Saturday, February 11, 2012

 
నిన్న మొన్న నీవే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సమ్యోగాలై
నిమిషం నిమిషం సరసం నిండేనోయి

నిన్న మొన్న నీవే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సమ్యోగాలై
కలలో ఇలలో వెలిసేమోయి

విరిసి విరియని పరువాలు
లయతో తలపడు నాట్యాలు
కలహంసలా కదిలావులే
మరుహింసకు గురిచెయ్యకే
కరుణ చూపించు నా దేవివై

తెలిసి తెలియని భావాలు
వలిచి మలచని రాగాలు
సురగంగలా పొంగాయిలే
మలయపవనాల గిలిగింతలో
పూచే పొదరిల్లు తోడుగా

బ్రతుకే బహుమతి ఇది చాలా
మెరిసే అధరం మధుశాల
విరిజాజిలా విరిసానులే
విరహాలలో తడిసానులే
ఎదుట నిలిచాను నీ దానిగా

కలలా కలిసెను ప్రణయాలు
కధలై చిలికెను కవనాలు
రసరాణిలా వెలిగావులే
కవికన్యలా కదిలావులే
ప్రణయ రసరాజ్యం ఏలేములే

కాచే వెన్నెల సాక్షిగా

సినిమా:- చూపులు కలిసిన శుభవేళ
సాహిత్యం:-
సంగీతం:- రాజన్-నాగేంద్ర
గానం:- జానకి, బాలు


ninna monna neevE dhyaanam
nEDu rEpu neevE gaanam
raagam taanam neevu nEnai
sangeetAlE samyOgaalai
nimisham nimisham sarasam ninDEnOyi

ninna monna neevE dhyaanam
nEDu rEpu neevE gaanam
raagam taanam neevu nEnai
sangeetAlE samyOgaalai
kalalO ilalO velisEmOyi

virisi viriyani paruvAlu
layatO talapaDu nATyaalu
kalahamsalaa kadilaavulE
maruhimsaku guricheyyakE
karuNa choopinchu naa dEvivai

telisi teliyani bhaavaalu
valichi malachani raagaalu
suragangalA pongAyilE
malayapavanaala giligintalO
poochE podarillu tODugaa

bratukE bahumati idi chaalaa
merisE adharam madhuSaala
virijaajilaa virisAnulE
virahaalalO taDisAnulE
eduTa nilichaanu nee daanigaa

kalalaa kalisenu praNayaalu
kadhalai chilikenu kavanaalu
rasaraaNilA veligaavulE
kavikanyalA kadilaavulE
praNaya rasaraajyam ElEmulE

kaachE vennela saakshigaa

sinimaa:- choopulu kalisina SubhavELa
saahityam:-
sangeetam:- raajan-naagEndra
gaanam:- jAnaki, bAlu


---

ప్రేమ గర్జించవే..నీ ధీమా వర్షించవే
గిట్టనోళ్ళు గింజుకున్నా..తొడగోట్టి పడగొట్టి జైకొట్టవే

నీ చూపే నీలంబరి
నీ రూపే కాదంబరి
నీవే నా రాగలహరి
రాగమైనా తాళమైనా లయతోనే రానిస్తుంది
నింగి కొసలు, నేల మనిషి మీటగా

ముసలోళ్ళు ప్రేమించరు..ప్రేమిస్తే హర్షించరు
ప్రేమ మహిమ అసలు తెలుసుకోరు
శిశువైనా పశువైనా
ప్రేమిస్తూ జీవిస్తుంది
ముసలి పెదవి మొడతి రుచుల కదపగా

సినిమా:- చూపులు కలిసిన శుభవేళ
సాహిత్యం:-
సంగీతం:- రాజన్-నాగేంద్ర
గానం:- బాలు, చిత్ర

prEma garjinchavE..nee dhImA varshinchavE
giTTanOLLu ginjukunnA..toDagOTTi paDagoTTi jaikoTTavE

nee choopE neelambari
nee roopE kaadambari
neevE naa raagalahari
raagamainaa taaLamainaa layatOnE raanistundi
ningi kosalu, nEla manishi meeTagA

musalOLLu prEmincharu..prEmistE harshincharu
prEma mahima asalu telusukOru
SiSuvainaa paSuvainaa
prEmistU jeevistundi
musali pedavi moDati ruchula kadapagA

sinimaa:- choopulu kalisina SubhavELa
saahityam:-
sangeetam:- raajan-naagEndra
gaanam:- bAlu, chitra

----

సిరిమల్లే శుభలేఖ..చదివేవా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
అక్షర లక్ష..ముద్దుల బిక్ష
కందిన మొగ్గ..కమ్మని బుగ్గ
చిరునవ్వే శుభలేఖ..చదివేవా శశిరేఖ

జాజిమల్లి తీగనై..జూకామల్లి పువ్వునై
నీ చెంత చేరేనులే
ఋతు పవనాలలో..రస కవనాలలో
తీర్చాలి నా మోజులే
రాజిలేని అల్లరి...రోజాపూల పల్లవి
నీ పాట పాడాలిలే
కధ రమనీయమై..చిర స్మరనీయమై
సాగాలి సంగీతమై..అనురాగ స్రీగందమై

రాగాలన్ని నవ్వులై..రావాలంట మువ్వవై
నా ప్రేమ మందారమై
తగు అధికారము..తమ సహకారము
కావాలి చేయూతగా
బుగ్గ బుగ్గ ఏకమై..ముద్దే మనకు లోకమై
నూరేళ్ళు సాగాలిలే..
ఇది మధుమాసమై..మనకు అనుకూలమై
జరగాలి సుముహుర్తమే..కళ్యాణ వైభోగమే

