Monday, November 27, 2006

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-23

సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో..సాగేటి ఆటలో
ఆవేశాలు, ఋణపాశాలు తెంచే వేళలో

గుండెలే బండగా మరిపొయేటి స్వార్ధం
తల్లిని తాళిని దబ్బుతో తూచు బేరం
రక్తమే నీరుగ తెల్లబోయెటి పంతం
ఇంటికి మంటికి ఎకధారైన శోకం
తలపైనీ గీత ఇలపైనే వెలసిందా
రాజులే బంటుగా మారు ఈ క్రీడలో
జీవులే పావులైపోవు ఈ ఖేళ్ళిలొ
ధనమే తల్లి, ధనమే తండ్రి, ధనమే దైవమా?

కాలిలో ముళ్ళుకి కంట నీరేట్టు కన్ను
కంటిలో నలుసిని కంట కనిపెట్టు చెల్లి
రేఖలు, గీతలు చూడదే ఏ రక్తబంధం
ఏ పగా చాలదు ఆపగా ప్రెమపాశం
గడిలో ఇమిరెనా మదిలో గల మమకారం
పుణ్యమే పాపమై సాగు ఈ పోరులో
పాపకే పాలు కరువైన పట్టింపులో
ఏ దైవాలు కాదంటాయి మదిలో ప్రేమను

సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక రణరంగం
ప్రాణాలూ తీసినా, పాశాలూ తీరునా
అదుపు లేదు, అజ్ఞ లేదు మమకారాలలో

కౌగిలే కాపురం కాదులే పిచ్చితల్లి
మల్లెల మంచమే మందిరం కాదు చెల్లి
తేనెతో దాహము తీర్చదేనాడు చెల్లి
త్యాగమే ఊపిరై ఆడదైయేను తల్లి
కామానికి దాసొహం కారాదే సంసారం
కాచుకో భర్తనే కంటి పాపాయిగా
నేర్చుకో ప్రేమనే చంటి పాపాయిగా
మన్నించేది, మనసిచ్చేది మగడే సోదరి

సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక గుణపాఠం
ప్రేమే సంసారము, ప్రేమే వేదాంతాము
వయస్సు కాదు, వాంచ కాదు, మనసే జీవితం

చుక్కలు, జాబిలి చూసి నవ్వేటి కావ్యం
నింగికే నిచ్చెన వేసుకుంటుంది బాల్యం
తారపై కోరిక తప్పురా చిట్టీ నేస్తం
రెక్కలే రానిదే ఎగరలేనెదు భ్రమరం
వినరా ఒ సుమతి..పొరాదు ఉన్న మతి
పాత పాఠాలనే దిద్దుకో ముందుగా
నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా
నిను పెంచేది , గెలిపించేది చదువే నాయనా

సంసారం ఒక చదరంగం
చెరింగిందా నీ చిరుస్వప్నం

Comments:
Hi sai,

Samsaram okka chadarangam song naaku fvt song. thanks for u r collection.
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]