Monday, January 30, 2012

 
చూడరా..దేశమేడున్నదో
చూపరా..మోసమెంతున్నదో
ఉన్నపేరు రత్నగర్భ..ఉన్నతీరు రాళ్ళదిబ్బ
ఖ్యాతి గొప్ప, చేత చిప్ప
తప్పు తప్పు పాత డప్పు, తిప్పి కొట్టరా

తిండి లేకపోతే సోదరా..తీర్దముందిలే సాగరా
నీరు కరువైతే హరహర..గాలిని మెసేసి బ్రతకరా
ఎదురు తిరిగి అడగమాకు..నెప్పుతారు బొక్కలోకు
గాలివాటమెరిగినవాడే ఏలుతాడు గద్దెలెక్కి
ఔనా? కాదా? ఐతే పదరా కింద మీద

కులముకున్న విలువ..తెలివికెక్కదుంది గురువా
ఎన్నెన్ని డిగ్రీలు ఉన్నా..ఏముంది ఫలితం నాన్నా
పెదవి చుట్టూ, పదవి చుట్టూ తిరిగుతుంది లోకం
నీతి కొరకు కట్టుబడితే చాతగాని చవట అంట
ఔనా? కాదా? అంతా ఇంతే ఉల్టా సీదా

సినిమా:- ?????
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- రాజ్-కోటి
గానం:- బాలు

chooDarA..dESamEDunnadO
chooparA..mOsamentunnadO
unnapEru ratnagarbha..unnateeru raaLLadibba
khyaati goppa, chEta chippa
tappu tappu paata Dappu, tippi koTTaraa

tinDi lEkapOtE sOdarA..teerdamundilE saagarA
neeru karuvaitE harahara..gaalini mesEsi bratakaraa
eduru tirigi aDagamaaku..nepputaaru bokkalOku
gaalivaaTameriginavaaDE ElutaaDu gaddelekki
ounaa? kaadaa? aitE padaraa kinda meeda

kulamukunna viluva..telivikekkadundi guruvA
ennenni Digreelu unnaa..Emundi phalitam naannaa
pedavi chuTTU, padavi chuTTU tirigutundi lOkam
neeti koraku kaTTubaDitE chaatagaani chavaTa anTa
ounA? kaadaa? antaa intE ulTaa seedaa

sinimaa:- ?????
saahityam:- vETUri
sangeetam:- raaj-kOTi
gaanam:- bAlu

Labels: , ,


 
ఒక నువ్వు, ఒక నేను
అంతా బొమ్మలం
ఈ లోకంలో మనుషులుగా
మసిలే బొమ్మలం

ఏమి ఎరుగని వయసమ్మా
ఈ పసితనమే ఒక వరమమ్మా
నవ్వు, ఏడుపు ఏదైనా
మీ మోమున సొగసేనమ్మా
కన్నీరైనా కంటికే కాని, గుండెది కాదమ్మా

ఆటకు పాటకు పుట్టిల్లు
ఆ గడప దాటితే అది చెల్లు
భర్త పేరుతో మొగ బొమ్మ
తలరాతలు మార్చేనమ్మా
మన కలలన్ని ఒకటేనమ్మా
కధలే వేరమ్మా

సినిమా:- గృహప్రవేశం
సాహిత్యం:- సినారె
సంగీతం:- సత్యం
గానం:- సుశీల

oka nuvvu, oka nEnu
antA bommalam
ee lOkamlO manushulugA
masilE bommalam

Emi erugani vayasammA
ee pasitanamE oka varamammA
navvu, EDupu Edainaa
mee mOmuna sogasEnammaa
kanneerainA kanTikE kaani, gunDedi kaadammA

aaTaku paaTaku puTTillu
aa gaDapa daaTitE adi chellu
bharta pErutO moga bomma
talaraatalu maarchEnammaa
mana kalalanni okaTEnammaa
kadhalE vErammaa

sinimaa:- gRhapravESam
saahityam:- sinAre
sangeetam:- satyam
gaanam:- suSeela

Labels: , ,


 
అ:
ప్రియతమా, ప్రియతమా, తరగని పరువమా
తరలి రా, తరలి రా
కన్నె గోదారిలా, కొంటె కావేరిలా
నిండు కౌగిలల్లో చేర రావే
ఆ:
ప్రియతమా, ప్రియతమా, తరగని విరహమా
కదలి రా, కదలి రా
మాఘమాసానివై, మల్లె పూమాలవై
నిండు నా గుండెల్లొ ఊయలూగా


