Monday, April 30, 2018

 
జనగణమన అని పాడే సమయం..చావుబతుకుల సంగమ సమయం
ముగిసే కధలే..ఆహ వీడే వెతలే
తుది ఆనందం..ఇక మన సొంతం
ఈ భూమికి మనకిక తొలగెను బంధం

జనులు ఎవరు మరణించకుంటే జనకోటి నే రీతి మోస్తుంది ఈ నేలరా
భువనగోళం తన చక్రభ్రమణం ఆపేను మారేను తన కలగతిలనిరా
తెలుసుకో సత్యం..ఇది నిత్యం
తలచుకో మనసులో అనునిత్యం
ఎది గగనం..అతి విశాలం..ప్రతి విహంగం ఎగరనీ
గాలిలో తేలని..ఎలా..ఎలా..అదో అలా..అలా
కలలా తిమిరం మన బ్రతుకంత..ఈ కధలకు కలలకు విడుదల రాని

వానజల్లే భూమాత ఒడిలో పడగానే అర్పించు తన సర్వమే
నదులు సాగే చేరేను కడలి..ఆ సంగమాన్ని హర్షించే ఈ లొకమే
ఇంతకంటే లేదే నీతి అన్నది..దానితోనే లోకం సాగుతున్నది
మనసుతీరా మనం ఒకటై..జగతి జతిలో సాగుదాం
జగతినే జయించుదాం..ఎలా..ఎలా..అదో అలా..అలా
ఈ గాధలకు ఇక కడ ఎది
ఈ ప్రశ్నకు బదులిచ్చు జ్ఞానులు ఏరి
 
సినిమా:- october 2
సంగీతం:- ఎం.ఎం.కీరవాణి
గానం:- బాలు, చిత్ర

janagaNamana ani paaDE samayam..chaavubatukula sangama samayam
mugisE kadhalE..aaha veeDE vetalE
tudi aanandam..ika mana sontam
ee bhoomiki manakika tolagenu bandham

janulu evaru maraNinchakunTE janakOTi nE reeti mOstundi ee nElaraa
bhuvanagOLam tana chakrabhramaNam aapEnu maarEnu tana kalagatilaniraa
telusukO satyam..idi nityam
talachukO manasulO anunityam
edi gaganam..ati viSaalam..prati vihangam egaranI
gaalilO tElani..elA..elA..adO alA..alA
kalalA timiram mana bratukanta..ee kadhalaku kalalaku viDudala raani

vaanajallE bhoomaata oDilO paDagAnE arpinchu tana sarvamE
nadulu saagE chErEnu kaDali..aa sangamaanni harshinchE ee lokamE
intakanTE lEdE neeti annadi..daanitOnE lOkam saagutunnadi
manasuteerA manam okaTai..jagati jatilO saagudaam
jagatinE jayinchudaam..elA..elA..adO alA..alA
ee gaadhalaku ika kaDa edi
ee praSnaku badulicchu jnAnulu Eri
 
sinimaa:- #october 2#
sangeetam:- em.em.keeravANi
gaanam:- bAlu, chitra 

Labels: , ,


 
ఎంత కరుణామూర్తివయ్యా..ఎంత చల్లని తండ్రివయ్యా
నీ రక్తాన్ని చిందించి నేర్పావు త్యాగము
ఆ త్యాగమార్గాన చూసాను నేను..రక్తసంభంధము
o god, mercy mercy you are mercy

ఇన్నియేళ్ళకు కన్నతల్లిని కన్నులారా చూశాను
ఎన్నిజన్మల పుణ్యమో ఆ తల్లి కడుపున కాచేను
కాని అంత చక్క్లని తల్లికి వెక్కిరింపుగా మిగిలానే
ఆ దేవత కడుపున దయ్యంగా పుట్టానే
దేవుడిచ్చిన లోపము..నేను చేసిన పాపమా
తనువుకున్న వికారము మనసులోన ఉండునా
అందమే అనుబంధమా..అది ప్రేమకన్నా అందమా
o god, mercy mercy you are mercy

ఈ అనాధకు నా అనేందుకు తమ్ముడొకడు దొరికాడు
ఈ కురూపి వాడి ముంది దిష్టిబొమ్మై నిలిచాడు
కాని ఇద్దరిలో ఒకే రక్తం గుర్తుపడుతుంది అనుకున్నాను
నోరారా ఒక్కసారి అన్నా అంటాడనుకున్న
జన్మనిచ్చిన బంధము కన్నతండ్రే తెంచాడు
తోడబుట్టిన వాడు నన్ను దొంగగానే చూశాడు
వీడిది ఒక జన్మమా..ఇది విధికి మాత్రం ధర్మమా
o god, mercy mercy you are mercy

సినిమా:- రక్త సంబంధం
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

enta karuNaamoortivayyA..enta challani tanDrivayyA
nee raktaanni chindinchi nErpAvu tyaagamu
aa tyaagamaargaana choosAnu nEnu..raktasambhandhamu 
#o god, mercy mercy you are mercy#

inniyELLaku kannatallini kannulaarA chooSAnu
ennijanmala puNyamO aa talli kaDupuna kaachEnu 
kaani anta chakklani talliki vekkirinpugA migilAnE
aa dEvata kaDupuna dayyangA puTTAnE 
dEvuDicchina lOpamu..nEnu chEsina paapamaa
tanuvukunna vikaaramu manasulOna unDunA
andamE anubandhamA..adi prEmakannA andamaa
#o god, mercy mercy you are mercy#

ee anaadhaku naa anEnduku tammuDokaDu dorikADu
ee kuroopi vADi mundi dishTibommai nilichaaDu 
kaani iddarilO okE raktam gurtupaDutundi anukunnaanu 
nOrArA okkasaari annA anTADanukunna
janmanicchina bandhamu kannatanDrE tenchADu
tODabuTTina vaaDu nannu dongagaanE chooSADu 
veeDidi oka janmamA..idi vidhiki maatram dharmamaa  
#o god, mercy mercy you are mercy#

sinimaa:- rakta sambandham
sangeetam:- chakravarti
gaanam:- bAlu 

Labels: ,


 
శోకమే లేదే..కలతకు స్థానమే లేదే
దూరమే లేదే..వేదుక దూరమే లేదే
గాలిలాగ మనసే చెలరేగెనే..గగనవీధిలొనే విహరించేనే
పాడే పాట..మేమిక సాగే బాట

ఊహలలోనే లోకమంతా చూడని..ఆశలు విరిసే పూలరాగం పాడని
వెతలకు నేడే వింతచెరలే దించని..కలిసిమెలిసి కధలతొటి పెరగని
అంబరాన పక్షుల్లా దిక్కుల అంచులకెగరాలి
పూలవోలె కొమ్మల్లో భువిని విరియాలి
రేగాలీ పొంగే సాగరమై..పండాలి నేడే మన చెలిమి

వేదనవీడి చంద్రలోకం సాగుదాం..సాధనచేసి కొత్త గగనం తాకుదాం
దిగులుమరచి కవితలెన్నో పాడుదాం..కవితలు తెలిపే కధలలోన తేలుదాం
ఊపిరి ఆగేవరకు ఇలా ఇర్రవైలోనె ఆగిపోదాం
గాలమేసే యముడికి ఇలా ఎదురుతిరుగుదాం
లేదమ్మా విలువ రేపటికి..నీదమ్మా నేడే ఈ చలవ

సినిమా:- october 2
సంగీతం:- ఎం.ఎం.కీరవాణి
గానం:- బాలు

SoakamE lEdE..kalataku sthAnamE lEdE
dooramE lEdE..vEduka dooramE lEdE
gaalilaaga manasE chelarEgenE..gaganaveedhilonE viharinchEnE
paaDE paaTa..mEmika saagE baaTa

oohalalOnE lOkamantA chooDani..aaSalu virisE poolaraagam paaDani
vetalaku nEDE vintacheralE dinchani..kalisimelisi kadhalatoTi peragani
ambarAna pakshullA dikkula anchulakegarAli
poolavOle kommallO bhuvini viriyAli
rEgAlI pongE saagaramai..panDAli nEDE mana chelimi

vEdanaveeDi chandralOkam saagudaam..saadhanachEsi kotta gaganam taakudaam
digulumarachi kavitalennO paaDudaam..kavitalu telipE kadhalalOna tEludaam
oopiri aagEvaraku ilA irravailOne aagipOdaam
gaalamEsE yamuDiki ilA edurutirugudaam
lEdammA viluva rEpaTiki..needammaa nEDE ee chalava

sinimaa:- #october 2#
sangeetam:- m.m.keeravANi
gaanam:- bAlu 

Labels: ,


 
పాట కాదు పాప పాట కాదు
దగా పడిన ప్రతి వనిత గుండెలోని కోత

కళ్ళనిండ నీళ్ళు..రొమ్ము నిండ పాలు..కలబోసిన రూపమే ఆడది
ఆ కన్నీటి చేదంతా నాలోనే ఉండని
కమ్మని పాలతో నీ కడుపు నిండని

ఆడదాని కడుపున పుట్టిన మగవాడు..ఆడదాన్నే బానిసగా మార్చాడు
ఈ మగవాళ్ళ పన్నగాలు ఎన్నాళ్ళు
ఇక చేదించు నీవైనా యుగయుగాల సంకెళ్ళు

సినిమా:- ఈ కాలం దంపతులు
గానం:- పి.సుశీల

paaTa kaadu paapa paaTa kaadu
dagA paDina prati vanita gunDelOni kOta

kaLLaninDa neeLLu..rommu ninDa paalu..kalabOsina roopamE aaDadi
aa kannITi chEdantA naalOnE unDani
kammani paalatO nee kaDupu ninDani

aaDadaani kaDupuna puTTina magavADu..aaDadaannE baanisagA maarchADu
ee magavALLa pannagAlu ennALLu
ika chEdinchu neevainaa yugayugaala sankeLLu

sinimA:- ee kaalam dampatulu
gAnam:- p.suSeela 

Labels: ,


 
ఈ భరతఖండం ఓ జ్వలితగుండం..నిజం..నిజం
రావణుల రాజ్యం..భూపతుల భోజ్యం..యుగాంతాలకే స్వాగతం

దృతరాష్ట్ర రాజ్యాల ఈ న్యాయము..దురంతాలు రేపే ఓ గాయము
రుధిరాలు చిందించు ఈ యాగము..వృధాకాదులే రేపు నీ త్యాగము
దనం పశుబలం..మధించిన జులుం..నశించేది ఎన్నాళ్ళకి
తుదిలేని ఎదురీత ఏ చోటుకి?

విలయాగ్ని గీతాల సంకేతము..జ్వలించింది మౌనసంగీతము
తలవంచె వంచనకు ఈ దేశము..లిఖించింది గాలిసందేశము
దురాగతమునే నిరోధించగా..దిశాంతాలు నినదించగా
గర్జించు నిర్జించు నీ సాహసం

సినిమా:- సాహసం
సంగీతం:- ఎం.ఎం.కీరవాణి
గానం:- బాలు  

ee bharatakhanDam O jwalitagunDam..nijam..nijam
raavaNula raajyam..bhoopatula bhOjyam..yugaantaalakE swaagatam

dRtarAshTra raajyaala ee nyaayamu..durantaalu rEpE O gaayamu
rudhiraalu chindinchu ee yaagamu..vRdhaakaadulE rEpu nee tyaagamu
danam paSubalam..madhinchina julum..naSinchEdi ennALLaki
tudilEni edureeta E chOTuki?

vilayaaagni geetaala sankEtamu..jwalinchindi mounasangeetamu
talavanche vanchanaku ee dESamu..likhinchindi gaalisandESamu
duraagatamunE nirOdhinchagA..diSaantAlu ninadinchagA
garjinchu nirjinchu nee saahasam

sinimA:- saahasam
sangeetam:- m.m.keeravANi
gAnam:- bAlu    

Labels: , ,


 
ఏ నావది ఏ తీరమో..ఏ నేస్తమే జన్మవరమో
కలగానో, కధగానో..మిగిలేది నీవే ఈ జన్మలో

నాలోని నీవే నేనైనాను.నీలోని నేనే నీవైనావు
విన్నావా ఈ వింతను..అన్నారా ఎవరైనను
నీకు నాకే చెల్లిందను

ఆకాశమల్లే నీవున్నావు..నీ నీలిరంగై నేనున్నాను
కలిసేది ఊహేనను..ఊహల్లో కలిసామను
నీవు నేనే సాక్ష్యాలను

సినిమా:- సంకీర్తన
సంగీతం:- ఇళయరాజా
గానం:- జేసుదాస్  

E nAvadi E teeramO..E nEstamE janmavaramO
kalagAnO, kadhagAnO..migilEdi neevE ee janmalO

naalOni neevE nEnainAnu.neelOni nEnE neevainAvu
vinnAvA ee vintanu..annArA evarainanu
neeku naakE chellindanu

aakASamallE neevunnAvu..nee neelirangai nEnunnAnu
kalisEdi oohEnanu..oohallO kalisAmanu
neevu nEnE saakshyAlanu

sinimA:- sankeertana
sangeetam:- iLayarAjA
gAnam:- jEsudAs   

Labels: ,


 
రాణి రాణమ్మ అనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని
ఏన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ
రాణి రాణమ్మ అనాటి నవ్వులు ఏవమ్మ

రతనాలమేడలోన నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా నా అరిచేతులుంచాలని
ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను
పన్నీటి బతుకులోన కన్నీటి మంటలేనా


రాణీ రాణమ్మ రాని కన్నీళ్లు రానీయమ్మా
సహనం స్త్రీకి కవచమని శాంతం అందుకు సాక్షమని
ఉన్నాను మౌనంగా కన్నులు దాటని కన్నీరుగా
రాణీ రాణమ్మ రాణీ కన్నీళ్లు రానీయమ్మా

గుండె రగిలిపోతూవుంటే గూడుమేడ ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే ముళ్ళు పూలు ఒకటేలే
ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలితీరం
ఎదురీత ఆగదులే విధిరాత తప్పదులే

సినిమా:- మాపల్లె గొపాలుడు
సాహిత్యం:- సినారె
సంగీతం:- కె.వి.మహదేవన్ 
గానం:- ఎస్.జానకి, బాలు  

Labels: , , , ,


Sunday, April 29, 2018

 
కొండలెక్కినా దేవుడా..ఆ బండలలో ఏముంది
నువ్వు చేసిన లోకం చూడు..గుండెగుండెకో కధవుంది

మనిషిమనిషికి మనసిచ్చావు..మమతలెందరికిచ్చావు
పులిని లేడిని నువ్వే చేసి, కలిసె బ్రతకమని అన్నావు
చేసిని తప్పు నీకే తెలిసి..గుడిలో శిలవై దాకున్నావు
రా..దిగిరా
నువ్వు చేసిన లోకం చూడు..గుండెగుండెకో కధవుంది

