOnE buggipAlu chesE pantam goppadA
prEmanta balaheenamA
pagasaadhistE ghanakaaryamA
mamakArAlu balichEstE santoshamA
idi nee sRshTilOpam sumA
dayalEni O daivamA

mAviDAkutOraNam, mallEpoolamanDapam kalagA migulunA
pacchanaina pandirE chicchurEpu kakshatO chitigA ragulunA
kOrindi kaLyANamA
kAnunnadi kallOlamA
kasikATEsi pOyETi O kAlamA
pasiprANalatO joodamA
nee vETa chaalinchumA

sinimA:- Subhamastu
saahityam:- sAmavEdam shaNmukha Sarma
sangeetam:- kOTi
gAnam:- bAlu

Labels: , ,


 
ఏ నావ్వది ఏ తీరమో
ఏ నేస్తం ఏ జన్మఫలమో
కలగానో, కధగానో
మిగిలేది నువ్వే ఈ జన్మలో

నాలోని నీవే నేనయినాను
నీలోని నేనే నీవయినావు
విన్నావా ఈ వింతను
అన్నారా ఎవ్వరైనను
నీకు నాకే చెల్లిందను

ఆకాశమల్లే నీవున్నావు
నీ నీలిరంగయి నేనున్నాను
కలిసేది ఊహేనను
ఊహల్లో కలిసామను
నీవు నేనే సాక్ష్యాలను

గానం:- జేసుదాస్

E nAvvadi E teeramO
E nEstam E janmaphalamO
kalagAnO, kadhagAnO
migilEdi nuvvE ee janmalO

nAlOni neevE nEnayinAnu
neelOni nEnE neevayinAvu
vinnAvA ee vintanu
annArA evvarainanu
neeku nAkE chellindanu

AkASamallE neevunnAvu
nee neelirangayi nEnunnAnu
kalisEdi oohEnanu
oohallO kalisAmanu
neevu nEnE saakshyAlanu

gAnam:- jEsudAs

Labels:


 
లాలి నెర్పవమ్మా నట్టేటి హోరుగాలి
నోరులేనిదమ్మా ఈ తల్లిగాని తల్లి
నడకన్నదే రాని పసిపాపకి
వెలుగన్నదే లేని కనుపాపకి
ఆకాశమా...నువ్వైనా దారి చూపవమ్మా

ఇంతలేత పాదమే బరువెంత మోసెనో
ఇంత చిన్న ప్రాణమే బ్రతుకెంత చూసెనో
ప్రతి పూట ఒక ఏడై ఎదిగింది ఇంతలోనే
ఆరింద అయ్యిందే పారాడు ఈడులోనే
ఏ పాఠశాల నేర్పుతుంది ఇంత జీవితం

ఎంత ఓర్చుకున్నదొ అడుగడున యాతన
ఎన్ని నేర్చుకున్నదో అపాయాల అంచున
అలిగిందా అడిగిందా ఎకాకి యాత్రలోనా
ఓడిందా ఒదిగిందా రాకాసి రాత్రిలోనా
ఒక తోడుగాని గూడుగాని లేకపోయినా

గానం:- బాలు

--

కాళరాత్రి నీడలో జన్మించిన చంద్రుడా
చీకటంటే ఇంతగా భయమెందుకు తమ్ముడా
ఎప్పుడైనా జడిసేనా నా వెంట నీవు ఉంటే
గడియైన గడిచేనా నీ వేలు విడిచిపెదితే
యముడైనా చెరుకోడు నిన్ను నేను ఉండగా

కాటు వెయ్యకమ్మా కష్టాల కటిక రేయి
దాడి చెయ్యకమ్మా దయలేని ముళ్ళదారి
విషనాగువై చెరకే ఆపగా
పసివాడిపై చూపకే నీ పగ
పాపాలు చేయు ఈడు కాదు పాడులోకమా

గానం:- మిన్ మిని

సినిమా:- ఆరంభం
సంగీతం:- శ్రీ


laali nerpavammaa naTTETi hOrugAli
nOrulEnidammaa ee talligaani talli
naDakannadE raani pasipaapaki
velugannadE lEni kanupaapaki
aakaaSamaa...nuvvainaa daari choopavammaa

intalEta paadamE baruventa mOsenO
inta chinna praaNamE bratukenta choosenO
prati pooTa oka EDai edigindi intalOnE
aarinda ayyindE paaraaDu eeDulOnE
E paaThaSaala nErputundi inta jeevitam

enta Orchukunnado aDugaDuna yaatana
enni nErchukunnadO apaayAla anchuna
aligindA aDigindA ekAki yaatralOnA
ODindaa odigindaa raakaasi raatrilOnA
oka tODugaani gooDugaani lEkapOyinaa

gAnam:- bAlu

--

kaaLaraatri neeDalO janminchina chandruDA
cheekaTanTE intagaa bhayamenduku tammuDA
eppuDainaa jaDisEnaa naa venTa neevu unTE
gaDiyaina gaDichEnaa nee vElu viDichipeditE
yamuDainaa cherukODu ninnu nEnu unDagaa

kaaTu veyyakammA kashTaala kaTika rEyi
daaDi cheyyakammA dayalEni muLLadaari
vishanaaguvai cherakE aapagaa
pasivaaDipai choopakE nee paga
paapaalu chEyu eeDu kaadu paaDulOkamaa

gAnam:- min mini

sinimaa:- aarambham
sangeetam:- SrI

Labels: , , ,


 
నీతోనే నువ్వు సరదాగానే లేనేలేవు
నలుగురిలో నవ్వులనేం చూస్తావు
నువ్వేంటో అర్ధం కావు
వేరేగా ఉంటావు
నీ మనసెందుకు నీలోనే దాస్తావు
ఎందుకోసమో ఈ ఆరాటం
ఎంచిచూసుకో అన్నది లోకం
ఒక్కసారి నువ్వు అలోచించు నీ కోసం
ముందువెనకలే చూడని మార్గం
మర్చిపోతే ఎలా లౌక్యం కొంచం
పట్టువిడుపుగా సర్దుకుపోవా నీ నైజం

ఎదేదో అనుకుంటావు
ఇంకేదో చేస్తుంటావు
చిక్కుల్లో పడతావు చిత్రంగా
ఏ నేరం చెయ్యని నువ్వు
బందిగా మిగిలావు
ఎంతో అలజడి మోసావు మూలాంగా
అద్దంలో నీ రూపు నీకు చూపేవారు
నీ దారినొదిలి కదిలారు
నీడయినా నీ వెంట లేనంది ఈనాడు
నీదే తప్పని నిందలు వేసి
కాలమెంత మారిపోయెరా

పైపై నవ్వుల లోకం
పైసాకే విలువ ఇచ్చిందా
కన్నీరంటిన స్వప్నం..చెరిగిందా
ఒంటరితనమే నిన్ను
వడగాలై తాకిందా
సత్యం తెలిసి కనువిప్పే కలిగిందా
చేదంత చేదయినా గాని మందే అనుకో
మంచేగా చేసింది నీ కధకు
ఏ బాధలేనోడు భూమ్మీద లేనోడే
మనిషై పుడితే దేవుడికైనా కంటనీరు కాయమేనురా
జానేదో నేస్తం
జరిగాకే తప్పును చూస్తాం
నిన్నటి లెక్కను నేడే సరి చేద్దాం
నడిరాతిరి నిశ్సబ్ధంలో నిజమేంటో కనుగొందాం
మలిపొద్దుల్లో మెళకువగా అడుగేద్దాం
ఎల్లకాలమీ అల్లరికాలం
ఒక్కతీరుగా ఉండదు నేస్తం
మంచిచెడ్డలు బొమ్మబొరుసే అనుకుందాం
పల్లమేమిటో చూసిన ప్రాణం
లెక్కచెయ్యదే ఎంతటి కష్టం
నేల తాకిన బంతయి మళ్ళీ పైకొద్దాం