అ: నీ ఆశలన్ని నా శ్వాశలైనా ఎంత మోహమో!
ఆ: నీ ఊసులన్ని నా బాసలైనా ఎంత మౌనమో!
అ: ఎవరేమి అన్నా, ఎదురీదనా
ఆ: సుడిగాలినైనా వడిచేరనా
అ: నీడల్లే నీ వెంట నేనుంటా, నా ప్రేమ సామ్రాజ్యమా

ఆ: పెదవుల్ని తడితే పుడుతుంది తేనె, తియ్య తియ్యగా
అ: కౌగిట్లో పడితే పుడుతుంది వాన, కమ్మ కమ్మగా
ఆ: వెన్నెల్ల మంచం వేసేయ్యనా
అ: ఏకాంత సేవ చేసేయ్యనా
ఆ: వెచ్చంగ చలి కాచుకోవాలా, నీ గుండె లోగిల్లలొ

సినిమా:- పెద్దరికం
సాహిత్యం:- భువనచంద్ర
సంగీతం:- రాజ్-కోటి
గానం:- బాలు, చిత్ర

a:
priyatamA, priyatamA, taragani paruvamA
tarali raa, tarali raa
kanne gOdArilA, konTe kAvErilA
ninDu kougilallO chEra raavE
A:
priyatamA, priyatamA, taragani virahamA
kadali raa, kadali raa
maaghamaasaanivai, malle poomaalavai
ninDu naa gunDello ooyaloogA


a: nee ASalanni naa SWASalainA enta mOhamO!
A: nee oosulanni naa baasalainA enta mounamO!
a: evarEmi annA, edureedanA
A: suDigaalinainA vaDichEranA
a: neeDallE nee venTa nEnunTA, naa prEma saamraajyamA

A: pedavulni taDitE puDutundi tEne, tiyya tiyyagA
a: kougiTlO paDitE puDutundi vAna, kamma kammagA
A: vennella mancham vEsEyyanA
a: Ekaanta sEva chEsEyyanA
A: vecchanga chali kaachukOvaalaa, nee gunDe lOgillalo

sinimaa:- peddarikam
saahityam:- bhuvanachandra
sangeetam:- raaj-kOTi
gaanam:- bAlu, chitra

Labels: , ,


 
దారి ఉంటేనే మరో దారి పుడుతుంది
ఒక దారి ఉంటేనే మరో దారి పుడుతుంది
ఒక అడుగు వేస్తేనే మరో అడుగు పడుతుంది
గమనం వేరైనా, గమ్యం ఒకటేనా
దిక్కులు మారినా, ధ్యేయం ఒకటేనా
ఓ మనిషి తిరిగి చూడు
ఓ మనిషి తిరిగి చూడు
ఎందరున్నారో, నీలా ఇంకెందరున్నారో
ఎక్కడున్నారో, ఏమౌతున్నారో

తొలి కోడి కూయగానే తెల్లవారిపోదు
వాన కురియగానే చేను పండిపోదు
ఇది వెలుతురులాంటి బ్రాంతి
తుఫాను ముందటి ప్రశాంతి

చెట్టు వాడిపోయింది, వట్టి మోడు మిగిలింది
కొమ్మలన్ని విరిగిపోగా, పళ్ళన్ని చెదిరిపోగా
ఉన్నాను, ఉన్నాను, ఇంకా బ్రతికున్నాను
ఇంకా బ్రతికున్ననని
పడిపోక, నిలబడలేక, చెట్టు బావురుమంటున్నది
తన చుట్టూ చితికిల బ్రతుకులు చూడమంటున్నది

వెట్టి చాకిరికి సంకెళ్ళు
దురంతాలకు తుదినాలు

సినిమా:- ఓ మనిషి తిరిగి చూడు
గానం:- బాలు

daari unTEnE marO daari puDutundi
oka daari unTEnE marO daari puDutundi
oka aDugu vEstEnE marO aDugu paDutundi
gamanam vErainaa, gamyam okaTEnA
dikkulu maarinA, dhyEyam okaTEnA
O manishi tirigi chooDu
O manishi tirigi chooDu
endarunnArO, neelA inkendarunnArO
ekkaDunnArO, EmoutunnArO