సినిమా:- చూపులు కలిసిన శుభవేళ
సాహిత్యం:-
సంగీతం:- రాజన్-నాగేంద్ర
గానం:- జానకి, బాలు

sirimallE SubhalEkha..chadivEvA nelavanka
tiyyani pilupE SraavaNa geetam
andina valapE aamani gaanam
akshara laksha..muddula biksha
kandina mogga..kammani bugga
chirunavvE SubhalEkha..chadivEvA SaSirEkha

jaajimalli teeganai..jUkaamalli puvvunai
nee chenta chErEnulE
Rtu pavanAlalO..rasa kavanAlalO
teerchaali nA mOjulE
raajilEni allari...rOjaapoola pallavi
nee paaTa paaDAlilE
kadha ramaneeyamai..chira smaraneeyamai
saagaali sangeetamai..anurAga sreegandamai

raagaalanni navvulai..raavAlanTa muvvavai
naa prEma mandaaramai
tagu adhikaaramu..tama sahakaaramu
kaavaali chEyUtagaa
bugga bugga Ekamai..muddE manaku lOkamai
nUrELLu saagaalilE..
idi madhumaasamai..manaku anukoolamai
jaragaali sumuhurtamE..kaLyaaNa vaibhOgamE

sinimaa:- choopulu kalisina SubhavELa
saahityam:-
sangeetam:- raajan-naagEndra
gaanam:- jAnaki, bAlu

Labels: , , , ,


Friday, February 10, 2012

 
అనుకోని అనుకోని
ప్రణయానికి మరో పేరు ప్రళయమని
కలల కడలి కనలి కనలి కనుల కొనల
ఎగజిమ్మే బాష్పానల కీల దాని ఫలితమని
అనుకోని అనుకోని
ప్రణయానికి మరో పేరు జ్వలనమని
రాగజ్యోతి వెలిగి వెలిగి త్యాగదీప్తి
ఎగజిమ్మే స్వర్ణోదయ లీల దాని ఫలితమని

కాలం బుసకొడుతుంది వేయి తలల నాగై
బ్రతుకు భారమవుతుంది మందర భూధరమై
సాదించేదేమిటి ఈ నిష్టుర నిష్ఫల మధనం
పాలమనసు పిండుకుంది హాలాహల నిదనం
పురము నందు గరళమనచి
పరుల కొరకు సుధ పంచే
పరమార్ధం తెలుపు మహిత కదనమని

అనుకోని అనుకోని అనుకోని

అగ్నితప్త కాంచనమై నిగ్గు తేలె హృదయం
కాలకూట విషమైనా భరించగల సహనం
ప్రేమ పెంచుతుంది నరుని పరమశివునిగా
త్యాగం అమృతఫలమై అవతరించగా
శిరము వంచి గగన ఝరిని మౌనంగా భరించిన
అది కొరే గమ్యం లవణాబ్ది అని

అనుకోని అనుకోని అనుకోని

వయోధరపు యెదను చీల్చు
కుట్టిల్ల తట్టిల్లతా కులుకును
భ్రమించాను మంగళ మంజుల సింజిత మంజీరపు జతి అని

పుడమి మోడు చిగురించగ
సదయ హృదయ సౌదామిని
చిందించిన చందన శీతల శీకర సౌహార్దపు గతి అని

తెల్లని వెన్నెల అందము అతివ వలపు కాదని
కల్లల యెల్లల కలయని అనుకోని

రగులుతున్న శశి యెదలో తాను మండి
జగతి గుండె చలర్చే తపన ఉంది అనుకోని

అహిఫణగత మణి ప్రణయం అనుకోని

అనుకోని అనుకోని అనుకోని

సినిమా:- శ్రీనివాస కళ్యాణం
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- మహదేవన్
గానం:- సుశీల, బాలు

anukOni anukOni
praNayaaniki marO pEru praLayamani
kalala kaDali kanali kanali kanula konala
egajimmE baashpAnala keela daani phalitamani
anukOni anukOni
praNayaaniki marO pEru jwalanamani
raagajyOti veligi veligi tyaagadeepti
egajimmE swarNOdaya leela daani phalitamani

kaalam busakoDutundi vEyi talala naagai
bratuku bhaaramavutundi mandara bhoodharamai
saadinchEdEmiTi ee nishTura nishphala madhanam
paalamanasu pinDukundi haalaahala nidanam
puramu nandu garaLamanachi
parula koraku sudha panchE
paramaardham telupu mahita kadanamani

anukOni anukOni anukOni

agnitapta kaanchanamai niggu tEle hRdayam
kaalakooTa vishamainaa bharinchagala sahanam
prEma penchutundi naruni paramaSivunigA
tyaagam amRtaphalamai avatarinchagaa
Siramu vanchi gagana jharini mounangaa bharinchina
adi korE gamyam lavaNaabdi ani

anukOni anukOni anukOni

vayOdharapu yedanu cheelchu
kuTTilla taTTillataa kulukunu
bhraminchaanu mangaLa manjula sinjita manjeerapu jati ani

puDami mODu chigurinchaga
sadaya hRdaya soudaamini
chindinchina chandana Seetala Seekara souhaardapu gati ani

tellani vennela andamu ativa valapu kaadani
kallala yellala kalayani anukOni

ragulutunna SaSi yedalO taanu manDi
jagati gunDe chalarchE tapana undi anukOni

ahiphaNagata maNi praNayam anukOni

anukOni anukOni anukOni

sinimaa:- SrInivAsa kaLyANam
saahityam:- sirivennela
sangeetam:- mahadEvan
gaanam:- suSeela, bAlu

Labels: , , ,


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]