Thursday, November 30, 2006

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-31

సాహిత్యం:- జొన్నవిత్తుల
సంగీతం:- వందేమాతరం శ్రీనివాస్
గానం:- స్వర్ణలత, సుజాత

పల్లవి
సిరుల నొసగు సుఖశాంతులను కూర్చును శిరిడి సాయి కధ
మధుర మధుర మహిమాన్విత బొధ సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ

చరణం
శిరిడీ గ్రామంలో..ఒక బాలుని రూపంలో
వేప చెట్టు కింద..వేదాంతిగా కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
అనందమే ఆహారం..చేదు చెట్టు నీడయె గురుపీఠం
ఏండకు వానకు..ఈ చెట్టుకిందనే ఉండకు
సాయి.సాయి రా మసీదుకు అన్న మహల్సాపతి పిలుపుకు
మసిదుకు మారను సాయిఅదే అయ్యినది ద్వారకామాయి
అక్కడ అందరు బాయి బాయి
బాబా బొధలే నిలయమనోయి

చరణం
ఖూరను, బైబిలు, గీత ఒకటని
కులమతం భేదం వద్దని
గాలి వాననొక క్షణమున ఆపే
ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులుగా చేసే నీటీ దీపమలు వెలిగించే
పచ్చి కుండలో నీటిని తెచ్చి..పూల మొక్కలకు పోసి
లెండీ వనం పెంచి..అఖండ జ్యొతిని వెలిగించె

కప్పకు పాముకు స్నేహం కలిపె
బల్లి బాషకు అర్ధం తెలిపె

ఆర్తుల రోగలు తనుహరియించె
భక్తుల భాదలు తాను భరించె

ప్రేమ సహనం రెండువైపుల ఉన్న నాణెం గురుదక్షిణ అడిగె
మరణం జీవికి మార్పని తెలిపె
మరణించి తను మరల బ్రతికె
సాయిరాం..సాయిరాం..సాయిరాం..
సాయిరాం..సాయిరాం..సాయిరాం..
నీదని నాదని అనుకోవద్దని
ధునిలొ ఊది విభూధిగ నిచ్చె
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు
చావడి ఉత్స్తవమై సాగగా
కంకడ హారతులందుకొని
కలి పాపలను కడుగగా
సకల దేవత స్వరూపుడై
వేద శాస్త్రముల కతీతుడై
సద్గురువై..జగద్గురువై
సత్యం చాటె దత్తాత్రేయుడై
జీవన సహచరి అని చాటిన తన ఇటుకరాయి
త్రుటిలోన పగులగా
పరిపూర్ణుడై..గురుపూర్ణిమై
భక్తుల మనసున చిరంజీవై
దేహం విడిచెను సాయి
సమాధి అయ్యెను సాయి
సాయిరాం..సాయిరాం..సాయిరాం..
సాయిరాం..సాయిరాం..సాయిరాం..

Tuesday, November 28, 2006

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-30

సాహిత్యం:- ???
సంగీతం:- సత్యం
గానం:- బాలు

పల్లవి
మంచిని సమాధి చేస్తారా
ఇది మనుషులు చెసే పనియెనా
మనలో పాపం చెయ్యని వాడు ఎవ్వరో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవ్వరొ చూపండి..

చరణం
కత్తితో చెధించలేనిది..కరుణతో చెధించాలి
కక్షతో కాని పని..క్షమాబిక్షతో సాధించాలి
తెలిసి తెలియక కాలు జారితే
తెలిసి తెలియక కాలు జారితే
చెయూత నిచ్చి నిలపాలి
మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి
లోపాలు లేని వారు ఎవరో చూపండి

చరణం
గుడులలో లింగాలను మెక్కే బడా భక్తులు కొందరు
ముసుగులో మోసాలు చెసే మహా వ్యక్తులు కొందరు
ఆకలి తీరక నేరం చెసే
ఆకలి తీరక నేరం చెసే..ఆభాగ్య జీవులు కొందరు
మనలో నేరం చెయ్యని వాడు ఎవరో చెప్పండి
ఏ దోషం లేని వాడు ఎవ్వరొ చూపండి..

చరణం
తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి
మరపు రాని గుణపాఠం పది మందిలో నెర్పించాలి
అయితేఎన్నడు పాపం చెయ్యని వాడు ముందుగ రాయి విసరాలి
మీలో పాపం చెయ్యని వాడే ఆ రాయి విసరాలి
ఏ లోపం లెని వాడే ఆ శిక్ష విధించాలి

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-29

సాహిత్యం:- ???
సంగీతం:- సత్యం
గానం:- సుశీల,బాలు

పల్లవి
మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది
మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది
ఎన్నొ ఎళ్ళకు మా ఇంట..ఎన్నొ ఎళ్ళకు మా ఇంట
పండినది ఈ నోముల పంట

చరణం
ముద్దు ముచ్చట మూట గట్టుకొని వచ్చెడు
ఆ మురిపాలన్ని అందరికి పంచి ఇస్తాడు
కోదండరాముని కోండంత దయ వలన
కోదండరాముని కోండంత దయ వలన
కొత్త పెత్తందారు నేడు వెలిసాడు

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-28

సాహిత్యం:- ???
సంగీతం:- సత్యం
గానం:- సుశీల,బాలు

పల్లవి
వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చె పున్నమి రోజు
దీపావళి రోజు..దీపావళి రోజు..