నింగికి, నేలకు, గాలికి లేని స్వార్ధం మనిషికి ఇచ్చావు
కలియుగమందు మంచిచెడులకు మధ్యన ఘర్షణ పెట్టావు
చదరంగానికి రెండువైపులా నువ్వే కూర్చొని ఆడేవు..
రా..దిగిరా
నువ్వు చేసిన లోకం చూడు..గుండెగుండెకో కధవుంది


సినిమా:- ఆలయశిఖరం
సాహిత్యం:- సినారె
సంగీతం:- జె.వి.రాఘవులు
గానం:- బాలు  

konDalekkinA dEvuDaa..aa banDalalO Emundi
nuvvu chEsina lOkam chooDu..gunDegunDekO kadhavundi

manishimanishiki manasicchaavu..mamatalendarikicchaavu
pulini lEDini nuvvE chEsi, kalise bratakamani annAvu
chEsini tappu neekE telisi..guDilO Silavai daakunnAvu
rA..digirA
nuvvu chEsina lOkam chooDu..gunDegunDekO kadhavundi

ningiki, nElaku, gAliki lEni swaardham manishiki icchAvu
kaliyugamandu manchicheDulaku madhyana gharshaNa peTTAvu
chadarangAniki renDuvaipulA nuvvE koorchoni aaDEvu..
rA..digirA
nuvvu chEsina lOkam chooDu..gunDegunDekO kadhavundi


sinimA:- aalayaSikharam
saahityam:- sinAre
sangeetam:- je.vi.rAghavulu
gaanam:- bAlu   

Labels: , , ,


 
అటు దహనం, ఇటు ఖననం
అటు మరణం, ఇటు జననం
ఇంతకన్న ఏం చేస్తావు..నన్ను ఏం సాధిస్తావు

నిన్ను నమ్మి ఎప్పుడెవ్వడు సుఖపడ్డాడు
నీలో హృదయమన్నది ఎవడు చూడగలిగాడు
సత్యం నీవని నమ్మి, ధర్మం నీవని నమ్మి..హరిశ్చంద్రుడేమైనాడు
కూటికి పేదై కాటికాపరి అయినాడు
జీవచ్చవమై నాలా శ్మశానం చేరేడు

నా ఇల్లని, నా వాళ్ళని ఇక్యంగా బ్రతకాలని
ఆశలు అడియాశలయిన పిచ్చివాడిని నేను
ఏ సుముహుర్తంలో నువ్విటు వస్తావని..
చితిమంటల వెలుగులో నన్ను కలుసుకుంటావని
సర్వసమానత్వానికి వేదికై ఈ శ్మశానం
ఇక్కడ జరగక తప్పదు మనకు సంగమం

సినిమా:- మగధీరుడు
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- బాలు
గానం:- బాలు

aTu dahanam, iTu khananam
aTu maraNam, iTu jananam
intakanna Em chEstAvu..nannu Em saadhistaavu

ninnu nammi eppuDevvaDu sukhapaDDaaDu
neelO hRdayamannadi evaDu chooDagaligADu
satyam neevani nammi, dharmam neevani nammi..hariSchandruDEmainADu
kooTiki pEdai kaaTikaapari ayinaaDu
jeevacchavamai naalA SmaSaanam chErEDu

naa illani, nA vALLani ikyangA bratakAlani
aaSalu aDiyaaSalayina picchivADini nEnu
E sumuhurtamlO nuvviTu vastAvani..
chitimanTala velugulO nannu kalusukunTAvani
sarvasamaanatvaaniki vEdikai ee SmaSAnam
ikkaDa jaragaka tappadu manaku sangamam

sinimA:- magadheeruDu
saahityam:- vETUri
sangeetam:- bAlu
gaanam:- bAlu   

Labels: , ,


 
మంచిని పంచిన నీవు..బాబు..వంచన పాలయినావు
అనురాగం, మమకారం అరదండాలై..ఖైది అయ్యావు

తలపై మోశావు ఈ నేరం..త్యాగం గుర్తించదీ లోకము
నీలో నీతిని నమ్మి నలిగిందో హృదయము
నీతికి గోతులు తవ్వి కులికిందో భోగము
ఈ ఆస్తిపాస్థులనేవి కావయ్యా శాశ్వతం
ఈ అన్నతమ్ముల గాధే అలనాటి భారతం

ధనమే ఓ కక్షగా రగిలెను..మనసే ఓ శిక్షగా మిగిలెను
న్యాయం గాయం చేసి గుండెల్లో మూల్గెను
కల్లాకపటం కలిసి నిన్ను రచ్చకీడ్చెను
ఈ నెత్తురే మెత్తని కత్తై నీ వెన్నే పొడిచెను
అది రుజువేలేని నిజమై నీతోనే నడిచెను  

సినిమా:- మగధీరుడు
సాహిత్యం:- ఆచార్య ఆత్రేయ
సంగీతం:- బాలు
గానం:- బాలు  

manchini panchina neevu..bAbu..vanchana pAlayinAvu
anurAgam, mamakAram aradanDaalai..khaidi ayyaavu

talapai mOSAvu ee nEram..tyaagam gurtinchadI lOkamu
neelO neetini nammi naligindO hRdayamu
neetiki gOtulu tavvi kulikindO bhOgamu
ee aastipaasthulanEvi kaavayyaa SaaSwatam
ee annatammula gaadhE alanATi bhaaratam

dhanamE O kakshagA ragilenu..manasE O SikshagA migilenu
nyaayam gaayam chEsi gunDellO moolgenu
kallAkapaTam kalisi ninnu racchakeeDchenu
ee netturE mettani kattai nee vennE poDichenu
adi rujuvElEni nijamai neetOnE naDichenu  

sinimA:- magadheeruDu
saahityam:- AchArya AtrEya
sangeetam:- bAlu
gaanam:- bAlu   

Labels: ,


 
ఇంటి పేరు అనురాగం..ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం..ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

వెలుగునీడలయినా, కలిమిలేములయినా
మా ముంగిట ఎప్పుడూ చిరునవ్వుల ముగ్గులే
ఎదిరించని జానకి, నిదురించని ఊర్మిళ
తోడికోడళ్ళుగా ఇల్లు చక్కదిద్దగా
ప్రేమకు రూపాలుగా, రామలక్ష్మణులుగా
కొండంత అండగా అన్నలు తొడుండగా

వయసులో చిన్నయినా, మనసులో పెద్దగా
తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా
అమ్మగా, నాన్నగా, బిడ్డగా, పాపగా
ఏ దేవకి కన్నా, ఏ యశోద పెంచినా
గోకులాన వెలిసాడు గోపాలకృష్ణుడు
మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు

ఏ కొండల పుట్టినా, ఏ కోనలపొంగినా
సాగే ప్రతి జీవనదికి..సాగరమే తుది మజిలి
సంసారమనే ఒక సాగరం
అన్నతమ్ములకైనా ఆలుమగలకయినా ఈ బ్రతుకు ప్రయాగలో
తప్పదులే సంగమం..ఈ త్రివేణి సంగమం

ఇంటి పేరు అనురాగం..ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం..ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

వెలుగులోన నీడగా, లేమిలోన కలిమిగా
అందరము ఒక్కటిగా కలిసినప్పుడు
ఎడబాటుల బాటలన్ని కూడలి కావా
ఎదచాటున ఆపేక్షలే పొంగి పొరలవా
మమకారం ఒక్కటే మానవతకు ఆధారం
ఈ సంగమాన్ని ఆపడం ఎవరి తరం..ఇంకెవ్వరి తరం

సినిమా:- మగధీరుడు
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- బాలు
గానం:- బాలు  

inTi pEru anuraagam..muddu pEru mamakAram
maa illE bRndAvanam..mukkOTi dEvatalu velasina dEvAlayam

veluguneeDalayinaa, kalimilEmulayinaa
maa mungiTa eppuDU chirunavvula muggulE
edirinchani jAnaki, nidurinchani oormiLa
tODikODaLLugA illu chakkadiddagA
prEmaku roopAlugA, rAmalakshmaNulugA
konDanta anDagA annalu toDunDagA

vayasulO chinnayinaa, manasulO peddagA
tammuDanna maaTakE taanu saakshigA
ammagA, naannagA, biDDagA, pApagA
E dEvaki kannA, E yaSOda penchinA
gOkulAna velisADu gOpAlakRshNuDu
maa inTiki deepamai chinnAri tammuDu

E konDala puTTinA, E kOnalaponginA
saagE prati jeevanadiki..saagaramE tudi majili
samsAramanE oka saagaram
annatammulakainaa aalumagalakayinaa ee bratuku prayAgalO
tappadulE sangamam..ee trivENi sangamam

inTi pEru anuraagam..muddu pEru mamakAram
maa illE bRndAvanam..mukkOTi dEvatalu velasina dEvAlayam

velugulOna neeDagA, lEmilOna kalimigA
andaramu okkaTigA kalisinappuDu
eDabaaTula baaTalanni kooDali kaavA
edachaaTuna aapEkshalE pongi poralavA
mamakaaram okkaTE maanavataku aadhaaram
ee sangamaanni aapaDam evari taram..inkevvari taram

sinimA:- magadheeruDu
saahityam:- vETUri
sangeetam:- bAlu
gaanam:- bAlu   

Labels: ,


 
లోకంలో మనుషులు రకరకాలు..మనుషుల్లో దొంగలు రెండు రకాలు
ఎగిరొచ్చే కెరటంరా బయటి దొంగ..చాపకింద నీరురా ఇంటిదొంగ

జాగిలాలు పోల్చగలవు బయటిదొంగను
ఈశుడయిన పోల్చలేడు ఇంటిదొంగను
లోకం నిదురించేవరకు, చీకటి మేలుకొనేవరకు
తాను ఒక మనిషినని తలపోయును బయటిదొంగ
పగలయినా రేయయినా నిదురించే క్షణమైనా
చెడుతలపే జీవించును ఇంటిదొంగ

సినిమా:- ఇంటిదొంగ
సాహిత్యం:- సినారె
సంగీతం:- కె.వి.మహదేవన్
సాహిత్యం:- బాలు

lOkamlO manushulu rakarakAlu..manushullO dongalu renDu rakaalu
egirocchE keraTaMraa bayaTi donga..chaapakinda neeruraa inTidonga

jaagilaalu pOlchagalavu bayaTidonganu
eeSuDayina pOlchalEDu inTidonganu
lOkam nidurinchEvaraku, cheekaTi mElukonEvaraku
taanu oka manishinani talapOyunu bayaTidonga
pagalayinaa rEyayinaa nidurinchE kshaNamainaa
cheDutalapE jeevinchunu inTidonga

sinimaa:- inTidonga
saahityam:- cinAre
sangeetam:- k.v.mahadEvan
saahityam:- bAlu  

Labels: , ,


 
ఇన్నాళ్ళకొచ్చింది దీపావళి..తీపి కన్నీటి ప్రమిధల్లో కలికావళి..దీప కలికావళి
అమ్మమ్మ మనసులో, అమావాస్య బ్రతుకులో మనవరాలు తెచ్చింది మమతల దీపావళి

చిట్టి చిట్టి అలకలు చిటపటలు
జిల్లి బిల్లి అల్లరులే సీమ టపాకాయలు
వెలుగుల సురపొన్నలు చిచ్చుబుడ్లు
చీకటికి చింతలకి జవాబులే మతాబులు
అమ్మమ్మ కళ్ళలో ఎన్ని వెలుగు నీడలో
ఈ వెలుగుకి తోడు నీడ ఎవ్వరో ఎప్పుడో

సినిమా:- ముద్దుల మనవరాలు
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- బాలు
సాహిత్యం:- బాలు

innALLakocchindi deepAvaLi..teepi kannITi pramidhallO kalikAvaLi..deepa kalikAvaLi
ammamma manasulO, amAvAsya bratukulO manavarAlu tecchindi mamatala deepAvaLi

chiTTi chiTTi alakalu chiTapaTalu
jilli billi allarulE seema TapAkAyalu
velugula suraponnalu chicchubuDlu
cheekaTiki chintalaki javaabulE matAbulu
ammamma kaLLalO enni velugu neeDalO
ee veluguki tODu neeDa evvarO eppuDO

sinimaa:- muddula manavarAlu
saahityam:- vETUri
sangeetam:- bAlu
saahityam:- bAlu  

Labels: , , ,


 
మందారంలో ఘుమఘుమలై.. మకరందంలో మధురిమలై
మంత్రాక్షరమై దీవించేది.. మనమై మనదై జీవించేది
ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..

గంగలాగ పొంగి వచ్చి.. యమునలాగ సంగమించి
గంగలాగ పొంగి వచ్చి.. యమునలాగ సంగమించి
కౌగిలిలో కాశీ క్షేత్రం.. శివశక్తుల తాండవ నృత్యం
నిలిచి.. వలపు పండించేది..
నిన్ను నన్ను బ్రతికించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..
అనురాగానికి పరిమళమై.. ఆరాధనకి సుమగళమై..
వేదాశీస్సులు కురిపించేది..
వేయి ఉషస్సులు వెలిగించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..

ఒక ప్రేమ అమృత శిల్పం.. ఒక ప్రేమ బుద్దుడి రూపం
ఒక ప్రేమ రామచరిత్రం.. ఒక ప్రేమ గాంధీ తత్వం
చితినైనా చిగురించేది.. మృతినైనా బ్రతికించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..
నేనున్నాని కోరేదీ..ఈ.. నీవే నేనని నీడయ్యేదీ..ఈ..
కమ్మగ చల్లగ కనిపించేది.. బ్రహ్మని సైతం కని పెంచేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..
మందారంలో ఘుమఘుమలై.. మకరందంలో మధురిమలై
మంత్రాక్షరమై దీవించేది.. మనమై మనదై జీవించేది
ప్రేమ.. ప్రేమ ప్రేమ..
ప్రేమ.. ప్రేమ ప్రేమ..
ప్రేమ.. ప్రేమ ప్రేమ..