toli kODi kooyagAnE tellavAripOdu
vaana kuriyagAnE chEnu panDipOdu
idi veluturulAnTi braanti
tuphaanu mundaTi praSaanti

cheTTu vaaDipOyindi, vaTTi mODu migilindi
kommalanni virigipOgA, paLLanni chediripOgA
unnaanu, unnaanu, inkA bratikunnaanu
inkA bratikunnanani
paDipOka, nilabaDalEka, cheTTu baavurumanTunnadi
tana chuTTU chitikila bratukulu chooDamanTunnadi

veTTi chaakiriki sankeLLu
durantaalaku tudinAlu

sinimaa:- O manishi tirigi chooDu
gaanam:- bAlu

Labels: ,


 
భరతదేశమా..ఓ విషాదమా
మతేలేని మతాలు, మసిచేసిన నిలయమా
మాతృదేశమా, మన్నించుమా

కన్నతల్లి ప్రేమకు విలువ ఏదిరా
అన్నదమ్ములన్నదే లేదు లేదురా
గంగపాలు అయినవి నల్లపూసలు
కార్చిచ్చులైనవి కడుపు కోతలు
ఈ దారుణం, ఈ మారణం
సాగించే సంఘం
పగలా, సెగలా,
కట్టెలా కాలని, మట్టిలో కలవని

అందరొచ్చి కలిసేది రుద్రభూమిలో
అందరొక్కటయేది వల్లకాటిలో
జాతిమాతాలిక్కడ నోళ్ళు విప్పవు
కులతత్వాలిక్కడా తలలు ఎత్తవు
ఈ రాజ్యమా? రామ రాజ్యము
బాపుజి కలలే
చితిలో రగిలి,
క్రాంతిగా ముగిసెను, క్రాంతికై వేచెను,

సినిమా:- పుణ్యభూమి నా దేశం
సంగీతం:- బప్పిలహరి
గానం:- బాలు


bharatadESamA..O vishAdamA
matElEni mataalu, masichEsina nilayamA
maatRdESamA, manninchumA

kannatalli prEmaku viluva EdirA
annadammulannadE lEdu lEduraa
gangapaalu ayinavi nallapoosalu
kaarchicchulainavi kaDupu kOtalu
ee daaruNam, ee maaraNam
saaginchE sangham
pagalA, segalA,
kaTTelA kaalani, maTTilO kalavani

andarocchi kalisEdi rudrabhoomilO
andarokkaTayEdi vallakATilO
jaatimaataalikkaDa nOLLu vippavu
kulatatvaalikkaDA talalu ettavu
ee raajyamaa? raama raajyamu
baapuji kalalE
chitilO ragili,
kraantigA mugisenu, kraantikai vEchenu,

sinimaa:- puNyabhoomi naa dESam
sangeetam:- bappilahari
gaanam:- bAlu

Labels:


 
హెచ్చరిక..హెచ్చరిక..హెచ్చరిక..
హెచ్చరిక..హెచ్చరిక..అందరికీ హెచ్చరిక
ముందు దగా..వెనుక దగా..గుర్తించమనే హెచ్చరిక
అగ్నిపరీక్ష సమయం..ఇది అకాల సుర్యాస్తమయం
నలుదిక్కులను నలుపెక్కిస్తూ కమ్ముకు వచ్చిన గ్రహణం
పట్టపగలే నడిరాత్రిగా మార్చిన చిక్కుల చీకటి వలయం
భద్రంగానే ఉన్నానని భ్రమ వదలని భారతమా
గద్ద గూటిలో నిద్దురపోయే శాంతి కపోతమా

మొన్నటి వరకు కనిపించాడు శత్రువు తెల్లవాడు గనక
అప్పటినుంచి ముసిరింది కీడు నల్లని ముసుగుల వెనుక
కులాల, జాతుల, మతాల నేతల కుమ్ములాటలొక వంక
అగ్గివాగులై, వ్యఘ్రనాగులై ఉగ్రవాదులొక వంక
ఆరలేదు ఇంకా భారత స్వరాజ్య సమరపు అగ్గిసెగ
చేరలేదు ఇంకా జాతికి సురాజ్య శాంతుల శుభలేఖ
పొలిమేరల్లో పొంచిఉన్న పగవారికి హెచ్చరిక
పులికోరల్లో పురుడోసుకొనే పిచ్చి ప్రగతికి హెచ్చరిక


