Tuesday, May 15, 2018

 
నల్లనయ్యా, ఎవరని అడిగావా నన్ను
మురళిని కాలేను, పించమైనా కాను
ఎవరని చెప్పాలి నేను? ఏమని చెప్పాలి నేను?

వలచిన రాధమ్మను విరహాన దించావు
పెంచినమ్మ యశొదమ్మను శోకాన ముంచావు
నీవు నేర్చినదొక్కటే, నిన్ను వలపించుకోవడం
నాకు తెలియనదొక్కటే, నా మనసుదాచుకోవడం
ఏమని చెప్పాలి నేను? ఎవరని చెప్పాలి నేను?

వెన్నయినా, మన్నయినా ఒకటే అన్నావు
దొంగవైన కాని దొరవై నిలిచావు
ఎంత మరవాలన్నా మనసును వీడిపోనంటావు
ఎంత కలవరించినా కంటికి కానరాకున్నావు
ఏమని చెప్పాలి నేను? ఎవరని చెప్పాలి నేను?

సినిమా:- మా ఇద్దరి కధ
సంగీతం:- చక్రవర్తి
గానం:- పి.సుశీల

nallanayyA, evarani aDigAvA nannu
muraLini kAlEnu, pinchamainA kAnu
evarani cheppAli nEnu? Emani cheppAli nEnu?

valachina rAdhammanu virahAna dinchAvu
penchinamma yaSodammanu SOkAna munchAvu
neevu nErchinadokkaTE, ninnu valapinchukOvaDam
nAku teliyanadokkaTE, nA manasudAchukOvaDam
Emani cheppAli nEnu? evarani cheppAli nEnu?

vennayinA, mannayinA okaTE annAvu
dongavaina kAni doravai nilichAvu
enta maravAlannA manasunu veeDipOnanTAvu
enta kalavarinchinA kanTiki kaanarAkunnAvu
Emani cheppAli nEnu? evarani cheppAli nEnu?

sinimA:- mA iddari kadha
sangeetam:- chakravarti
gaanam:- p.suSeela 

Labels: ,


Friday, May 11, 2018

 
చూడరా, చూడరా, తెలుగు సోదరా
నీ చుట్టూరా సాగుతున్న నాటకాలు చూడరా
ఆదమరచి నిదురిస్తే వెలుగు లేదురా
అన్యాయాన్ని ఎదిరిస్తే గెలుపు నీదిరా
తెలుగు సొదరా, గెలుగు నీదిరా

కలవారల కనుగానని ఆవేశం చూడరా
అదుపులేని పిడుగులేని ఆ వేగం కీడురా
ధనచక్రపు ఇరుసులలో పడినలిగే సుడితిరిగే
బడుగుజనులందరికీ బాసటగా నిలవరా
తెలుగు సొదరా, గెలుగు నీదిరా

స్త్రీల శీలమపహరించి తిరుగు పరమనీచులు
కష్టజీవి చెమట దోచు బ్రష్ట దుష్టశక్తులు
హూంకరించుచుండగా, అహంకరించుచుండగా
నీవు కదలి, జాతిపరువు నిలిచి, ప్రతిఘటించరా
తెలుగు సొదరా, గెలుగు నీదిరా

పిడికెలెత్తి ప్రతినబట్టి ప్రగతిబాట నడువరా
అలమటించు తెలుగుతల్లి కనులనీరు తుడువరా
ఇదే నీకు మేలుకొలుపు, సింహంలా జూలు దులుపు
తిరుగులేని ఎదురులేని దివ్యశక్తి నీదిరా
తెలుగు సోదరా, గెలుపు నీదిరా

సినిమా:- అమ్మాయి మోగుడు మామకు యముడు
సాహిత్యం:- శ్రీశ్రీ
సంగీతం:- ఎం.ఎస్.విశ్వనాధన్
గానం:- బాలు

chooDarA, chooDarA, telugu sOdarA
nee chuTTUrA saagutunna naaTakAlu chooDarA
aadamarachi niduristE velugu lEdurA
anyAyAnni ediristE gelupu needirA
telugu sodarA, gelugu needirA

kalavArala kanugAnani aavESam chooDarA
adupulEni piDugulEni aa vEgam keeDurA
dhanachakrapu irusulalO paDinaligE suDitirigE
baDugujanulandarikI baasaTagA nilavarA
telugu sodarA, gelugu needirA

streela Seelamapaharinchi tirugu paramaneechulu
kashTajeevi chemaTa dOchu brashTa dushTaSaktulu
hoonkarinchuchunDagA, ahankarinchuchunDagA
neevu kadali, jaatiparuvu nilichi, pratighaTincharA
telugu sodarA, gelugu needirA

piDikeletti pratinabaTTi pragatibATa naDuvarA
alamaTinchu telugutalli kanulaneeru tuDuvarA
idE neeku mElukolupu, siMhamlA joolu dulupu
tirugulEni edurulEni divyaSakti needirA
telugu sOdarA, gelupu needirA

sinimA:- ammAyi mOguDu mAmaku yamuDu
saahityam:- SrISrI
sangeetam:- m.s.viSwanAdhan
gaanam:- bAlu 

Labels: , ,


 
తేనె కన్నా తియ్యనిది తెలుగుబాష, దేశబాషలందు లెస్స తెలుగుబాష

మయూరాల వయ్యారాలు మాటలలో పురివిప్పును
పావురాల కువకువలు పలుకులందు నినదించును
సప్తస్వరనాదసుధలు నవరసభావాలమణులు, జానుతెలుగుసొగసులో జాలువారు జాతి

అమరావతి సీమలో కమనీయ శిలామంజరి
రామప్ప గుడిగోడలా రమనీయ కళారంజని
అన్నమయ్య సంకీర్తనం, క్షేత్రయ్య శృంగారం, త్యాగరాజరాగ మధువు తెలుగు సామగనమయం

సినిమా:- రాజ్ కుమార్
సాహిత్యం:- ఆచార్య ఆత్రేయ
సంగీతం:- ఇళయరాజా
గానం:- బాలు

tEne kannA tiyyanidi telugubAsha, dESabAshalandu lessa telugubAsha

mayUrAla vayyArAlu maaTalalO purivippunu
paavurAla kuvakuvalu palukulandu ninadinchunu
saptaswaranaadasudhalu navarasabhaavAlamaNulu, jAnutelugusogasulO jaaluvAru jaati

amarAvati seemalO kamaneeya SilAmanjari
rAmappa guDigODalA ramaneeya kaLAranjani
annamayya sankeertanam, kshEtrayya SRngAram, tyAgarAjarAga madhuvu telugu saamaganamayam

sinimA:- rAj kumAr
saahityam:- aachArya AtrEya
sangeetam:- iLayarAjA
gaanam:- bAlu 

Labels: , , ,


Thursday, May 10, 2018

 
ఏగిరే జెండా మన జనని, ఎమౌంటున్నది మననుగని
పూవులదీవెనలు అందిస్తున్నది తనంత ఎత్తుకు ఎదగమని
వందేమాతరం, వందేమాతరం, వందేమాతరం

తరతరాల భరతసంస్కృత తెలుపును కాషాయం
స్వచ్చమైన శాంతికి సంకేతం మచ్చలేని ఆ తెల్లదనం
తరగని సంపద తనలో కలదని పలుకును పంటల పచ్చదనం
జన్మంతా ఈ విలువలు ముడివేసి నడుపునది అశోకచక్రం
ఆ నీడను నడవమని, ఆ ఘనతను నిలపమని

గాంధిజీ అందించిన సూత్రం కలిపిన భారతిసంతానం
ఎన్నో జాతుల, ఎన్నో రీతుల, ఎన్నో రంగుల విరులవనం
విభేదాలతో విడిపోతే ఆ తల్లికి తీరని సంతాపం
కళకళలాడుతూ కలిసి ఉంటేనే కలుగును కలగను సంతోషం
ఆ వెలుగును అందుకొని, నీ ప్రగతిని పొందమని

సినిమా:- బాలమురళి
సాహిత్యం:- ఆచార్య ఆత్రేయ
సంగీతం:- కె.వి.మహదేవన్
గానం:- పి.సుశీల

EgirE jenDA mana janani, emounTunnadi mananugani
poovuladeevenalu andistunnadi tananta ettuku edagamani
vandEmAtaram, vandEmAtaram, vandEmAtaram

taratarAla bharatasamskRta telupunu kAshAyam
swacchamaina SAntiki sankEtam macchalEni aa telladanam
taragani sampada tanalO kaladani palukunu panTala pacchadanam
janmantA ee viluvalu muDivEsi naDupunadi aSOkachakram
aa neeDanu naDavamani, aa ghanatanu nilapamani

gaandhijI andinchina sootram kalipina bhaaratisantAnam
ennO jaatula, ennO reetula, ennO rangula virulavanam
vibhEdAlatO viDipOtE aa talliki teerani santaapam
kaLakaLalADutU kalisi unTEnE kalugunu kalaganu santOsham
aa velugunu andukoni, nee pragatini pondamani

sinimA:- bAlamuraLi
saahityam:- AchArya AtrEya
sangeetam:- k.v.mahadEvan
gaanam:- p.suSeela 

Labels: , ,


 
నా కనులే నీ కనులై, నా కలలే నీ కలలై, ఇలాగే ఉందామా, ఉందామా, ఉందామా

కురిసే పొగమంచులోన, తడిసే శిఖరరాలగా
మెరిసే నీరెండలోన, విరిసే కుసుమాలలాగా
ఎదలు కలిపి జతగా నిలిచి, ఇలాగే ఉందామా, ఉందామా, ఉందామా

వాలిన మలిసంధ్యలోన, వణికే చలిగాలిలొన
కాగిన కౌగిళ్ళలోన, ఊగిన తొలిహాయిలోన
కలలు చిలికి కవిత ఒలికి, ఇలాగే ఉందామా, ఉందామా, ఉందామా

సినిమా:- దొంగల వేట
సహిత్యం:- సినారె
సంగీతం:- సత్యం
గానం:- పి.సుశీల, బాలు

nA kanulE nee kanulai, nA kalalE nee kalalai, ilAgE undAmA, undAmA, undAmA

kurisE pogamanchulOna, taDisE SikhararAlagA
merisE neerenDalOna, virisE kusumAlalAgA
edalu kalipi jatagA nilichi, ilAgE undAmA, undAmA, undAmA

vaalina malisandhyalOna, vaNikE chaligAlilona
kaagina kougiLLalOna, oogina tolihAyilOna
kalalu chiliki kavita oliki, ilAgE undAmA, undAmA, undAmA

sinimA:- dongala vETa
sahityam:- sinAre
sangeetam:- satyam
gaanam:- p.suSeela, bAlu 