సినిమా:- game
సాహిత్యం:- రామజోగయ్య శాస్త్రి
సంగీతం:- జాషువ శ్రీధర్
గానం:- బాలు

neetOnE nuvvu saradAgAnE lEnElEvu
nalugurilO navvulanEm choostaavu
nuvvEnTO ardham kaavu
vErEgA unTAvu
nee manasenduku neelOnE daastaavu
endukOsamO ee aarATam
enchichoosukO annadi lOkam
okkasAri nuvvu alOchinchu nee kOsam
munduvenakalE chooDani maargam
marchipOtE elA loukyam koncham
paTTuviDupugA sardukupOvA nee naijam

edEdO anukunTAVu
inkEdO chEstunTAvu
chikkullO paDatAvu chitrangaa
E nEram cheyyani nuvvu
bandigA migilAvu
entO alajaDi mOsAvu moolAngaa
addamlO nee roopu neeku choopEvAru
nee daarinodili kadilAru
neeDayinaa nee venTa lEnandi eenADu
needE tappani nindalu vEsi
kaalamenta maaripOyeraa

paipai navvula lOkam
paisAkE viluva icchindA
kannIranTina swapnam..cherigindaa
onTaritanamE ninnu
vaDagaalai taakindaa
satyam telisi kanuvippE kaligindaa
chEdanta chEdayinaa gaani mandE anukO
manchEgaa chEsindi nee kadhaku
E baadhalEnODu bhoommeeda lEnODE
manishai puDitE dEvuDikainaa kanTaneeru kaayamEnuraa
jaanEdO nEstam
jarigaakE tappunu choostaam
ninnaTi lekkanu nEDE sari chEddaam
naDiraatiri niSsabdhamlO nijamEnTO kanugondaam
malipoddullO meLakuvagaa aDugEddaam
ellakaalamI allarikaalam
okkateerugaa unDadu nEstam
manchicheDDalu bommaborusE anukundaam
pallamEmiTO choosina praaNam
lekkacheyyadE entaTi kashTam
nEla taakina bantayi maLLI paikoddaam

sinimaa:- #game#
saahityam:- raamajOgayya Saastri
sangeetam:- jaashuva SrIdhar
gaanam:- bAlu

Labels: , ,


Sunday, April 3, 2011

 
గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి
బుంగ మూతి ప్యారి నా బుల్ బుల్ సింగారి
ముందు జేబు నల్లకెళ్ళి వందనోట్ల కట్ట తీస్తా
వెనక జేబు నల్లకెళ్ళి వెయ్యికొక్క కట్ట తీస్తా
మనం reserve bank, మా బామర్ధికి thanks

ఒక లక్ష కాదు, రెండు లక్షలు కాదు
వందకోట్ల ముల్లే వచ్చే బిడ్డో
kawasaki వద్దు, benz car వద్దు
గాలి మోటార్ నేను తెస్తా బిడ్డో
వజ్రాలే ఒదిగిన వడ్డాణమే తెచ్చి బుజ్జి నడుము పూజ చేసుకుంటా
రతనాలు అద్దిన రైకబట్ట తెచ్చి మెత్తంగా మొత్తంగా దోచుకుంటా
ఔనంటారా, ఇంక సుఖామంటారా, బేఫికారంటారా
కాశిదాకా వెళ్ళిన
కర్మ మీకు దక్కునా
బుర్రగీకితే చూడనా
మీకు ఎఱ్ఱగడ్డ దవఖానా

గాజుమహల్ కాదు రాజమహల్ కాదు
తాజ్ మహల్ నేను కొంటా బిడ్డో
హనుమకొండా కాదు హైదరాబాద్ కాదు
అమెరికాలో నేను బంగళ కడతా బిడ్డో
అత్తిబత్తిలెక్క మూతి ముడుచుకుంటే అత్తారు పన్నీరు చలుకుంటా
calcutta పాన్ వేసి కన్ను కొట్టావంటే గోలుకోండ కిల్లాకు రాజునంటా
ఔనంటారా, కొంచం డౌన్ అంటారా లేదు డౌట్ అంటారా
తొందరెందుకు బాబులు
ముందరున్నవి మోజులు
లెక్కపెడతరు చువ్వలు
ఇక చిప్పలలో బువ్వలు

సినిమా:- నమస్తే అన్నా
సాహిత్యం:- సుద్దాల అశోక్ తేజ
సంగీతం:- రాజ్ కోటి
గనం:- వడ్డెపళ్ళి శ్రినివాస్



garam garam pOri nA gajjela savvAri
bunga mooti pyAri nA bul bul singAri
mundu jEbu nallakeLLi vandanOTla kaTTa teestA
venaka jEbu nallakeLLi veyyikokka kaTTa teestA
manam #reserve bank#, maa baamardhiki #thanks#

oka laksha kaadu, renDu lakshalu kAdu
vandakOTla mullE vacchE biDDO
#kawasaki# vaddu, #benz car# vaddu
gAli mOTAr nEnu testA biDDO
vajrAlE odigina vaDDANamE tecchi bujji naDumu pooja chEsukunTA
ratanAlu addina raikabaTTa tecchi mettangA mottangA dOchukunTA
ounanTArA, inka sukhAmanTArA, bEfikAranTArA
kaaSidAkA veLLina
karma meeku dakkunA
burrageekitE chooDanA
meeku e~r~ragaDDa davakhAnA

gaajumahal kaadu raajamahal kaadu
taaj mahal nEnu konTA biDDO
hanumakonDA kaadu haidarAbaad kaadu
amerikAlO nEnu bangaLa kaDatA biDDO
attibattilekka mooti muDuchukunTE attAru pannIru chalukunTA
#calcutta# pAn vEsi kannu koTTAvanTE gOlukOnDa killAku rAjunanTA
ounanTArA, koncham Down anTAraa lEdu DouT anTArA
tondarenduku bAbulu
mundarunnavi mOjulu
lekkapeDataru chuvvalu
ika chippalalO buvvalu

sinimaa:- namastE annA
saahityam:- suddAla aSOk tEja
sangeetam:- rAj kOTi
ganam:- vaDDepaLLi SriniVAs

Friday, April 1, 2011

 
పెద్దవీధి చిన్నవీధి ఇరుకువీధి మెరకవీధి
అన్ని వీధులు ఊరివేరా
పొట్టివాడు పొడుగువాడు ఉన్నవాడు లేనివాడు
అన్ని రూపులు మనిషివేరా
ఊరిఊరికి బేధముందిరా
మనిషిమనిషికో మర్మముందిరా
ఆచితూచి ఈ జగాన అడుగు ముందుకు వేయ్యరా

కష్టమొచ్చినా నష్టమొచ్చినా చెదిరిపోనిది ఈ బంధమేనురా
రెచగొట్టినా రచ్చకీడ్చినా బెదిరిపోనిది ఈ స్నేహమేనురా
చిన్ననవ్వుతో లొకాన్ని గెలుచుకో
ఉన్నదానితో స్వర్గాన్ని మలచుకో
కలిమిలో పొంగకు లేమిలో కుంగకు
భాయి
నిన్నుగన్న ఊరిపేరు మరచిపోకు నేస్తమా

మనసు నమ్మిన మార్గమెంచుకో
ముక్కుసూటిగా సాగిపోరా
మాయ అద్దమే పాడులొకము
ముందుచూపుతొ మసలుకొరా
పూలతోటలో విషనాగులుండవా?
లేళ్ళచెంతనే తొడేళ్ళు ఉండవా?
పిడుగులే రాలినా అడుగులే సాగని
భాయి
లక్ష ముళ్ళకంటే ఒక పువ్వు మేలు మిత్రమా