సినిమా:- రెండు జళ్ళ సీత
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- రమేశ్ నాయిడు

గానం:- ఎస్.జానకి,బాలు 

Labels: , , , , ,


 
మంచోళ్ళందరు పోయారు..మంచిని చెప్పే పోయారు
ఆ మంచిని కాచే మనుషులిప్పుడు మనలో కరువైనారు
రామయ్యా..రావయ్యా..ఈ రాజ్యమే నీదయ్యా

కొటిపేదల తోటివాడుగా కోళాయెవడు కడతాడు
కాల్చుకోమ్మని రొమ్ముచూపిన నేత ఎప్పుడు పుడతాడు
దొరలగుండెల్లో దూసుకేళ్ళీన మన్నెంవీరుడు రాబోడు
దేశభక్తులు, త్యాగమూర్తులు కలలు కధలైపోయరు
ఎవ్వరో తెచ్చింది, తేరగా చిక్కింది
కోతుల చెతుళ్ళో కొబ్బరే అయ్యింది
అహా..దేశం దేశంగా ఉన్నదా..
ఉన్నది కన్నది చెప్పేదంతా, వోట్లుమాత్రం వెయ్యాలంటా

బుద్ధిమంతులు, నీతిమంతులు వద్దు వద్దనుకున్నారు
తోడుదొంగలు, దొంగకొంగలు గూడుపుఠాణి చేసారు
రాజయ్కీయము ఉన్నవాళ్ళకు వ్యాపారంగా మారింది
ప్రజారాజ్యం వారసత్వమై వేసినచొటే ఉంటొంది
ఎవ్వడు చెప్తాడు, ఎవ్వడు వింటాడు
ఎవ్వడు ఉంటాడు, ఎప్పుడు దిగుతాడు
అహా..జ్యోస్యం చెప్పాలి సాములు
లంచమంటే లాంచనమంట, త్యాగమంటే లాభమంట

సినిమా:- పిచ్చిపంతులు
సాహిత్యం:- ఆచార్య ఆత్రేయ
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

manchOLLandaru pOyAru..manchini cheppE pOyAru
aa manchini kaachE manushulippuDu manalO karuvainAru
rAmayyA..rAvayyA..ee rAjyamE needayyA

koTipEdala tOTivADugA kOLAyevaDu kaDatADu
kaalchukOmmani rommuchoopina nEta eppuDu puDatADu
doralagunDellO doosukELLIna mannemveeruDu rAbODu
dESabhaktulu, tyAgamoortulu kalalu kadhalaipOyaru
evvarO tecchindi, tEragA chikkindi
kOtula chetuLLO kobbarE ayyindi
ahA..dESam dESamgaa unnadaa..
unnadi kannadi cheppEdantA, vOTlumaatram veyyAlanTA

buddhimantulu, neetimantulu vaddu vaddanukunnAru
tODudongalu, dongakongalu gooDupuThANi chEsAru
raajaykeeyamu unnavALLaku vyApArangA maarindi
prajAraajyam vaarasatvamai vEsinachoTE unTondi
evvaDu cheptADu, evvaDu vinTADu
evvaDu unTADu, eppuDu digutADu
ahA..jyOsyam cheppAli saamulu
lanchamanTE laanchanamanTa, tyAgamanTE lAbhamanTa

sinimA:- picchipantulu
saahityam:- AchArya AtrEya
sangeetam:- chakravarti
gaanam:- bAlu 

Labels: , , ,


 
నేను నీకై పుట్టినాని..నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో..చేయిపట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే ప్రేమ..ఊపిరే ప్రేమ

నిన్ను చూడక నిదురపోని రెండు నేత్రాలు
కలలహారతి నీకు పట్టే మౌన మంత్రాలు
నిన్ను తాకక నిలవలేని పంచ ప్రాణాలు
కౌగిలింతలా గర్భగుడిలో మూగ దీపాలు
ప్రేమ మహిమ తెలుపతరమా..ప్రేమే జీవన మధురిమ

స్త్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే
రావడంలే నీదు వెలుగులా ప్రమిదనై ఉంటా
ఓం అనే అక్షరంలా నీవు ఎదురైతే
నాదమై నిన్నాలపించే ప్రణవమై ఉంటా
ప్రేమ మహిమ తెలియతరమా..ప్రేమే జీవన మధురిమ

సినిమా:- చంటబ్బాయి
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- పి.సుశీల, బాలు  

nEnu neekai puTTinAni..ninnu pondakA maTTikAnani 
chemmagillE kanulatO..chEyipaTTE manasutO
chEsukunna bAsalO oosulE prEma..oopirE prEma 

ninnu chooDaka nidurapOni renDu nEtraalu
kalalahaarati neeku paTTE mouna mantraalu 
ninnu taakaka nilavalEni pancha prANAlu 
kougilintalA garbhaguDilO mooga deepAlu
prEma mahima telupataramA..prEmE jeevana madhurima

stree anE telugaksharmlA neevu niluchunTE
rAvaDamlE needu velugulA pramidanai unTA
Om anE aksharamlA neevu eduraitE
naadamai ninnaalapinchE praNavamai unTA
prEma mahima teliyataramA..prEmE jeevana madhurima

sinimA:- chanTabbAyi
saahityam:- vETUri
sangeetam:- chakravarti
gaanam:- p.suSeela, bAlu   

Labels: , , , , ,


 
తెలుసా .నీకు తెలుసా ... ప్రేమంటే ఒకే లాగ ఉదయించె గగనమని నీకు తెలుసా ...ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మాట వినిపించే కావ్యమని . ఒకే దివ్య వెలుగొందే కోవెలని అదే అదే .అదే నా హృదయమని . ప్రణయమని ... ప్రాణమని! నీకు తెలుసా ...ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని ఒకే మురళి పలికే గోకులమని . ఒకే కెరటము పొంగే యమున అని అదే అదే నా జీవమని . గానమని . మౌనమని ... తెలుసా!
సీతగాలి వీచినప్పుడు లేత ఎండలా ఎండకన్ను సోకినప్పుడా మంచు కొండలా ఆదుకొనే వెచ్చని మమత ఆవిరయ్యే చల్లని ఎడద ఒకటే శృతి .ఒకటే లయ. ఒకటే స్వరము మౌన రాగమొకటే అదే . అదే. అనురాగమని మౌనయోగమని . ప్రేమదీపమని . తెలుసా . నీకు తెలుసా ...!!! శరత్ కాల నదులలోని తేట నీటిలా పుష్య మాస సుమగళాల తేనెవాసలా సుప్రసన్న సుందర కవిత సుప్రభాత మరంద గుళిక ఒక పార్వతి . ఒక శ్రీపతి . ఒక సరస్వతి " సర్వ మంగళ మాన్గాల్యే శివే సర్వార్దాసారకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే " ఉన్న మంత్రమొకటే . అదే .అదే . మమకారము సృష్టి కారణం ... బ్రహ్మకు జననం .తెలుసా .నీకు తెలుసా ...!!!

సినిమా:- బాబాయి-అబ్బాయి సాహిత్యం:- వేటూరి సంగీతం:- చక్రవర్తి గానం:- ఎస్.జానకి, బాలు

Labels: , , , , ,


Saturday, April 28, 2018

 
ఒక మాట చెప్పానా..ఒక పాట పాడనా
ఇది మౌనబాష మీటుతున్న వీణ
ఎవరెంత ఆపినా..కన్నీరు ఆగునా
ఇది కంటిపాప చల్లుతున్న వాన
చిన్ని గుండెలో ఎన్నెని ఆశలో
గొంతు విప్పి చెప్పలేని ఎన్ని మాటలో
రాతిరేలలో చుర్రుక్కుమంటదో
మనసులేని మనిషి నేను ఏమి చెయ్యను

నీ కంటిచూపులే అలా అలా నను తాకగా
నీ వెంట నేనిలా ప్రతిక్షణం తోడు ఉండనా
దారితప్పి తిరుగుతున్న బాటసారిని
పూలదారిలోకి నువ్వు నడిపినావని
జీవితానికి అర్ధమేంటో తెలిపినావని
మనసు తెరిచి నన్ను నువ్వు గెలిచినావని
క్షమించమన్న అర్హతయిన నాకులేదని

ఈ చీకటెప్పుడు ఇలా ఇలాగే ఉండిపోదులే
నీ నవ్వు తాకితే సరాసరి వెన్నెలవునులే
పంజరాన చిక్కుకున్న చిలక నీవని
బాధపడి కూర్చుని ఉంటే లాభమేంటని
వేటగాడితో చెలిమి చేసినావని
తప్పు తెలుసుకున్నవాడే మనిషౌనని
నీ మాటతో పొందినాను కొత్త జన్మని

సినిమా:- నీరీక్షణ
సంగీతం:- ఎం.ఎం.శ్రీలేఖ
గానం:- బాలు

oka maaTa cheppAnA..oka pATa pADanA
idi mounabAsha meeTutunna veeNa
evarenta aapinaa..kannIru aagunA
idi kanTipApa challutunna vAna
chinni gunDelO enneni aaSalO
gontu vippi cheppalEni enni mATalO
raatirElalO churrukkumanTadO
manasulEni manishi nEnu Emi cheyyanu

nee kanTichoopulE alA alA nanu tAkagA
nee venTa nEnilA pratikshaNam tODu unDanA
daaritappi tirugutunna baaTasArini
pooladaarilOki nuvvu naDipinAvani
jeevitAniki ardhamEnTO telipinAvani
manasu terichi nannu nuvvu gelichinAvani
kshaminchamanna arhatayina naakulEdani

ee cheekaTeppuDu ilA ilAgE unDipOdulE
nee navvu taakitE sarAsari vennelavunulE
panjarAna chikkukunna chilaka neevani
bAdhapaDi koorchuni unTE lAbhamEnTani
vETagADitO chelimi chEsinAvani
tappu telusukunnavADE manishaunani
nee maaTatO pondinAnu kotta janmani

sinimA:- nIrIkshaNa
sangeetam:- m.m.SrIlEkha
gAnam:- bAlu 

Labels: ,


 
ఇంత అందం...ఎప్పుడూ చూడ లేదే... ఇంత కాలం ఎవరూ చెప్ప లేదే. ఇది కల అనుకోనా... వరమనుకో... కలవరమనుకోనా ఇది చెలిమనుకోనా... చెలి అనుకోనా... చెరిసగమనుకోనా... తోడు అనుకో...నీకో నీడననుకో రాగమనుకో...నీలో భాగమనుకో ఇంత అందం...ఎప్పుడూ చూడ లేదే ఇంత కాలం ఎవరూ చెప్ప లేదే ఆ బ్రహ్మ దేవుడే తన పేరు చరితలో నిలవాలని నీ రూపమే సృష్టించెనే ఆ నింగి చంద్రుడే ఆకాశ చెరలలో నిలవొద్దని నీ స్నేహమై నను చేరెనే స్నేహ సీమలో కొత్తగా ప్రేమ పూవులే పూయగా ప్రేమ సీమలో తీయగా తేనె స్థానమే చేయగా తలవంచక తప్పదు స్వర్గం ప్రతి నిమిషం నీ కాలి గోటిపై నా గుండె వాలగా కసిరేయక విసిరేయక కాపాడవా నీ కంటి గోటిపై కలపాప చేరగా విదిలించక వదిలేయక నడిపించవా నిన్న దాక నా జీవితం కవిత లేని ఓ కాగితం నువ్వు లేని నా యవ్వనం దివ్వె లేని ఓ ఆలయం మన అనుబంధానికి మనసే తొలి సాక్ష్యం

సినిమా:- నిరీక్షణ
సంగీతం:- ఎం.ఎం.శ్రీలేఖ 
గానం:- బాలు, చిత్ర 

Labels: ,


 
లేత కొబ్బరి నీళ్ళల్లే..పూత మమిడి పిందల్లే
చెప్పకుండా వస్తుంది చిలిప్ వయసు
నిప్పు మీద నీరవుతుంది పాడు మనసు..మనసు

పొంగు వస్తుంది నీ బాల అంగాలకు
రంగు తెస్తుంది నీ పాల చెక్కిళ్ళకు
కోక కడతావు మొలకెత్తు అందాలకు
కొంగుచాటెసి గుట్టంత దాచేందుకు
దాగలేనివి ఆగలేనివి దారులేవో వెతుకుతుంటవి

కోటి అర్ధాలు చూసేవు నా మాటలో
కొర్కెలేవో రేగేను నీ గుండెలో
నేర్చుకుంటాయి నీ కళ్ళూ దొంగాటలు
ఆడుకుంటాయి నాతో దోబూచులు
చూచుకొమ్మని దోచుకొమ్మని దాచుకున్నవి పిలుస్తుంటవి

వయసు తెస్తుంది ఎన్నెన్నో పెచిలాను
మనసు తానొల్లనంటుంది రాజీలను
అగలసెగలు పెట్టి వెళ్ళుతుంది లోలోపల
రాత్రి ఎగదోస్తూ ఉంటుంది తెల్లారులు
రేపు ఉందని తీపి ముద్దని ఆశలన్ని మేలుకుంటవి


సినిమా:- అల్లుడొచ్చాడు
సంగీతం:- టి.చలపతిరావు
గానం:- బాలు

lEta kobbari neeLLallE..poota mamiDi pindallE
cheppakunDA vastundi chilip vayasu
nippu meeda neeravutundi pADu manasu..manasu

pongu vastundi nee bAla angAlaku
rangu testundi nee pAla chekkiLLaku
kOka kaDatAvu molakettu andAlaku
konguchATesi guTTanta daachEnduku
dAgalEnivi aagalEnivi daarulEvO vetukutunTavi

kOTi ardhAlu choosEvu nA mATalO
korkelEvO rEgEnu nee gunDelO
nErchukunTAyi nee kaLLU dongATalu
ADukunTAyi naatO dOboochulu
choochukommani dOchukommani daachukunnavi pilustunTavi

vayasu testundi ennennO pechilAnu
manasu taanollananTundi raajeelanu
agalasegalu peTTi veLLutundi lOlOpala
raatri egadOstU unTundi tellArulu
rEpu undani teepi muddani aaSalanni mElukunTavi


sinimA:- alluDocchADu
sangeetam:- TichalapatirAo
gAnam:- bAlu 

Labels: ,


 
వేళ పాల ఉండాలమ్మ దేనికైనా
నువ్వు వేగిరపడితే రాదమ్మా తేరగవచ్చేదేదయినా
కోరిక నీలో ఎంత ఉన్నా..తీర్చే మొనగాడెదుట ఉన్నా
వేడి ఎక్కడో పుట్టాలి..నీ వేడుక అప్పుడు తీరాలి

పొదలో తుమ్మెద రొదపెడితే..మొగ్గకు తేనె వచ్చేన
ఎదలో ఎదో సొద పుడితే..ఎంకిపాటగా పలికేనా
పెదవులు రెండు కలవాలి..నీ ఎదలోని కుతి తీరాలి

పదహారేళ్ళ ప్రాయంలో పైట జారక నిలిచేనా
ఎదిగే పొంగు ఎనాడయినా అదిమిపెట్టితే ఆగేనా
ఆగనివన్ని రేగాలి..అప్పుడు మన కధ సాగాలి