Labels: , , ,


 
కళ్ళలో ఎన్నెన్ని కలలో, అ కలలలో ఎన్నెన్ని కధలో
కలలన్ని పండాలి వసంతాలై, కధలన్ని మిగలాలి సుఖాంతాలై

నీ నవ్వులోని ఆ మూగబాసలే నవవేణునాదాలై నాలోన పలికెనులే
ఆ నాదాలే ఎదగాలి రాగాలై, అవి గుండెలో నిండాలి అనురాగాలై

నీ చూపులోని ఆ మమతలన్ని మాటాడు మల్లికలై మదిలోన విరిసెనులే
ఆ మల్లికల్లే ఒదగాలి మాలికలై, మన ఇద్దరికే చెందాలి అవి కానుకలై

సినిమా:- మనస్సాక్షి
సాహిత్యం:- సినారె
సంగీతం:- జేవి రాఘవులు
గానం:- పి.సుశీల, బాలు

kaLLalO ennenni kalalO, a kalalalO ennenni kadhalO
kalalanni panDAli vasantAlai, kadhalanni migalAli sukhAntAlai

nee navvulOni aa moogabAsalE navavENunAdAlai naalOna palikenulE
aa nAdAlE edagAli rAgAlai, avi gunDelO ninDAli anurAgAlai

nee choopulOni aa mamatalanni mATADu mallikalai madilOna virisenulE
aa mallikallE odagAli maalikalai, mana iddarikE chendAli avi kAnukalai

sinimA:- manassAkshi
saahityam:- sinAre
sangeetam:- jv rAghavulu
gaanam:- p.suSeela, bAlu 

Labels: , , ,


Wednesday, May 9, 2018

 
ఈ తీగ పలికినా, నా గొంతు కలిపినా
ఉదయించే ఆ గీతం నీ కోసం
తీగ మార్చి చూడమంటే, స్వరం మార్చి పాడమంటే
ఆ గీతం నా జీవితానికే చరమగీతం, అదే చివరి గీతం

కడలిలోనిది ఉప్పునీరని కలిసే సెలయేరు తిరిగిపోవునా
కళలు తరిగే జాబిలి అయినా, వెన్నెల దానిని వీడిపోవునా
దాహం తీర్చే మగువే, తన ధర్మపత్ని అని అనుకుంటే
పవిత్ర మంగళసూత్రం ఒక పలుపుతాడని అనుకుంటే
వాడు ఒక మగవాడేనా? వాడిది ఒక బ్రతుకేనా?

కదలలేని శిలపైన ఎందుకో ఆ తీరని మమత
ఆ శిలయే గుడిలో ఉంటే అది కాదా దేవత
కొడిగట్టిన దీపంపైన ఎందుకంత సానుభూతి
ఆరదించే మనసుంటే అది కాదా జీవనజ్యోతి
అది కాదా జీవనజ్యోతి

సినిమా:- మాంగళ్యానికి మరో ముడి
సాహిత్యం:- సినారె
సంగీతం:- కె.వి.మహదేవన్
గానం:- పి.సుశీల, బాలు

ee teega palikinA, nA gontu kalipinA
udayinchE aa geetam nee kOsam
teega maarchi chooDamanTE, swaram maarchi pADamanTE
aa geetam naa jeevitAnikE charamageetam, adE chivari geetam

kaDalilOnidi uppuneerani kalisE selayEru tirigipOvunA
kaLalu tarigE jAbili ayinA, vennela dAnini veeDipOvunA
daaham teerchE maguvE, tana dharmapatni ani anukunTE
pavitra mangaLasootram oka paluputADani anukunTE
vADu oka magavADEnA? vADidi oka bratukEnA?

kadalalEni Silapaina endukO aa teerani mamata
aa SilayE guDilO unTE adi kAdA dEvata
koDigaTTina deepampaina endukanta saanubhooti
aaradinchE manasunTE adi kAdA jeevanajyOti
adi kAdA jeevanajyOti

sinimA:- mAngaLyAniki marO muDi
saahityam:- sinAre
sangeetam:- k.v.mahadEvan
gaanam:- p.suSeela, bAlu 

Labels: , , ,


 
జై భజరంగభళి
రంగ భళి, భజరంగభళి, భజరంగభళి

నమో నమో హనుమంత, మహిత గుణవంత
మహా బలవంత, స్వామి నీ ముందు మేమంత
నీ భక్తి భళి, భుజశక్తి భళి, రఘురామ భక్త భజరంగభళి

సూర్యుని మించును నీ తేజం, పవననుని మించును నీ వేగం
అగ్నిని మించును నీ రౌద్రం, అమృతమయం నీ హృదయం
ఓ సుజన మందరా, ఓ దనుజ సంహారా
నీ దివ్య చరణం, పాప హరణం, స్వామి శరణం
మమ్ము కరుణించవయ్యా

శ్రీరామ కార్యం చేపట్టినావు, సీతమ్మ జాడ కనిపెట్టినావు
లంకిణీని దెబ్బకు పడగొట్టినావు, లంకాపురిని తగలబెట్టినావు
ఒంటితలల రావణులు ఊరురా ఉన్నారు, కంట కనిపెట్టి, తోక చుట్టి, విసిరి కొట్టి
మమ్ము కాపాడవయ్యా

సినిమా:- కలియుగ రావణసురుడు
సాహిత్యం:- సినారె
సంగీతం:- కె.వి.మహదేవన్
గానం:- బాలు

jai bhajarangabhaLi
ranga bhaLi, bhajarangabhaLi, bhajarangabhaLi

namO namO hanumanta, mahita guNavanta
mahA balavanta, swAmi nee mundu mEmanta
nee bhakti bhaLi, bhujaSakti bhaLi, raghurAma bhakta bhajarangabhaLi

sooryuni minchunu nee tEjam, pavananuni minchunu nee vEgam
agnini minchunu nee roudram, amRtamayam nee hRdayam
O sujana mandarA, O danuja saMhArA
nee divya charaNam, pApa haraNam, swAmi SaraNam
mammu karuNinchavayyA

SrIrAma kaaryam chEpaTTinAvu, seetamma jADa kanipeTTinAvu
lankiNIni debbaku paDagoTTinAvu, lankApurini tagalabeTTinAvu
onTitalala rAvaNulu oorurA unnAru, kanTa kanipeTTi, tOka chuTTi, visiri koTTi
mammu kApADavayyA

sinimA:- kaliyuga rAvaNasuruDu
saahityam:- sinAre
sangeetam:- k.v.mahadEvan
gaanam:- bAlu 

Labels: , ,


 
ఈ పాల వెన్నెల్లో, నీ జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఉన్నారు, ఎవ్వరు వారెవరు ?

ఈ పాల వెన్నెల్లో, నా జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఒకరేలే, ఆ ఒక్కరు నీవేలే

చుక్కలే నిను మెచ్చి పక్కనే దిగివచ్చి
మక్కువే చూపితే నన్ను మరిచేవో
చుక్కలు వేలు ఉన్నా, నా చుక్కి ఒకతే కాదా
లక్షల మగువలు ఉన్నా, నా లక్ష్యమొకటే కాదా
నా లక్ష్మి ఒకతే కాదా

తుంటరి చిరుగాలి కొంటెగా నిను చూసి
పైటనే కాజేస్తే ఏమి చేస్తావో
పైటే ఏమౌతుంది నీ చేతిలోన అది ఉంటే
స్వర్గం దిగివస్తుంది నా స్వామి తోడుగా ఉంటే
నా రాముని నీడుంటే

సినిమా:- లంబాడోళ్ళ రామదాస్
సంగీతం:- సాలూరి రాజేశ్వరరావు
గానం:- పి.సుశీల, బాలు


ee paala vennellO, nee jaali kaLLallO
iddarU unnAru, evvaru vArevaru ?

ee paala vennellO, nA jaali kaLLallO
iddarU okarElE, aa okkaru neevElE 

chukkalE ninu mecchi pakkanE digivacchi 
makkuvE choopitE nannu marichEvO 
chukkalu vElu unnA, nA chukki okatE kAdA
lakshala maguvalu unnA, nA lakshyamokaTE kAdA 
nA lakshmi okatE kAdA

tunTari chirugAli konTegA ninu choosi 
paiTanE kaajEstE Emi chEstAvO 
paiTE Emoutundi nee chEtilOna adi unTE
swargam digivastundi nA swaami tODugA unTE
nA rAmuni neeDunTE 

sinimA:- lambADOLLa rAmadAs
sangeetam:- saalUri rAjESwararAo
gaanam:- p.suSeela, bAlu 

Labels: , ,


 
ఏరెల్లిపోతున్నా నీరుండిపోయింది, నీటి మీద రాత రాసి నావెళ్ళిపోయింది

కోటిపల్లి రేవుకాడ సిలకమ్మ గొడవ
కోరంగి దాటింది గొరింక పడవ

ఏటిపాప సాపమ్మ ఎగిసి తాను చూసింది
ఏడ నావోడంటూ ఏటిలోన మునిగింది
సాప మునిగిన కాడ శతకోటి సున్నాలు
శాపమైన గుండెలోన చెప్పలేని సుడిగుండాలు

ఏటికొక్క దారంట ఏరు సాగిపోతుంది
సెరువైన ఊరూవాడ పైరు పచ్చనవుతుంది
ఏరుతగిలినా కాడ ఏడాది తిరనాళ్ళు
ఏరులోన నీరెంత ఉన్నా, ఎంత కడవకు అన్నే నీళ్ళు

సినిమా:- ఆశాజ్యొతి
సాహిత్యం:- వేటూరి
గానం:- బాలు


ErellipOtunnA neerunDipOyindi, neeTi meeda raata raasi naaveLLipOyindi 

kOTipalli rEvukADa silakamma goDava
kOrangi daaTindi gorinka paDava 

ETipApa saapamma egisi tAnu choosindi 
EDa nAvODanTU ETilOna munigindi 
saapa munigina kADa SatakOTi sunnAlu 
Saapamaina gunDelOna cheppalEni suDigunDAlu  
 
