Tuesday, May 8, 2018

 
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
అది ఈనాడైనా ఏనాడైనా నీకే నీకే అంకితం

తెరచిన నా కన్నులలో ఎప్పుడూ నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎప్పుడూ నీ కలలదీపమే
కనులే కలలై, కలలే కనులై
చూసిన అందాలు, అనుబంధాలు అవి నీకే నీకే అంకితం

నిండిన నా గుండెలలో ఎప్పుడూ నీ ధ్యానమే
పండిన ఆ ధ్యానంలో ఎప్పుడూ నీ ప్రణయగానమే
ధ్యానమే గానమై, గానమే ప్రాణమై
పలికిన రాగాలు, అనురాగాలు అవి నీకే నీకే అంకితం

సినిమా:- అర్ధాంగి
సాహిత్త్యం:- సినారె
సంగీతం:- టి.చలపతిరావు
గానం:- పి.సుశీల


nA manasE oka tellani kAgitam
nee valapE toli vennela santakam
adi eenADainA EnADainA neekE neekE ankitam

terachina naa kannulalO eppuDU nee roopamE
moosina naa kannulalO eppuDU nee kalaladeepamE
kanulE kalalai, kalalE kanulai
choosina andAlu, anubandhAlu avi neekE neekE ankitam

ninDina naa gunDelalO eppuDU nee dhyAnamE
panDina aa dhyAnamlO eppuDU nee praNayagAnamE
dhyAnamE gAnamai, gAnamE prANamai
palikina rAgAlu, anurAgAlu avi neekE neekE ankitam

sinimA:- ardhAngi
saahittyam:- sinAre
sangeetam:- T.chalapatirAvu
gaanam:- p.suSeela 

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]