చరణం
పెద్దలంతా పిల్లలుగా మారే రోజు
పల్లెదో పట్టణమెదో తెలియని రోజు
పల్లెదో పట్టణమెదో తెలియని రోజు
దీపావళి రోజు..దీపావళి రోజు..
వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు

చరణం
చంటి పాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు
చంటి పాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు
మింట నున్న తారకలు ఇంటింట వెలిగే రోజు
మింట నున్న తారకలు ఇంటింట వెలిగే దీపావళి రోజు..
దీపావళి రోజు..వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు

చరణం
జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది
గువ్వలే బ్రతకాలని తారజువ్వ చెబుతుంది
నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని
నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని
తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-27

సాహిత్యం:- ???
సంగీతం:- మహదేవన్
గానం:- సుశీల

పల్లవి
దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హ్రుదయం ఆభరణం
హ్రుదయానికి ఏనటికి తరగని సుగుణం ఆభరణం

చరణం
నిండుగ పారే ఏరు..తన నీటిని తానే తాగదు
జగతిని చూపే కన్ను..తన ఉనికిని తానే చూడదు
పరుల కోసం బ్రతికే మనిషి
తన బాగు తానే కొరడు

చరణం
తాజ్ మహలొ కురిసే వెన్నెల..పూరి గుడిసెపై పడదా
బ్రుందావనిలొ విరిసె మల్లిక..పేద ముంగిట విరియదా
మంచితనం పంచె వారికి..అంతరాలతో పని ఉంధా

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-26

సాహిత్యం:- వేటూరి

సంగీతం:- మహదేవన్

గానం:- బాలు

పల్లవి

చేతికి గాజులా..

కంటికి కాటుకలా

నుదిటికి తిలకంలా

రాధకు మాధవుదు


చరణం

మానసమున నీ ప్రణయము మారు మ్రోగగా

కావ్యగాన మాలపించి కవి నేనైతి

మధుమాసం చెలి మోమున విరబూయగనే

భావరాగ తాళమున మేలవించితి

ఏటికి కెరటంలా

పాటకు చరణంలా

సీతకు రాముడిలా

రాధకు మాధవుదు


చరణం

పూల పరిమళాల గాలి పలుకరించగా

నీలి నీలి మేఘమాల పరవశించెను

నవనీతం చెలి హ్రుదయం నను చేరగనే

అతిశయమున బ్రతుకు వీణ శ్రుతులు చేసెను

రాత్రికి జబిలిలా

పగటికి సుర్యుడిలా

గౌరికి ఈసుడిలా

రాధకు మాధవుదు


Monday, November 27, 2006

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-25

పల్లవి
నవ్వు వచ్చిందంటే కిల కిల
ఎడుపొచ్చిందంటే వల వల
గోదారి పాడింది గల గల
దాని మీద నీరెండ మిల మిల మిల

చరణం
నది నిండా నీళ్ళూ ఉన్నా
మనకెంత ప్రాప్తమన్నా
కడవైతే కడవెడు నీళ్ళే
గరిటైతే గరిటెడు నీళ్ళే
ఎవరెంత చేసుకుంటే
అంతే కాదా దక్కేది

చరణం
ధర తక్కువ బంగారనికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారనికి గొతులెక్కువ
కొత్త మతం పుచ్చుకుంటె గుట్టులెక్కువ
చేతకానమ్మకే చెష్టలెక్కువ
చెల్లని రూపయికే గీతలెక్కువ

చరణం
తమ సొమ్ము సోమవారం..ఒంటి పొద్దునుంటారు
మంది సొమ్ము మంగళవారం...ముప్పెదుల్లా తింటారు
పరుల కింత పెట్టినదే..పరలోకం పెట్టుబడి

నవ్వు వచ్చిందంటే కిల కిల
ఎడుపొచ్చిందంటే వల వల
గోదారి పాడింది గల గల
కధలు చెప్పింది ఇలా ఇలా ఇలా

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-24

సాహిత్యం:- ???????