ETikokka daaranTa Eru saagipOtundi 
seruvaina oorUvADa pairu pacchanavutundi 
ErutagilinA kADa EDAdi tiranALLu 
ErulOna neerenta unnA, enta kaDavaku annE neeLLu 

sinimA:- aaSAjyoti 
saahityam:- vETUri 
gaanam:- bAlu 

Labels: ,


Tuesday, May 8, 2018

 
మాటంటే నీదేలే, మనిషంటే నీవేలే, లంబాడొల రామదాసా

మంచిని మించిన మతం లేదురా, గుణమును మించిన కులం లేదురా
గుండెను మించిన గుడే లేదురా, దయను మించిన దైవం లేదురా

ఎంతగా దున్నితే నేల అంతగా పదునవుతుంది
ఎంత సానపెడితే వజ్రం అంతగా మెరుస్తుంది
ఎంత శాంతముంటే మనిషికి అంత సౌఖ్యం కలుగుతుంది

గోవుల వన్నెలు వేరైనా, పాలు తెలుపేరా
మనుషుల రంగులు వేరైనా, రక్తం ఎరుపేరా
పిల్లల గుణాలు వేరైనా, తల్లికి అందరు ఒకటేరా

సినిమా:- లంబాడొల రామదాసా
సాహిత్యం:- సినారె
సంగీతం:- సాలూరి రాజేశ్వరరావు
గానం:- బాలు

maaTanTE needElE, manishanTE neevElE, lambADola rAmadAsA

manchini minchina matam lEdurA, guNamunu minchina kulam lEdurA
gunDenu minchina guDE lEdurA, dayanu minchina daivam lEdurA

entagA dunnitE nEla antagA padunavutundi
enta saanapeDitE vajram antagA merustundi
enta SaantamunTE manishiki anta soukhyam kalugutundi

gOvula vannelu vErainA, paalu telupErA
manushula rangulu vErainA, raktam erupErA
pillala guNAlu vErainA, talliki andaru okaTErA

sinimA:- lambADola rAmadAsA
saahityam:- sinAre
sangeetam:- sAlUri rAjESwara rAo
gaanam:- bAlu 

Labels: , ,


 
కల అయినా, నిజమైనా, కాదన్నా, లేదన్నా, చెబుతున్నా ప్రియతమా
నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు ప్రేమ

నిన్ను పూజించనా, నిన్ను సేవించనా, సర్వమర్పించనా, నిన్ను మెప్పించనా
నీ గుడిలో దీపముగా నా బ్రతుకే వెలిగించి, కొడిగట్టి నేనారిపోనా
నువ్వంటే నాకు ప్రేమ

నిన్ను లాలించనా, నిన్ను పాలించనా, జగతి మరిపించనా, స్వర్గమనిపించనా
నా యెదలో దేవతగా  నీ రూపే నిలుపుకొని, నీ ప్రేమ పూజారి కానా
నువ్వంటే నాకు ప్రేమ

కలిసి జీవించినా, కలలు పండించినా, వలచి విలపించినా, కడకు మరణించినా
నీ జతలో జరగాలి, నీ కధలో నాయికగా మిగలాలి మరుజన్మకైనా
నువ్వంటే నాకు ప్రేమ

సినిమా:- ప్రేమ తరంగాలు
సాహిత్యం:- సినారె
సంగీతం:- చక్రవర్తి
గానం:- పి.సుశీల, బాలు

kala ayinA, nijamainA, kAdannA, lEdannA, chebutunnA priyatamA
nuvvanTE nAku prEma, nuvvanTE nAku prEma

ninnu poojinchanA, ninnu sEvinchanA, sarvamarpinchanA, ninnu meppinchanA
nee guDilO deepamugA naa bratukE veliginchi, koDigaTTi nEnAripOnA
nuvvanTE nAku prEma

ninnu lAlinchanA, ninnu pAlinchanA, jagati maripinchanA, swargamanipinchanA
nA yedalO dEvatagA  nee roopE nilupukoni, nee prEma poojAri kAnA
nuvvanTE nAku prEma

kalisi jeevinchinA, kalalu panDinchinA, valachi vilapinchinA, kaDaku maraNinchinA
nee jatalO jaragAli, nee kadhalO naayikagA migalAli marujanmakainA
nuvvanTE nAku prEma

sinimA:- prEma tarangAlu
saahityam:- sinAre
sangeetam:- chakravarti
gaanam:- p.suSeela, bAlu 

Labels: , , ,


 
నవ్వెందుకే ఈ జీవితం, నవ్వొక్కటేరా శాశ్వతం
దేవుడిచ్చిన జీవితాన్ని, చివరిదాకా మాసిపోని నవ్వుతో నింపేయరా

కానరాని కాటుచీకటి బాటలో పయనించినా
లోకమంతా ఎకమై నిను వేరుచేసి చూసినా
జాలిలేని కాలమే నిను కాలరాచి వెళ్ళినా
దేవుడిచ్చిన జీవితాన్ని, చివరిదాకా మాసిపోని నవ్వుతో గడిపేయరా

కళ్ళుమూసి వెళ్ళిపోయే జీవితం ఒక రాక్షసి 
వెంటవుండి తీసుకెళ్ళే మృత్యువే నీ ప్రేయసి 
నువ్వు వెళ్ళుతూ ఉన్నవాళ్ళకు పూలబాటలు చూపరా
దేవుడిచ్చిన జీవితాన్ని, చివరిదాకా మాసిపోని నవ్వుతో సాగించరా

సినిమా:- ప్రేమ తరంగాలు
సాహిత్యం:- సినారె
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు


navvendukE ee jeevitam, navvokkaTErA SASwatam
dEvuDicchina jeevitAnni, chivaridAkA maasipOni navvutO nimpEyarA 

kaanarAni kaaTucheekaTi bATalO payaninchinA 
lOkamantA ekamai ninu vEruchEsi choosinA
jaalilEni kaalamE ninu kaalarAchi veLLinA
dEvuDicchina jeevitAnni, chivaridAkA maasipOni navvutO gaDipEyarA 

kaLLumoosi veLLipOyE jeevitam oka rAkshasi 
venTavunDi teesukeLLE mRtyuvE nee prEyasi 
nuvvu veLLutU unnavALLaku poolabaaTalu chooparA 
dEvuDicchina jeevitAnni, chivaridAkA maasipOni navvutO saagincharA 

sinimA:- prEma tarangAlu 
saahityam:- sinAre
sangeetam:- chakravarti
gaanam:- bAlu 

Labels: , , ,


 
కురిసే చినుకుల గుసగుసలు, అవి మదిలో మెరిసే కోరికలు
ఆ కోరికలన్ని తీరం చేరే తీయ్యని వేళ, ఈ తీయ్యని వేళ

మనసే ఒక ఆకాశమై, అనురాగామే నీలిమేఘమై
ఆ తొలకరి తలపుల జల్లులలో, ఆ తొలకరి తలపుల జల్లులలో,
మన కలలే విరిసే వేళ, ఈ తీయ్యని వేళ

వయసే నవవసంతమై, తొలి వలపులే పూలతీవెలై
ఆ పరిమళ లహరుల దారులలో, ఆ పరిమళ లహరుల దారులలో
మన బ్రతుకే సాగే వేళ, ఈ తీయ్యని వేళ

సినిమా:- అమ్మ నాన్న
సాహిత్యం:- సినారె
సంగీతం:- టి.చలపతిరావు
గానం:- పి.సుశీల, బాలు

kurisE chinukula gusagusalu, avi madilO merisE kOrikalu
aa kOrikalanni teeram chErE teeyyani vELa, ee teeyyani vELa

manasE oka aakASamai, anurAgAmE neelimEghamai
aa tolakari talapula jallulalO, aa tolakari talapula jallulalO,
mana kalalE virisE vELa, ee teeyyani vELa

vayasE navavasantamai, toli valapulE poolateevelai
aa parimaLa laharula daarulalO, aa parimaLa laharula daarulalO
mana bratukE sAgE vELa, ee teeyyani vELa

sinimA:- amma nAnna
saahityam:- sinAre
sangeetam:- T.chalapatirAo
gaanam:- p.suSeela, bAlu 

Labels: , , ,


 
మన జీవితం ఒక తోట, అనురాగమే ఒక పాట
ఆ పాట మనలో కరిగి, అణువణువు తియ్యగ కదలి
ఉదయించే చిన్నారి నాన్న, వీడు ఎదగాలి గగనాల కన్న

ఎన్నో దిక్కులున్నా వెలుగిచ్చే సూర్యుడొకడే
ఎన్నో చుక్కలున్నా కళలిచ్చే చంద్రుడొకడే
అ వెలుగే జగతికి ఆభరణం, ఈ బాబే మన ఆశా కిరణం

పూచే ప్రతి పువ్వు మా బాబు చిరు చిరు నవ్వు
వీచే ప్రతి గాలి మా బాబు వేసే అడుగు
మా నాన్న చిరునవ్వులోన, మ్రోగాలి మాణిక్యవీణ

ఎన్నో జన్మలున్నా ఈ జన్మే తీయ్యని వరము
ఎన్నో మమతలున్నా ఈ బాబే వీడని బంధము
ఈ బంధమే మన ఊపిరిగా, ఉందాము బ్రతుకె పున్నమిగా

సినిమా:- love marriage
సాహిత్యం:- సినారె
సంగీతం:- టి.చలపతిరావు
గానం:- పి.సుశీల, బాలు  


mana jeevitam oka tOTa, anurAgamE oka pATa
aa pATa manalO karigi, aNuvaNuvu tiyyaga kadali
udayinchE chinnAri nAnna, veeDu edagAli gaganAla kanna

ennO dikkulunnA velugicchE sooryuDokaDE
ennO chukkalunnA kaLalicchE chandruDokaDE
a velugE jagatiki aabharaNam, ee bAbE mana aaSA kiraNam

poochE prati puvvu mA bAbu chiru chiru navvu
veechE prati gAli mA bAbu vEsE aDugu
mA nAnna chirunavvulOna, mrOgAli maaNikyaveeNa

ennO janmalunnA ee janmE teeyyani varamu
ennO mamatalunnA ee bAbE veeDani bandhamu
ee bandhamE mana oopirigA, undAmu bratuke punnamigA

sinimA:-  love marriage
saahityam:- sinAre
sangeetam:- T.chalapatirAvu
gaanam:- p.suSeela, bAlu  


Labels: , , ,


 
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
అది ఈనాడైనా ఏనాడైనా నీకే నీకే అంకితం

తెరచిన నా కన్నులలో ఎప్పుడూ నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎప్పుడూ నీ కలలదీపమే
కనులే కలలై, కలలే కనులై
చూసిన అందాలు, అనుబంధాలు అవి నీకే నీకే అంకితం