సినిమా:- అల్లుడొచ్చాడు
సంగీతం:- టి.చలపతిరావు
గానం:- బాలు

vELa pAla unDAlamma dEnikainaa
nuvvu vEgirapaDitE raadammA tEragavacchEdEdayinaa
kOrika neelO enta unnA..teerchE monagADeduTa unnA
vEDi ekkaDO puTTAli..nee vEDuka appuDu teerAli

podalO tummeda rodapeDitE..moggaku tEne vacchEna
edalO edO soda puDitE..enkipATagA palikEnA
pedavulu renDu kalavAli..nee edalOni kuti teerAli

padahArELLa prAyamlO paiTa jaaraka nilichEnA
edigE pongu enADayinA adimipeTTitE aagEnA
aaganivanni rEgAli..appuDu mana kadha sAgAli

sinimA:- alluDocchADu
sangeetam:- T.chalapatirAo
gAnam:- bAlu 

Labels: ,


 
ఏమి కధ చెప్పనురా ముద్దల కన్న
సీతకధ చెబుతాను వినరా నాన్న
సీతమ్మకి నిత్య వనవాసమే
రామయకి తాను కడుదూరమే
తీరదులే ఆ సీత గుండెకోత

కాపురాలనే గాలిగోపురాలుగా చేసుకున్నది చేతులారా
కారుచీకటే కంటికాటుకవ్వగా దూరమైనది తన పతికే
అయోధ్యాభవనాల స్వర్ణసీతలు..ఆడవిలో వెన్నెలలే సీత జాడలు
జరిగిన కధవిని జాలిగా చూడకు
మారదులే అ సీత నొసటిరాత

పుణ్యమాతలే పురుడుపోయగా తాను కన్నది తనయులనే
ఆదికవితలే జోలపాడగా పెంచుకున్నది మమతలనే
అయినాడు రామయ్య శ్రీకృష్ణుడు..ఆ పైన ఓ భామ ప్రేమదాశుడు
ఈ కధ ఎవరిదో వివరమే అడగకు
ఆరదులే ఆ సీత అగ్నిగీత

సినిమా:- శ్రావణ మేఘలు
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- పి.సుశీల


Emi kadha cheppanurA muddala kanna
seetakadha chebutAnu vinarA nAnna 
seetammaki nitya vanavAsamE 
raamayaki taanu kaDudooramE  
teeradulE aa seeta gunDekOta

kaapurAlanE gaaligOpuraalugA chEsukunnadi chEtulArA 
kArucheekaTE kanTikaaTukavvagA dooramainadi tana patikE 
ayOdhyAbhavanAla swarNaseetalu..aaDavilO vennelalE seeta jaaDalu 
jarigina kadhavini jaaligA chooDaku
maaradulE a seeta nosaTiraata

puNyamAtalE puruDupOyagA tAnu kannadi tanayulanE 
aadikavitalE jOlapaaDagA penchukunnadi mamatalanE 
ayinADu raamayya SrIkRshNuDu..aa paina O bhaama prEmadASuDu
ee kadha evaridO vivaramE aDagaku 
aaradulE aa seeta agnigeeta

sinimaa:- SrAvaNa mEghalu 
saahityam:- vETUri
sangeetam:- chakravarti
gAnam:- p.suSeela

Labels: , ,


 
కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో
ముద్దులతోనే ముద్దరవేసి..ప్రేయసి కౌగిలి అందుకో
కాస్తందుకో..దరఖాస్తందుకో..భామ దరఖాస్తందుకో
దగ్గర చేరి..దత్తతు చేసి..ప్రేయసి కౌగిలి అందుకో

చిరుగాలి దరఖాస్తు..లేకుంటే కరిమబ్బు
మెరుపంత నవ్వునా..చినుకైన రాలునా
జడివాన దరఖాస్తు..పడకుంటె సెలయేరు
వరదలే పొంగునా..కడలింట చెరునా
శుభమస్తు అంటే..దరఖాస్తు ok

చలిగాలి దరఖాస్తు..తొలియీడు వినకుంటే
చెలి జంట చేరునా..చెలిమలే మారునా
నెలవంక దరఖాస్తు..లేకుంటే చెక్కిళ్ళు
ఎరుపెక్కి పోవునా..ఎన్నెళ్ళు పండునా
దరిచేరి కూడా దరఖాస్తులేలా

సినిమా:- రెండు రెళ్ళు ఆరు
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- రాజన్ నాగేంద్ర
గానం:- ఎస్.జానకి, బాలు
kaastandukO..darakhAstandukO..prEma darakhAstandukO
muddulatOnE muddaravEsi..prEyasi kougili andukO
kaastandukO..darakhAstandukO..bhaama darakhAstandukO
daggara chEri..dattatu chEsi..prEyasi kougili andukO

chirugAli darakhAstu..lEkunTE karimabbu
merupanta navvunA..chinukaina raalunA
jaDivAna darakhAstu..paDakunTe selayEru
varadalE pongunA..kaDalinTa cherunA
Subhamastu anTE..darakhAstu #ok#

chaligAli darakhAstu..toliyeeDu vinakunTE
cheli janTa chErunA..chelimalE mArunA
nelavanka darakhAstu..lEkunTE chekkiLLu
erupekki pOvunA..enneLLu panDunA
darichEri kooDA darakhAstulElA

sinimA:- renDu reLLu aaru
saahityam:- vETUri
sangeetam:- rAjan nAgEndra
gAnam:- s.jAnaki, bAlu

Labels: , , , , ,


 
పాడనా వేణువునై..నీవు నా ప్రాణమై
నా జీవన బృందావనిలో..ప్రియదర్శన మాధురిలో

చెలి, సఖి, ప్రియే, చారుశీలే అని
తలచి, తనువు మరచి కలలు కన్నానులే
కాముడిలా సుమబాణాలు వేసి..తగిలిన నీ చలికోణలు చూసి
ఆమనిలో సుమగంధాలు పూసి..కవితలుగా నవవేదాలు రాసి
మోవికి తగిలి..ముద్దుల మురళి..
కౌగిలిలో ప్రియకళ్యాణినే..సంగీతమే పాడిందిలే

కలం, గళం, స్వరం నాకు నీవేనని
మధుర ప్రణయ కవిత పాడుతున్నానులే
నీలో అలిగే అందాలరూపం..నాలో వెలిగే శృంగారదీపం
నీలో కరిగే ఆ ఇంద్రచాపం..నాలో జరిగే అమృతాభిషేకం
సన్నని కులుకే..వెన్నెల చినుకై
రమ్మందిలే, మనసిమ్మందిలే..నీ రాగమే పాడిందిలే

సినిమా:- సుందరి సుబ్బారావు
సాహిత్యం:- వేటూరి
గానం:- ఎస్.జానకి, బాలు

pADanA vENuvunai..neevu naa prANamai
nA jeevana bRmdAvanilO..priyadarSana maadhurilO

cheli, sakhi, priyE, chAruSeelE ani
talachi, tanuvu marachi kalalu kannAnulE
kAmuDilA sumabANAlu vEsi..tagilina nee chalikONalu choosi
aamanilO sumagandhAlu poosi..kavitalugA navavEdaalu raasi
mOviki tagili..muddula muraLi..
kougililO priyakaLyANinE..sangeetamE paaDindilE

kalam, gaLam, swaram naaku neevEnani
madhura praNaya kavita pADutunnAnulE
neelO aligE andAlaroopam..nAlO veligE SRngAradeepam
neelO karigE aa indrachaapam..nAlO jarigE amRtAbhishEkam
sannani kulukE..vennela chinukai
rammandilE, manasimmandilE..nee rAgamE pADindilE

sinimA:- sundari subbArAo
saahityam:- vETUri
gaanam:- S.jAnaki, bAlu

Labels: , ,


 
మా కంటిపాపకి మాణిక్యహారతి
మా ఇంటిజ్యోతికి శతమానంభవతి
అవుతుంది ఈ పిల్ల పెళ్ళికూతురు
అబ్బాయీ కళ్ళకి నూరేళ్ళవెలుతురు

మల్లెపువ్వు పల్లకిలో మంచుగుళికలు
పెళ్ళినాటి పల్లకిలో పిల్లకులుకులు
ఎన్ని వన్నెలో..ఎంత వెన్నెలో
వసంతాల వయసులో సొంతమైన సొగసుతో
కిలకిలా పలుకుతున్న పడుచు కోయిలా
కసికసిగా కలగనకే పగలు రేయిగా
వేడివేడి వేణువూది చిలిపి గాలులా

సన్నసన్న మీసంలో నవ్వు మొలకలు
బుగ్గపండు కొడుతున్న ప్రేమ చిలకలు
సిగ్గుమొగ్గలే చిదుముతున్నవి
నల్లమబ్బు నీడలో..మెరుపుకన్నె మేడలో
మిలమిలా మెరుస్తున్న పగటి తారక
కట్నంగా చాలవులే కౌగిలింతలు
కౌగిలితో ఆరవులే కవ్వింతలు

సినిమా:- పులి
సాహిత్యం:- వేటూరి
గానం:- పి.సుశీల, బాలు

maa kanTipaapaki mANikyahArati
maa inTijyOtiki SatamAnambhavati
avutundi ee pilla peLLikooturu
abbAyii kaLLaki noorELLaveluturu

mallepuvvu pallakilO manchuguLikalu
peLLinATi pallakilO pillakulukulu
enni vannelO..enta vennelO
vasantAla vayasulO sontamaina sogasutO
kilakilA palukutunna paDuchu kOyilA
kasikasigA kalaganakE pagalu rEyigA
vEDivEDi vENuvoodi chilipi gaalulA

sannasanna meesamlO navvu molakalu
buggapanDu koDutunna prEma chilakalu
siggumoggalE chidumutunnavi
nallamabbu neeDalO..merupukanne mEDalO
milamilA merustunna pagaTi tAraka
kaTnamgA chAlavulE kougilintalu
kougilitO aaravulE kavvintalu

sinimA:- puli
saahityam:- vETUri
gaanam:- pi.suSeela, bAlu 

Labels: , , ,


 
ప్రాణం ప్రాణం కలిపే ప్రణయం
జతగా జతిగా పలికే హృదయం..నీకు అంకితం
జీవితం ఆఖశం..ప్రేమంటే నక్షత్రం
సూర్యుడికి చంద్రుడికి గ్రహణాలే పడుతున్నా..అమావాస్య వస్తున్నా
మాసిపోనిది మమతారూపం..ఆరిపోనిది తారాదీపం
ప్రేమ..ప్రేమ..ప్రేమ

తోడుకోరు తొడిమల్లో..తొలకరించు పువ్వుల్లో
ఏ వసంత వేళల్లోనో..ఎగసి వచ్చు తావుల్లోనో
వినిపించే పరిమళగీతం..ప్రేమ
ప్రాణసుగంధం ప్రేమ..అదే శాశ్వతం

ఆకశాల మౌనంలో..సాగరాల గానంలో
ఏ నిరాశ నీడల్లోనో..ఏ నిషీధి అంచుల్లోనో
ఉదయించే వెలుగుల వేదం..ప్రేమ  
వెతలకు అంతం ప్రేమ..అదే శాశ్వతం

సినిమా:- ఆనంద భైరవి
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- రమేష్ నాయిడు
గానం:- వాణిజయరాం, బాలు  

prANam prANam kalipE praNayam
jatagA jatigA palikE hRdayam..neeku ankitam
jeevitam aaKaSam..prEmanTE nakshatram
sooryuDiki chandruDiki grahaNAlE paDutunnA..amAvAsya vastunnA
maasipOnidi mamatAroopam..aaripOnidi tArAdeepam
prEma..prEma..prEma

tODukOru toDimallO..tolakarinchu puvvullO
E vasanta vELallOnO..egasi vacchu taavullOnO
vinipinchE parimaLageetam..prEma
prANasugandham prEma..adE SASwatam

aakaSAla mounamlO..saagarAla gaanamlO
E nirASa neeDallOnO..E nisheedhi anchullOnO
udayinchE velugula vEdam..prEma  
vetalaku antam prEma..adE SASwatam

sinimaa:- aananda bhairavi
saahityam:- vETUri
sangeetam:- ramEsh nAyiDu
gAnam:- vANijayarAm, bAlu   

Labels: , , , , ,


 
కోర్టుకెళ్ళబోకురా సోదరా
కోర్టుపక్షి కాబోకురా

చట్టానికి చెవులేకాని కళ్ళులేవురా
లాయర్లకు law తప్ప నిజాలొద్దురా
జడ్గ్జీలకు సాక్ష్యాలే ఆయుధాలురా
దున్నపోతు ఈనిందనన్న సాక్ష్యులుంటే చాలురా    

తిరుపతికి పోయేవాడు తలనిండుగ పోతాడు
గోవిందా అంటూ గుండు చేసుకొస్తాడు
కోర్టుకు పొయేవాడు జెబులెగరేసుకు పోతాడు
ఉన్నదంతా ఊడ్చిపెట్టి గుండెపోటుతో పడిపోతాడు

తాతాలనాడు ఈ కోర్టులేవ్విరా
కొట్టుకున్న చెట్టుకిందే తీర్పురా
బుద్దుడికి బోధించిన బోధిచెట్టురా..నాయనా
వీడి బొధ వింటే నువ్వు బుద్ధుడి అవుతావురా

సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

kOrTukeLLabOkuraa sOdaraa
kOrTupakshi kaabOkuraa

chaTTAniki chevulEkaani kaLLulEvuraa
lAyarlaku #law# tappa nijAloddurA
jaDgjIlaku sAkshyAlE AyudhaalurA
dunnapOtu eenindananna saakshyulunTE chAlurA    

tirupatiki pOyEvaaDu talaninDuga pOtaaDu
gOvindA anTU gunDu chEsukostADu
kOrTuku poyEvaaDu jebulegarEsuku pOtADu
unnadantA ooDchipeTTi gunDepOTutO paDipOtADu

tAtAlanADu ee kOrTulEvvirA
koTTukunna cheTTukindE teerpurA
budduDiki bOdhinchina bOdhicheTTurA..naayanaa
veeDi bodha vinTE nuvvu buddhuDi avutAvurA

sangeetam:- chakravarti
gaanam:- bAlu

Labels: , ,


 
జం జం జం జరిగేనంట చెల్లెలి కళ్యాణం
ఢుం ఢుం ఢుం పలికేనంట మంగళవాయిద్యం
అటు ఇటు తెగ పరుగిడుతుంది అడుగులు నిలవని ఆనందం
ప్రతి ఒకరికి అందిస్తుంది పెళ్ళికి రమ్మని ఆహ్వానం
అంతావచ్చి దీవిస్తే నాకెంతో సంతోషం