సంగీతం:- చక్రవర్తి

గానం:- బాలు

పల్లవి

ఎవరికి వారే యమునా తీరే

ఎక్కడొ పుడతారు..ఎక్కడొ పెరుగుతారు

ఎవ్వరికీ చెప్పకుండ పొతూనె ఉంటారు

చరణం

రాజ్యాలను ఏలినారు వేన వేల రాజులు

చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు

కట్టించిన కోటలన్ని మిగిలిపోయెను

కట్టుకున్న మహరాజులు తరలిపోయెను తరలిపోయెను

చరణం

ఊపిరి చొరబడితె పుట్టాడంటారు

ఊపిరి నిలబడితె పొయాడంటారు

గాలివాటు బ్రతుకులు..వఠ్ఠి నీటి బుడగలు

నిజమింతే తెలుసుకో...నిజమింతే తెలుసుకో

కలత మరచి నిదురపొ...కలత మరచి నిదురపొ


 

నాకు నచ్చిన తెలుగు పాటలు-23

సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో..సాగేటి ఆటలో
ఆవేశాలు, ఋణపాశాలు తెంచే వేళలో

గుండెలే బండగా మరిపొయేటి స్వార్ధం
తల్లిని తాళిని దబ్బుతో తూచు బేరం
రక్తమే నీరుగ తెల్లబోయెటి పంతం
ఇంటికి మంటికి ఎకధారైన శోకం
తలపైనీ గీత ఇలపైనే వెలసిందా
రాజులే బంటుగా మారు ఈ క్రీడలో
జీవులే పావులైపోవు ఈ ఖేళ్ళిలొ
ధనమే తల్లి, ధనమే తండ్రి, ధనమే దైవమా?

కాలిలో ముళ్ళుకి కంట నీరేట్టు కన్ను
కంటిలో నలుసిని కంట కనిపెట్టు చెల్లి
రేఖలు, గీతలు చూడదే ఏ రక్తబంధం
ఏ పగా చాలదు ఆపగా ప్రెమపాశం
గడిలో ఇమిరెనా మదిలో గల మమకారం
పుణ్యమే పాపమై సాగు ఈ పోరులో
పాపకే పాలు కరువైన పట్టింపులో
ఏ దైవాలు కాదంటాయి మదిలో ప్రేమను

సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక రణరంగం
ప్రాణాలూ తీసినా, పాశాలూ తీరునా
అదుపు లేదు, అజ్ఞ లేదు మమకారాలలో

కౌగిలే కాపురం కాదులే పిచ్చితల్లి
మల్లెల మంచమే మందిరం కాదు చెల్లి
తేనెతో దాహము తీర్చదేనాడు చెల్లి
త్యాగమే ఊపిరై ఆడదైయేను తల్లి
కామానికి దాసొహం కారాదే సంసారం
కాచుకో భర్తనే కంటి పాపాయిగా
నేర్చుకో ప్రేమనే చంటి పాపాయిగా
మన్నించేది, మనసిచ్చేది మగడే సోదరి

సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక గుణపాఠం
ప్రేమే సంసారము, ప్రేమే వేదాంతాము
వయస్సు కాదు, వాంచ కాదు, మనసే జీవితం

చుక్కలు, జాబిలి చూసి నవ్వేటి కావ్యం
నింగికే నిచ్చెన వేసుకుంటుంది బాల్యం
తారపై కోరిక తప్పురా చిట్టీ నేస్తం
రెక్కలే రానిదే ఎగరలేనెదు భ్రమరం
వినరా ఒ సుమతి..పొరాదు ఉన్న మతి
పాత పాఠాలనే దిద్దుకో ముందుగా
నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా
నిను పెంచేది , గెలిపించేది చదువే నాయనా

సంసారం ఒక చదరంగం
చెరింగిందా నీ చిరుస్వప్నం

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-22

సాహిత్యం:- ??????
సంగీతం:- సాలూరు రాజేశ్వరావు
గానం:- సుశీల

పల్లవి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి

చరణం
కళకళలాడే నీ కళ్ళు దేవుని ఇల్లమ్మా
కిలకిల నవ్వే నీ మోమే ముద్దుల మూటమ్మా
నీ కోసమే నే జీవించాలి
నీవె పెరిగి నా ఆశెలు తీర్చాలి

చరణం
ఆటలలో చదువులలో మేటిగా రావాలి
మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి
చీకటి హ్రుదయంలొ వెన్నెల కాయాలి
నా బంగారు కలలే నిజమై నిలవాలి

చరణం
నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాధుడె కావాలి
నీ సంసారం పూల నావలా సాగిపొవాలి
నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి
నిన్నే తలచి నే పొంగిపోవాలి

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-21

సాహిత్యం:- ??????
సంగీతం:- రమెష్ నాయిడు
గానం:- సుశీల, బాలు


పల్లవి
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు

చరణం
మల్లెల కన్నీరు చూడు..మంచులా కురిసింది
లేత ఎండల నీడలలో నీ నవ్వే కనిపించింది
వేసారినా బాటలలొ..వేసవి నిట్టూర్పులలో
వేసారినా బాటలలొ..వేసవి నిట్టూర్పులలో
దొసిట నా ఆశలన్నీ..దోచి వెళ్ళిపొయావు

చరణం
ప్రాణాలన్ని నీకై చలి వేణువైనాయీ
ఊపిరి ఉయాలూగే ఎదే మూగ సన్నాయి
పసుపైనా కానీవా..పదాలంటుకొనీవాపాదాలకు
పారాణై పరవశించిపొనీవా...పలకరించిపొలెవా..