నిండిన నా గుండెలలో ఎప్పుడూ నీ ధ్యానమే
పండిన ఆ ధ్యానంలో ఎప్పుడూ నీ ప్రణయగానమే
ధ్యానమే గానమై, గానమే ప్రాణమై
పలికిన రాగాలు, అనురాగాలు అవి నీకే నీకే అంకితం

సినిమా:- అర్ధాంగి
సాహిత్త్యం:- సినారె
సంగీతం:- టి.చలపతిరావు
గానం:- పి.సుశీల


nA manasE oka tellani kAgitam
nee valapE toli vennela santakam
adi eenADainA EnADainA neekE neekE ankitam

terachina naa kannulalO eppuDU nee roopamE
moosina naa kannulalO eppuDU nee kalaladeepamE
kanulE kalalai, kalalE kanulai
choosina andAlu, anubandhAlu avi neekE neekE ankitam

ninDina naa gunDelalO eppuDU nee dhyAnamE
panDina aa dhyAnamlO eppuDU nee praNayagAnamE
dhyAnamE gAnamai, gAnamE prANamai
palikina rAgAlu, anurAgAlu avi neekE neekE ankitam

sinimA:- ardhAngi
saahittyam:- sinAre
sangeetam:- T.chalapatirAvu
gaanam:- p.suSeela 

Labels: , ,


 
ముందుకు ముందుకు ముందుకు, వెనకకు చూడడమెందుకు
సాగిపోదాం, ఊగిపోదాం, మబ్బుల్లో ఊరేగిపోదాం

బాబ్బావు అంటే వినిపించుకోనేది ఎవరు
బాంచెన్ దొర అంటే కరుణించేవారెవరు
ఎన్నాళ్ళీ వెట్టి చకిరి, ఎన్నాళ్ళి మట్టి ఊపిరి
రివ్వున తారాజువ్వలగా రెపరెపలాడుతూ పోదాం పదరా

కనులు మూసుకుంటే దృష్టి లేదు
మనసు మూసుకుంటే సృష్టి లేదు
ఎన్నాళ్ళీ అతుకుల బ్రతుకులు, ఎన్నాళ్ళీ గతుకుల నడకలు
సిమెంటురొడ్డుల, కరెంటుమేడల జిలుగులు చూద్దాం పదరా

బ్రతుకంతా పొగలో గడిపే బానిసతనమొద్దు
మెతుకుల కోసం చేయి చాచే మెతకతనం వద్దు
కండలు కరిగిద్దాం, లక్షలు గడియిద్దాం
కన్నవారిని సుఖపెడదాం, కలిసి అందరం సుఖపడదాం

సినిమా:- ఓ మనిషి తిరిగి చూడు
సాహిత్యం:- సినారె
సంగీతం:- రమేశ్ నాయిడు
గానం:- బాలు, రమేశ్


munduku munduku munduku, venakaku chooDaDamenduku
saagipOdAm, oogipOdAm, mabbullO oorEgipOdAm

bAbbAvu anTE vinipinchukOnEdi evaru
bAnchen dora anTE karuNinchEvArevaru
ennALLI veTTi chakiri, ennALLi maTTi oopiri
rivvuna taarAjuvvalagA reparepalADutU pOdAm padarA

kanulu moosukunTE dRshTi lEdu
manasu moosukunTE sRshTi lEdu
ennALLI atukula bratukulu, ennALLI gatukula naDakalu
simenTuroDDula, karenTumEDala jilugulu chooddAm padarA

bratukantA pogalO gaDipE baanisatanamoddu
metukula kOsam chEyi chaachE metakatanam vaddu
kanDalu karigiddAm, lakshalu gaDiyiddAm
kannavArini sukhapeDadAm, kalisi andaram sukhapaDadAm

sinimA:- O manishi tirigi chooDu
saahityam:- sinAre
sangeetam:- ramESh nAiDu
gaanam:- bAlu, ramESh

Labels: , ,


 
ఓ మనిషి తిరిగి చూడు..ఓ మనిషి తిరిగి చూడు
ఎందరున్నారో, ఇలా ఇంకెందరున్నారో, ఎక్కడున్నరో, ఎమౌతున్నారో

దారి ఉంటేనే మరో దారి పుడుతుంది..ఒక అడుగు వేస్తేనే మరో అడుగు పడుతుంది
గమనం వేరైనా, గమ్యం ఒకటేనా
దిక్కులు మారినా, ధ్యేయం ఒకటేనా

కోడి కూయగానే తెల్లవారిపోదు..వాన కురియగానే చేను పండిపోదు
ఇది వెలుతురులాంటి బ్రాంతి..తుఫాను ముందటి ప్రశాంతి

చెట్టు వాడిపోయింది, వఠ్ఠి మోడు మిగిలింది
కొమ్మలన్ని విరిగిపోగా, పళ్ళన్ని చెదిరిపోగా
ఉన్నాను, ఉన్నాను ఇంకా బ్రతికున్నానని
పడిపోక, నిలబడలేక చెట్టు ఆవురుమంటున్నది
తన చుట్టూ చితికిన బ్రతుకుల చూడమంటున్నది

వెట్టిచాకిరికి సంకళ్ళు, దురంతాలకు తుదినాళ్ళు
ఓ మనిషి తిరిగి చూడు..ఓ మనిషి తిరిగి చూడు

సినిమా:- ఓ మనిషి తిరిగి చూడు
సాహిత్యం:- సినారె
సంగీతం:- రమేశ్ నాయిడు
గానం:- బాలు

O manishi tirigi chooDu..O manishi tirigi chooDu
endarunnArO, ilA inkendarunnArO, ekkaDunnarO, emoutunnArO

daari unTEnE marO daari puDutundi..oka aDugu vEstEnE marO aDugu paDutundi
gamanam vErainA, gamyam okaTEnA
dikkulu maarinA, dhyEyam okaTEnA

kODi kooyagAnE tellavAripOdu..vAna kuriyagAnE chEnu panDipOdu
idi veluturulAnTi brAnti..tufAnu mundaTi praSAnti

cheTTu vADipOyindi, vaThThi mODu migilindi
kommalanni virigipOgA, paLLanni chediripOgA
unnAnu, unnAnu inkA bratikunnAnani
paDipOka, nilabaDalEka cheTTu aavurumanTunnadi
tana chuTTU chitikina bratukula chooDamanTunnadi

veTTichAkiriki sankaLLu, durantAlaku tudinALLu
O manishi tirigi chooDu..O manishi tirigi chooDu

sinimA:- O manishi tirigi chooDu
saahityam:- sinAre
sangeetam:- ramESh nAiDu
gaanam:- bAlu

Labels: , ,


 
దేవుడే కరుణిస్తే మనిషికి
కనురెప్పలు తోడుంటే కలత లేదు కంటికి

శతకోతి వరహలకన్నా, కన్నతల్లికి తన కొడుకెంతో మిన్న
తన బాబు ఎంతెంత వాడైనా, ఆమె కనులందు గారాల పసికూన
వొడిలోన పడుకున్న చాలు, ఆ తల్లి స్వర్గాలు ఇక కోరుకోదు

ఊరికి ఉపకారి నీకా ఇంతటి అన్యాయం..మంచికి ఇదేన సన్మానం
దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి
కనురెప్పలే కాటేస్తే కాపెవ్వరు కంటికి

నీవు నిప్పులాంటివాడివని తనకు తెలిసినా, చాటి చెప్పేందుకు సత్యానికి నోరులేదే
నీకు రక్షగా నిలవాలని తాను తలచినా, కదలి వచ్చెందుకు ధర్మానికి కాళ్ళు లేవే
వేసారు సంకెళ్ళు నీ చేతికి, కాని వెయ్యలేరు చెదిరిపోని నీ నీతికి

చందురునికి ఏ గ్రహణం పట్టినా, వాని పొందువిడిచి వెన్నెలతో వెళ్ళ్గునా
పందిరి సుడిగాలికి పడిపోతున్నా, దాని బంధాన్ని తీగ తెంచుపోగలుగునా
మంచిమనసు వలచేది ఒకేసారి, ఎదిఎమైనా మారునా దానిదారి

సినిమా:- ఊరికి ఉపకారి
సంగీతం:- సత్యం
గానం:- ఘంటసాల, పి.సుశీల


dEvuDE karuNistE manishiki
kanureppalu tODunTE kalata lEdu kanTiki

SatakOti varahalakannA, kannatalliki tana koDukentO minna
tana bAbu ententa vADainA, Ame kanulandu gaarAla pasikoona
voDilOna paDukunna chAlu, aa talli swargAlu ika kOrukOdu

ooriki upakAri neekA intaTi anyAyam..manchiki idEna sanmAnam
dEvuDE pagabaDitE dikkevvaru manishiki
kanureppalE kATEstE kaapevvaru kanTiki

neevu nippulAnTivADivani tanaku telisinA, chATi cheppEnduku satyAniki nOrulEdE
neeku rakshagA nilavAlani tAnu talachinA, kadali vacchenduku dharmAniki kALLu lEvE
vEsAru sankeLLu nee chEtiki, kAni veyyalEru chediripOni nee neetiki

chanduruniki E grahaNam paTTinA, vAni ponduviDichi vennelatO veLLgunA
pandiri suDigAliki paDipOtunnA, dAni bandhAnni teega tenchupOgalugunA
manchimanasu valachEdi okEsAri, ediemainA mArunA dAnidaari

sinimA:- ooriki upakAri
sangeetam:- satyam
gaanam:- ghanTasAla, p.suSeela

Labels: , ,


 
దేవుడు తాను ఆడుకొనేందుకు ఆలుమగలను సృష్టించాడు
ఆ ఇద్దరు కలసి ఆడుకొనేందుకు ముద్దుల బిడ్డను ఇచ్చాడు
తారంగం, తారంగం, తాండవకృష్ణ తారంగం

మోసిననాడు తెలియవురా ఈ ముద్దుమురిపాలు
కన్ననాడు చూడలేదు ఈ కంటి నవ్వులు
ప్రేమతోటి తినిపించాను గోరుముద్దలు
వాటితోనే పెంచుకున్న అన్ని పాశాలు
ఏనుగొచ్చింది ఏనుగు, ఎక్కడికొచ్చింది ఏనుగు?
మా వూరొచ్చింది ఏనుగు, మంచినీళ్ళు తాగింది ఏనుగు