దర్జాగా రాజాలాగా ఉంటాడండి అబ్బాయి
డాబు దర్పంలో కాబోయే బావామొగళాయి
మీనాలో రాణిలాగే వెళ్ళుతూ ఉంటే అమ్మాయి
అమ్మో నా దిష్టే తగలినో ఎమో బాబాయి
ఊరందరి తోబుట్టువులా పెరిగింది పాపాయి
పేరుపేరునా అందరిని పిలిచింది మా చెల్లాయి
తన మనువుకి అంతా రండి..మనసారా దీవించండి

ఈ ముచ్చటకోసం కళ్ళు చాన్నాళ్ళుగా చూస్తున్నాయి
చూసే సుముహుర్తం ఎపుడెప్పుడని కలవరపడినాయి
బొమ్మలే ముస్తాబయి కనపడుతుంటే చెల్లాయి
ఎదో తెరలాగా కన్నీళ్ళే చెమరిస్తున్నయి
పట్టలేని ఆనందంతో గంగై పొంగేనేమో
చెప్పలేని ఆరటంతో బెంగే కలిగిందేమో
ప్రతి చుక్క అక్షింతలుగా దీవించే తరుణం రాగా

సినిమా:- మాణిక్యం
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ఎస్.ఏ.రాజ్ కుమార్
గానం:- బాలు

jam jam jam jarigEnanTa chelleli kaLyaaNam
Dhum Dhum Dhum palikEnanTa mangaLavaayidyam
aTu iTu tega parugiDutundi aDugulu nilavani aanandam
prati okariki andistundi peLLiki rammani aahvaanam
antaavacchi deevistE naakentO santOsham

darjaagaa raajaalaagaa unTADanDi abbaayi
Daabu darpamlO kaabOyE baavaamogaLaayi
meenaalO raaNilaagE veLLutoo unTE ammaayi
ammO naa dishTE tagalinO emO baabaayi
oorandari tObuTTuvulA perigindi paapaayi
pErupErunaa andarini pilichindi maa chellAyi
tana manuvuki antaa ranDi..manasaaraa dIvinchanDi

ee mucchaTakOsam kaLLu chaannaaLLugaa choostunnaayi
choosE sumuhurtam epuDeppuDani kalavarapaDinaayi
bommalE mustaabayi kanapaDutunTE chellAyi
edO teralaagaa kannILLE chemaristunnayi
paTTalEni aanandamtO gangai pongEnEmO
cheppalEni aaraTamtO bengE kaligindEmO
prati chukka akshintalugaa deevinchE taruNam raagaa

sinimaa:- maaNikyam
saahityam:- sirivennela
sangeetam:- S.A.raajkumar
gaanam:- bAlu 

Labels: , , ,


Thursday, April 26, 2018

 
అనుకున్నానా ఏనాడైనా..అపురూపంగా చూస్తూ ఉన్నా
కాలాన్నే ఖైదు చేసే ఈ క్షణాన..నాలో ఓ కాళిదాసే ఉండిఉన్నా
కలలాంటి ఈ నిజం చూసే వేళ..ఏ మాట తోచక కళవరపడిపోడా

మొదటిసారి నా మది మేలుకొలుపు విన్నది
ప్రభాతాలకాంతి ఇదా అన్నది
ప్రతియేట ఓ పుట్టినరోజు వయసే లెక్కేసింది
ఇప్పుడు ఈ పుత్తడికిరణం మనసుకు పురుడొసింది
పెరే పెట్టని వేరే జన్మిది

కొత్త తెల్లకాగితం..ఇన్నినాల జీవితం
తనేం రాసుకున్నా అదే శాశ్వతం
కలలు కధలు ఇప్పటివరకు ఎప్పుడు ఎరుగని హృదయం
తన పేరే తొలి శ్రీకరంగా చుట్టిన ఈ శుభసమయం
చెలికే అంకితం, చెలిమే సంతకం

సినిమా:- పంచదార చిలక
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ఎస్.ఎ.రాజ్ కుమార్
గానం:- బాలు

anukunnaanaa EnaaDainaa..apuroopaMgaa choostU unnaa
kaalaannE khaidu chEsE ee kshaNaana..naalO O kaaLidaasE unDiunnaa
kalalaanTi ee nijam choosE vELa..E maaTa tOchaka kaLavarapaDipODA

modaTisaari naa madi mElukolupu vinnadi
prabhaataalakaanti idaa annadi
pratiyETa O puTTinarOju vayasE lekkEsindi
ippuDu ee puttaDikiraNam manasuku puruDosindi
perE peTTani vErE janmidi

kotta tellakaagitam..inninaala jeevitam
tanEm raasukunnaa adE SaaSwatam
kalalu kadhalu ippaTivaraku eppuDu erugani hRdayam
tana pErE toli Sreekarangaa chuTTina ee Subhasamayam
chelikE ankitam, chelimE santakam

sinimaa:- panchadaara chilaka
saahityam:- sirivennela
sangeetam:- S.A.raajkumAr
gaanam:- bAlu 

Labels: , ,


 
(సంతోషం)
చందా..ఓ చందా  
మదికోవెల కోరిన దేవతగా..దివితారలు పంపిన దీవెనగా
ఇలచేరినా అమృతవాహినగా..కలలూయలలో తొలి ఆమనిగా
ఒడిలోన వాలవే పంచదార చిలక

అలసట ఎరుగక ఎగిసిన అలలకు అందిన అంబరమా
తరగల పరుగుల తరగని తలపులు నిలిచిన మందిరమా
బ్రతుకు పొడవునా పరచి ఉన్న నా గుండెమీదుగా
అడుగువేయవే పసిడి పదములే కందనీయక
నువ్వే తోడుగా ప్రయాణించగా
ప్రతి నిమిషము తేనెవానలే..పంచదార చిలక

ఉరుములవెనకనే జలజల కురిసిన చిలిపిగ తొలిచినుక
మెరుపుల గలగల మిలమిల వరముగ దొరికిన మణితుణక
జతను విడువని చలువ చెలిమితో బాస చేయగా
వన్నె చెదరని సొగసు సిరుల సావాసమీయగా
వరించావుగా వెలుగు వెల్లువా
ప్రతి వేకువా వెండివెన్నెలే..పంచదార చిలక


(దుఖం)
వెలుగున నవ్వుతూ సుధలను చిలికుతూ మధనము జరిగినది
అమృతకళశము కడలిని విడిచి గగనము చేరినది
పాలగుండెలో జ్వాల రేపిన తీపి జ్ఞాపకం
కంటినీటితో ఆపలేని మంటైన జీవితం
మసలిపోయినా, మసైపోయినా మరలి రాదుగా మాయమైన ఆ పంచదార చిలక
నీట్టూర్పులే నా ఊపిరని..తడినవ్వులే నా తలరాతలని
శాసించిన మోహిని తాను అని
ఈ జన్మకు చేరువ కాను అని
తను కరిగిపోయినా నా పంచదార చిలక
చందా..ఓ చందా  


సినిమా:- పంచదార చిలక
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ఎస్.ఎ.రాజ్ కుమార్
గానం:- బాలు

(santOsham)
chandaa..O chandaa  
madikOvela kOrina dEvatagaa..divitaaralu pampina deevenagaa
ilachErinaa amRtavaahinagaa..kalalooyalalO toli aamanigaa
oDilOna vaalavE panchadaara chilaka

alasaTa erugaka egisina alalaku andina ambaramaa
taragala parugula taragani talapulu nilichina mandiramaa
bratuku poDavunaa parachi unna naa gunDemeedugaa
aDuguvEyavE pasiDi padamulE kandaneeyaka
nuvvE tODugaa prayaaNinchagaa
prati nimishamu tEnevaanalE..panchadaara chilaka

urumulavenakanE jalajala kurisina chilipiga tolichinuka
merupula galagala milamila varamuga dorikina maNituNaka
jatanu viDuvani chaluva chelimitO baasa chEyagaa
vanne chedarani sogasu sirula saavaasameeyagaa
varinchaavugaa velugu velluvaa
prati vEkuvaa venDivennelE..panchadaara chilaka


(dukham)
veluguna navvutU sudhalanu chilikutU madhanamu jariginadi
amRtakaLaSamu kaDalini viDichi gaganamu chErinadi
paalagunDelO jwaala rEpina teepi jnaapakam
kanTineeTitO aapalEni manTaina jeevitam
masalipOyinaa, masaipOyinaa marali raadugaa maayamaina aa panchadaara chilaka
neeTTUrpulE naa oopirani..taDinavvulE naa talaraatalani
Saasinchina mOhini taanu ani
ee janmaku chEruva kaanu ani
tanu karigipOyinaa naa panchadaara chilaka
chandaa..O chandaa  


sinimaa:- panchadAra chilaka
saahityam:- sirivennela
sangeetam:- s.a.raajkumAr
gaanam:- bAlu 

Labels: , ,


 
నాదం నీ దీవెనే..నీ రాగాలాపనే
నీ రాగగీతం పాడుతుంటే పలుకే పాలూరదా
పువ్వే వికసించదా

అమృతగానం నీ అనురాగం..నదులు జతిగా పాడునే
నదిని విడిచే అలను నేనై..ఎగసి ముగిసి పోదునే
కన్నుల మౌనమా కలతే రూపమా
దాచకే మెరుపులే కన్నీరు మెఘమా
మరుమల్లె పువ్వంటి మనసే తొలిసారి విరిసే

కోయిలలే నాదమధువే పొందకోరే జీవినే
నిదురపోని కనులలోని కలలు మాసిపోవునే
కోవెల బాటలో పువ్వుల తోరణం
ఎంతకు మాయని తీయ్యని జ్ఞాపకం
వెన్నెల్లో అల్లడు సమయం
విధి నాకు విరహం

సినిమా:- రాగమాలిక
సంగీతం:- ఇళయరాజా
గానం:- ఎస్.జానకి

naadam nee deevenE..nee raagaalaapanE
nee raagageetam paaDutunTE palukE paalooradaa
puvvE vikasinchadaa

amRtagaanam nee anuraagam..nadulu jatigaa paaDunE
nadini viDichE alanu nEnai..egasi mugisi pOdunE
kannula mounamaa kalatE roopamaa
daachakE merupulE kannIru meghamaa
marumalle puvvanTi manasE tolisaari virisE

kOyilalE naadamadhuvE pondakOrE jeevinE
nidurapOni kanulalOni kalalu maasipOvunE
kOvela baaTalO puvvula tOraNam
entaku maayani teeyyani jnaapakam
vennellO allaDu samayam
vidhi naaku viraham

sinimaa:- raagamaalika
sangeetam:- iLayarAjA
gaanam:- es.jAnaki

Labels: ,


 
వేగుచుక్క మొలిచింది..వేకువ పొడసూపింది
తూరుపు తెలతెలవారక ముందే కాలం మాటేసింది
నా కళ్ళను కాటేసింది

జీవితమంటే కల

కాదు..అది కవులు రచించే కధ కాదు
కనుమరుగైనది సిరి కాదు..అది మనదని తలచుట సరికాదు 
కుడియెడమైతే పొరపాటు లేదను నానుడి సత్యం కాదు
ఇది అందరికర్ధం కాదు

ఎండిన మల్లెకు వెల లేదు..మండే గుండెకు చలి లేదు
మంచిని మించిన జత లేదు..విధి వంచనకన్నా వెత లేదు
మనసే మనిషికి చిరుచేదైతే మనుగడకర్ధం లేదు
ఇది అందరికర్ధం కాదు

సినిమా:- కళ్యాణవీణ
సాహిత్యం:- మల్లేమాల
సంగీతం:- సత్యం
గానం:- యేసుదాస్

vEguchukka molichindi..vEkuva poDasoopindi 
toorupu telatelavaaraka mundE kaalam maaTEsindi
naa kaLLanu kaaTEsindi

jeevitamanTE kala kaadu..adi kavulu rachinchE kadha kaadu
kanumarugainadi siri kaadu..adi manadani talachuTa sarikaadu 
kuDiyeDamaitE porapaaTu lEdanu naanuDi satyam kaadu
idi andarikardham kaadu

enDina malleku vela lEdu..manDE gunDeku chali lEdu
manchini minchina jata lEdu..vidhi vanchanakannaa veta lEdu
manasE manishiki chiruchEdaitE manugaDakardham lEdu
idi andarikardham kaadu

sinimaa:- kaLyaaNaveeNa
saahityam:- mallEmaala
sangeetam:- satyam
gaanam:- yEsudaas 

Labels: , ,


 
ఓ మానవతి..తెలుసుకో నీ గతి
ఆడదిగా పుట్టడమే అధోగతి
అది మా సంస్కృతి..ఇది నీ జీవన్మృతి

పెళ్ళయిన ప్రతి ఆడది అడవిలోని సీత
కుళ్ళికుళ్ళి ఏడవడం విధి రాసిన రాత
భర్త అనే భగవంతుడు కోసిన ఎదకోత

నీ రూపాన్నే వరించి..నీ అందాన్నే హరించి
నీ త్యాగం అనుభవించి..నీ సర్వం సంగ్రహించి
జాలి దయ లేకుండా చివరకు నిన్నే వధించి
కులకడమే మా సంస్కృతి..కులసతి
అదే నీ జీవన్మృతి

తనపేరుకు నీ సమాధి కట్టేవాడొకడు
తనపదవికి నిన్ను పునాది చెసుకునేవాడొకడు
నిన్ను బొమ్మగా చేసి ఆడుకునేవాడొకడు
ఇంతకు ఈ మగడనే ఈ మగాడు నీకెవ్వడు
ఏనాటిది ఈ రుణం..ఎందుకింత దారుణం
కడుపున పుట్టినవాడే కంఠానికి పాశమేసి
నీ పాలిట యముడైతే..నీకెందుకు మమకారం
మరిచావా ఆదిశక్తి అవతారం
తెలుసుకో నీకు ఉన్న అధికారం
దాటిరా పాతబడ్డ ప్రాకారం
చుట్టుకో కొత్తబ్రతుకు శ్రీకారం


సినిమా:- ఓ భార్య కధ
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- బాలు
గానం:- బాలు

