Sunday, April 29, 2018

 
మంచిని పంచిన నీవు..బాబు..వంచన పాలయినావు
అనురాగం, మమకారం అరదండాలై..ఖైది అయ్యావు

తలపై మోశావు ఈ నేరం..త్యాగం గుర్తించదీ లోకము
నీలో నీతిని నమ్మి నలిగిందో హృదయము
నీతికి గోతులు తవ్వి కులికిందో భోగము
ఈ ఆస్తిపాస్థులనేవి కావయ్యా శాశ్వతం
ఈ అన్నతమ్ముల గాధే అలనాటి భారతం

ధనమే ఓ కక్షగా రగిలెను..మనసే ఓ శిక్షగా మిగిలెను
న్యాయం గాయం చేసి గుండెల్లో మూల్గెను
కల్లాకపటం కలిసి నిన్ను రచ్చకీడ్చెను
ఈ నెత్తురే మెత్తని కత్తై నీ వెన్నే పొడిచెను
అది రుజువేలేని నిజమై నీతోనే నడిచెను  

సినిమా:- మగధీరుడు
సాహిత్యం:- ఆచార్య ఆత్రేయ
సంగీతం:- బాలు
గానం:- బాలు  

manchini panchina neevu..bAbu..vanchana pAlayinAvu
anurAgam, mamakAram aradanDaalai..khaidi ayyaavu

talapai mOSAvu ee nEram..tyaagam gurtinchadI lOkamu
neelO neetini nammi naligindO hRdayamu
neetiki gOtulu tavvi kulikindO bhOgamu
ee aastipaasthulanEvi kaavayyaa SaaSwatam
ee annatammula gaadhE alanATi bhaaratam

dhanamE O kakshagA ragilenu..manasE O SikshagA migilenu
nyaayam gaayam chEsi gunDellO moolgenu
kallAkapaTam kalisi ninnu racchakeeDchenu
ee netturE mettani kattai nee vennE poDichenu
adi rujuvElEni nijamai neetOnE naDichenu  

sinimA:- magadheeruDu
saahityam:- AchArya AtrEya
sangeetam:- bAlu
gaanam:- bAlu   

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]