ఎవ్వరు నీవు, ఎవ్వరు నేనో పూర్వ జన్మలో
ఎవ్వరి పుణ్యం ఇలా పండెనో ఈ జన్మలో
తీరిపోయే మమత కాదిది ఈ పుట్టుకతో
మరల నీకు తల్లినవుతా ఇదే తీపితో
తప్పేట్లోయి, తాళాలోయి, దేవుడి గుళ్ళో భాజాలోయి
తప్పేట్లోయి, తాళాలోయి, దేవుడి గుళ్ళో భాజాలోయి

పాలకోసం ఏద్చిననాడు ఎవరు పలికారు
పడ్డనడు ఎవరు నీకు ఊతమిచ్చారు
కన్నకడుపుకు తెలుసునా నీ కంటినీరు
ఉన్నవారని నిన్ను నన్ను వేరు చేసారు

సినిమా:- స్వర్గ సీమ
సంగీతం:- కె.వి.మహదేవన్
గానం:- పి.సుశీల



dEvuDu tAnu aaDukonEnduku aalumagalanu sRshTinchADu
aa iddaru kalasi aaDukonEnduku muddula biDDanu icchADu
tArangam, tArangam, tAnDavakRshNa tArangam

mOsinanADu teliyavurA ee muddumuripAlu
kannanADu chooDalEdu ee kanTi navvulu
prEmatOTi tinipinchAnu gOrumuddalu
vaaTitOnE penchukunna anni pASAlu
Enugocchindi Enugu, ekkaDikocchindi Enugu?
maa voorocchindi Enugu, manchinILLu taagindi Enugu

evvaru neevu, evvaru nEnO poorva janmalO
evvari puNyam ilA panDenO ee janmalO
teeripOyE mamata kaadidi ee puTTukatO
marala neeku tallinavutA idE teepitO
tappETlOyi, tALAlOyi, dEvuDi guLLO bhAjAlOyi
tappETlOyi, tALAlOyi, dEvuDi guLLO bhAjAlOyi

pAlakOsam EdchinanADu evaru palikAru
paDDanaDu evaru neeku ootamicchAru
kannakaDupuku telusunA nee kanTinIru
unnavArani ninnu nannu vEru chEsAru

sinimA:- swarga seema
sangeetam:- k.v.mahadEvan
gaanam:- p.suSeela 

Labels: ,


Monday, May 7, 2018

 
ప్రయాణం ప్రయాణం
ఈ లోకానికి రావాడమే తొలి ప్రయాణం
పై లోకానికి పోవడమే తుది ప్రయాణం
మధ్యన ఉండే జీవితమంతా మనిషికి తప్పదు ప్రయాణం

దూరం తెలియని తీరం వరకు ఉరుకు పరుగుల ప్రయాణం
ఆగని కాలం ఆగేవరకు అలసట తప్పని ప్రయాణం
ప్రయాణం ప్రయాణం

కన్నవారే కన్నెపిల్లకు కావలివారు
ఒక మగవాడే కన్నె బ్రతుకున దోపిడిదారు
జీవితమే ఒక స్వర్గం నడిపే తోడు దొరికితే
కన్నీరే నడిపిస్తుంది దారి తప్పితే

సినిమా:- ప్రయాణంలో పదనిసలు
సాహిత్యం:- సినారె
సంగీతం:- శంకర్ గణేష్
గానం:- బాలు

prayANam prayANam
ee lOkAniki rAvADamE toli prayANam
pai lOkAniki pOvaDamE tudi prayANam
madhyana unDE jeevitamantA manishiki tappadu prayANam

dooram teliyani teeram varaku uruku parugula prayANam
aagani kAlam aagEvaraku alasaTa tappani prayANam
prayANam prayANam

kannavArE kannepillaku kAvalivAru
oka magavADE kanne bratukuna dOpiDidAru
jeevitamE oka swargam naDipE tODu dorikitE
kannIrE naDipistundi daari tappitE

sinimA:- prayANamlO padanisalu
saahityam:- sinAre
sangeetam:- Sankar gaNEsh
gaanam:- bAlu 

Labels: , , ,


 
ఒక మౌనం రాగమై ఎగిసింది
ఒక రాగం మౌనమై కురిసింది
చినుకు చినుకుగా, తొలి కోరికలనే మేలుకొలుపుగా
చినుకు చినుకుగా

పారే సెలయేరే నీ పాదాలు కడిగింది..నీ పాదాలు కడిగింది
మెరిసే నీరెండ పసిడి పారాణి తీర్చింది
పుడమి ముంగిట మలయపవనం..పువ్వుల ముగ్గులు వేసింది

వొలికే నీ ఊపిరితో పలికే వేణువునై
తాకే నీ పెదవులతో తడిసే కవినై
తొలకరించే వేళలోనే..వలపు వాకిలి తెరిచింది

సినిమా:- ఆశాజ్యొతి
సాహిత్యం:- సినారె
సంగీతం:- రమేశ్ నాయిడు
గానం:- వాణి జయరాం, బాలు

oka mounam rAgamai egisindi
oka rAgam mounamai kurisindi
chinuku chinukugA, toli kOrikalanE mElukolupugA
chinuku chinukugA

pArE selayErE nee pAdAlu kaDigindi..nee pAdAlu kaDigindi
merisE neerenDa pasiDi pArANi teerchindi
puDami mungiTa malayapavanam..puvvula muggulu vEsindi

volikE nee oopiritO palikE vENuvunai
taakE nee pedavulatO taDisE kavinai
tolakarinchE vELalOnE..valapu vAkili terichindi

sinimA:- aaSAjyoti
saahityam:- sinAre
sangeetam:- ramESh nAiDu
gaanam:- vANi jayarAm, bAlu 

Labels: , , ,


 
కోవెలలో దీపంలా నువ్వు వెలుగుతూ ఉండాలి
నిను చూసినప్పుడలా నా కనులు కరుగుతూ ఉండాలి

చెల్లి నుదుటి తిలకాలే, అన్న యెదను కోరికలు
ముత్తైదుల దీవెనలే, నిత్య పసుపుకుంకుమలు
ఇప్పుడిప్పుడే ఆడిన పాపకు ఎంతేంతటి బిడియాలు  
కలకాలం మీ ఇద్దరికి నా మమతలే అక్షింతలు

ఈ ఇంటిని నాకు విడిచి, ఆ ఇంటికి వెళ్ళుతున్నావు
అనుబంధం ఒకటే ఇల్లు, అది మాత్రం మన ఇద్దరిది
సాగిపోవు శుభసమయంలో ఎలనమ్మ కన్నుల నీరు
కరుణతోడ అన్నకు ఇచ్చే కానుక ఇది కాబోలు

సినిమా:- మహాపురుషుడు
గానం:- బాలు

kOvelalO deepamlA nuvvu velugutU unDAli
ninu choosinappuDalA naa kanulu karugutU unDAli

chelli nuduTi tilakAlE, anna yedanu kOrikalu
muttaidula deevenalE, nitya pasupukumkumalu
ippuDippuDE aaDina paapaku entaentaTi biDiyAlu  
kalakAlam mee iddariki nA mamatalE akshintalu

ee inTini naaku viDichi, aa inTiki veLLutunnAvu
anubandham okaTE illu, adi maatram mana iddaridi
saagipOvu SubhasamayamlO elanamma kannula neeru
karuNatODa annaku icchE kaanuka idi kAbOlu

sinimA:- mahApurushuDu
gaanam:- bAlu 

Labels: ,


 
కొత్తగున్నది పాత కోయిల కుహు కుహు అంటే
మత్తుగున్నది, మల్లెపూలా పాట వింటుంటే
ఆ ఊసు వింటుంటే, కొత్తగున్నది పాత కోయిల కుహు కుహు అంటే

జుమ్మని తుమ్మెద రొదపెడితే, జుంజుమ్మని తుమ్మెద రొదపెడితే,
రమ్మని పిలుపై, కమ్మని కబురై
జల్లుజల్లుమంటోంది న వళ్ళు
అవేనా అవేనా ఈ వింత పరవళ్ళు kottagunnadi pAta kOyila kuhu kuhu anTE
mattugunnadi, mallepoolA pATa vinTunTE
aa oosu vinTunTE, kottagunnadi pAta kOyila kuhu kuhu anTE

jummani tummeda rodapeDitE, jumjummani tummeda rodapeDitE,
rammani pilupai, kammani kaburai
jallujallumanTOndi na vaLLu
avEnA avEnA ee vinta paravaLLu

enDalu gunDelO guDi kaDitE, enDalu gunDelO guDi kaDitE,
vecchani pilupai, vennela chinukai
velluvaipOtundi naa vayasu
avEnA avEnA ee tEna vaDagaLLu

sinimA:- aaSAjyoti
sangeetam:- ramESh nAiDu
gaanam:- p.suSeela

ఎండలు గుండెలో గుడి కడితే, ఎండలు గుండెలో గుడి కడితే,
వెచ్చని పిలుపై, వెన్నెల చినుకై
వెల్లువైపోతుంది నా వయసు
అవేనా అవేనా ఈ తేన వడగళ్ళు

సినిమా:- ఆశాజ్యొతి
సంగీతం:- రమేశ్ నాయిడు
గానం:- పి.సుశీల


Labels: ,


Friday, May 4, 2018

 
కాలాల ఎనకాల ఒక ఏంకి ఉండేదటా
ఆ ఏంకి నండూరి పాటల్లో మిగిలిందటా
అది ఏ జాను తెనుగో, అది ఏ జానపదమో
ఆ ఏంకి మనసులో ఎన్నెన్ని ఊసులో, కడకంట ఎన్నెన్ని బాసలో

ఆ ఏంకి ఒకనాడు నా వంక చూసింది
ఆ చూపుతో వేగుచుక్కేదో పొడిచింది
అది కలలాగ ఎదిగి, నా కన్నీట కరిగి
నా ఆశ అకాశమై ఆగిపోయింది
నా ఏంకి తెల్లారి వెన్నెలైపోయింది
ఎదలోని ఆ ఏంకి ఎదురైన వేళ, పదమేది పాడేది ఈవేళ

తెలుగింట ప్రేమదీపాలు పెట్టింది
వెలుగారిపోయాక ఎద చూసుకోమంది
అది నా గుండే నమిలి, నా మనసంత నలిగి
తెలుగోళ్ళకొక పాటాగా ఏంకి మిగిలింది
పాడలేని నాకు పల్లవై పోయింది
ఎదలోని ఆ ఏంకి ఎదురైన వేళ, పదమేది పాడేది ఈవేళ