చరణం
వెకువంటి చీకటి మీద చందమామ జారింది
నీవు లేని వేదనలొనే నిశిరాతిరి నిట్టూర్చింది
తెల్లారని రాతిరిలా..వెకువలో వెన్నెలలా
తెల్లారని రాతిరిలా..వెకువలో వెన్నెలలా
జ్ణపకాల వెళ్ళువలోనే..కరిగి చెరిగి పొతున్నాను

Sunday, November 26, 2006

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-20

సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- S.A.రాజ్ కుమార్
గానం:- బాలు

పల్లవి
పాటల పల్లకివై ఊరెగే చిరుగాలి
కంటికి కనపడవే నిన్నెక్కెడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాశకి శ్వాశ ఆడదే
నిన్నె చెరుకొనిదే గుండెకి సందడుండదె
నీ కొసమే అన్వేషణ
నీ రూపు రేఖలెమో ఎవరిని అడగాలి

చరణం
నిలాల కనుపాప లొకాన్ని చూస్తుంది
తన రూపు తానెప్పుడు చూపించలెనంది
అద్దంలా మెరిసే ఒక హ్రుదయం కావాలి
ఆ మదిలొ వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనుక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది
రెప్పలు తెరిచే మెలకువలొ కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కల్లు ఎవరిని అడగాలి

చరణం
పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించె భావాల ఉనికేది
వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గూటిని చూపుమా
ఈ నిమిషంలొ నీ రాగం నా మది తాకింది
తనలొ నన్నె కరిగించి పయనిస్తూ ఊంది

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-19

సాహిత్యం:- ఆరుద్ర
సంగీతం:- మహదేవన్
గానం:- బాలు

పల్లవి
ఎమయ్యా ఓ రామయ్య
ఎలా సేవించాలయ్యా..నిను ఏమని కీర్తించాలయ్యా

చరణం
పదములు పడదామనుకుంటే..మారుతి చరణాలు వదలడు
ఫలములు తినిపించాలంటే..పాపం సబరికి బెదురు
పాదం కడగాలనుకుంటే..పదపడి గుహుడే తయారు
ప్రాణాలిద్దాం అనుకుంటే పక్షిగా జటాయువు ఉన్నాడు

చరణం
కమ్మని చరితం రాద్దామనుకుంటే..కవి వాల్మీకిని కానయ్యా
గానంతొ కొలువాలంటే ఘన త్యాగయ్యను కానయ్య
ఆశతో కొవెల కడదామంటే..తహసిల్దారును కానయ్య
ఆఖరికి మనిసిద్దాం అనుకుంటే..అది ఎనాడో నీదయ్య

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-18

సాహిత్యం:- ????
సంగీతం:- మహదేవన్
గానం:- సుశీల,బాలు

పల్లవి
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు

చరణం
కరి మబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలొ..మౌనమే వెలుగు
దహించే బాధల మధ్యన..సహనమే వెలుగు

చరణం
కడలి నడుమ పడవ మునిగితే..కడదాకా ఈదాలి
నీళ్ళు లేని ఎడారిలో..కన్నీరైనా తాగి బ్రతకాలి
ఏ తొడు లేని నాడు నీ నీడే నీకు తోడు
జగమంత దగా చేసిన..చిగురంత ఆశను చూడు

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-17

సాహిత్యం:- ????
సంగీతం:- మహదేవన్
గానం:- సుశీల

పల్లవి
నిదురించె తొటలొకి పాట ఒకటి వచ్చింది
కన్నులొ నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

చరణం
రమ్యంగా కుటీరాన రంగవలులు అల్లింది
దీనురాలి గూటిలొన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులొ ఒక స్వరం కలిపి నిలిచింది
ఆకు రాలు అడవికి ఒక ఆమని దయచేసింది

చరణం
విఫలమైన నా కొర్కెలు వెలాడే గుమ్మంలొ
ఆశల అడుగులు వినపడి..అంతలో పోయాయి
కొమ్మలొ పక్షులారా..గగనంలో మబ్బులారా
నది కొసుకుపొతున్న నావను ఆపండి
రేవు భావురుమంటొందని..నావకు చెప్పండి

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-16

సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- సత్యం
గానం:- బాలు

పల్లవి
ఈ అనంత కాల గమనంలో
ఈ రవ్వంత జీవన పయనంలొ
అందరు నీవారు..చివరకు మిగిలెదవరు లేరు

చరణం
నీ కడుపున చీకటి దాచుకొని
కన్నీరే చమురుగ చేసికొని
నీ కొర్కెలు నిలువునా కాల్చుకొని
వెలుగును పంచావందరికి
నీ వేదన తెలిసింధెవరికి

చరణం
చేతికి తమ్ముడు అందోస్తాడని
చెట్టుకు తానొక వెరౌతాడని
చేసిన త్యగం చెయిదాటిందా
రెక్కలు వస్తే అంతేనమ్మా
నీ రెక్కలే నీకు శాశ్వతమమ్మా