ఆయువునిచ్చే ప్రాణవాయువుకి లేదే ఏ కులము
ఆపదనుంచి కాపాడొద్దని చెప్పదు ఏ మతము
ఊపిరి పోసే సంకల్పాన్ని ఆపదు ఏ ధర్మం
సాయం చేసే సాహసాన్ని ఎదిరిస్తే నేరం
కులమతాలకన్నా ముందు మనుషులుగా జన్మించాం
ఆ బంధంలో మనమంతా ఓ తల్లి సంతానం
విద్వేషాల విషాన్ని చింపే తక్షకులకు ఈ హెచ్చరిక
లక్షల కత్తులు దించి చెలిమితో అల్లిన చేతుల హెచ్చరిక

రాం రహీంల భేధం చెరిపి
ఖురాన్, గీతల స్వరాలు కలిపి
మతం కన్న జనహితం మిన్న..అని చాటిన బలిదానం
మృత్యువు మోయలేని ఈ పసిప్రాణం
కలత నిదురలో ఉలికిపడ్డ కన్నతల్లి గుండెల్ల ఘోష
గర్భ శొకమై, గర్వ స్లోకమై అరిపిస్తున్నది వీర వందనం
చరిత్ర సైతం చలించిపోయే ఈ త్యాగమే ఓ హెచ్చరిక
ఇలాంటి సంస్కృతి పునాదిగాగల అనాది గాధల హెచ్చరిక

సినిమా:- భారతరత్న
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- వందేమాతరం శ్రీనివాస్
గానం:- బాలు

heccharika..heccharika..heccharika..
heccharika..heccharika..andarikI heccharika
mundu dagA..venuka dagA..gurtinchamanE heccharika
agniparIksha samayam..idi akaala suryaastamayam
naludikkulanu nalupekkistU kammuku vacchina grahaNam
paTTapagalE naDiraatrigaa maarchina chikkula cheekaTi valayam
bhadramgaanE unnaanani bhrama vadalani bhaaratamaa
gadda gooTilO niddurapOyE Saanti kapOtamaa

monnaTi varaku kanipinchADu Satruvu tellavADu ganaka
appaTinunchi musirindi keeDu nallani musugula venuka
kulaala, jaatula, mataala nEtala kummulaaTaloka vanka
aggivaagulai, vyaGranaagulai ugravaaduloka vanka
aaralEdu inkaa bhaarata swaraajya samarapu aggisega
chEralEdu inkaa jaatiki suraajya Saantula SubhalEkha
polimErallO ponchiunna pagavaariki heccharika
pulikOrallO puruDOsukonE picchi pragatiki heccharika


aayuvunicchE praaNavaayuvuki lEdE E kulamu
aapadanunchi kaapaaDoddani cheppadu E matamu
oopiri pOsE sankalpaanni aapadu E dharmam
saayam chEsE saahasaanni ediristE nEram
kulamataalakannaa mundu manushulugaa janminchaam
aa bandhamlO manamantaa O talli santaanam
vidvEshaala vishaanni chimpE takshakulaku ee heccharika
lakshala kattulu dinchi chelimitO allina chEtula heccharika

raam raheemla bhEdham cheripi
khuraan, gItala swaraalu kalipi
matam kanna janahitam minna..ani chaaTina balidaanam
mRtyuvu mOyalEni ee pasipraaNam
kalata niduralO ulikipaDDa kannatalli gunDella ghOsha
garbha Sokamai, garva slOkamai aripistunnadi veera vandanam
charitra saitam chalinchipOyE ee tyAgamE O heccharika
ilaanTi samskRti punaadigaagala anaadi gaadhala heccharika

sinimaa:- bhaarataratna
saahityam:- sirivennela
sangeetam:- vandEmaataram SrInivaas
gaanam:- bAlu

Labels: , ,


 
మనసే మీటనా...చెలిమే చాటనా
తొలి చినుకంటి తెలుగింటి పాటతో

త్యాగరాయుని భావాలనల్లి..తీగసాగిన రాగాలవల్లి
అన్నమార్యుని కీర్తనల తేలి..దేవదేవుని లాలించు లాలి
తేనేల కాణాచి..మన తెలుగున చవిచూచి
అమృతమేమి రుచి..అనరేమి మైమరచి
జగమే..
జగమే పరమాత్మ ఎవ్వరితో మొరలిడు
తేటి నడకలకి సెలయేటి పరుగులకి
మన పలుకిచ్చి పులకించు పాటతో