సినిమా:- ఊహసుందరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

kAlAla enakAla oka Enki unDEdaTA
aa Enki nanDoori paaTallO migilindaTA
adi E jaanu tenugO, adi E jAnapadamO
aa Enki manasulO ennenni oosulO, kaDakanTa ennenni bAsalO

aa Enki okanADu naa vanka choosindi
aa chooputO vEguchukkEdO poDichindi
adi kalalAga edigi, naa kannITa karigi
naa ASa akaaSamai aagipOyindi
naa Enki tellAri vennelaipOyindi
edalOni aa Enki eduraina vELa, padamEdi paaDEdi eevELa

teluginTa prEmadeepAlu peTTindi
velugAripOyAka eda choosukOmandi
adi nA gunDE namili, nA manasanta naligi
telugOLLakoka pATAgA Enki migilindi
paaDalEni naaku pallavai pOyindi
edalOni aa Enki eduraina vELa, padamEdi paaDEdi eevELa

sinimA:- oohasundari
sangeetam:- chakravarti
gAnam:- bAlu 

Labels: ,


 
జిందాబాద్ జీవితం..జీవిస్తూ వెలుగుదాం
ఉల్టాసీదా లోకంలో ఉయ్యాలో జంపాల
పల్టి కొట్టేదాకేనే నీ లీల మా గోల

కన్నులలో మాట, సిరివెన్నెలలో వేట
చెలి సందిట్లో సయ్యాటలొ..తడిముంగిట్లొ ముద్దాటలో
socialism వేదం, అది సొమ్మసిలే సంఘం
జతకాబోదు మీ దారిలో, యమగొప్పల మీ గోదారిలో
కులికి కూచిపూడి, మా కడుపు మీద దాడి
దిగులు దాచుకుంది మా వగలమారి నాడి
కసాబిసా కవ్వించే కచేరి మీ వంతు
శ్రుతి లయ స్వరం పధం మా వంతు

జీవితమనే ఆట, అది జివ్వుమనే పాట
ఒక పల్లవిగా పరువాలలో, ఎద పంచుకొనే ప్రణయాలలో
లోకమనే శొకం, అది పాడుకొనే శ్లోకం
జమ కాబోదు మీ లెక్కలో, నవరంగుల మా నాట్యాలలో
చీకు చింత లేని చిరునవ్వులన్ని మీవి  
దీపాలు తీసినాక తాపాలు తీర్చు మోవి
శుభోజయం ప్రియంగా నూరేళ్ళు జీవించు
నిరంతరం తరం తరం నవ్వించు

సినిమా:- పెద్దింటి అల్లుడు
సంగీతం:- రాజ్-కోటి
గానం:- బాలు

zindAbAd jeevitam..jeevistU velugudAm
ulTAseedA lOkamlO uyyAlO jampAla
palTi koTTEdaakEnE nee leela mA gOla

kannulalO mATa, sirivennelalO vETa
cheli sandiTlO sayyATalo..taDimungiTlo muddATalO
#socialism# vEdam, adi sommasilE sangham
jatakaabOdu mee daarilO, yamagoppala mee gOdArilO
kuliki koochipooDi, maa kaDupu meeda dADi
digulu daachukundi maa vagalamAri nADi
kasAbisA kavvinchE kachEri mee vantu
Sruti laya swaram padham maa vantu

jeevitamanE ATa, adi jivvumanE pATa
oka pallavigA paruvAlalO, eda panchukonE praNayAlalO
lOkamanE Sokam, adi paaDukonE SlOkam
jama kAbOdu mee lekkalO, navarangula maa nATyAlalO
cheeku chinta lEni chirunavvulanni meevi  
deepAlu teesinAka tApAlu teerchu mOvi
SubhOjayam priyangA noorELLu jeevinchu
nirantaram taram taram navvinchu

sinimA:- peddinTi alluDu
sangeetam:- rAj-kOTi
gaanam:- bAlu 

Labels: ,


 
జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగని
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగని
దారిలో మమతలే, పువ్వులై కురియని
ఇలానే, ఇలానే

జలతారు మేఘం పరదాలు దాటి..నీలాలనింగి నే చేరుకోనా
ఆ తారలన్ని తళుకాడు వేళ..ఎన్నెన్నొ కలలు కదలాడవా
ఆ కాంతి నేనై ఇలా ఉండిపోనా

దరిచేరు వేళ చిరు సిగ్గులో..మనసైనవాని కనుచూపులో
సరికొత్త అందం చిగురించితే..ఓ గర్వరేఖ కనుగీటితే
అ రేఖనై ఇలా ఇలా నేనొదొగిపోనా

సినిమా:- సుమంగళి
గానం:- పి.సుశీల, బాలు

jeevitam O prayANam tODugA sAgani
gunDelO prEmageetam ninDugA mrOgani
daarilO mamatalE, puvvulai kuriyani
ilAnE, ilAnE

jalatAru mEgham paradAlu dATi..neelAlaningi nE chErukOnA
aa tAralanni taLukADu vELa..ennenno kalalu kadalADavA
aa kAnti nEnai ilA unDipOnA

darichEru vELa chiru siggulO..manasainavAni kanuchoopulO
sarikotta andam chigurinchitE..O garvarEkha kanugeeTitE
a rEkhanai ilA ilA nEnodogipOnA

sinimA:- sumangaLi
gaanam:- p.suSeela, bAlu 

Labels: ,


Thursday, May 3, 2018

 
నిదురపోరా బాబు..నిదురపోరా
నిదురొకటే నీకున్న సిరిరా..నిరుపేద స్వర్గమే నిండైన నిదురరా

ఎందుకు నిన్ను మోసానో..ఎందుకు నిన్ను కన్నానో..నిలదీసి అడగకురా
ఎక్కడనుంచి వచ్చావో..ఇక్కడ ఎందుకు పుట్టావో..నిను నేను అడగనురా
మనుషలనడిగి లాభంలేదు..మన్నే మనకు చెప్పాలి బదులు

ఆశలు నువ్వు తెచ్చావు..ఆకలి నేను ఇచ్చాను..ఎవరేది తీర్చాలో
బ్రతుకున కోరి వచ్చావు..వెతలకు నీవు చిక్కావు..తుదకేది దక్కేనో
దీవించేదే తెలుసు తల్లికి..దేవునిరాతే తెలియదెవరికి

సినిమా:- అంగడిబొమ్మ
సంగీతం:- సత్యం
గానం:- పి.సుశీల

nidurapOrA bAbu..nidurapOrA
nidurokaTE neekunna sirirA..nirupEda swargamE ninDaina nidurarA

enduku ninnu mOsAnO..enduku ninnu kannAnO..niladeesi aDagakurA
ekkaDanunchi vacchAvO..ikkaDa enduku puTTAvO..ninu nEnu aDaganurA
manushalanaDigi lAbhamlEdu..mannE manaku cheppAli badulu

aaSalu nuvvu tecchAvu..aakali nEnu icchAnu..evarEdi teerchAlO
bratukuna kOri vacchAvu..vetalaku neevu chikkAvu..tudakEdi dakkEnO
deevinchEdE telusu talliki..dEvuniraatE teliyadevariki

sinimA:- angaDibomma
sangeetam:- satyam
gAnam:- p.suSeela 

Labels: , ,


 
ఎమయిందో ఎమో నా మదిలో ఈవేళ
ప్రేమయిందో ఎమో అనుమానం కలిగేలా
ఔనో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

హాయి రామా  ఇదేమి ప్రేమ..హంగామా భరించతరమా..
అందం అంతా అయోమయంగా..ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ

ఎ చోట నా పాదం నిలబడనట్టోంది..ప్రతి బాట నీవైపే పదపద అంటోంది
మనసంతా ఎందుకనో దిగులగ ఉంటుంది..అదికూడా చిత్రంగా బాగానే ఉంది
ఉప్పేనలా హృదయంలో చెలరేగే కలవరం..తప్పుకునే దారేదొ వెతకాలి ఇద్దరం
ఎప్పుడు మొదలయిందో నను లాగే ప్రియస్వరం..ఎప్పుడు ఎటుతోస్తుందో చెబుతుందా ఈ క్షణం
అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా..విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెల

ఏ ప్రేమో మతే చెడంగా..చిక్కేమో అమాయకంగా
గుండెల్లో అదొరకంగా..చిందరవందర తొందర తికమక

ఎవరయినా నీ పేరు అనుకుంటే చాలు..కోపంతొ ఎఱ్ఱబడే కసిరే నా కళ్ళు
ఎవరయినా నిను కొంచం గమనిస్తే చాలు..గుండెసడి ఉలికిపడి ఒకటే కంగారు
చప్పున ఒకటైపోదాం ఈ దూరం జరగని...ఎక్కడికైనా పొదాం మనలోకం వేరని
ఎవ్వరికి ఏమాత్రం కనిపించం పొమ్మని..ఆ క్షణమే మనకోసం ఎకాంతం చూడని
చిటికేవేసి పిలిచే ప్రేమ మనతో చేరదా..మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా
           
సినిమా:- ప్రేమతో రా
సంగీతం:- మణిశర్మ
గానం:- బాలు, హరిణి  

emayindO emO nA madilO eevELa
prEmayindO emO anumAnam kaligElA
ounO kaadO aDagAlanTE teguvE chaaladE
nijamO kaadO teliyakapOtE taguvE tEladE

hAyi rAmA  idEmi prEma..hangAmA bharinchataramA..
andam antA ayOmayangA..ukkiri bikkiri oopiri sarigama

e chOTa naa pAdam nilabaDanaTTOndi..prati bATa neevaipE padapada anTOndi
manasantA endukanO digulaga uMTundi..adikooDA chitraMgA baagAnE undi
uppEnalA hRdayamlO chelarEgE kalavaram..tappukunE daarEdo vetakAli iddaram
eppuDu modalayindO nanu lAgE priyaswaram..eppuDu eTutOstundO chebutundA ee kshaNam
anukOkunDA paDadOsindi valapE nannilA..viDipOkunDA muDivEsindi bigisE sankela

E prEmO matE cheDangA..chikkEmO amAyakangA
gunDellO adorakangA..chindaravandara tondara tikamaka

evarayinA nee pEru anukunTE chAlu..kOpamto e~r~rabaDE kasirE nA kaLLu
evarayinA ninu koncham gamanistE chAlu..gunDesaDi ulikipaDi okaTE kangAru
chappuna okaTaipOdAm ee dooram jaragani...ekkaDikainA podAm manalOkam vErani
evvariki EmAtram kanipincham pommani..aa kshaNamE manakOsam ekAntam chooDani
chiTikEvEsi pilichE prEma manatO chEradA..manalO chEri karigE prEma manamai mAragA
           
sinimA:- prEmatO rA
sangeetam:- maNiSarma
gAnam:- bAlu, hariNi     

Labels: , , ,


 
కళ్యాణం..శ్రీ సీతారాముల కళ్యాణం
కన్నులపండుగ కనగా కనగా..వీనుల విందు వినగా వినగా

తొలకరి సిగ్గులు తొణికసలాడగా..జిలిబిలి తలపులు మిలమిలలాడగా
అడుగులలోనా హంసలు కదలగ
మేఘశ్యాముని చెంగట మెరుపై నిలిచిన తరుణి జానకి