చరణం
నీ అలసట తీర్చే ఓడి ఒకటుందని
నీ అనురగనికి గుడి తాననుకొని
వేచావమ్మా ఆశలు దాచుకొని..
దేవుడు తలుపులు మూసడా
నీ దీపం నేటితో కొండెక్కిందా

చరణం
అందరి నొసలు ఒకటేనమ్మా
అందరి రాతలు వెరౌనమ్మా
కొందరి బ్రతుకులు అందరి కోసమని
రాసినివాడికే తెలియాలి
కధ ముగింపు వాడె తెల్చాలి

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-15

సాహిత్యం:- ????
సంగీతం:- మహదేవన్
గానం:- బాలు

పల్లవి
వంశీక్రిష్ణ యదు వంశీక్రిష్ణ
గోపవనిత హ్రుదయ సరసి
రాజహంస క్రిష్ణ క్రిష్ణ

చరణం
పుట్టీంది రాజకుమారుడుగా
పెరిగింది గోపకిశొరుడుగా
తిరిగింది యమునాతీరంలొ ని
లిచింది గీతాసారంలొ

చరణం
ప్రాణులందరు వేణువులే
అవి పలికేది నీ రాగములే
పాడేది పాడించేది
ఆడేది ఆడించేది
ఒడేది ఒడించేది
అంతా నీవ్వెలె
అన్ని నీ లీలలే

చరణం
నొటిలొ ధరణి చూపిన క్రిష్ణ
గోటితొ గిరిని మోసిన క్రిష్ణ
ఆటగ రణము నడిపిన క్రిష్ణ
పాటగా బ్రతుకు గదిపిన క్రిష్ణ
కిల కిల మువ్వల ఖేళి క్రిష్ణ
తకధిమి తకధిమి తాండవ క్రిష్ణ
ఖేళి క్రిష్ణ...తాండవ క్రిష్ణ
ఖేళి క్రిష్ణ...తాండవ క్రిష్ణ

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-14

సాహిత్యం:- ????
సంగీతం:- మహదేవన్
గానం:- బాలు

జై భజరంగభళి
పల్లవి
నమో నమో హనుమంతా..మహిత గుణవంత
మహా బలవంత..స్వామి నీ ముందు మేమెంతా

చరణం
సూర్యుని మించును నీ తేజం
పవనుని మించును నీ వేగం
అగ్నిని మించును నీ రౌద్రం
అమ్రుతమయం నీ హ్రుదయం
ఓ సుజన మందార..ఓ దనుజ సమ్హరా
నీ దివ్య చరణం..పాప హరనం..స్వామి శరణం మమ్ము కపాడుమయా

చరణం
శ్రీ రామ కార్యం చెపట్టినావు
సీతమ్మ జాడ కనిపెట్టినావు
లంకినిని దెబ్బకు పడగొట్టినావు
అహ లంకాపురిని తగులబెట్టినావు
ఒంటి తలల రావణులు..ఊరూర ఉన్నారు
కంట కనిపెట్టీ..తోక చుట్టి..విసిరి కొట్టీ
మమ్ము కపాడుమయా

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-13

సాహిత్యం:- ????

సంగీతం:- చక్రవర్తి

గానం:- బాలు

పల్లవి
కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదం వెలుగు బాట
తెలుగువారు నవ జీవన నిర్మాతలని
తెలుగుజాతి సకలామనికె జ్యొతి అని

చరణం
కార్యసూరుడు వీరేశలింగం..కలం పట్టి పొరాడిన సింగం
దురాచాలను దురాగతాలను తుదముట్టించిన అగ్నితరంగం
అదుగొ అతడే వీరేశలింగం..

మగవాడేంతటి ముసలాడైన మళ్ళీ పెళ్ళికి అర్హత ఉంటే
బ్రతుకే తెలియని బాలవితంతువుకు ఎందుకు లెదా హక్కంటాను?
చెతికి గాజులు తొడిగాడు..చెదిరిన తిలకం దిద్దాడు
మోడు వారిన ఆద బ్రతుకున పసుపు కుంకుమ నిలిపాడు

చరణం
అడుగో అతడే గురజాడ

మంచి చెడ్డలు ఎంచి చూద లొకమందు రెందె కులములు
మంచి అన్నది మాల అయితే మాల నేనౌతాను

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-12

సాహిత్యం:- వెటూరి
సంగీతం:- మహదేవన్
గానం:- జానకి,బాలు

పల్లవి
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన

చరణం
తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా
ఎందుకుండవ్
కర్రావు కడుపున ఎర్రావు పుట్టద
ఏమో
తెల్లావు కడుపుల్లో కర్రావు లుండవా
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా
గోపయ్య ఆడున్న
గోపెమ్మ ఈడున్న
గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా
ఆ పొద్దు పొడిచేనా
ఈ పొద్దు గడిచేనా
ఎందువలన అంటే అందువలన
ఎందువలన అంటే దైవఘటన