O maanavati..telusukO nee gati
aaDadigaa puTTaDamE adhOgati
adi maa samskRti..idi nee jeevanmRti

peLLayina prati aaDadi aDavilOni seeta
kuLLikuLLi EDavaDam vidhi raasina raata
bharta anE bhagavantuDu kOsina edakOta

nee roopaannE varinchi..nee andaannE harinchi
nee tyaagam anubhavinchi..nee sarvam sangrahinchi
jaali daya lEkunDaa chivaraku ninnE vadhinchi
kulakaDamE maa samskRti..kulasati
adE nee jeevanmRti

tanapEruku nee samaadhi kaTTEvADokaDu
tanapadaviki ninnu punaadi chesukunEvADokaDu
ninnu bommagaa chEsi aaDukunEvADokaDu
intaku ee magaDanE ee magaaDu neekevvaDu
EnaaTidi ee ruNam..endukinta daaruNam
kaDupuna puTTinavaaDE kanThaaniki paaSamEsi
nee paaLiTa yamuDaitE..neekenduku mamakaaram
marichaavaa aadiSakti avataaram
telusukO neeku unna adhikaaram
daaTiraa paatabaDDA praakaaram
chuTTukO kottabratuku Sreekaaram


sinimaa:- O bhaarya kadha
saahityam:- vETUri
sangeetam:- bAlu
gaanam:- bAlu
  

Labels: ,


 
హైరే హైరే హంగామ..ఈ అల్లరే మన చిరునామా
చాంగుచాంగురే అందామా ఈ సందడేరా మన ధీమ
ఈ వయసుది ఏ దారి..హోరెత్తే గోదారి
పట్టువదులితే ఓసారి..జారిపోదా చేజారి

ఫస్ట్ మార్కుల స్టూడంటు..వేస్టు చెయ్యకు టాలెంటు
పుస్తకాల్లో పడివుంటూ..ఆదమరపుగ ఉండద్దు
అనుభవమేరా అసలు చదువు..లోకం దానికి టీచరు        
లైఫ్ ని మించిన లైబ్రరి..ఎక్కడుంది పదమరి 
చుక్కలెన్నో లెక్కపెట్టి చెప్పలేవురా
జీవితాన్ని గుక్కపట్టి తాగలేవురా
ఫేల్ అవుతూనే ప్రతి క్షణం పాస్ అవుతుంది జీవితం      

సినిమా:- పంచాదర చిలక
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ఎస్.ఏ.రాజ్ కుమార్
గానం:- రాజేష్

hairE hairE hangaama..ee allarE mana chirunaamaa
chaanguchaangurE andaamaa ee sandaDEraa mana dheema
ee vayasudi E daari..hOrettE gOdaari
paTTuvadulitE Osaari..jaaripOdaa chEjaari

fasT maarkula sTooDanTu..wEsTu cheyyaku TaalenTu
pustakaallO paDivunTU..aadamarapuga unDaddu
anubhavamEraa asalu chaduvu..lOkam daaniki Teecharu      
laif ni minchina laibrari..ekkaDundi padamari
chukkalennO lekkapeTTi cheppalEvuraa
jeevitaanni gukkapaTTi taagalEvuraa
fEl avutUnE prati kshaNam paas avutundi jeevitam      

sinimaa:- panchaadara chilaka
saahityam:- sirivennela
sangeetam:- es.E.raaj kumaar
gaanam:- raajEsh 

Labels: , ,


 
అరవైకి ఆరేళ్ళకి ఎమిటి అనుభంధం
దీపానికి దేవుడికి ఉండే సంభంధం

పొద్దుకుంగిపోతున్న తరుణంలో నే చందమామ కావాలని కోరేనా
వద్దన్న వచ్చింది వెన్నెల
కరిగిపొమ్మన్న పోకుంది ఈనాడు ఆ కల

అప్పుడు నీ అల్లరితో మురిపించావు
ఇప్పుడు నా బ్రతుకునే అల్లరి చేసావు
మనిషికి ఒకటే శిక్ష పెద్దతనం
తెలియని శ్రీరామరక్ష పసితనం

సినిమా:- రా రా కృష్ణయ్య
సాహిత్యం:- మల్లెవరపు గోపి
సంగీతం:- బాలు
గానం:- బాలు

aravaiki aarELLaki emiTi anubhandham
deepaaniki dEvuDiki unDE sambhandham

poddukungipOtunna taruNamlO nE chandamaama kaavaalani kOrEnaa
vaddanna vacchindi vennela
karigipommanna pOkundi eenaaDu aa kala

appuDu nee allaritO muripinchaavu
ippuDu naa bratukunE allari chEsaavu
manishiki okaTE Siksha peddatanam
teliyani Sreeraamaraksha pasitanam

sinimaa:- raa raa kRshNayya
saahityam:- mallevarapu gOpi
sangeetam:- bAlu
gaanam:- bAlu  

Labels: ,


 
అన్నీ నీవనుకున్నా..ఎవరున్నారు నీకన్న
ఈ రాధమ్మ కోరేది నిన్నేనురా
కలనయినా రమ్మని పిలిచేవా
నా కన్నుల్లో చెమ్మలు తుడిచావా

గుండెపగిలిపోతున్నా గొంతు విప్పలేను
కలలు చెరిగిపోతున్నా కలత చెప్పలేను
ఈ మూగరాగమేదో ఆలకించవాannI neevanukunnaa..evarunnaaru neekanna
ee raadhamma kOrEdi ninnEnuraa
kalanayinaa rammani pilichEvaa
naa kannullO chemmalu tuDichaavaa

gunDepagilipOtunnaa gontu vippalEnu
kalalu cherigipOtunnaa kalata cheppalEnu
ee moogaraagamEdO aalakinchavaa
aalakinchi nannu nuvvu aadarinchavaa

chandamaama raakunTE kaluva niluvalEdu
jataga neevu lEkunTE bratuku viluvalEdu
innaaLLu kaachukunna aaSa neediraa
aaSapaDDa kannemanasu baasa neediraa

sinimaa:- bhagat
gaanam:- chitra
ఆలకించి నన్ను నువ్వు ఆదరించవా

చందమామ రాకుంటే కలువ నిలువలేదు
జతగ నీవు లేకుంటే బ్రతుకు విలువలేదు
ఇన్నాళ్ళు కాచుకున్న ఆశ నీదిరా
ఆశపడ్డ కన్నెమనసు బాస నీదిరా

సినిమా:- భగత్
గానం:- చిత్ర


Labels:


 
గ్యాంగోళ్ళమండి బాబు..గ్యాంగోళ్ళమండి బాబు
గ్యాంగోళ్ళమండి బాబు..గ్యాంగోళ్ళమండి బాబు
మా రక్తమంత ధారపోసి రైలుపట్టాలేస్తాము

పట్టాలపై పోయే పొగబళ్ళలో సాగే
ఏడాది మనుషులను సూత్తుంటాము
వాళ్ళ ఎడుపులు నవ్వులు వింటుంటాము
ఇటునుంచి వస్తాది ఓ బండి
అటునుంచి వస్తాది ఓ బండి
ఏ బండి ఆగినా..ఏ బండి సాగినా
ఆగకుండా సాగాలి బ్రతుకులబళ్ళు
అవి ఆగేనా నూకలు సెల్లు

మనుషుల్ని చేసింది దేవుడయినా
దేవుడ్ని నమ్మింది మనుషులయినా
నువ్వు చేసే పని ఒకటే నీకు దేవుడు
అనుకుంటే లోటు రాదు నీకేప్పుడు
అందుకే నవ్వుతూ బ్రతకాలిరా
ఆ బ్రతుకులొనే కొండంత తృప్తి ఉందిరా
నవ్వు తృప్తి కలిస్నప్పుడే జీవితంరా
అదిలేనినాడు చీకటి నీ లోకంరా

ఎక్కడో పుడతారు మనుషులు
ఎక్కడికో చేరుతాయి బ్రతుకులు
అడుగడున అంతరంగ సంఘర్షణలే
అనుక్షణం అంతులేని సంక్షోబాలే
దూరపు కొండలు నునుపని
మెరిసేదంతా మెలిమి అనుకోని
స్వర్గాలకే నిచ్చెనలు వేస్తూంటారు
ఆత్మబలం చాలక పడిపోతుంటారు
చివరకు ఓడిపోయి చావుతోవ పడుతుంటారు

సినిమా:- స్టేషన్ మాస్టర్
సాహిత్యం:- సినారె
సంగీతం:- చక్రవర్తి
గానం:- మనో, వందేమాత్రం


gyaangOLLamanDi bAbu..gyaangOLLamanDi bAbu
gyaangOLLamanDi bAbu..gyaangOLLamanDi bAbu
maa raktamanta dhaarapOsi railupaTTaalEstaamu

paTTaalapai pOyE pogabaLLalO saagE
EDaadi manushulanu soottunTaamu
vaaLLa eDupulu navvulu vinTunTaamu
iTununchi vastaadi O banDi
aTununchi vastaadi O banDi
E banDi aaginaa..E banDi saaginaa
aagakunDaa saagaali bratukulabaLLu
avi aagEnaa nookalu sellu

manushulni chEsindi dEvuDayinaa
dEvuDni nammindi manushulayinaa
nuvvu chEsE pani okaTE neeku dEvuDu
anukunTE lOTu raadu neekEppuDu
andukE navvutU bratakaaliraa
aa bratukulonE konDanta tRpti undiraa
navvu tRpti kalisnappuDE jeevitaMraa
adilEninaaDu cheekaTi nee lOkaMraa

ekkaDO puDataaru manushulu
ekkaDikO chErutaayi bratukulu
aDugaDuna antaranga sangharshaNalE
anukshaNam antulEni sankshObaalE
doorapu konDalu nunupani
merisEdantaa melimi anukOni
swargaalakE nicchenalu vEstUnTaaru
aatmabalam chaalaka paDipOtunTaaru
chivaraku ODipOyi chaavutOva paDutunTaaru

sinimaa:- Station Master
saahityam:- sinaare
sangeetam:- chakravarti
gaanam:- manO, vandEmaatram

Labels: , , ,


Wednesday, April 25, 2018

 
ఆకాశం మబ్బులకిల్లు..భూలోకం మనుషులకిల్లు.నడిమధ్యనే నాటకం
మోళి కట్టాలా..అందరి కన్నే కొట్టాలా
దెబ్బకు కాసులతల్లి జల్లై కురవాలా

నింగి అడుగున తీగనడకతో సాములు చేసేయాలా
నిప్పు మడుగున పడ్డ అడుగులే సాములు చూసేయాలా
నీ జానేడు పొట్టను తలచుకో..ఆ ఆకలి మంటలు తెలుసుకో
వేసిన డబ్బుల దరువుతో..నీ కుదురును చక్కగ నిలుపుకో    
మా పాత జనమా..నీదేరా హనుమా
చూపలి పదరా తాయెత్తు మహిమా

బూతుదండకం నోటికి పడితే నాయకత్వమే ఖాయం
మంచి చెప్పిన, చేసి చూపిన మంత్రిపదవులే మాయం
ముక్కోటి బూతులు వోటుకే..శతకోటి సంతకాలు సీటుకే
మా మాటలు గారడి కావులే..మా పాటకు పల్లవి ఆకలే
నీ వోటుకాదు..బేవర్సుగుండు
గురిచూసి కొడితే లంకంత మండు

సినిమా:- జడ్జిమంట్
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు, చిత్ర


aakaaSam mabbulakillu..bhoolOkam manushulakillu.naDimadhyanE naaTakam
mOLi kaTTaalaa..andari kannE koTTAlaa
debbaku kaasulatalli jallai kuravaalaa

ningi aDuguna teeganaDakatO saamulu chEsEyaalaa
nippu maDuguna paDDa aDugulE saamulu choosEyaalaa
nee jaanEDu poTTanu talachukO..aa aakali manTalu telusukO
vEsina Dabbula daruvutO..nee kudurunu chakkaga nilupukO    
maa paata janamaa..needEraa hanumaa
choopali padaraa taayettu mahimaa

bootudanDakam nOTiki paDitE naayakatvamE khaayam
manchi cheppina, chEsi choopina mantripadavulE maayam
mukkOTi bootulu vOTukE..SatakOTi santakaalu seeTukE
maa maaTalu gaaraDi kaavulE..maa paaTaku pallavi aakalE
nee vOTukaadu..bEwarsugunDu
gurichoosi koDitE lankanta manDu

sinimaa:- jaDjimanT   (judgement - usha kiran movies)
sangeetam:- chakravarti
gaanam:- bAlu, chitra

Labels: , ,


 
ఆ దేవుడు మనిషగ పుట్టాలిరా..ఈ మనుషుల భరతం పట్టాలిరా
మనిషై పుడితే మలినం సోకి..మనలో ఒకడుగ మారిపోవురా

ధాన్యం చాటున దాచేవాళ్ళని బైటేస్తాడొయి..తిండి కరువు తీరుస్తాడు
ప్రజాసహాయం ఉండకపోతే అతడు మాత్రం ఏం చేస్తాడు..ఆకలేట్లా తీరుస్తాడు?

పాతిపెట్టిన బ్లాకుడబ్బును వరసపెట్టి కట్టిస్తాడోయి..తొక్కిపట్టి సాగదీస్తాడోయి
గుళ్ళుగోపురాలు కట్టినవాళ్ళను కొంచం జాలిగా చూస్తాడు..వీలుంటే టైంస్తాడు

లంచాలు భోంచేసేవాళ్ళను పక్కకు లాగిస్తాడోయి..చెవులు పట్టి సాగదీస్తాడొయి
సరయిన సాక్ష్యం చెప్పకపొతే రుజువేలా చేస్తాడు..నిజమేలా చూపిస్తాడు

దేవుడు మనిషై పుట్టి కూడా ఏమి చెయ్యలేడంటావా..ఈ మాటే వినమంటావా
దేవుడేకాదు ఆ దేవదేవుడు మనిషై చేసేది ఇంతేనోయి
ఈ కలికాలం మారాలోయి..
కాలం రా  కలికాలం రా
ఈ లోకమంత ఇంద్రజాలం రా
మనిషై పుడితే దేవుడు కూడ మైలపడేది ఖాయం రా

సినిమా:- అంతస్తులు
గానం:- పిఠాపురం, మాధవపెద్ది

aa dEvuDu manishaga puTTAliraa..ee manushula bharatam paTTAliraa
manishai puDitE malinam sOki..manalO okaDuga maaripOvuraa

dhaanyam chaaTuna daachEvaaLLani baiTEstaaDoyi..tinDi karuvu teerustaaDu
prajaasahaayam unDakapOtE ataDu maatram Em chEstaaDu..aakalETlaa teerustaaDu?

paatipeTTina blaakuDabbunu varasapeTTi kaTTistaaDOyi..tokkipaTTi saagadeestaaDOyi
guLLugOpuraalu kaTTinavaaLLanu koncham jaaligaa choostaaDu..veelunTE TaimstaaDu

lanchaalu bhOmchEsEvaaLLanu pakkaku laagistaaDOyi..chevulu paTTi saagadeestaaDoyi
sarayina saakshyam cheppakapotE rujuvElaa chEstaaDu..nijamElaa choopistaaDu

dEvuDu manishai puTTi kooDaa Emi cheyyalEDanTaavaa..ee maaTE vinamanTaavaa
dEvuDEkaadu aa dEvadEvuDu manishai chEsEdi intEnOyi
ee kalikaalam maaraalOyi..
kaalam raa  kalikaalam raa
ee lOkamanta indrajaalam raa
manishai puDitE dEvuDu kooDa mailapaDEdi khaayam raa

sinimaa:- antastulu
gaanam:- piThaapuram, maadhavapeddi  

Labels: ,


 
కొత్తాసిగురు తొడిగింది అంటుమామిడి
కొడలొచ్చి మురిసింది ఇంటిచావిడి
నిండుదనం వచ్చి..నిగనిగలు హెచ్చి
గుండెల్లో పండగలే..ఒకే సందడి