అయోధ్యకాదది శ్రీవైకుంఠం..అల మిధిలాపురి క్షీరసాగరం
సురముని గణములు పరవశమందగా
రమామాధవుల పెళ్ళివైభవం మరో రూపమున చరితగ మిగలగా
       
సినిమా:- ఇల్లంతా సందడి
గానం:- పి.సుశీల, బాలు  

kaLyANam..SrI seetAraamula kaLyANam
kannulapanDuga kanagA kanagA..veenula vindu vinagA vinagA

tolakari siggulu toNikasalADagA..jilibili talapulu milamilalADagA
aDugulalOnA hamsalu kadalaga
mEghaSyAmuni chengaTa merupai nilichina taruNi jAnaki

ayOdhyakaadadi SrIvaikunTham..ala midhilApuri ksheerasAgaram
suramuni gaNamulu paravaSamandagA
ramAmAdhavula peLLivaibhavam marO roopamuna charitaga migalagA
       
sinimA:- illantA sandaDi
gAnam:- p.suSeela, bAlu    

Labels: ,


 
వద్దు బాబోయి, పెళ్ళొద్దు బాబోయి
మొదట మొదట ముద్దులాటలు, పోను పోను దెబ్బలాటలు

పెళ్ళయిన కొత్తలో కాపురం..ఒళ్ళంతా పట్టలేని సంబరం
సాయంత్రం తోటలో నడకలు..పొద్దెక్కినా దిగని పడకలు
ఆ మోజులు దగ్గినకోద్దీ..ఆ రోజులు గడిచినకొద్దీ
రుసరుసలా టపాకులు..విసుగొస్తే విడాకులు

ఆ కాలం కాదులే బామ్మా..ఆడది ఆనాడు పైడిబొమ్మ
భర్తంటే కనిపించే దేవుడు..అత్తంటే నిలువెళ్ళా వణుకుడు
ఆ వరస మారిపోయింది..రభస పెరిగిపోయింది
చలాయింపు పెళ్ళాలది..చిత్తగింపు భర్తలది
 
సినిమా:- ఇల్లంతా సందడి
గానం:- బాలు  

vaddu bAbOyi, peLLoddu bAbOyi
modaTa modaTa muddulATalu, pOnu pOnu debbalATalu

peLLayina kottalO kaapuram..oLLantA paTTalEni sambaram
saayantram tOTalO naDakalu..poddekkinA digani paDakalu
aa mOjulu dagginakOddI..aa rOjulu gaDichinakoddI
rusarusalA TapAkulu..visugostE viDAkulu

aa kAlam kaadulE bAmmA..aaDadi aanADu paiDibomma
bhartanTE kanipinchE dEvuDu..attanTE niluveLLA vaNukuDu
aa varasa maaripOyindi..rabhasa perigipOyindi
chalAyimpu peLLAladi..chittaginpu bhartaladi
 
sinimA:- illantA sandaDi
gAnam:- bAlu    

Labels: ,


 
ఇది నా తొలి ప్రేమగీతం..ప్రియా
నీ భావనలో నిదురించిన మది ఆలపించిన మధుర సంగీతం

ఉదయరాగం హృదయమందే విరిసినది ఈనాడు
మృదులభావమే కదలి రాగమై పలికినది ఈనాడు
ఇది తొలి మధురానుభావం..ప్రియా..ఇది నా మధురానురాగం

వెన్నెల గ్రోలిన మల్లెలో ఒక చల్లని పరిమళము
కన్నుల దాగిన రూపముతో నాలో తీయ్యని idi naa toli prEmageetam..priyA
nee bhAvanalO nidurinchina madi aalapinchina madhura sangeetam

udayaraagam hRdayamandE virisinadi eenADu
mRdulabhaavamE kadali raagamai palikinadi eenADu
idi toli madhurAnubhaavam..priyA..idi naa madhurAnuraagam

vennela grOlina mallelO oka challani parimaLamu
kannula daagina roopamutO naalO teeyyani paravaSamu
edO..teeyyani paravaSamu
idi toli praNayaanubhaavam..priyA..idi naa praNayaanubhaavam

manasu mEghamai payaninchE, talapu temmarala kougilinchi  
kalala chinukulE kurisinavi, valapu molakalE vEchinavi
idi toli kavitAtmakaraagam..priyA..idi naa toli prEmageetam

sinimA:- kottavennela
sageetam:- penDyAla
gAnam:- SobhArAj  పరవశము
ఎదో..తీయ్యని పరవశము
ఇది తొలి ప్రణయానుభావం..ప్రియా..ఇది నా ప్రణయానుభావం

మనసు మేఘమై పయనించే, తలపు తెమ్మరల కౌగిలించి  
కలల చినుకులే కురిసినవి, వలపు మొలకలే వేచినవి
ఇది తొలి కవితాత్మకరాగం..ప్రియా..ఇది నా తొలి ప్రేమగీతం

సినిమా:- కొత్తవెన్నెల
సగీతం:- పెండ్యాల
గానం:- శొభారాజ్


Labels:


 
ఇది ఆమని సాగే చైత్రరధం..ఇది రుక్మిణి ఎక్కిన పూలరధం
మనోవేగమున..మరో లోకమున..పరుగులు తీసే మనోరధం

పంచప్రాణాల వేణువూది కోయిల పాడాలి..ప్రణయాల పంచమస్వరం ఆలపించాలి
కృష్ణమ్మ యమునలే దారి చూపాలి..నా కృష్ణుడున్న తీరాలు చేరుకోవలి
నీరెండ పూలు పెట్టి..నీలాల కోక చుట్టి..నువ్వొస్తే బృందావనాల నవ్వాలి

అల నెలవంక పల్లకిలొ సాగిపోవాలి..మనవంక తారలింక తేరిచూడాలి
కొసమెరుపుల ముత్యాలహారమేయాలి..నా వలపలే నిన్ను నేను అల్లుకోవాలి
నా గుండె జళ్ళుమంటే..గుడిగంట ఘళ్ళుమంటే..కౌగిలలో ఇల్లు కట్టుకోవాలి

సినిమా:- జేగంటలు
సగీతం:- పుహళేంది
గానం:- పి.సుశీల, బాలు

idi aamani saagE chaitraradham..idi rukmiNi ekkina poolaradham
manOvEgamuna..marO lOkamuna..parugulu teesE manOradham

panchaprANAla vENuvoodi kOyila pADAli..praNayAla panchamaswaram aalapinchAli
kRshNamma yamunalE daari choopAli..nA kRshNuDunna teerAlu chErukOvali
nIrenDa poolu peTTi..neelAla kOka chuTTi..nuvvostE bRndAvanAla navvAli

ala nelavanka pallakilo saagipOvAli..manavanka taaralinka tErichooDAli
kosamerupula mutyAlahaaramEyAli..nA valapalE ninnu nEnu allukOvAli
naa gunDe jaLLumanTE..guDiganTa ghaLLumanTE..kougilalO illu kaTTukOvAli

sinimA:- jEganTalu
sageetam:- puhaLEndi
gAnam:- p.suSeela, bAlu 

Labels: , ,


 
i live for you అన్నది ప్రేమ
i die for you అన్నది ప్రేమ
నా పంచప్రాణాల పల్లవే ప్రేమ..ఆరారు కాలాల అల్లికే ప్రేమ
ప్రేమే నీ తోడు..ప్రేమించి చూడు
ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిపి

చిరునవ్వే విరిజల్లయినా..అందాలే హరివిల్లయినా..ఈ ప్రేమ వర్ణాలతోనే
కౌగిల్లే కరిగిస్తున్నా..కసికళ్ళే కాట్టేస్తున్నా..ఈ ప్రేమ బాణాలతోనే
ఏ జన్మగంధాలు తీసిందీ ప్రేమ..
నీ మౌనలా నా గానాల కళ్యాణాల పందిల్లోన

వేదంలా మంత్రిస్తున్నా..వెన్నేలా మనసిస్తున్నా..ఈ ప్రేమ నీరాజనాలే
అనురాగాం ముద్దిస్తున్నా..అద్వైతం సిద్దిస్తున్నా..ఈ ప్రేమ ఆరాధనేలే
ధర్మార్ధకామాలు దాటింది ప్రేమ
నీలోనేను నాలోనువ్వు జీవించేటి సందిట్లోన

సినిమా:- ప్రేమ ఖైదీ
సంగీతం:- రాజన్ నాగేంద్ర
గానం:- బాలు, చిత్ర

#i live for you# annadi prEma
#i die for you# annadi prEma
naa panchaprANAla pallavE prEma..aaraaru kAlAla allikE prEma
prEmE nee tODu..prEminchi chooDu
ee prEma vEdAla SRtilO layagA kalipi

chirunavvE virijallayinA..andAlE harivillayinA..ee prEma varNAlatOnE
kougillE karigistunnA..kasikaLLE kATTEstunnA..ee prEma baaNAlatOnE
E janmagandhAlu teesindI prEma..
nee mounalA naa gAnAla kaLyANAla pandillOna

vEdamlA mantristunnA..vennElA manasistunnA..ee prEma neerAjanAlE
anurAgAm muddistunnA..advaitam siddistunnA..ee prEma aarAdhanElE
dharmArdhakAmAlu daaTindi prEma
neelOnEnu naalOnuvvu jeevinchETi sandiTlOna

sinimA:- prEma khaidI
sangeetam:- rAjan nAgEndra
gaanam:- bAlu, chitra 

Labels: , ,


 
నవ్వరనవ్వు నా సామిరంగా.అర్రే నవ్వరనవ్వు నా సామిరంగా
అందని పువ్వు, కోరినందుకు నువ్వు
లవ్వాటలో నువ్వోడినా, నీ కన్నీటిలోనే తానుండదా