చరణం
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
పాపం
అల్లనమోవికి తాకితే గేయాలు
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లనమోవికి తాకితే గేయాలు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా
ఈ కడిమి పూసేనా
ఆ కలిమి చూసేనా

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-11

సాహిత్యం:- వెటూరి
సంగీతం:- మహదేవన్
గానం:- జానకి,బాలు

పల్లవి
రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి మొహనమురళి
ఇదేనా ఆ మురళి

చరణం
కాళింది మడుగున కాళియును పడగల
ఆబాల గోపాల మాబాల గోపాలుని
కాళింది మడుగున కాళియును పడగల
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

చరణం
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవన రాగమై బ్రుదావన గీతమయి
జీవన రాగమై బ్రుదావన గీతమయి
కన్నుల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

వేణుగానలోలుని మురిపించిన రవళి నటనల సరళి ఆ నందనమురళి
ఇదేనా ఆ మురలి మువ్వల మురళి ఇదేనా ఆ మురలి

మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై..ఆ
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా..ఇదేనా ఆ మురళి

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-10

సాహిత్యం:- వెటూరి
సంగీతం:- మహదేవన్
గానం:- సుశీల,బాలు

పల్లవి
ఏ కులము నీదంటే గొకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

చరణం
ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే ఇన్ని మాటలు

చరణం
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సు అవుతాది
అన్ని వర్ణలకు ఒకటే ఇహము పరము ఉంటాది

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-9

సాహిత్యం:- ??????
సంగీతం:- చక్రవర్తి
గానం:- సుశీల,బాలు

పల్లవి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
తరతరలుగా మారని వాళ్ళను మీ తరమైనా మార్చాలి

మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మెప్పులకోసం దెప్పేవాలను మీ తరమైనా మార్చాలి

చరణం
అందరు దేవుని సంతతి కాదా
ఎందుకు తరతమ భేదాలు??

అందరి దేవుదు ఒకడే అయ్యితే
ఎందుకు కోటి రూపాలు?

అందరి రక్తం ఒకటే కాదా
ఎందుకు కులమత భేదలు??

అందరి రక్తం ఒకటే అయ్యితే
ఎందుకు రంగుల తేడాలు

చరణం
తెలిసి తెలిసి బురద నీటిలొ దిగుతరా ఎవరైనా?
ఆ బురదలొనే అందాల కమలము పుడుతుందని మరిచెరా?
కమలం కోసం బురదలొనే కాపురముండెది ఎవ్వరు?
మనసులొని బురద కడుగుకొని మనుషుల్లా బ్రతికేవారు

వారిదే ఈనాటి తరం ..వారిదే రానున్న యుగం
కాదనేవారు..ఇంకా కళ్ళు తెరవనివారు మారిపొక తప్పదులే

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-8

సాహిత్యం:- ??????
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

పల్లవి
తెల్ల కాగితం మనిషి జీవితం
ఒకో అక్షరం ప్రతి నిమిషం
చెయ్యి మారితే రాత మారుతుంది
చెయ్యి జారితే మచ్చ మిగులుతుంది

చరణం
బాష ఏది ఐనా చూసేందుకు అక్షరాలు కొన్నే
అక్షరాలు కొన్నైనా రసేందుకు భవాలు ఎన్నో
అనుకున్నవి రాయలేరు కొందరు
రాసినా చెయ్యలేరు కొందరు
చేసినా పొందలేరు కొందరు
పొందినా ఉందలేరు కొందరు

చరణం
బంగారం కురిసినా పట్టెందుకు చేతులు రెండే
చెతులెన్ని ఉన్నా తినడానికి నోరు ఒక్కటే
తినడానికి లెనివారు కొందరు
తిని అరిగించుకొలేనివారు కొందరు
ఉండి తినలేనివారు కొందరు
తిన్నా ఉండలెనివారు కొందరు

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-7

సాహిత్యం:- ??????
సంగీతం:- చక్రవర్తి
గానం:- జెసుదాస్, శైలజ

పల్లవి
ఓ బాటసారి ఇది జీవిత రహదారి
ఎంత దూరమో..ఎది అంతమో
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సోంతం కాదు ఇది

చరణం
ఎవరు ఎవరికి తొడౌతారో
ఎప్పుడెందుకు విడిపొతారో
మనసే చాలని ఉంటారో
మమతే కాదని వెళతారో
అడగదు ఎవ్వరిని..బదులే దొరకదని

చరణం
కడుపు తీపికి ఋజువేముంది
అంతకు మించిన నిజమేముంది
కాయే చెట్టుకు బరువైతే
చెట్టును భూమి మోస్తుందా
ఇప్పుడు తప్పును తెలుసుకొని
జరిగేదేమిటని
క్షమించదెవ్వరని


చరణం
పెంచుకుంటివి అనుబంధాన్ని
పెంచుకున్నదొక హ్రుదయం దాన్ని
అమ్మలిద్దరు వుంటారని అనుకొలెని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని
తల్లివి కాగలవా..తనయుడు కాగలడా?