సినిమా:- వాలుజడ తోలుబెల్టు
సాహిత్యం:- భువనచంద్ర
సంగీతం:- ప్రసన్న సర్రాజు
గానం:- బాలు

peddavIdhi chinnavIdhi irukuvIdhi merakavIdhi
anni veedhulu oorivErA
poTTivADu poDuguvADu unnavADu lEnivADu
anni roopulu manishivErA
ooriooriki bEdhamundirA
manishimanishikO marmamundirA
aachitoochi ee jagAna aDugu munduku vEyyarA

kashTamocchinA nashTamocchinA chediripOnidi ee bandhamEnurA
rechagoTTinA racchakeeDchinA bediripOnidi ee snEhamEnurA
chinnanavvutO lokAnni geluchukO
unnadAnitO swargAnni malachukO
kalimilO pongaku lEmilO kungaku
bhAyi
ninnuganna ooripEru marachipOku nEstamA

manasu nammina mArgamenchukO
mukkusooTigA sAgipOrA
mAya addamE paaDulokamu
munduchooputo masalukorA
poolatOTalO vishanAgulunDavA?
lELLachentanE toDELLu undava?
piDugulE raalinA aDugulE sAgani
bhAyi
laksha muLLakanTE oka puvvu mElu mitramA

sinimA:- vAlujaDa tOlubelTu
saahityam:- bhuvanachandra
sangeetam:- prasanna sarrAju
gAnam:- bAlu

Labels: ,


 
హర హర మహాదేవ శంభొ హర ఓం
శుభకర శివానంద జగదీశ్వర ఓం
ప్రణవాంశ శక్తి స్వరూపాయ ఓం
ప్రళయాగ్ని సెగ శిఖల నిఠలాక్ష ఓం

ఒక వేకువ దీపంతో ఈ లోకం మేలుకొని
ఒక దేవుడి రూపంతో తన దీవేనెలందుకొని
ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వుల పల్లె ఝల్లుమంది
ఆ వెలసిన దేవుడి ముంగిట నిలబడి తలలు వంచుకుంది
హరిఓం శాంతి శాంతి ఢమరుకనాద విశ్వ శాంతి
హరిఓం శాంతి శాంతి ఢమరుకనాద విశ్వ శాంతి
భంచిక భంచిక చంచక
చక్కనమ్మ ముగ్గులెట్టే ఎంచెక్కా
పాడిపంట పొంగులాడే భంచక
ఊరువాడ చిందులాడే ఎంచెక్కా

ధనధాన్యం రాసులు పోసి
ధర్మానికి దోసిల్లేసి
గుణశీలం జనకొలువైతే
మహదేవుడు మారాజైతే
ముత్యాలు పండే లోగిలళ్ళో వరాల నవ్వుల జళ్ళంటరో
సుక్కలో వెన్నెలబొమ్మ
పుట్టింటికి నడిచొస్తుంటే
పక్కన చిరునవ్వులవాడే
శివదేవుడు అనిపిస్తుంటే
ఆ తాతామనవల్లాట
ఈ ఊరికి ఊయ్యలపాట
ఆ కుంకుమ రేకుల మూట
మా గడపకి వచ్చిన పూట
పండగే వచ్చెనంట సందడంటరో
సందెపొద్దు చిందులాడే వేడుకంటరో
హరిఓం శాంతి శాంతి ఢమరుకనాద విశ్వ శాంతి
హరిఓం శాంతి శాంతి ఢమరుకనాద విశ్వ శాంతి

అనురాగం పురుడొసుకొని
అనుబంధం ముడులేసుకొని
దేవుడు మనిషై పుడుతుంటే
నలుగురితో నడిచొస్తుంటే
బుడి బుడి అడుగుల నాట్యానికి ఆ నటరాజే గురుతొచ్చేనట
మనిషిని మహనీయుడు చేసే
మమతల గుడి వొడి చేసుకొని
కని పెంచే తల్లులు ఉంటే
లోకాలను వెలిగిస్తూ ఉంటే
ఆ వెలుతురు కిన్నెర పాట
తాతయ్యకు వన్నెల కోట
ఆ కోటకు రారాజెవ్వరో
ఈ కాలమే చెప్పేనంట
జాంకుకు జాంకుకు కోడిపుంజురో
జాతికోడి కూతలేసె పండగంటరో
సంకెలాడి సంకురాతిరి వచ్చెనంటరో
గొబ్బిలమ్మ పువ్వులంట ముగ్గులంటరో

ఒక దేవుడు మనిషైతే
తన తల్లికి ఎడమైతే
విలపించే అనురాగం
వెలుగెంతో తెలిసేది
చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా
కంచికి చేరని కధలా బ్రతుకు విలవిల ఏడ్వాలా
ఏడడుగుల జీవితమా
ఇది దేవుడి శాసనమా
ఏడ్పించే నా గతమా
ఒదార్చని జీవితమా

సినిమా:- పెదబాబు
సాహిత్యం:- జాలది
సంగీతం:- చక్రి
గానం:- బాలు


hara hara mahAdEva Sambho hara Om
Subhakara SivAnanda jagadeeSwara Om
praNavAmSa Sakti swarUpAya Om
praLayAgni sega Sikhala niThalaaksha Om

oka vEkuva deepamtO ee lOkam mElukoni
oka dEvuDi roopamtO tana deevEnelandukoni
musi musi navvula virisina puvvula palle jhallumandi
aa velasina dEvuDi mungiTa nilabaDi talalu vanchukundi
hariOm Saanti Saanti DhamarukanAda viSwa Saanti
hariOm Saanti Saanti DhamarukanAda viSwa Saanti
bhamchika bhamchika chamchaka
chakkanamma mugguleTTE enchekkA
pADipanTa pongulADE bhamchaka
ooruvADa chindulADE enchekkA

dhanadhaanyam rAsulu pOsi
dharmAniki dOsillEsi
guNaSeelam janakoluvaitE
mahadEvuDu maarAjaitE
mutyAlu panDE lOgilaLLO varAla navvula jaLLanTarO
sukkalO vennelabomma
puTTinTiki naDichostunTE
pakkana chirunavvulavADE
SivadEvuDu anipistunTE
aa tAtAmanavallATa
ee ooriki ooyyalapATa
aa kumkuma rEkula mooTa
mA gaDapaki vacchina pooTa
panDagE vacchenanTa sandaDanTarO
sandepoddu chindulADE vEDukanTarO
hariOm Saanti Saanti DhamarukanAda viSwa Saanti
hariOm Saanti Saanti DhamarukanAda viSwa Saanti

anurAgam puruDosukoni
anubandham muDulEsukoni
dEvuDu manishai puDutunTE
naluguritO naDichostunTE
buDi buDi aDugula nATyAniki aa naTarAjE gurutocchEnaTa
manishini mahaneeyuDu chEsE
mamatala guDi voDi chEsukoni
kani penchE tallulu unTE
lOkAlanu veligistU unTE
aa veluturu kinnera pATa
tAtayyaku vannela kOTa
aa kOTaku rArAjevvarO
ee kAlamE cheppEnanTa
jaamkuku jaamkuku kODipunjurO
jaatikODi kootalEse panDaganTarO
sankelADi sankuraatiri vacchenanTarO
gobbilamma puvvulanTa muggulanTarO

oka dEvuDu manishaitE
tana talliki eDamaitE
vilapinchE anurAgam
velugentO telisEdi
chiTikeDu kumkuma talliki panchE koDukai puTTAlA
kanchiki chErani kadhalA bratuku vilavila EDvAlA
EDaDugula jeevitamA
idi dEvuDi SAsanamA
EDpinchE nA gatamA
odArchani jeevitamA

sinimA:- pedabAbu
saahityam:- jAladi
sangeetam:- chakri
gAnam:- bAlu

Labels: , ,


 
ఒకే గొడుగు, ఒకే అడుగు, ఒకే నడకగా
ఒకరికొకరుగా, ఒకేఒకరుగా
కలిసి పయనించే స్నేహము
వలపు వర్షించే మేఘము