మునుపులేని అందాలు పచ్చాపచ్చనా
ముసుగులోని గుసగుసలు వెచ్చావెచ్చనా
తొలికోడి కూత ఇప్పుడు వినిపించదు
నులకమంచం వదలాలని అనిపించదు

పొద్దుటేల్ల పిల్లమొగం ముద్దమందారం
బద్దకంగ వొల్లిరిస్తే ఎంత సింగారం
అర్ధరాతిరి దాటినా చక్కిలిగింతలు
నిద్దట్లోను అవే అవే పలవరింతలు

సినిమా:- కొత్త నీరు
గానం:- బాలు

kottaasiguru toDigindi anTumaamiDi
koDalocchi murisindi inTichaaviDi
ninDudanam vacchi..niganigalu hecchi
gunDellO panDagalE..okE sandaDi

munupulEni andaalu pacchaapacchanaa
musugulOni gusagusalu vecchaavecchanaa
tolikODi koota ippuDu vinipinchadu
nulakamancham vadalaalani anipinchadu

podduTElla pillamogam muddamandaaram
baddakanga volliristE enta singaaram
ardharaatiri daaTinaa chakkiligintalu
niddaTlOnu avE avE palavarintalu

sinimaa:- kotta neeru
gaanam:- bAlu

Labels:


 
అర్ధరాత్రి జాబిలికి అమ్మలిద్దరు
ఒకరు తూరుపు..ఒకరు పడమర
కడుపు చించుకొని కన్నానని ఒక తల్లి
నెత్తురుగుడ్డుకు ఊపిరి పోసానని ఒక తల్లి
హై అల్లా..ఓ జీసస్..హే కృష్ణా
కన్నది ఎవరో..ఇంతకు కన్నది ఎవరో
తెలిసుంటే చెప్పు నీ జడ్జిమెంటు
మనుషులకే ఎందుకింత సెంటిమెంటు

ఎఱ్ఱని తన రక్తంతో నల్లని నీ కాళ్ళుకడగి
తెల్లని నీ తీర్పు అడిగి తపిస్తున్నది ఒక తల్లి
పొర్లువచ్చు దుఖంతో పొర్లిదండమే పెడుతూ
చల్లని నీ చూపు కొరకు జ్వలిస్తున్నది ఒక తల్లి
హే కృష్ణా..కన్నతల్లి దేవకికి కన్నీటిని తుడిచావా
వెన్నతల్లి యశొదకి వెన్నయినా నిమిరావా
ఇద్దరు తల్లుల బిడ్డవి నీకుందా సెంటిమెంటు
ఉంటే మనసుంటే చెప్పు నీ జడ్జిమెంటు

ఆడుకోకు అమ్మలతో బొమ్మలుగా నీవు తలచి
శపిస్తారు నిన్ను తిరిగి అమ్మ మనసు విరిగి
తాళిబొట్టు తల్లిపేగు రెంటిని పెనవేసి
నిన్నే ఉరితీయగలరు అమ్మతనం అలిగి
పరమేశా..రాతిని నాతిగ చేసిన రామపాదమే ఓ శిల
ఒ అమ్మకు పుట్టని నీ పురాణమే ఒ కల
అమ్మలేని నీ జన్మకు ఎక్కడుంది సెంటిమెంటు
ఉంటే నువ్వుంటే చెప్పు నీ జడ్జిమెంటు

సినిమా:- జడ్జిమెంటు
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు


ardharaatri jaabiliki ammaliddaru
okaru toorupu..okaru paDamara
kaDupu chinchukoni kannAnani oka talli
netturuguDDuku oopiri pOsAnani oka talli
hai allaa..O jeesas..hE kRshNA
kannadi evarO..intaku kannadi evarO 
telisunTE cheppu nee jaDjimenTu 
manushulakE endukinta senTimenTu

e~r~rani tana raktamtO nallani nee kaaLLukaDagi 
tellani nee teerpu aDigi tapistunnadi oka talli
porluvacchu dukhamtO porlidanDamE peDutU
challani nee choopu koraku jwalistunnadi oka talli
hE kRshNA..kannatalli dEvakiki kannITini tuDichaavaa
vennatalli yaSodaki vennayinaa nimiraavaa 
iddaru tallula biDDavi neekundA senTimenTu
unTE manasunTE cheppu nee jaDjimenTu 

aaDukOku ammalatO bommalugaa neevu talachi
Sapistaaru ninnu tirigi amma manasu virigi
taaLiboTTu tallipEgu renTini penavEsi 
ninnE uriteeyagalaru ammatanam aligi 
paramESaa..raatini naatiga chEsina raamapaadamE O Sila
o ammaku puTTani nee purANamE o kala
ammalEni nee janmaku ekkaDundi senTimenTu
unTE nuvvunTE cheppu nee jaDjimenTu 

sinimaa:- jaDjimenTu  (judgement - usha kiran movies)
saahityam:- vETUri
sangeetam:- chakravarti
gaanam:- bAlu 

Labels: ,


 
కాలం పామై కాటువేసిన శీలవతికి తుది పేరంటం
ప్రాణదాతగా ఎదిగిన పతికి ఎదలో ఎదో ఆరాటం
సాగనంపడం కన్నా లేదులే  సంసారం
కాలి బూడిదయై మిగలనున్నది ఈ కమలం
జ్యోతి జ్వాలగా మారిపోయెనా ఈనాడు
చావుబతుకులా పసుపుకుంకుమ నీ తోడు
రేయిపగలు కలిసే చోట సూర్యుడి జననం
ఆలుమగలు కలిసే వేళ జరిగే కధనం

బొడ్డుకోసినా తీరిపోవులే పుట్టినప్పటి బంధాలు 
వల్లకాటితో ఆరిపోవులే జన్మజన్మలా పాశాలు 
ఎన్ని అలలతో అలసిపోయినా ఏరు ఒక్కటే
ఎవరికెవ్వరుగా మారిపోయినా మనసు ఒక్కటే
రామపాదమే రాయి కోరెను ఒకనాడు
రక్తబంధమే కుంకుమైనది ఈనాడు
రేయిపగలు కలిసే చోట సూర్యుడి జననం
ఆలుమగలు కలిసే వేళ జరిగే కధనం
విధి చదరంగం విపరీతం
మది శిల అయినా విషగీతం

సినిమా:- ప్రాణదాత
సంగీతం:- రాజ్-కోటి
గానం:- బాలు

kaalam paamai kaaTuvEsina Seelavatiki tudi pEranTam
praaNadaatagaa edigina patiki edalO edO aaraaTam
saaganampaDam kannaa lEdulE  samsaaram
kaali booDidayai migalanunnadi ee kamalam
jyOti jwaalagaa maaripOyenaa eenaaDu
chaavubatukulaa pasupukumkuma nee tODu
rEyipagalu kalisE chOTa sooryuDi jananam
aalumagalu kalisE vELa jarigE kadhanam

boDDukOsinaa teeripOvulE puTTinappaTi bandhaalu
vallakaaTitO aaripOvulE janmajanmalaa paaSaalu
enni alalatO alasipOyinaa Eru okkaTE
evarikevvarugaa maaripOyinaa manasu okkaTE
raamapaadamE raayi kOrenu okanaaDu
raktabandhamE kumkumainadi eenaaDu
rEyipagalu kalisE chOTa sooryuDi jananam
aalumagalu kalisE vELa jarigE kadhanam
vidhi chadarangam vipareetam
madi Sila ayinaa vishageetam

sinimaa:- praaNadaata
sangeetam:- raaj-kOTi
gaanam:- bAlu 

Labels: ,


Tuesday, April 24, 2018

 
లెగు లెగు లెగు స్వతంత్రమా..నిదురబొయే స్వతంత్రమా
నీ చీకటి తొలగిస్తాము..నీకు స్వేచ్చ కలిగిస్తాము

విద్యన్నది వివేకమైతే..వివేకాన్ని ప్రేమను చేసి
ప్రేమే పరమార్ధమని..ప్రేమే సర్వస్వమని
ప్రేమతోని కలిమి లేమి కళ్యాణం కావాలంటూ
నలుదిక్కుల నా గొంతు ప్రజ్వలింప చేస్తాను
నవ్య జగతి సిద్ధికై దివ్వెనై వెలుగుతాను

రాజకీయ రంకుతోని..వొటులన్న కంపుతోని
స్వతంత్రాన్ని చంపుతున్న స్వార్ధపరుల కుతంత్రాన్ని
కుయుక్తులున్ని నిలదీసి నడివీధిలో పడదోసి
కలమే కత్తిని చేసి..ఖండఖండలుగా కోసి
నవ్యలోక సౌధానికి మెట్టు మెట్టు కడతాను
విశ్వశాంతి పుష్పానికి విద్య ధారపోస్తాము

మనిషొక మాటంటున్నారు..దారితప్పి పోతున్నారు
లక్ష్యాలను వేరును చేసి..ఇక్యత వీడి చెడుతున్నారు
శాంతి సమరం సత్యం ధర్మం
వేరు చేసి కేకలు వేసి
విడివిడిగా నడిచామంటే
విప్లవం రాదురా భాయి
విప్లవం రాదురా భాయి
ఐదువేళ్ళు కలిస్తేనురా..పిడికిలి పొడుస్తుందిరా
నలుగురము ఒకటైనప్పుడే..మన లక్ష్యం నిలిస్తుందిరా
మన లక్ష్యం నిలిస్తుందిరా..మన మాటే గెలుస్తుందిరా


గానం:- బాలు, చిత్ర

legu legu legu swatantramaa..niduraboyE swatantramaa
nee cheekaTi tolagistaamu..neeku swEccha kaligistaamu

vidyannadi vivEkamaitE..vivEkaanni prEmanu chEsi
prEmE paramaardhamani..prEmE sarvasvamani
prEmatOni kalimi lEmi kaLyaaNam kaavaalanTU
naludikkula naa gontu prajwalimpa chEstaanu 
navya jagati siddhikai divvenai velugutaanu 

raajakeeya rankutOni..voTulanna kamputOni
swatantraanni champutunna swaardhaparula kutantraanni 
kuyuktulunni niladeesi naDiveedhilO paDadOsi 
kalamE kattini chEsi..khanDakhanDalugaa kOsi
navyalOka soudhaaniki meTTu meTTu kaDataanu
viSwaSaanti pushpaaniki vidya dhaarapOstaamu 
  
manishoka maaTanTunnaaru..daaritappi pOtunnaaru
lakshyaalanu vErunu chEsi..ikyata veeDi cheDutunnaaru 
Saanti samaram satyam dharmam 
vEru chEsi kEkalu vEsi
viDiviDigaa naDichaamanTE
viplavam raaduraa bhaayi
viplavam raaduraa bhaayi
aiduvELLu kalistEnuraa..piDikili poDustundiraa 
naluguramu okaTainappuDE..mana lakshyam nilistundiraa 
mana lakshyam nilistundiraa..mana maaTE gelustundiraa


gaanam:- bAlu, chitra

Labels: ,


 
ఈ కాల సాగరగర్భంలో ఏ లీలలు ఇమిడిఉన్నాయో
ఏ అల ఎందుకు పుడుతుందో..ఏ బ్రతుకు ఏ దారి పడుతుందో

ఎవ్వరికెవ్వరు ప్రాణమో..ఏ ప్రాణం ఎటు పోతుందో
ఈ ఆరని మంటలనడగాలి
ఈ జీవితమెందుకు ముగిసిందో..ఈ జన్మకు పిదప ఏముందో
ఈ బూడిదకుప్పే చెప్పాలి 

బండికి రెండే చక్రాలు..తన బ్రతుకుకు రెండే దీపాలు
ఈ చక్రాలు పరుగులు తియ్యాలి..ఆ దీపల వెలుగులు పెరగాలి
చీకటిలోన వెలుగుందో..వెలుగు దాటితే చీకటి ఉందో
జీవితాన్ని మనమడగాలి..ఆ దేవుడే జవాబు చెప్పాలి

కన్నతండ్రి తల్లయినాడు..తన రెండు కళ్ళకు రెప్పయినాడు
రెప్పలు ఆపే కన్నీళ్ళు..రేపాటి కలలకు పందిళ్ళు
ఆ కలలు నిజాలుగ చూస్తడో..ఇది కాదని దేవుడు ఏంచేస్తాడో?

సినిమా:- తుఫాన్ మెయిల్
సాహిత్యం:- ఆచార్య ఆత్రేయ
గానం:- బాలు


ee kaala saagaragarbhamlO E leelalu imiDiunnaayO 
E ala enduku puDutundO..E bratuku E daari paDutundO

evvarikevvaru praaNamO..E praaNam eTu pOtundO
ee aarani manTalanaDagaali
ee jeevitamenduku mugisindO..ee janmaku pidapa EmundO
ee booDidakuppE cheppaali 

banDiki renDE chakraalu..tana bratukuku renDE deepaalu
ee chakraalu parugulu tiyyaali..aa deepala velugulu peragaali
cheekaTilOna velugundO..velugu daaTitE cheekaTi undO
jeevitaanni manamaDagaali..aa dEvuDE javaabu cheppaali 

kannatanDri tallayinaaDu..tana renDu kaLLaku reppayinaaDu
reppalu aapE kanneeLLu..rEpaaTi kalalaku pandiLLu
aa kalalu nijaaluga choostaDO..idi kaadani dEvuDu EmchEstaaDO?

sinimaa:- tufaan meyil
saahityam:- aachaarya aatrEya 
gaanam:- baalu  


 
బండెళ్ళిపోతుందే చెల్లెలా..బతుకు బండెళ్ళిపొతుందే చెల్లెలా
గతుకు బితుకు లేక బతకనేర్చిన బండి
శతబోను పెడతందే చెల్లెలా

బతుకెళ్ళిపొతుంది  ఒరన్నయ్యో..బతుకు బండెళ్ళిపొతుంది ఒరన్నయ్య
ఆ బతుకు ఈ బతుకు అతుకుపెట్టెలతోటి
బండెళ్ళిపోతుంది ఒరన్నయ్యో..బతుకు బండెళ్ళిపొతుందు ఒరన్నయ్య


దొరలెక్క దిబ్బేలో పరుపులు..అల్ల పేదోళ్ళ బతుకంత బరువులు
బతుకే బరువైపొతే చెల్లెలా..దాని కూలోడే మొయ్యాలే చెల్లెలా
ధర్మమడిగావంటే చెల్లెలా..మన ఖర్మనే తిడతారే చెల్లెలా
పేదోళ్ళ దిబ్బెలో చెల్లేలా..ఇంత ఆధరణ దొరికేనా చెల్లెలా

కష్టాల పట్టాల మెలికలు..మనిషి గుండెల్లో తెగపుట్టే పరుగులు
పెట్టేల్లో జనమేమో కిటకిటా..ముద్ద పెట్టే దిక్కే లేక కటకట
స్టేషన్లన్ని మారిపోయినా..బండి ఏ దేశానికి వెళ్ళి ఆగినా
పట్టాల మార్పేనే చెల్లేలా..మన పొట్టైనా నిండాదే చెల్లెలా.