చరణం
అడ్డ దారిలో వచ్చావమ్మా
అనుకోకుండా కలిసావమ్మ
ఆడదాని ఐశ్వర్యమేమిటో ఇప్పుడు తెలిసింది
కధ ముగిసేపొయింధి



 

నాకు నచ్చిన తెలుగు పాటలు-6

సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- శంకర్-గణేష్
గానం:- బాలు

పల్లవి
నేలమ్మ, నింగమ్మ, నీరమ్మ, నిప్పమ్మ, గాలమ్మ
కనరమ్మా..సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సొయగాల సంగమం

చరణం
కలికి కళ్ళలొ కలల మెరుపుతో
నువ్వు తెల్లబొదువే నిలాల గగనమా
చిలక సొంపులొ ఇంత మైకమాచిరుగాలి
నువ్వలా స్తంభించిపొకుమా
చెలియ తనువులో వేడి తగిలితే
చలికి వణకవా సుర్యబింబమా
ఆ మంచు మంటతో జాబిల్లిగా మారవా

చరణం
??????????????????????????
ఎడాదికొక్కటే వసంతమున్నది
ఋతువు మారినా చెదిరిపోనిధి
అమ్మాయి మేనిలొ అందల పెన్నిధి
తుళ్ళకే అలా గంగ వెల్లువ
సొగసు పొంగులో ఈమె సాటివా
ఆ మేని విరుపులు నీ వొంటికున్నవా?

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-5

సాహిత్యం:- ?????
సంగీతం:- మహదేవన్
గానం:- బాలు

పల్లవి
ఒకే కులం..ఒకే మతం..అందరు ఒకటే
అందరిని కాపాడె దేవుదు ఒక్కడే
అందులకే ఆతనికి తలవంచాలి
అనుదినం ఆ దేవుని పూజించాలి

చరణం
భగవంతుని ప్రతిరాపం కరుణ అందురు
ఆ కరుణతో భగవంతుని చూడమందురు
కరుణయె మనిసికి దేవుని వరము
అది పరుల ఎడల చూపినపుడె బ్రతుకు ధన్యము

చరణం
పాపాలకు వెనవేలు దారులున్నవి
ధర్మ గోపురానికి ఒక్కటె ద్వారమున్నది
నీతియె ఊపిరిగ నిలపాలి
న్యాయమే బాటగా సాగాలి

చరణం
చెడును చూడకు..చెడు పనులు చేయకు
చెడు పలుకులు నీ నోట మాటలాడకు
పగయే నీ శత్రువని నిజం తెలుసుకో
ప్రెమతో పగను గెలిచె బ్రతుకు దిద్దుకొ
మన బాపుజి మాట నిలుపుకో


 

నాకు నచ్చిన తెలుగు పాటలు-4

సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- హంసలేఖ
గానం:- బాలు, చిత్ర

పల్లవి
ఎవరో ఒకరు...ఎప్పుడొ అప్పుడు
నడువరా ముందుగా..అటో ఇటో ఎటోవైపు
మొదటి వాడు..ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు..ఎప్పుడు ఒంటరే మరి
వెనుక వచ్చు వాలకు బాట అయ్యినది

చరణం
కదలరు ఎవ్వరు వెకువ వచ్చినా
అనుకొని కోడి కూత నిదురపొదుగా..
జగతికి మెలుకొలుపు మానుకొదుగా..

మొదటి చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వానధార రాదుగు నేల దారికి.
ప్రాణమంటూ లేదుగా బ్రతకడానికి!!!

చరణం
చెదరకపోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి..దానికి లెక్క లెదు కాళ రాతిరి
పెదవి ప్రమిద నిలపిని నవ్వు జ్యొతిని
రెప్ప వెనుక ఆపని కంటి నీటిని
సాగలేక అగితే దారి తరుగునా..జాలి చూపి తీరమే దరికి చేరునా?

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-3

సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- S.A.రాజ్ కుమార్
గానం:- బాలు

పల్లవి
ఆలయాన హారతిలొ..ఆఖరి చితిమంటలలొ..
రెండిటిలో నిజానికి ఉన్నది ఒకతె అగ్ని గుణం
ప్రెమ అనే పదన ఉన్నది అరని అగ్ని కణం
దీపన నిలబెడుతుంధొ..తాపాన బలి పెడుతుంధొ..
అమ్రుతమో..హలహలమో...ఎమో ఈ ప్రెమగుణం
ఏ క్షణాన ఎలా మారునో ప్రెమించే హ్రుదయం

చరణం
ఎండమావిలొ ఎంత వెతికినా..నీటి చెమ్మ దొరికేనా..
గుండె బావిలొ ఉన్న ఆశె ఆవిరి అవ్తున్న.. ప్రపంచాన్ని మరిచెలా మంత్రించె ఒ ప్రేమ
ఎలా నిన్ను కనిపెట్టాలొ ఆచూకి ఇవ్వమ్మ!
నీ జడ తెలియని ప్రాణం..చెస్తొంది గగన ప్రయాణం
ఎదర ఉన్నధి నడి రేయి అన్నధి ఈ సంధ్య సమయం