ఆ:
నీలి మబ్బు మెరిసి మెరిసి
నీళ్ళ మనసు మురిసి మురిసి
ఎన్ని జలదరింపులో
ఎన్నెన్ని పులకరింతలో
అ:
చినుకు చినుకు కలిసి కలిసి
చెలిమి జల్లు కురిసి కురిసి
ఎన్ని వలపు వరదలో
ఎన్నెన్ని కలల వాగులో
ఆ:
ఇది భూదేవికి సీమంతం
అ:
అనురాగానికి వసంతం

అ:
కన్నె తీగ తడిసి తడిసి
వన్నె మొగ్గ తొడిగి తొడిగి
ఎన్ని పూలపొంగులో
ఎన్నెన్ని రంగవల్లులో
ఆ:
ఇంద్రధనస్సు పందిరేసి
రంగులేడు ముగ్గులేసి
ఎన్ని మధనపూజలో
ఎన్నెన్ని మరులవిందులో
అ:
ఇది ఈ సృష్టికి ఆనందం
ఆ:
ఇది మన ఇద్దరి అనుబంధం

సినిమా:- అభిమన్యుడు
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- మహదేవన్
గానం:- బాలు, సుశీల

okE goDugu, okE aDugu, okE naDakagA
okarikokarugA, okEokarugA
kalisi payaninchE snEhamu
valapu varshinchE mEghamu

A:
neeli mabbu merisi merisi
neeLLa manasu murisi murisi
enni jaladarinpulO
ennenni pulakarintalO
a:
chinuku chinuku kalisi kalisi
chelimi jallu kurisi kurisi
enni valapu varadalO
ennenni kalala vAgulO
A:
idi bhoodEviki seemantam
a:
anurAgAniki vasantam

a:
kanne teega taDisi taDisi
vanne mogga toDigi toDigi
enni poolapongulO
ennenni rangavallulO
A:
indradhanassu pandirEsi
rangulEDu muggulEsi
enni madhanapoojalO
ennenni marulavindulO
a:
idi ee sRshTiki Anandam
A:
idi mana iddari anubandham

sinimaa:- abhimanyuDu
saahityam:- AtrEya
sangeetam:- mahadEvan
gAnam:- bAlu, suSeela

Labels: , , ,


 
సూర్యుడు చూస్తున్నాడు
చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు
వాడు నీవాడు
నేడు రేపు ఏనాడు

ఆ: నిన్ను ఎలా నమ్మను?
అ: ఎలా నమ్మించను?

అ:
ప్రేమకు పునాది నమ్మకము
అది నదీసాగర సంగమము
ఆ:
కడలికి ఎన్నో నదుల బంధము
మనిషికి ఒకటే హృదయము
అ:
అది వెలిగించని ప్రమిధలాంటిది
వలచినప్పుడే వెలిగేది
ఆ: వెలిగిందా మరి?
అ: వలచవా మరి?
ఆ:
ఎదలొ ఎదొ మెదిలింది
అది ప్రేమని నేడే తెలిసింది

అ: వింటున్నవా?
ఆ: ఏమి వినమంటావ్?

ఆ:
మనసుకు భాషే లేదన్నారు
మరి ఎవరి మాటలను వినమంటావు?
అ:
మనసు మూగగా వినబడుతుంది
అది విన్నవాళ్ళకే బాసవుతుంది
ఆ:
అది పలికించని వీణవంటిది
మీటినప్పుడే పాటవుతుంది
అ: మీటేది ఎవ్వరని?
ఆ: పాడేదేమని?
అ:
మాటా మనసు ఒక్కటని
మారని చెరగని సత్యమని

సినిమా:- అభిమన్యుడు
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- మహదేవన్
గానం:- బాలు, సుశీల


sooryuDu choostunnADu
chandruDu vinTunnADu
neevu nammanivADu nijamu chebutunnADu
vADu neevADu
nEDu rEpu EnADu

A: ninnu elA nammanu?
a: elA namminchanu?

a:
prEmaku punAdi nammakamu
adi nadIsaagara sangamamu
A:
kaDaliki ennO nadula bandhamu
manishiki okaTE hRdayamu
a:
adi veliginchani pramidhalAnTidi
valachinappuDE veligEdi
A: veligindA mari?
a: valachavA mari?
A:
edalo edo medilindi
adi prEmani nEDE telisindi

a: vinTunnaVA?
A: Emi vinamanTAv?

A:
manasuku bhAshE lEdannAru
mari evari mATalanu vinamanTAvu?
a:
manasu moogagA vinabaDutundi
adi vinnavALLakE baasavutundi
A:
adi palikinchani veeNavanTidi
meeTinappuDE pATavutundi
a: meeTEdi evvarani?
A: pADEdEmani?
a:
mATA manasu okkaTani
mArani cheragani satyamani

sinimaa:- abhimanyuDu
saahityam:- AtrEya
sangeetam:- mahadEvan
gAnam:- bAlu, suSeela

Labels: , , ,


 
దేవతలారా దీవించండి
చేసిన తప్పులు మన్నించండి
జరిగెను ఎంత ఘోరము
తగిలెను దాని శాపము
పోగొట్టుకుంటిని నా కన్నవారిని
చేజార్చుకుంటిని నా అన్నవారిని
ఎవ్వరూలేని ఎకాకినైతిని

కంటికి రెప్పనై కావలి కాయనా
పగలురాతిరి పాపలకు
పట్టెడుగుండెనే ఊయ్యల చేయ్యనా
పలుకేనోచని సేవలకు
వినువీధి దారిలోన విహరించు తారలారా
మనసారా ఒక్కసారి నా మాట చెప్పి రారా
నాన్నా..అన్న ఒక పిలుపు చాలని

ఆశలజ్యోతితో హారతులివ్వనా
ఈ చిన్నారి కోవ్వెలకు
చెమరిన కళ్ళతో చమురును పోయ్యనా
నీ గుడి ముంగిట దివ్వెలకు
కడసారి మరణశిక్ష మన్నింపు కోరుకుంది
నీ మనసులోన ఇంత చోటు ఇస్తే చాలునంది
పోతే పోని..ఆ పైన జీవితం

గానం:- జేసుదాస్

dEvatalArA deevinchanDi
chEsina tappulu manninchanDi
jarigenu enta ghOramu
tagilenu dAni SApamu
pOgoTTukunTini naa kannavArini
chEjaarchukunTini naa annavArini
evvarUlEni ekAkinaitini

kanTiki reppanai kAvali kAyanA
pagaluraatiri pApalaku
paTTeDugunDenE ooyyala chEyyanA
palukEnOchani sEvalaku
vinuveedhi daarilOna viharinchu tAralAraa
manasArA okkasAri nA mATa cheppi rArA
nAnnA..anna oka pilupu chAlani

aaSalajyOtitO haaratulivvanA
ee chinnAri kOvvelaku
chemarina kaLLatO chamurunu pOyyanA
nee guDi mungiTa divvelaku
kaDasAri maraNaSiksha mannimpu kOrukundi
nee manasulOna inta chOTu istE chaalunandi
pOtE pOni..aa paina jeevitam

gAnam:- jEsudAs

Labels:


 
దేవాలయాన్నే విడనాడె దైవం
ధర్మాలయాన కడతేరే ధర్మం
కలిలోన దైవాలయినా శిలలే కదా

చెవులుండి వినది చట్టం
అడిగేను దొరకని సాక్ష్యం
ఈ గుడ్డి న్యాయం కోసం
ఎన్నాళ్ళు ఈ బలిదానం
నీకున్న ఆరోప్రాణం
పెట్టింది కన్నుల ప్రాణం
ముద్దాయివన్నది లోకం
ఇది ఏమి విధి విపరీతం
జన్మమే నేరమై
ధర్మమే పాపమై
కధలా నడిచి కలలా ముగిసే నీ గాధలో


తన అన్నపై అనురాగం
తన భర్తపై మమకారం
మనసులోన రగిలే సత్యం
మాటరాక కుమిలే సాక్ష్యం
ఆ మామ కంటికి దీపం
ఈ పాప ప్రేమకు రూపం
పెనవేసుకున్న బంధం
తెంచలేదులే ఏ దైవం
న్యాయమే గుడ్డిదై
ధర్మమే కుంటిదై
ఉరితొ బిగిసి బలితో ముగిసే నీ గాధలో

గానం:- జేసుదాస్, సుశీల

dEvAlayAnnE viDanADe daivam
dharmAlayAna kaDatErE dharmam
kalilOna daivAlayinA SilalE kadA

chevulunDi vinadi chaTTam
aDigEnu dorakani sAkshyam
ee guDDi nyAyam kOsam
ennALLu ee balidAnam
neekunna aarOprANam
peTTindi kannula prANam
muddAyivannadi lOkam
idi Emi vidhi vipareetam
janmamE nEramai
dharmamE pApamai
kadhalA naDichi kalalA mugisE nee gAdhalO


tana annapai anurAgam
tana bhartapai mamakAram
manasulOna ragilE satyam
maaTaraaka kumilE saakshyam
aa mAma kanTiki deepam
ee pApa prEmaku roopam
penavEsukunna bandham
tenchalEdulE E daivam
nyAyamE guDDidai
dharmamE kunTidai
urito bigisi balitO mugisE nee gAdhalO

gAnam:- jEsudAs, suSeela

Labels: ,


 
ఆ:
బంగరులేడిని కొరే వేళ జానకినైనానో
అడగరాని వరమడిగే వేళ కైకనైనానో
కానక కన్నకోడుకు కోసమై కఠిన శిలనైనానో
ఈ కన్నీళ్ళతో మీ పాదాలు కడగనివ్వండి
నేరక చేసిన నా నేరానికి అడనివ్వండి
శిక్ష అడగనివ్వండి

అ:
నీ కంట నీలాలు
రారాదు ఏనాడు
ఆ:
నా తీపి కన్నీరు
మీ ప్రేమ పన్నీరు
అ:
ఈ బాధల్నే పెరిగే ప్రేమబంధాలు
ఆ:
రెక్కలు విడిచిన వాళ్ళు
దిక్కులకెగిరిన నాడు
అ:
ఆ స్వప్నలతో ఈ బంధాలు కరిగిపోరాదు
జన్మకి చాలని అనుబంధాలను విడిచిపోరాదు
మమతే మరచిపోరాదు

ఆ:
మీ నీడ నా లోకం..భూలోక వైకుంఠం
అ:
ఈ తొటకే మళ్ళీ రావాలి మధుమాసం
ఆ:
ఏనాటి పుణ్యాలో నిలిచే పసుపుకుంకాఇ
అ:
ప్రేమే రాముడి బాణం
సీతే ఆతని ప్రాణం
ఆ:
నా అరాధనే నీకు ఈనాడు హారతి ఇస్తున్నా
ఎదుటే వెలసిన దైవం మీరని తెలుసుకుంటున్నా
నన్నే మరచిపోతున్నా

సినిమా:- collectorగారి అబ్బాయి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు, సుశీల



A:
bangarulEDini korE vELa jAnakinainAnO
aDagarAni varamaDigE vELa kaikanainAnO
kAnaka kannakODuku kOsamai kaThina SilanainAnO
ee kannILLatO mee pAdAlu kaDaganivvanDi
nEraka chEsina naa nErAniki aDanivvanDi
Siksha aDaganivvanDi

a:
nee kanTa neelAlu
raarAdu EnaaDu
A:
naa teepi kannIru
mee prEma pannIru
a:
ee bAdhalnE perigE prEmabandhAlu
A:
rekkalu viDichina vALLu
dikkulakegirina nADu
a:
A swapnalatO ee bandhAlu karigipOrAdu
janmaki chAlani anubandhAlanu viDichipOrAdu
mamatE marachipOrAdu

A:
mee neeDa nA lOkam..bhoolOka vaikunTham
a:
ee toTakE maLLI rAvAli madhumAsam
A:
EnaaTi puNyAlO nilichE pasupukunkAi
a:
prEmE rAmuDi bANam
seetE Atani prANam
A:
nA arAdhanE neeku eenADu haarati istunnA
eduTE velasina daivam meerani telusukunTunnA
nannE marachipOtunnA

sinimA:- #collector#gAri abbAyi
sangeetam:- chakravarti
gAnam:- bAlu, suSeela

Labels: , ,


 
చూపులు చూపులు తొలిచూపై
చూచిన క్షణమే శుభలగ్నం
నీవు నేను ఒక మనసై
మనమనుకున్నదే మాంగళ్యం
చూచిన క్షణమే శుభలగ్నం
మనమనుకున్నదే మాంగళ్యం

అ:
మనసిచ్చిన దేవతకు
మమకారం సుమహారం
ఆ:
కరుణించిన దైవముకి
కన్నీరే అభిషేకం
అ:
చెలిమికి కౌగిలి ఆలయము
నా చెలికీ లోగిలి ఆశ్రమము
ఆ:
నిన్ను నన్ను కలిపిన దైవం
ఉన్నాడని అనిపించిన సుదినం

ఆ:
తపియించిన హృదయాలే
...
అ:
మరులల్లినే ప్రాయాలే
మరుమల్లెల శయనాలు
ఆ:
కలలో తలవని కళ్యాణం
అ:
ఇది కలకాలానికి శతమానం
ఆ:
ఎన్నో జన్మల పూజాఫలము
నువ్వీ జన్మకు నాకో వరము

గానం:- జేసుదాస్, సుశీల


choopulu choopulu tolichoopai
choochina kshaNamE Subhalagnam
neevu nEnu oka manasai
manamanukunnadE mAngaLyam
choochina kshaNamE Subhalagnam
manamanukunnadE mAngaLyam

a:
manasicchina dEvataku
mamakAram sumahAram
A:
karuNinchina daivamuki
kannIrE abhishEkam
a:
chelimiki kougili Alayamu
naa chelikI lOgili aaSramamu
A:
ninnu nannu kalipina daivam
unnADani anipinchina sudinam

A:
tapiyinchina hRdayAlE
...
a:
marulallinE prAyAlE
marumallela SayanAlu
A:
kalalO talavani kaLyANam
a:
idi kalakAlAniki SatamAnam
A:
ennO janmala poojAphalamu
nuvvI janmaku naakO varamu

gAnam:- jEsudAs, suSeela

Labels: ,


 
చిన్ని చిన్ని కన్నయ్య
కన్నులలో నీవయ్యా
నిను చూసి మురిసేను
నన్ను నేను మరిచేను
ఎత్తుకొని ముద్దాడి
ఊయాలలూపేను
జోలపాట పాడేను
లాలిపాట పాడేను