కాలానికి ఈ ఆట కొత్త కాదురా..గాలానికి ఈ చేప తప్పుకోదురా
నవ్వరా రంగా..ఇది లవ్వురా రంగా
ఏనాడు గెలిచేను, మొన్న నిన్న నేడు రేపు తానోడి నిలిచేనురా
ఏ ప్రేమను కన్నా కలయిక సున్నా, తీయ్యని తీరని కలరన్నా

నీ ప్రేమ పామై కాటేసినాదిరా..పోట్రాము మందేసి విషంలాగరా
ముల్లుకి ముల్లే మందురా రంగా
బాటిల్నే ప్రేమిస్తే దగా, వగా, పగా లేదు..నీ జంట వీడిపోదురా
ఏ మెత్తని కన్నె కత్తులకన్నా నమ్మకమైనది మత్తేరా

సినిమా:- గోపాలరావుగారి అబ్బాయి
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం@- ఇళయరాజా
గానం:- బాలు

navvaranavvu naa saamirangA.arrE navvaranavvu naa saamirangA
andani puvvu, kOrinanduku nuvvu
lavvATalO nuvvODinA, nee kannITilOnE taanunDadaa

kAlAniki ee ATa kotta kaadurA..gAlAniki ee chEpa tappukOduraa
navvaraa rangA..idi lavvurA rangA
EnaaDu gelichEnu, monna ninna nEDu rEpu taanODi nilichEnuraa
E prEmanu kannA kalayika sunnaa, teeyyani teerani kalarannA

nI prEma paamai kATEsinaadirA..pOTraamu mandEsi vishamlaagaraa
mulluki mullE mandurA rangA
baaTilnE prEmistE dagA, vagA, pagA lEdu..nee janTa veeDipOduraa
E mettani kanne kattulakannaa nammakamainadi mattErA

sinimA:- gOpAlarAvugaari abbAyi
saahityam:- sirivennela
sangeetam@- iLayarAjA
gaanam:- bAlu

Labels: , , ,


 
సిరిసిరిపూల చెల్లాయిపాప సీమంతమీనాడే
పులకల కోమ్మా, పుణ్యాల రెమ్మా పేరంటేమీనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈమాట
ఊగక మన ఊయల అలిగింది ఈపూట

మీ అందాలలో నెలవంకా..ఈ నేల వంక వచ్చేనా
శృంగారాలకే శలవింక..జోలాలీలకే నిదురించేనా
పెళ్ళినాటి కుంగిబాటు తల్లినాడు సాగునా
అమ్మచాటు బిడ్డ ముందు అయ్యగారికి ఇవ్వనా
కలలే కన్నారు కమ్మగా..ఇదిగో మీ కానుక
చిలికే వలపే మొలకై మొలిచే కనుపాపలా, కనిపించేలే
కలికి చిలక వొడినే అలికే అనురాగమే, వినిపించెలే  

మా సంసారమే మధుగీతం..పూసే యవ్వన వన జాగాలే
పిల్లాపాపలా అనుభందం..దాచేసిందిలే తొలి బృందాలే
గోకులాన పుట్టినోడు కొంగుచాటు కృష్ణుడే
నందనాల అందమంతా బాలకృష్ణుడొక్కడే  
యెదలో ఉన్నాడు జీవుడు..ఎదురైతే దేవుడు
పలికే మురళి, తలపై నెమలి అది ఆటగా ఇది పాటగా

సినిమా:- గండీవం
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- ఎం.ఎం.కీరవాణి
గానం:- బాలు, చిత్ర, కీరవాణి

sirisiripoola chellAyipaapa seemantameenADE
pulakala kOmmA, puNyAla remmA pEranTEmeenADE
aaSagaa madhumaasamE aDigindi eemaaTa
oogaka mana ooyala aligindi eepooTa

mee andaalalO nelavankA..ee nEla vanka vacchEnA
SRngAraalakE Salavinka..jOlAleelakE nidurinchEnA
peLLinATi kungibATu tallinADu saagunA
ammachaaTu biDDa mundu ayyagAriki ivvanA
kalalE kannAru kammagA..idigO mee kAnuka
chilikE valapE molakai molichE kanupApalA, kanipinchElE
kaliki chilaka voDinE alikE anurAgamE, vinipinchelE  

mA samsAramE madhugeetam..poosE yavvana vana jaagaalE
pillApaapalA anubhandam..daachEsindilE toli bRndAlE
gOkulAna puTTinODu konguchaaTu kRshNuDE
nandanAla andamantA bAlakRshNuDokkaDE  
yedalO unnADu jeevuDu..eduraitE dEvuDu
palikE muraLi, talapai nemali adi aaTagA idi paaTagA

sinimA:- ganDeevam
saahityam:- vETUri
sangeetam:- m.m.keeravANi
gaanam:- bAlu, chitra, keeravANi

Labels: , , ,


 
ఏవో ఏవో ఆశించావు..ఎమిటి చివరకు సాధించావు
ఆకాశాలకు వేసిన నిచ్చెన అనుకోకుండా విరిగింది
ఆవేశం పలుదోవలు తీస్తే అంధకారమే మిగిలింది
అహా వింత పయనం..అయ్యో ఎంత పతనం

కన్నుమిన్ను కనకుండా, ఎవ్వరెన్ని చెప్పినా వినకుండా
అయ్యినవారినే కాదన్నావు, నీ పెడదారే నీదన్నావు
మిసమిసలాడే పూలమాదిరిగా పసిరిక పామును మెడను దాల్చగా
ఫలితం తెలిసివచ్చింది..ప్రళయం ముంచుకొచ్చింది

జీవితమన్నది ప్రవాహమే, అది గట్టుదాటితే ప్రమాదమే
హద్దులోనే అందం వుంది, అయినవారికి ఆనందం వుంది
తెలుపునలుపు తేడా తెలిసి, కలలే భ్రమలై కరిగేసరికి
తరుణం చేయిజారింది, సమయం మించిపోయింది

సినిమా:- ఇల్లే స్వర్గం
సాహిత్యం:- శ్రీ శ్రీ
సంగీతం:- రమేశ్ నాయిడు
గానం:- బాలు

EvO EvO aaSinchAvu..emiTi chivaraku saadhinchAvu
aakASAlaku vEsina nicchena anukOkunDA virigindi
aavESam paludOvalu teestE andhakAramE migilindi
ahaa vinta payanam..ayyO enta patanam

kannuminnu kanakunDA, evvarenni cheppinA vinakunDA
ayyinavArinE kaadannaavu, nee peDadaarE needannaavu
misamisalADE poolamaadirigA pasirika paamunu meDanu daalchagA
phalitam telisivacchindi..praLayam munchukocchindi

jeevitamannadi pravAhamE, adi gaTTudaaTitE pramAdamE
haddulOnE andam vundi, ayinavAriki Anandam vundi
telupunalupu tEDA telisi, kalalE bhramalai karigEsariki
taruNam chEyijaarindi, samayam minchipOyindi

sinimA:- illE swargam
saahityam:- SrI SrI
sangeetam:- ramEShnAiDu
gaanam:- bAlu 

Labels: , ,


Tuesday, May 1, 2018

 
గాయకుడ్ని కాను..నే నాయకుడ్ని కాను
మనిషిగ జీవించే ప్రేమికుడ్ని నేను..ఆ ప్రేమకే తలవంచే మానవుడ్ని నేను


కరిగి కరిగిపోతున్నా కలలంటే మోజువిరిగి విరిగిపడుతున్నా అలలంటే మోజు
ఇంత హృదయముంది ఎలా దాచుకోను
ఈ లోకాన్నే ప్రేమించక ఎలా ఎలా ఎలా ఊరుకోను

పూలు కోరుకుంటే ముల్లు కలిసెను
చెలిమి కోరుకుంటే చేదు మిగిలెను
మనసు గాయపడితే ఎల మరచిపోను
కన్నీటికి కాలానికి ఎలా ఎలా ఎలా లొంగిపోను

సినిమా:- మంచి మనసు
సంగీతం:- టి.చలపతిరావు
గానం:- బాలు

gaayakuDni kaanu..nE naayakuDni kaanu
manishiga jeevinchE prEmikuDni nEnu..aa prEmakE talavanchE maanavuDni nEnu

karigi karigipOtunnA kalalanTE mOju
virigi virigipaDutunnA alalanTE mOju
inta hRdayamundi elA daachukOnu
ee lOkaannE prEminchaka elA elA elA oorukOnu

poolu kOrukunTE mullu kalisenu
chelimi kOrukunTE chEdu migilenu
manasu gaayapaDitE ela marachipOnu
kannITiki kaalaaniki elA elA elA longipOnu

sinimA:- manchi manasu
sangeetam:- Tichalapati rAo
gaanam:- bAlu  

Labels: ,


 
చీకటి విచ్చునులే..వెన్నెల వచ్చునులే
ఎప్పుడో ఒకసారి..ఎదో ఒకసారి దొరుకునులే బాటసారి

అయినవాళ్ళు లేరని దిగులుచెందకోయి
ఉన్నవాళ్ళే నావాళ్ళని అనుకోవలనోయి
స్వేచ్చగా దిక్కులేని పక్షులు విహరించవా
హాయిగా నోరులేని పశువులు జీవించవా
భయమెందుకు..పద ముందుకు..ఓయి బాటసారి

ఆశతోటి లోకమంత బ్రతుకుతుందిరా
అందులోనే కధంతా తిరుగుతుందిరా
కష్టానికి సౌఖ్యానికి లంకె ఉందిరా
ఈ కాలచక్రమును ఆపగా ఎవరితరమురా
భయమెందుకు..పద ముందుకు..ఓయి బాటసారి

సినిమా:- పొట్టి ప్లీడర్
సాహిత్యం:- శ్రీ శ్రీ
సంగీతం:- కోదండపాణి
గానం:- ఘంటసాల

cheekaTi vicchunulE..vennela vacchunulE
eppuDO okasAri..edO okasaari dorukunulE baaTasAri

ayinavALLu lErani diguluchendakOyi
unnavALLE naavALLani anukOvalanOyi
swEcchagA dikkulEni pakshulu viharinchavA
haayigA nOrulEni paSuvulu jeevinchavA
bhayamenduku..pada munduku..Oyi baaTasAri

aaSatOTi lOkamanta bratukutundirA
andulOnE kadhantA tirugutundirA
kashTAniki soukhyAniki lanke undirA
ee kaalachakramunu aapagaa evaritaramurA
bhayamenduku..pada munduku..Oyi baaTasAri

sinimA:- poTTi pleeDar
saahityam:- SrI SrI
sangeetam:- kOdanDapANi
gaanam:- ghanTasAla 

Labels: , , ,


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]