నన్నయాదుల తొలి తెలుగు మాట..భరతగాధకు బంగారు బాట
కృష్ణరాయుల కనుసైగ వెంట..భువనవిజయము సాగించెనంట
పోతన మాగాణి..శ్రీనాధుని మారాణి
సాటిలేని బాణి..మన జాణ తెలుగువాణి
నగరాజ ధర నీదు పరివారులెల్ల..ఓగి భోదన జేసేడి వారలుగారే
జానపదములకి..నెరజాన జావళకి
తన లయలిచ్చి నడిపించు పాటతో

సినిమా:- తోకలేని పిట్ట
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ధర్మవరపు సుబ్రమణ్యం
గానం:- చిత్ర



manasE meeTanA...chelimE chaaTanA
toli chinukanTi teluginTi paaTatO

tyaagaraayuni bhaavaalanalli..teegasaagina raagaalavalli
annamaaryuni keertanala tEli..dEvadEvuni laalinchu laali
tEnEla kaaNaachi..mana teluguna chavichoochi
amRtamEmi ruchi..anarEmi maimarachi
jagamE..
jagamE paramaatma evvaritO moraliDu
tETi naDakalaki selayETi parugulaki
mana palukicchi pulakinchu paaTatO

nannayaadula toli telugu maaTa..bharatagaadhaku bangaaru baaTa
kRshNaraayula kanusaiga venTa..bhuvanavijayamu saaginchenanTa
pOtana maagANi..Sreenaadhuni maarANi
saaTilEni baaNi..mana jaaNa teluguvANi
nagaraaja dhara needu parivArulella
Ogi bhOdana jEsEDi vaaralugArE
jaanapadamulaki..nerajAna jaavaLaki
tana layalicchi naDipinchu paaTatO

sinimaa:- tOkalEni piTTa
saahityam:- sirivennela
sangeetam:- dharmavarapu subramaNyam
gaanam:- chitra

Labels: ,


 
కృష్ణా...
కొండంత దేవుడవు నీవు
గోరంత దీపాన్ని నేను
దీపాలకు దీపమే నువ్వు
అందుకే నా దైవమైనావు

నిన్ను చూడాలని కన్నులే చూపులై
చూడలేక కన్నీటి చుక్కలై
యమునగా పొంగినా..పదములే కడిగినా
నిరుపేద హారతి నీవందుకోవా
నీ ఆలయ జ్యోతిగా నను చేసుకోవా

ఈ దీపమింక వెలిగేది ఎన్నాళ్ళో
నీ రూపమింక చూసేది ఎన్నడో
దీపమై వెలిగినా..నీడనై మిగిలినా
వెలిగేది నీ కాంతి రూపం
మిగిలేది కన్నయ్యా నీ నీలి వర్ణం

సినిమా:- ?????
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం: సుశీల, శైలజ

kRshNA...
konDanta dEvuDavu nIvu
gOranta deepaanni nEnu
deepAlaku deepamE nuvvu
andukE naa daivamainAvu

ninnu chooDaalani kannulE choopulai
chooDalEka kannITi chukkalai
yamunagA ponginA..padamulE kaDiginA
nirupEda haarati neevandukOvA
nee aalaya jyOtigA nanu chEsukOvA

ee deepaminka veligEdi ennALLO
nee roopaminka choosEdi ennaDO
deepamai veliginA..neeDanai migilinA
veligEdi nee kaanti roopam
migilEdi kannayyA nee neeli varNam

sinimaa:- ?????
saahityam:- vETUri
sangeetam:- chakravarti
gAnam: suSeela, Sailaja

Labels: , ,


 
శివ శివ అంటే భయమేలా?

శివ శివ అంటే భయమేది?
నామానికి సరి వేరేది?
శివ నామానికి సరి వేరేది?
శివ భక్తునికి కొరతే లేదే (2)
జన్మ జన్మలకు నరకం లేదే

అన్నదానమును సాగించు..నాదను అహమును తొలగించు (2)
ఆశ్రితపాలకుని అర్చించు (2)
గిరిజానాదుని భజియించు

భోగభాగ్యల వలలోన మిడిసిపడుట ఒక నేరమయా (2)
కాయ కష్టమున జీవించు (2)
ఆత్మనందం సాగించు

ధ్యానమే జగమున తపమయ్యా..దానమే ఘనతర జపమయ్యా (2)
అపకారముని ఒనరిస్తే (2)
కైలాసపదం దొరకదయా

సినిమా:- భక్త సిరియాల (Kannada movie dubbing)
సాహిత్యం:- రాజశ్రీ
సంగీతం:- టి జి లింగప్ప
గానం:- బాలు

Siva Siva anTE bhayamElA?