అ:
నీ వొడిలో నిదురించి
తీయ్యని కలగాంచి
పొంగి పొంగి పోయాను
పుణ్యమెంతో చేసాను
ఆ:
నీ వొడిలో నిదురించి
తీయ్యని కలగాంచి
అ:
పొంగి పొంగి పోయాను
పుణ్యమెంతో చేసాను
ఏడేడు జన్మలకు
నా తోడు నీవమ్మా
ఈనాటి ఈ బంధం
ఏనాడు విడదమ్మా
ఆ:
అమ్మవలే రమ్మనగా
పాపవలే చేరేవు
నా చెంత నీవుంటే
స్వర్గమే ఇక నాదవును
అ:
గాయత్రి మంత్రమును జపించే భక్తుడనే
కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలనులే
ఆ:
స్నానమడే శుభవేళ
కురులలో పువ్వులతో
అ:
దేవివలే నీవొస్తే
నా మనసు నిలువదులే
ఆ:
అందాల పొన్నులకు
కాటుకను దిద్దేను
చెడుచూపు పడకుండా
అగరుచుక్క పెట్టేను

గానం:- జేసుదాస్, సుశీల



chinni chinni kannayya
kannulalO neevayyaa
ninu choosi murisEnu
nannu nEnu marichEnu
ettukoni muddADi
ooyaalaloopEnu
jOlapaaTa paaDEnu
laalipaaTa paaDEnu

a:
nee voDilO nidurinchi
teeyyani kalagaanchi
pongi pongi pOyAnu
puNyamentO chEsAnu
A:
nee voDilO nidurinchi
teeyyani kalagaanchi
a:
pongi pongi pOyAnu
puNyamentO chEsAnu
EDEDu janmalaku
naa tODu neevammaa
eenATi ee bandham
EnaaDu viDadammaa
A:
ammavalE rammanagaa
paapavalE chErEvu
naa chenta neevunTE
swargamE ika naadavunu
a:
gaayatri mantramunu japinchE bhaktuDanE
kOrukunna varamulanu ivvakunna vadalanulE
A:
snaanamaDE SubhavELa
kurulalO puvvulatO
a:
dEvivalE neevostE
naa manasu niluvadulE
A:
andAla ponnulaku
kATukanu diddEnu
cheDuchoopu paDakunDA
agaruchukka peTTEnu

gAnam:- jEsudAs, suSeela

Labels: ,


 
అ:
చిలిపి కళ్ళలో వలపు సిగ్గులు
ఓర చూపుల్లో దోర సిగ్గులు
కలికి నుదిటి తిలకంలో కళ్యాణం సిగ్గులు
ఎందుకో ఆ సిగ్గులెందుకో
అందుకో నా ముద్దులందుకో
ఆ:
చిలిపి కళ్ళలో వలపు సిగ్గులు
ఓర చూపుల్లో దోర సిగ్గులు
కన్నెవలపు గుండెల్లో కళ్యాణం ముగ్గులు
అందుకే ఆ వింత సిగ్గులు
అందుకే గోరంత సిగ్గులు

అ:
సాగర సంసారంలో రాగమాలికలు పాడి
ఉదయకిరణమై కదలే పెదవి సిగ్గులు
నడక హంస నాట్యమైతే
నడుము జడకు నేస్తమైతే
తడిమి తడిమి ముద్దడే జడగంటల సిగ్గులు
ఆ:
జడగంటల అందానికి
గుడిగంటల బంధానికి
ఏడెడుగుల దూరానికి ఎన్నెన్నొ సిగ్గులు

అ:
శొభన శృంగారంలో సోయగాల అలజడిలో
మూగరాగమై పాడే ముద్దు సిగ్గులు
పెదవి పెదవిపై చేరి
కొత్త పదము రాస్తుంటే
చదువుకున్న హృదయములో చకిలిగిలి సిగ్గులు
ఆ:
గిలిగింతల అందానికి
తొలిజంటల బంధానికి
సిగ్గు చిన్నదవుతుంది
సిరిమొగ్గలు వేస్తుంది

గానం:- జేసుదాస్, సుశీల

a:
chilipi kaLLalO valapu siggulu
Ora choopullO dOra siggulu
kaliki nudiTi tilakamlO kaLyANam siggulu
endukO aa siggulendukO
andukO nA muddulandukO
A:
chilipi kaLLalO valapu siggulu
Ora choopullO dOra siggulu
kannevalapu gunDellO kaLyANam muggulu
andukE aa vinta siggulu
andukE gOranta siggulu

a:
saagara samsaaramlO raagamaalikalu pADi
udayakiraNamai kadalE pedavi siggulu
naDaka hamsa nATyamaitE
naDumu jaDaku nEstamaitE
taDimi taDimi muddaDE jaDaganTala siggulu
A:
jaDaganTala andaaniki
guDiganTala bandhaaniki
EDeDugula doorAniki ennenno siggulu

a:
Sobhana SRngaaramlO sOyagAla alajaDilO
moogaraagamai paaDE muddu siggulu
pedavi pedavipai chEri
kotta padamu raastunTE
chaduvukunna hRdayamulO chakiligili siggulu
A:
giligintala andaaniki
tolijanTala bandhaaniki
siggu chinnadavutundi
sirimoggalu vEstundi

gAnam:- jEsudAs, suSeela

Labels: ,


 
చిక్ చిక్ పుల్లాట
చక చక పిల్లలాట
చిన్ననాడు ఆడిన ఆట
చెలిమికి వేసిన తొలిబాట

ఈ నీరు అడిగింది
ఎన్ని మునకలు వేసావని
ఈ ఇసుక నవ్వింది
ఎన్ని గూళ్ళు కట్టావని
ల ల
లలల
ఇసుకకు తెలుసు మన సయ్యాట
వయసుకు తెలుసు వలపు వేట

ఈ చెంప అలిగింది
ఆ చెంప నిమిరావని
ఈ కన్ను కులికింది
నీ కన్ను పిలిచిందని
ల ల
చెంప కన్ను చెప్పని మాట
ఇద్దరి పెదవుల ముద్దల మాట

ఈ సంధ్య అంటుంది
ఇంక చీకటి అవుతుందని
నా గుండె అంటుంది
ఐతే బాగుంటుందని
సంధ్యకు తెలుసు మన చెలగాట
మసకకు తెలుసు మనసు ఆట

గానం:- జేసుదాస్, సుశీల

chik chik pullATa
chaka chaka pillalATa
chinnanADu aaDina aaTa
chelimiki vEsina tolibATa

ee neeru aDigindi
enni munakalu vEsAvani
ee isuka navvindi
enni gooLLu kaTTAvani
la la
lalala
isukaku telusu mana sayyATa
vayasuku telusu valapu vETa

ee chempa aligindi
aa chempa nimiraavani
ee kannu kulikindi
nee kannu pilichindani
la la
chempa kannu cheppani mATa
iddari pedavula muddala mATa

ee sandhya anTundi
inka cheekaTi avutundani
naa gunDe anTundi
aitE baagunTundani
sandhyaku telusu mana chelagATa
masakaku telusu manasu aaTa

gAnam:- jEsudAs, suSeela

Labels: ,


 
చిగురు మావిళ్ళు ఇంటింటి సిరులు
ప్రతి బిడ్డ వేవిళ్ళు..పుట్టింటి కౌగిల్లు
తాతయ్య కలలు..మా తల్లి నెలలు

మా ఇంట వెలసిన మా మహాలక్ష్మికి
ఏ ఇంట జరగని సీమంతమమ్మా..సీమంతమమ్మా
ఓ కంట కన్నీటి ఆనందమమ్మా..ఆనందమమ్మా

ఎదురింటి వదినమ్మ, పొరుగింటి అమ్మమ్మ,
పక్కింటి పిన్నమ్మ, పై ఇంటి చిన్నమ్మ
ముత్తైదువులు వచ్చినారమ్మ
నిను దీవించ నిలిచినారమ్మ
ఏ చేతి పసుపు
ఏ తల్లి కుంకుమ
నీ పసుపుకుంకుమలు పెంచునో
అందుకోవమ్మా నా రతనాల తల్లి

