Saturday, February 11, 2012

 
నిన్న మొన్న నీవే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సమ్యోగాలై
నిమిషం నిమిషం సరసం నిండేనోయి

నిన్న మొన్న నీవే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సమ్యోగాలై
కలలో ఇలలో వెలిసేమోయి

విరిసి విరియని పరువాలు
లయతో తలపడు నాట్యాలు
కలహంసలా కదిలావులే
మరుహింసకు గురిచెయ్యకే
కరుణ చూపించు నా దేవివై

తెలిసి తెలియని భావాలు
వలిచి మలచని రాగాలు
సురగంగలా పొంగాయిలే
మలయపవనాల గిలిగింతలో
పూచే పొదరిల్లు తోడుగా

బ్రతుకే బహుమతి ఇది చాలా
మెరిసే అధరం మధుశాల
విరిజాజిలా విరిసానులే
విరహాలలో తడిసానులే
ఎదుట నిలిచాను నీ దానిగా

కలలా కలిసెను ప్రణయాలు
కధలై చిలికెను కవనాలు
రసరాణిలా వెలిగావులే
కవికన్యలా కదిలావులే
ప్రణయ రసరాజ్యం ఏలేములే

కాచే వెన్నెల సాక్షిగా

సినిమా:- చూపులు కలిసిన శుభవేళ
సాహిత్యం:-
సంగీతం:- రాజన్-నాగేంద్ర
గానం:- జానకి, బాలు


ninna monna neevE dhyaanam
nEDu rEpu neevE gaanam
raagam taanam neevu nEnai
sangeetAlE samyOgaalai
nimisham nimisham sarasam ninDEnOyi

ninna monna neevE dhyaanam
nEDu rEpu neevE gaanam
raagam taanam neevu nEnai
sangeetAlE samyOgaalai
kalalO ilalO velisEmOyi

virisi viriyani paruvAlu
layatO talapaDu nATyaalu
kalahamsalaa kadilaavulE
maruhimsaku guricheyyakE
karuNa choopinchu naa dEvivai

telisi teliyani bhaavaalu
valichi malachani raagaalu
suragangalA pongAyilE
malayapavanaala giligintalO
poochE podarillu tODugaa

bratukE bahumati idi chaalaa
merisE adharam madhuSaala
virijaajilaa virisAnulE
virahaalalO taDisAnulE
eduTa nilichaanu nee daanigaa

kalalaa kalisenu praNayaalu
kadhalai chilikenu kavanaalu
rasaraaNilA veligaavulE
kavikanyalA kadilaavulE
praNaya rasaraajyam ElEmulE

kaachE vennela saakshigaa

sinimaa:- choopulu kalisina SubhavELa
saahityam:-
sangeetam:- raajan-naagEndra
gaanam:- jAnaki, bAlu


---

ప్రేమ గర్జించవే..నీ ధీమా వర్షించవే
గిట్టనోళ్ళు గింజుకున్నా..తొడగోట్టి పడగొట్టి జైకొట్టవే

నీ చూపే నీలంబరి
నీ రూపే కాదంబరి
నీవే నా రాగలహరి
రాగమైనా తాళమైనా లయతోనే రానిస్తుంది
నింగి కొసలు, నేల మనిషి మీటగా

ముసలోళ్ళు ప్రేమించరు..ప్రేమిస్తే హర్షించరు
ప్రేమ మహిమ అసలు తెలుసుకోరు
శిశువైనా పశువైనా
ప్రేమిస్తూ జీవిస్తుంది
ముసలి పెదవి మొడతి రుచుల కదపగా

సినిమా:- చూపులు కలిసిన శుభవేళ
సాహిత్యం:-
సంగీతం:- రాజన్-నాగేంద్ర
గానం:- బాలు, చిత్ర

prEma garjinchavE..nee dhImA varshinchavE
giTTanOLLu ginjukunnA..toDagOTTi paDagoTTi jaikoTTavE

nee choopE neelambari
nee roopE kaadambari
neevE naa raagalahari
raagamainaa taaLamainaa layatOnE raanistundi
ningi kosalu, nEla manishi meeTagA

musalOLLu prEmincharu..prEmistE harshincharu
prEma mahima asalu telusukOru
SiSuvainaa paSuvainaa
prEmistU jeevistundi
musali pedavi moDati ruchula kadapagA

sinimaa:- choopulu kalisina SubhavELa
saahityam:-
sangeetam:- raajan-naagEndra
gaanam:- bAlu, chitra

----

సిరిమల్లే శుభలేఖ..చదివేవా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
అక్షర లక్ష..ముద్దుల బిక్ష
కందిన మొగ్గ..కమ్మని బుగ్గ
చిరునవ్వే శుభలేఖ..చదివేవా శశిరేఖ

జాజిమల్లి తీగనై..జూకామల్లి పువ్వునై
నీ చెంత చేరేనులే
ఋతు పవనాలలో..రస కవనాలలో
తీర్చాలి నా మోజులే
రాజిలేని అల్లరి...రోజాపూల పల్లవి
నీ పాట పాడాలిలే
కధ రమనీయమై..చిర స్మరనీయమై
సాగాలి సంగీతమై..అనురాగ స్రీగందమై

రాగాలన్ని నవ్వులై..రావాలంట మువ్వవై
నా ప్రేమ మందారమై
తగు అధికారము..తమ సహకారము
కావాలి చేయూతగా
బుగ్గ బుగ్గ ఏకమై..ముద్దే మనకు లోకమై
నూరేళ్ళు సాగాలిలే..
ఇది మధుమాసమై..మనకు అనుకూలమై
జరగాలి సుముహుర్తమే..కళ్యాణ వైభోగమే

సినిమా:- చూపులు కలిసిన శుభవేళ
సాహిత్యం:-
సంగీతం:- రాజన్-నాగేంద్ర
గానం:- జానకి, బాలు

sirimallE SubhalEkha..chadivEvA nelavanka
tiyyani pilupE SraavaNa geetam
andina valapE aamani gaanam
akshara laksha..muddula biksha
kandina mogga..kammani bugga
chirunavvE SubhalEkha..chadivEvA SaSirEkha

jaajimalli teeganai..jUkaamalli puvvunai
nee chenta chErEnulE
Rtu pavanAlalO..rasa kavanAlalO
teerchaali nA mOjulE
raajilEni allari...rOjaapoola pallavi
nee paaTa paaDAlilE
kadha ramaneeyamai..chira smaraneeyamai
saagaali sangeetamai..anurAga sreegandamai

raagaalanni navvulai..raavAlanTa muvvavai
naa prEma mandaaramai
tagu adhikaaramu..tama sahakaaramu
kaavaali chEyUtagaa
bugga bugga Ekamai..muddE manaku lOkamai
nUrELLu saagaalilE..
idi madhumaasamai..manaku anukoolamai
jaragaali sumuhurtamE..kaLyaaNa vaibhOgamE

sinimaa:- choopulu kalisina SubhavELa
saahityam:-
sangeetam:- raajan-naagEndra
gaanam:- jAnaki, bAlu

Labels: , , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]