కిటికీలో కనిపించే కాలము..అల్ల గిరగిర తిరిగే భూగోళం
యేడకి పోతుందో తెలవదు..బండి గుండెళ్ళొ బరువేమో తరగదు
పుట్టింటిలో పడి బ్రతికినా..దాని టిక్కెట్టు నీ చెతికిచ్చినా
ఊరు పేరు రాసేఉంటాది..బతుకు దూరమెంతో వేసివుంటాది

పుట్టెటప్పుడు కొన్న టిక్కెట్టు..నిన్ను మోసేటప్పుడు కాస్త చూపెట్టు
పదుగురితో పరుగెట్టే పయనము..కడకు నలుగిరితో నడిచెళ్ళే దూరము..
జండాలు రెండేనే చెల్లెలా..అవి చావుపుట్టకలంట చెల్లెలా
సిగినల్ ఇచ్చేవోడు దేవుడు..బండి దిగివెళ్ళిపోయేవాడు జీవుడు

సినిమా:- ఇదా ప్రపంచం
సాహిత్యం:- జాలది
సంగీతం:- చక్రవర్తి
గానం:- మనో, వందేమాతరం, శైలజ

banDeLLipOtundE chellelA..batuku banDeLLipotundE chellelaa
gatuku bituku lEka batakanErchina banDi
SatabOnu peDatandE chellelaa

banDeLLipOtundi orannayyO..batuku banDeLLipotundi orannayya
aa batuku ee batuku atukupeTTelatOTi
banDeLLipOtundi orannayyO..batuku banDeLLipotundu orannayya


doralekka dibbElO parupulu..alla pEdOLLa batukanta baruvulu
batukE baruvaipotE chellelA..daani koolODE moyyaalE chellelaa
dharmamaDigaavanTE chellelaa..mana kharmanE tiDataarE chellelaa
pEdOLLa dibbelO chellElaa..inta aadharaNa dorikEnaa chellelaa

kashTaala paTTaala melikalu..manishi gunDellO tegapuTTE parugulu
peTTEllO janamEmO kiTakiTA..mudda peTTE dikkE lEka kaTakaTa
sTEshanlanni maaripOyinaa..banDi E dESaaniki veLLi aaginaa
paTTaala maarpEnE chellElaa..mana poTTainaa ninDaadE chellelaa.

kiTikeelO kanipinchE kaalamu..alla giragira tirigE bhoogOLam
yEDaki pOtundO telavadu..banDi gunDeLLo baruvEmO taragadu
puTTinTilO paDi bratikinaa..daani TikkeTTu nee chetikicchinaa
ooru pEru raasEunTaadi..batuku dooramentO vEsivunTAdi

puTTeTappuDu konna TikkeTTu..ninnu mOsETappuDu baaga choopeTTu
paduguritO parugeTTE payanamu..kaDaku nalugiritO naDicheLLE dooramu..
janDaalu renDEnE chellelaa..avi chaavupuTTakalanTa chellelaa
siginal icchEvODu dEvuDu..banDi digiveLLipOyEvaaDu jeevuDu

sinimaa:- idA prapancham
saahityam:- jaaladi
sangeetam:- chakravarti
gaanam:- manO, vandEmaataram, Sailaja 

Labels: , , , ,


 
అక్షరాల ఆశయాలు..ఉద్యమాల లక్ష్యాలు
చింపబొతే చిరగబోవురో..చంపబొతే చావబోవురో

రాజకీయ పిశాచాలు స్వతంత్రంగా కులకాలని
కులం పేరు కుప్పించి..మతం మందు ఎక్కించి
బుద్ధినిచ్చే చదువు మీద బురద చల్లుతునారు
కుఱ్ఱోలను వెఱ్ఱోలుగా కూడతిప్పుతున్నారు
ఆ వెంటబొతే అంటుజబ్బురో..అది అంటుకుంటే కుంటిబ్రతుకురో

దేశమన్న నేలమీద ధ్యానమన్న మొక్క నాటి
భాగ్యాలను పండించే విద్యార్ధుల విలువలని
దోపిడీకి బలిపెట్టి..దోచుకునే దొంగలంతా
నిరుద్యోగమన్న బిక్ష నీకు చేతికిస్తుంటే
భవితవ్యం బాట మూతరో..చైతన్యం చీకటేనురో

వోటులకై మంత్రులంతా..బూతులతో ఒకరినొకరు
అమ్మ ఆలి పరువు తీసి అంగడిలో పెడుతుంటే
సంస్కారం ఎక్కడుంది..సమసామ్యం ఏముంది
ఈ పందుల కుమ్ములాటలో..ఎందుకొరకు వోటులెస్స్తరో

చదువుతల్లి బిడ్డలైన విద్యార్ధుల లోకంలో
బ్రుచ్చులొచ్చి ఉచ్చు రేపి..విచ్చిణ్ణం చేయబొతే
అల్లూరులు, ఝాన్సీలు, భగత్ సింగ్ సుకదేవులు
శ్రీశ్రీలు గురజాడలు మాలోనే బయలుదేరి
పిడుగుల్లా ప్రతిఘటించి గడగడలాడిస్తారు
ఖబర్దార్ ద్రోహులరా..
ఖబర్దార్...ఖబర్దార్...ఖబర్దార్

సినిమా:- ఇదా ప్రపంచం
సాహిత్యం:- వెన్నెలకంటి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు, మనో

aksharaala aaSayaalu..udyamaala lakshyaalu
chimpabotE chiragabOvurO..champabotE chaavabOvurO

raajakeeya piSaachaalu swatantrangaa kulakaalani
kulam pEru kuppinchi..matam mandu ekkinchi
buddhinicchE chaduvu meeda burada challutunaaru
ku~r~rOlanu ve~r~rOlugaa kooDatipputunnaaru
aa venTabotE anTujabburO..adi anTukunTE kunTibratukurO

dESamanna nElameeda dhyaanamanna mokka naaTi
bhaagyaalanu panDinchE vidyaardhula viluvalani
dOpiDeeki balipeTTi..dOchukunE dongalantaa
nirudyOgamanna biksha neeku chEtikistunTE
bhavitavyam baaTa mootarO..chaitanyam cheekaTEnurO

vOTulakai mantrulantaa..bootulatO okarinokaru
amma aali paruvu teesi angaDilO peDutunTE
samskaaram ekkaDundi..samasaamyam Emundi
ee pandula kummulaaTalO..endukoraku vOTulesstarO

chaduvutalli biDDalaina vidyaardhula lOkamlO
brucchulocchi ucchu rEpi..vicchiNNam chEyabotE
allUrulu, jhaanseelu, bhagat sing sukadEvulu
SrISreelu gurajaaDalu maalOnE bayaludEri
piDugullaa pratighaTinchi gaDagaDalaaDistaaru
khabardaar drOhularaa..
khabardaar...khabardaar...khabardaar

sinimaa:- idA prapancham
saahityam:- vennelakanTi
sangeetam:- chakravarti
gaanam:- bAlu, manO

Labels: , , ,


Monday, April 23, 2018

 
జో లాలి..జో లాలి..జో లాలి

చిట్టి పొట్టి ఊసులు చెప్పి ఉయ్యాలూపవే గాలి
చిన్ని తండ్రిని బజ్జొమని జో కొట్టే జాబిలి

జో లాలి..జో లాలి..జో లాలి

అమ్మా నాన్న ఉన్నా..చుట్టూ చుట్టాలున్నా
చూసేవారే లేక వొంటరి అయ్యావా
ఆడే పాడే తోడు..కోరే అల్లరి ఈడు
నిద్దుర పోనే పోక బిత్తరపోయావా

జో లాలి..జో లాలి..జో లాలి

గుక్కెడు పాలను పోసి..గువ్వకు ఆకలి తీర్చి
అక్కున చేర్చే అమ్మ..ఎక్కడ అంటావా
ఇంటిల్లపాదికి తల్లి..అందరి సేవకు వెళ్ళి
ఇంకా రాదేమంటూ అల్లరి చేస్తావా

జో లాలి..జో లాలి..జో లాలి

సినిమా:- చిన్న కోదలు
సంగీతం:- బప్పిలహరి
గానం:- పి.సుశీల

jO laali..jO laali..jO laali

chiTTi poTTi oosulu cheppi uyyaaloopavE gaali
chinni tanDrini bajjomani jO koTTE jaabili

jO laali..jO laali..jO laali

ammaa naanna unnaa..chuTTU chuTTAlunnaa
choosEvaarE lEka vonTari ayyaavaa
aaDE paaDE tODu..kOrE allari eeDu
niddura pOnE pOka bittarapOyaavaa

jO laali..jO laali..jO laali

gukkeDu paalanu pOsi..guvvaku aakali teerchi
akkuna chErchE amma..ekkaDa anTaavaa
inTillapaadiki talli..andari sEvaku veLLi
inkaa raadEmanTU allari chEstaavaa

jO laali..jO laali..jO laali

sinimaa:- chinna kOdalu
sangeetam:- bappilahari
gaanam:- pi.suSeela 

Labels: ,


 
సుబ్బన్న సెప్పాడన్న స్వతంత్రం వచ్చిందని..స్వరాజ్యం వచ్చిందని
అప్పన్న అన్నాడన్న రాకముందే బాగుందని..స్వరాజ్యం రాక ముందే బాగుందని
ఈ వీరన్న అంటాడన్న..నిప్పులాంటి నిజమన్న
అప్పుడైనా ఇప్పుడైనా మన బ్రతుకులు ఇంతేనని..అవి మారవని

కూలాలు పోతవని..హెచ్చుతగ్గులుండవని
డెబ్బయియెళ్ళనుంచి చెవులు పగల చెప్పారు
సన్నజనాన్ని ఉబ్బేసి..వోట్లు కాస్తా కాజేసి 
సింహాసనమెక్కాక చిప్ప చెతికిచ్చారు 
వాళ్ళు సిగ్గే ఒగ్గేసారు

అర్ధరాతిరి ఆడది తిరగొచ్చు అన్నారు
మగాడితో సమానంగా హక్కులు ఇస్తామన్నారు
మానభంగాలు ఎన్నయినా..ప్రాణాలే పోతున్నా
ఎటేట ఈ జండా ఎగరెస్తౌన్నారు
మనకు ఇది తప్పదు అన్నారు

ఆకలి సావులు ఇంక ఉండవని బొంకేరు
అందరికి ఊరకెనే సదువు సెప్పుతామన్నరు
ప్రజారాజ్యమొచ్చిందని.. స్వర్గం దిగివస్తాదని 
నమ్మకాలు చెప్పి చెప్పి నట్టేట ముంచారు 
వాళ్ళు గట్టెక్కి చూసేరు   

సినిమా:- ఎర్ర మట్టి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

subbanna seppaaDanna swatantram vacchindani..swaraajyam vacchindani
appanna annaaDanna raakamundE baagundani..swaraajyam raaka mundE baagundani
ee veeranna anTaaDanna..nippulaanTi nijamanna
appuDainaa ippuDainaa mana bratukulu intEnani..avi maaravani

koolaalu pOtavani..hecchutaggulunDavani
DebbayiyeLLanunchi chevulu pagala cheppaaru
sannajanaanni ubbEsi..vOTlu kaastaa kaajEsi
siMhaasanamekkaaka chippa chetikicchaaru
vaaLLu siggE oggEsaaru

ardharaatiri aaDadi tiragocchu annaaru
magaaDitO samaanangA hakkulu istaamannaaru
maanabhangaalu ennayinaa..praaNaalE pOtunnaa
eTETa ee janDA egarestaunnaaru
manaku idi tappadu annaaru

aakali saavulu inka unDavani bonkEru
andariki oorakenE saduvu sepputaamannaru
prajaaraajyamocchindani.. swargam digivastaadani
nammakaalu cheppi cheppi naTTETa munchaaru
vaaLLu gaTTekki choosEru  

sinimaa:- erra maTTi
sangeetam:- chakravarti
gaanam:- bAlu 

 
అందరివాడవని పేరేగాని కొందరివాడవులే
అందగాడవని మాటేగాని అందనివాడవులే
కృష్ణ..అల్లరివాడవులే

పాలువెన్నతో పెరిగిన నాడే.ఆఆ..
పడతుల వెంట తిరిగావంటా
చీరెలు దా
చి..మనసులు దోచి
ఎన్నో లీలలు చేసావంట
ఇన్ని విద్యలు నేర్చిన నిన్ను
ఎంతని వెతకనురా..స్వామి ఏమని పిలవనురా

లోకాలన్ని నీ గానంలో..ఆఆ..
పరవశమంది ఆడేనంటా
నీ పదయుగమే నిలచిన చోట
బృందావనిగా మారేనంటా  
నీ అందాలే చూడాలంటే వేయి కన్నులే చాలవురా..
నాకున్నవి రెండే కన్నులురా


సినిమా:- ముగ్గురుమూర్ఖులు
సంగీతం:- చక్రవర్తి
గానం:- పి.సుశీల, బాలు

andarivaaDavani pErEgaani kondarivaaDavulE
andagaaDavani maaTEgaani andanivaaDavulE
kRshNa..allarivADavulE

paaluvennatO perigina naaDE.aaaaaa..
paDatula venTa tirigaavanTA
cheerelu daachi..manasulu dOchi
ennO leelalu chEsaavanTa
inni vidyalu nErchina ninnu
entani vetakanuraa..swaami Emani pilavanurA

lOkaalanni nee gaanamlO..aaaaaa..
paravaSamandi aaDEnanTaa
nee padayugamE nilachina chOTa
bRmdaavanigaa maarEnanTA  
nee andaalE chooDaalanTE vEyi kannulE chaalavuraa..
naakunnavi renDE kannulurA


sinimaa:- muggurumUrkhulu
sangeetam:- chakravarti
gaanam:- pi.suSeela, bAlu 

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]