ఒకనాటి మాటమ్మ చెడును కోరమ్మా
ఒకకంటి చూపమ్మ కీడు చేయ్యమ్మా
ఓర్వలేని నరుల చూపమ్మా
నల్లరాళ్ళైన పగులగొట్టమ్మా
ఏ కంటి చూపు
ఏ చెడ్డ తలపు
నీ ముందు దిగదుడుపుగా
అందుకోవమ్మా ఈ హరతులు తల్లి

సినిమా:- జుస్టిస్ చక్రవర్తి
సాహిత్యం:- ????
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

chiguru mAviLLu inTinTi sirulu
prati biDDa vEviLLu..puTTinTi kougillu
tAtayya kalalu..mA talli nelalu

maa inTa velasina mA mahAlakshmiki
E inTa jaragani seemantamammA..seemantamammA
O kanTa kannITi aanandamammaa..aanandamammaa

edurinTi vadinamma, poruginTi ammamma,
pakkinTi pinnamma, pai inTi chinnamma
muttaiduvulu vacchinAramma
ninu deevincha nilichinAramma
E chEti pasupu
E talli kumkuma
nee pasupukumkumalu penchunO
andukOvammaa naa ratanaala talli

okanATi mATamma cheDunu kOrammaa
okakanTi choopamma keeDu chEyyammaa
OrvalEni narula choopammaa
nallarALLaina pagulagoTTammaa
E kanTi choopu
E cheDDa talapu
nee mundu digaduDupugA
andukOvammaa ee haratulu talli

sinimaa:- jusTis chakravarti
saahityam:- ????
sangeetam:- chakravarti
gAnam:- bAlu

Labels: ,


 
చెల్లివైనా తల్లివైనా
చామంతిపువ్వంటి నువ్వే..నాకు నువ్వే
అన్ననైనా నాన్ననైనా
నీ కంటిరెప్పంటి నేనే..నీకు నేనే
అమ్మ కడుపే చల్లగా
నువ్వు వర్ధిల్లవే పచ్చగా
కన్న కలలే పండగా
ఈ అన్న చెల్లాయిగా

ఆకలివేళ అన్నను ఐనా
అన్నమై నే పుట్టనా
నీ బొజ్జ నే నింపనా
నిద్దురవేళ అమ్మను కానా
జొలలే నే పాడనా
ఊయలై నే ఊగనా
జో జో లాలి
లాలి లాలి జో లాలి
అమ్మ కడుపే చల్లగా
నువ్వు వర్ధిల్లవే పచ్చగా
కన్న కలలే పండగా
ఈ అన్న చెల్లాయిగా

చూపుడు వేలు
రాపిడి కళ్ళు
రానంత దూరాలలో
నా గుండెలో దాచనా
జనకుడు నేనై
జానకిలాగ అత్తింటికే పంపనా
పుట్టిల్లుగా మిగలనా
అన్నగా ఏడేడు జన్మాలకి

సినిమా:- సీతమ్మ పెళ్ళి
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- బాలు
గానం:- బాలు


chellivainA tallivainA
chaamantipuvvanTi nuvvE..nAku nuvvE
annanainA nAnnanainA
nee kanTireppanTi nEnE..neeku nEnE
amma kaDupE challagaa
nuvvu vardhillavE pacchagA
kanna kalalE panDagA
ee anna chellAyigA

AkalivELa annanu ainA
annamai nE puTTanA
nee bojja nE nimpanA
nidduravELa ammanu kAnA
jolalE nE pADanA
ooyalai nE ooganA
jO jO lAli
lAli lAli jO lAli
amma kaDupE challagaa
nuvvu vardhillavE pacchagA
kanna kalalE panDagA
ee anna chellAyigA

choopuDu vElu
rApiDi kaLLu
rAnanta doorAlalO
nA gunDelO dAchanA
janakuDu nEnai
jAnakilaaga attinTikE pampanA
puTTillugA migalanA
annagA EDEDu janmAlaki

sinimA:- seetamma peLLi
saahityam:- vETUri
sangeetam:- bAlu
gAnam:- bAlu

Labels: ,


 
చెదిరిన నీ కుంకుమలే తిరిగి రానివా
నిత్య సౌభాగ్యాలే చెరిగిపోయెనా
పసిదానివే అని చూడక
వసివాడని నీ బ్రతుకున
విధియే విషమే చిలికే

ఆరిపోనిదమ్మా నీ కన్నీటి శొకం
భారతాన స్త్రీ జాతికి భర్తయే దైవం
నూరేళ్ళు ఉండేదంటారే మాంగళ్యం
ముడినే తెంచే వేసారే ఎం ఘోరం
స్వర్గతుల్యమైనదే నీ సంసారం
శొకసంద్రమైనదే నీ ప్రాయం
బ్రతుకే మోడై మిగిలే

మానిపోనిదమ్మా నీ యెదలోని గాయం
రాలిపోయెనమ్మా నీ సిగలోని కుసుమం
పడతికి బొట్టుకాటుకలే ఆధారం
మెడకొక ఉచ్చును పోలినదే వైధవ్యం
గాజులతో కన్న కలల మోజులే పోయే
గాజుకళ్ళ జీవితమే తెల్లబోయే
తోడే నీకే కరువై

గానం:- జేసుదాస్



chedirina nee kumkumalE tirigi raanivA
nitya soubhAgyAlE cherigipOyenA
pasidAnivE ani chooDaka
vasivADani nee bratukuna
vidhiyE vishamE chilikE

aaripOnidammA nee kannITi Sokam
bhaaratAna stree jaatiki bhartayE daivam
noorELLu unDEdanTArE mAngaLyam
muDinE tenchE vEsArE em ghOram
swargatulyamainadE nee samsaaram
SokasandramainadE nee praayam
bratukE mODai migilE

mAnipOnidammA nee yedalOni gaayam
raalipOyenammA nee sigalOni kusumam
paDatiki boTTukATukalE aadhAram
meDakoka ucchunu pOlinadE vaidhavyam
gaajulatO kanna kalala mOjulE pOyE
gaajukaLLa jeevitamE tellabOyE
tODE neekE karuvai

gAnam:- jEsudAs

Labels:


 
చదివినోళ్ళని మాకు పేరండి
జనులార
మాకు ఉద్యొగం ఇచ్చే దాతలేరండి
బాబు
చదివినోళ్ళని మాకు పేరండి
జనులార
మాకు ఉద్యొగం ఇచ్చే దాతలేరండి
అమ్మా
ఆస్తిపాస్తులు అమ్మి మాకై అమ్మనాన్నలు ఆశపడితే
no vacancy board లెట్టి
నోరునొక్కి పంపినారు

వెలగబెట్టి B.Sc ఉల్లిపాయ కోస్తున్నా
అబ్బా
నీకు తోడు నేనున్నా నా కన్నా
B.Aలు B.Comలు ఎన్నెన్నో డిగ్రీలు
ఐతేనేమి ఆకులు కుడుతూ యాతన పడుతున్నాం
be calm

మినపప్పు నానేసి..వేసి
నానినాక రొకలిలో వేసి..నా నాన్నా
గారేలు, ఇడ్లీలు, దోసలు, పెసరట్లు
hot hotగా ఆకులపెట్టి supply చెయ్యాలి
ఆగు
తొందరపడకు సుందరవదన బోణి కానీరా