Siva Siva anTE bhayamEdi?
nAmAniki sari vErEdi?
Siva nAmAniki sari vErEdi?
Siva bhaktuniki koratE lEdE (2)
janma janmalaku narakam lEdE

annadAnamunu saaginchu..naadanu ahamunu tolaginchu (2)
aaSritapaalakuni archinchu (2)
girijAnaaduni bhajiyinchu

bhOgabhaagyala valalOna miDisipaDuTa oka nEramayA (2)
kaaya kashTamuna jeevinchu (2)
aatmanandam saaginchu

dhyaanamE jagamuna tapamayyA..daanamE ghanatara japamayyA (2)
apakaaramuni onaristE (2)
kailAsapadam dorakadayA

sinimA:- bhakta siriyAla
saahityam:- raajaSrI
sangeetam:- Ti ji lingappa
gaanam:- bAlu

Labels: ,


Saturday, January 28, 2012

 
"నీలాసుందరి పరిణయం" అనే కావ్యంలో
"కూచిమచి తిమ్మకవి"
మొదటగా చేసిన శివస్తుతి

శ్రీ అనే అక్షరం తప్పించి (ఎందుకంటే ఎదైనా కావ్యం "శ్రీ" అనే అక్షరంతో మొదలు పెట్టడం సాంప్రదాయం) ఈ కవ్యం మొత్తం అచ్చమైన తెలుగు పదాలతోనే రచించడం జరిగింది
మచ్చుకి మొదటి రెండు పద్యాలు


శ్రీలకు తానకంబగుచు, చెన్నె లలరారెడి వెండికొండపై
మెలికదానె డాలు హొయెలు మీరెడి జాబిలి రాల మెడలో
వెలుపురేడు నల్వయను వెన్నుడు కొల్వగ
మంచుకొండ రాచూలుని కూడి
వెడుకల చొక్కెడు లే నెలతాల్పు కొల్చెదన్

శ్రీలకు = ఇశ్వర్యాలకు
తానకంబు = నివాసభూమి
వెండికొండపై = కైలాసముపై
వెలుపురేడు = ఇంద్రుడు
నల్వయను = బ్రహ్మ
వెన్నుడు = విష్ణు
కొల్వగా = కొల్చుకుంటుంటే
మంచుకొంద
రాజు = హిమవంతుండు
చూలు = కూతురు (పార్వతిదేవి)
వేడుకల
చొక్కెడు = దానితో ఆనందముగా ప్రకాశిస్తున్నటి
లే = లేత
నెల = చంద్రుడు
తాల్పు = ధరించిన
కొల్చెదన్ = పూజించుట

ఇశ్వర్యాలకు నిలయమైన కైలాసముపై, ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు కొలుచుకుంటున్న, చంద్రుడిని తలపై ధరించిన పార్వతిదేవి సహితుడైన శివుని నే పూజిస్తున్నను


ఈ కావ్యాన్ని శివుడి అంకితమిస్తూ, ఎలాంటి శివుడికి అంటే

మత్తగిల్లు సత్తు గిత్త తత్తడినెక్కి
మిత్తి మొత్తి
సత్తి నత్తి
బత్తి పత్తిరిడిన
బుత్తిముత్తులు రెండును
ఒత్తి గుత్తకట్టుచుండు రేడు

మత్తగిల్లు = బాగా మధించిన
సత్తు గిత్త = సత్తువు కలిగిన ఎద్దు
తత్తడి = గుర్రం (వాహనం)
ఎక్కి = (వృషభ వాహనం) ఎక్కి
మిత్తి = మృత్యువు
మొత్తి = నశింపచేసి
సత్తి = శక్తి (పార్వతిదేవి)
నత్తి = హత్తుకొని
బత్తి = భక్తితో
పత్తిరిడిన = పత్తినిగాని ఇస్తే
బుత్తిముత్తి = భుక్తి, ముక్తులు రెండును
ఒత్తి
గుత్తకట్టుచుండు
రేడు = ప్రేమగా అందించే దేవర

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]