ఏ క్షణాన ఎలా మారునో ప్రెమించే హ్రుదయం

చరణం
చరణం
సుర్యబింబమే అస్థమించనిధే..మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకొని కలవరించెనె కంటి పాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలొ మసి అయినా..
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన అగెనా..
పొందేది ఎది ఎమైనా..పొయింధి తిరిగి వచ్చెనా?
కంటి పాప కల అడిగింధి అని నిధురించెను నయనం

ఏ క్షణాన ఎలా మారునో ప్రెమించే హ్రుదయం

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-2

సాహిత్యం:- సిరివెన్నెల

సంగీతం:- మాధవపెద్ది సురెష్

గానం:- బాలు

పల్లవి

ఒ గమ్యమున్న చరణం

అది సవ్యమైన చలనం

గగననైనా ఎదురిదే

గువ్వలా సాగడం

ఏ దారి లేని పయనం

అది గాలి బాటు గమనం


చరణం

నేల తల్లి వడిలొన వున్న పసి గరిక అదురుతుందా!

ఎంత పెద్ద సుడిగాలికైన తల వంచి ఒదుగుతుంధా!

నీలి మబ్బులతో బేరమాడగల మర్రి కొమ్మ కూడా

పిల్ల గాలి కొన వెలు తగిలినా వనికి వూగిపొదా


బడబాగ్నితో కడుపు రగిలినా.. బయటపడని కడలి గుణం

పడమరలొ మునిగిన రవినే.. తూర్పున తెల్చే గొప్పతనం

ఒ మిణుగురంత మిగిలి వున్న చాలు.. చీకటి చీల్చే ఆశాకిరణం


చరణం

గద్దె నెక్కి గర్జించుతున్న రారాజు నీతి కూడా

తెగ విర్రవీగి పెడ దారి పడితే నడి వీధి పాలు కాగా

ఎటికొక్క అమవాసకైన దీపావళి ఒకటి రాదా

కటిక చీకటి కంటి కాటుకై కళలు దిద్ది పొదా..

దారం అధారం వదలి మిడిసిపడె గాలిపటం

యె తీరం చెరకె ఊరికె ఉరెగే వెర్రితనం

చీమంత చినుకులొ చలువదనం....ఊరంత బ్రతికె పచ్చదనం


 

నాకు నచ్చిన తెలుగు పాటలు-1

సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం :- మణిశర్మ
గానం :- మనో,మురళి

(pallavi)
బోడి చదువులు వేస్టు ..నీ బుర్రంత భొంచెస్తూ..
ఆడి చూదు క్రికెట్టు..టెందుల్కర్ అయ్యెటట్టూ..
ఒక ఫొజు కొట్టు..లక్షలు వచ్చి పదెటట్టు
ఆడిడాస్ బూట్లు తొడగవ..నీకు ఆరు కొట్లు..
ఎంత చదివితె సంపాదిస్తావు ఇంత గొప్ప అంతస్థు ..

-----------------------------------
(charanam-1)
చిరుపుంజిలొని చినుకంతైనా తడుస్తుందా నీ జుట్టు
తార్ ఎడారి గోలెందుకురా గోదారి ఒడ్డున ఉంటూ
వీరప్పన్ కొట్టేసి ఉంటాడు..అశొకుదు ఎప్పుడొ నాటిన చెట్ట్లు
పాత డేట్లు బట్టివెస్తూ అసలెంటి ఈ కుస్తీ పట్లు
IQ అంటె అర్ధం అతి తెలివికి తొలి మెట్టు
ఆడే పాడే ఈడును దానికి పెట్టకు తాకట్టు

-----------------------------------
(charanam-2)

లీకు వీరులకు ముందే తెలుసు..question paper గుట్టు

లొకజ్ఞానం కలిగినవాడే coaching centre పెట్టు

మర్కుల కోసం ఏడవలేదుర ఎదిగిన ఏ scientist

గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ intrest

నీక్కుడా ఉండే ఉంటుంది ఎదొ ఒక talent

నీకు నువ్వు boss అవాలంటె దాన్ని బయటపెట్టు

రేసుహర్సువై బ్రతుకును గెలిచే పరుగు మొదలుపెట్టు

-----------------------------------
(charanam-3)
రెండో ఎక్కం రాకపొయినా నీకేమిట్రా లోటు
caluculator చేపట్టు
bill కడితే నీ బెడ్రూంలొ వేస్తాడు భాసింపట్టు
సాక్షాత్తూ bill gates
పిచ్హొడెవడొ జుట్టును పీక్కొని ఎన్నొ కనిపెట్టు
పైసా ఉంటే అదే నీకు అన్ని కొనిపెట్టు
చదువు సంధ్య వదలి సన్నాసివి కమ్మట్టూ
సలహ ఇస్తునానుకుంటె అదే wrong route
బ్రతుకు బాటలొ ముందుకు నడపని బరువు మొయవద్దు

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]