సినిమా:- ఈ చరిత్ర ఏ సిరతో
సాహిత్యం:- ?????
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు, సుశీల, రమేష్

chadivinOLLani mAku pEranDi
janulAra
mAku udyogam icchE dAtalEranDi
bAbu
chadivinOLLani mAku pEranDi
janulAra
mAku udyogam icchE dAtalEranDi
ammA
aastipaastulu ammi mAkai ammanAnnalu aaSapaDitE
#no vacancy board# leTTi
nOrunokki pampinAru

velagabeTTi #B.Sc# ullipAya kOstunnA
abbA
neeku tODu nEnunnA nA kannA
#B.A#lu #B.Com#lu ennennO Digreelu
aitEnEmi aakulu kuDutU yaatana paDutunnAm
#be calm#

minapappu nAnEsi..vEsi
naaninAka rokalilO vEsi..nA nAnnA
gaarElu, iDleelu, dOsalu, pesaraTlu
#hot hot#gA aakulapeTTi #supply# cheyyAli
aagu
tondarapaDaku sundaravadana bONi kAneerA

sinimaa:- ee charitra E siratO
saahityam:- ?????
sangeetam:- chakravarti
gAnam:- bAlu, suSeela, ramEsh

Labels: , ,


 
అ:
ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపివలపు పూజలా
ఆ:
ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపివలపు పూజలా
అ:
మొగ్గ విచ్చుకున్న వేళ కలువభామ
ఆ:
ముద్దులన్ని లెక్కబెట్టె చందమామ


ఆ:
గుట్టులేని గుండెలో గుచ్చి గుచ్చి చూడకు
అ:
మల్లెపూల దండలో దారమింక దాచకు
ఆ:
కొంటెగా చూడకు కొకసిగ్గు మాత్రము
అ:
కంటితో తుంచని కన్నెజాజి పుష్పము
ఆ:
రేగుతున్న యౌవ్వనం వేగుచుక్క కోరునా
అ:
కాగుతున్న పాల్లలో మీగడింక దాగునా

సినిమా:- బామ్మ బాట బంగారు బాట
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- శివాజిరాజా
గానం:- బాలు, జానకి

a:
prEmatO chilakamaDupu sEvalA
siggutO chilipivalapu poojalA
A:
prEmatO chilakamaDupu sEvalA
siggutO chilipivalapu poojalA
a:
mogga vicchukunna vELa kaluvabhAma
A:
muddulanni lekkabeTTe chandamAma


A:
guTTulEni gunDelO gucchi gucchi chooDaku
a:
mallepoola danDalO daaraminka dAchaku
A:
konTegA chooDaku kokasiggu mAtramu
a:
kanTitO tunchani kannejAji pushpamu
A:
rEgutunna yauvvanam vEguchukka kOrunA
a:
kAgutunna pAllalO meegaDinka dAgunA

sinimaa:- bAmma bATa bangAru bATa
saahityam:- vETUri
sangeetam:- SivAjirAjA
gAnam:- bAlu, jAnaki

Labels: , ,


 
అయ్యలు జాగ్రత్త..అమ్మలు జాగ్రత్త
కళ్ళుండి కొందరు లోకాన్ని చూడరు
కాళ్ళుండి కొందరు కదలనే కదలరు
అందుకే కొడతుండ డప్పు
ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు

కొడిపిల్ల తెస్తా ఎగరేసుకెళ్ళినట్టు
పేదోడ్ని పెద్దోడు దోచుకుంటున్నాడు
చీమలెట్టిన పుట్ట పాము చొరబడ్డట్టూ
మూట గట్టేదొకడు..కొలువు తీరేదొకడు
ఈ కుళ్ళు తెలుసుకొని
నీ కళ్ళు తెరవమని
ఎలుగెత్తి చెప్పాడు ఎప్పుడో ఎలమంద
అందుకే కొడతుండ డప్పు
ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు

తెల్లోలు ఆనాడు తేరగా దేశాన్ని
కొల్లగొట్టారని ఎలగొట్టేసాము
మనోళ్ళు గద్దెక్కి మనకడుపు కొడతుంటే
గుడ్లప్పగించేసి గుటకలేస్తున్నాము
ఈ పీడ వదిలించి
లోపాలు తొలగించి
నాయకుడు రావాలి
అందుకే కొడతుండ డప్పు
ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు

సినిమా:- అంకుశం
సాహిత్యం:- ????
సంగీతం:- సత్యం
గానం:- బాలు

ayyalu jaagratta..ammalu jAgratta
kaLLunDi kondaru lOkAnni chooDaru
kALLunDi kondaru kadalanE kadalaru
andukE koDatunDa Dappu
ippuDainA telusukOnDi tappu

koDipilla testA egarEsukeLLinaTTu
pEdODni peddODu dOchukunTunnADu
cheemaleTTina puTTa pAmu chorabaDDaTTU
mooTa gaTTEdokaDu..koluvu teerEdokaDu
ee kuLLu telusukoni
nee kaLLu teravamani
elugetti cheppADu eppuDO elamanda
andukE koDatunDa Dappu
ippuDainA telusukOnDi tappu

tellOlu AnADu tEragA dESAnni
kollagoTTArani elagoTTEsAmu
manOLLu gaddekki manakaDupu koDatunTE
guDlappaginchEsi guTakalEstunnAmu
ee peeDa vadilinchi
lOpAlu tolaginchi
nAyakuDu rAvAli
andukE koDatunDa Dappu
ippuDainA telusukOnDi tappu

sinimA:- ankuSam
saahityam:- ????
sangeetam:- satyam
gAnam:- bAlu

Labels: ,


 
అ:
ఆషాడానికి హారతివా..చిరుజల్లుల శ్రావణివా
ఆకాశానికి కుంకుమవా..నా తొలకరి బాలికవా
ఆ:
చిరుగాలి వాన ఒకటవ్వగా
అది వరదై పొంగే ఒక పండగ


అ:
తనువుకి తప్పసుకి తలుపులు తెరచిన వేళ
ఆ:
తీపికి అనుభూతికి హద్దులు చెరిపిన వేళ
అ:
పరదాల చీకటులు తొలగేటి తరుణమిది
ఆ:
అధరాల కోరికలా తీరేటి రోజు ఇది
అ:
అబ్బా ఇన్నినాళ్ళు దాచుకున్న అందాలన్ని నీకు నాకు దక్కే రోజు ఇదే ఇదే


ఆ:
గ్రీష్మం కోరిన మధనుడివా
గత స్వప్నం విడిచిన భీష్ముడివా
అ:
ఆకాశానికి కుంకుమవా..నా తొలకరి బాలికవా


ఆ:
సాగరం నదులతో సంగమించు ఒక శుభవేళ
అ:
మధనుది మధనితో యౌవ్వనాల అంచులు చూసి
ఆ:
పరువాల పరుగులకు సరదాల గమ్యమిదే
అ:
బిడియాల సొగసులకు తీయ్యాలి గది గడియ
ఆ:
అబ్బా గుండెల్లోన దాచుకున్న సోకులన్ని నీకే ఇచ్చి అంకితమైపోనా

గానం:- జేసుదాస్, సుజాత

a:
AshADAniki hArativA..chirujallula SrAvaNivA
AkASAniki kumkumavA..nA tolakari bAlikavA
A:
chirugAli vAna okaTavvagA
adi varadai pongE oka panDaga


a:
tanuvuki tappasuki talupulu terachina vELa
A:
teepiki anubhootiki haddulu cheripina vELa
a:
paradAla cheekaTulu tolagETi taruNamidi
A:
adharAla kOrikalA teerETi rOju idi
a:
abbA inninALLu daachukunna andAlanni neeku nAku dakkE rOju idE idE


A:
greeshmam kOrina madhanuDivA
gata swapnam viDichina bheeshmuDivA
a:
AkASAniki kumkumavA..nA tolakari bAlikavA


A:
sAgaram nadulatO sangaminchu oka SubhavELa
a:
madhanudi madhanitO yauvvanAla anchulu choosi
A:
paruvAla parugulaku saradAla gamyamidE
a:
biDiyAla sogasulaku teeyyAli gadi gaDiya
A:
abbA gunDellOna dAchukunna sOkulanni neekE icchi ankitamaipOnA

gAnam:- jEsudAs, sujAta

Labels:


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]