Thursday, March 31, 2011

 
అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయా
ఆనందనిలయ వేదాంత హృదయ

ఆత్మదీపమే వెలిగించుమయా
అంధకారమే తొలగించుమయా
ఆనందనిలయ వేదాంత హృదయ
దీనజనావన దీక్షా కంకణ ధారనమే నీ ధర్మమయా
ఆనందనిలయ వేదాంత హృదయ
సిరులకు లొంగిన నరుడెంతుకయ్యా
పరులకు ఒదవని బ్రతుకెందుకయ్యా
ఆనందనిలయ వేదాంత హృదయ

కర్మయోగమే ఆదర్శమయా
జ్ఞానజ్యోతిని దర్శించుమయా
ఆనందనిలయ వేదాంత హృదయ
మానవసేవ మహాయజ్ఞమిది సమిధి నీవని తెలుయుమయా
ఆనందనిలయ వేదాంత హృదయ
కోవ్వెల శిలకు కొలుపెందుకయ్యా
నీ వెల తెలియని నీవెందుకయ్యా
ఆనందనిలయ వేదాంత హృదయ

సినిమా:- శుభోదయం
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- మహదెవన్
గానం:- బాలు

asatO mA sadgamaya
tamasO mA jyOtirgamayA
aanandanilaya vEdAnta hRdaya

AtmadeepamE veliginchumayA
andhakAramE tolaginchumayA
aanandanilaya vEdAnta hRdaya
deenajanAvana deekshA kankaNa dhAranamE nee dharmamayA
aanandanilaya vEdAnta hRdaya
sirulaku longina naruDentukayyA
parulaku odavani bratukendukayyA
aanandanilaya vEdAnta hRdaya

karmayOgamE aadarSamayA
jnAnajyOtini darSinchumayA
aanandanilaya vEdAnta hRdaya
mAnavasEva mahAyaj~namidi samidhi neevani teluyumayA
aanandanilaya vEdAnta hRdaya
kOvvela Silaku kolupendukayyA
nee vela teliyani neevendukayyA
aanandanilaya vEdAnta hRdaya

sinimaa:- SubhOdayam
saahityam:- vETUri
sangeetam:- mahadevan
gAnam:- bAlu

Labels: , ,


 
ప్రాణం ప్రాణం కలిసే ప్రణయం
జతగా జతిగా కసిగా కలిసే హృదయం
నీకు అంకితం
నీకు అంకితం
జీవితం ఆకాశం..ప్రేమంటే నక్షత్రం
సూర్యుడికి చంద్రుడికి
గ్రహణలే పడుతున్నా, అమావాస్య వస్తున్నా
మాసిపోనిది మమతారూపం
ఆరిపోనిది తారాదీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

తోడుకోరు తొడిమల్లో
తొలకరించు పువ్వుల్లో
ఏ వసంత వేళలోనో
ఎగసివచ్చు తావుల్లోనో
వినిపించే పరిమళగీతం ప్రేమ
ప్రాణసుగంధం ప్రేమ
అదే శాశ్వతం

ఆకశాల మౌనంలో
సాగరాల గానంలో
ఏ శ్వాశ నీడల్లోనో
ఏ నిశీధి అంచుల్లోనో
ఉదయించే వెలుగుల ఉదయం ప్రేమ
వెతలకు అంతం ప్రేమ
అదే శాశ్వతం

సినిమా:- ఆనందభైరవి
సాహిత్యం: వేటూరి
సంగీతం:- రమేష్ నాయిడు
గానం:- బాలు, వాణి జయరాం

prANam prANam kalisE praNayam
jatagA jatigA kasigA kalisE hRdayam
neeku ankitam
neeku ankitam
jeevitam AkASam..prEmanTE nakshatram
sooryuDiki chandruDiki
grahaNalE paDutunnaa, amAvaasya vastunnaa
mAsipOnidi mamatAroopam
aaripOnidi tArAdeepam
prEma prEma prEma prEma

tODukOru toDimallO
tolakarinchu puvvullO
E vasanta vELalOnO
egasivacchu tAvullOnO
vinipinchE parimaLageetam prEma
praaNasugandham prEma
adE SASwatam

aakaSAla mounamlO
sAgarAla gAnamlO
E SwaaSa neeDallOnO
E niSIdhi anchullOnO
udayinchE velugula udayam prEma
vetalaku antam prEma
adE SASwatam

sinimA:- Anandabhairavi
saahityam: vETUri
sangeetam:- ramEsh nAyiDu
gAnam:- bAlu, vANi jayarAm

Labels: , , , , ,


 
అనగనగా కధలు ఆ కాశి మజిళీలు
గజిబిజిగా గదులు ఈ జీవిత మజిళీలు
నడకే రానివాడు నట్టేట్లో ఈదుతాడు
ఉట్టే అందనోడు స్వర్గాన్నే కోరతాడు
మబ్బుల్లో నీళ్ళకని ఉన్న ముంతనే ఒంపేస్తాడు
తోక గుప్పెడు గొర్రె గంపెడు
ఆస్తి మూరెడు ఆశ బారెడు

ఆ:
పాల్లవాళ్ళతో పేచి..పైపునీళ్ళతో పేచి..
పక్క ఇళ్ళతో పేచి..పడి బ్రతకమా
అ:
అందుకే మరి
ఆడదాన్ని పూజించి..ఆదిశక్తిగా ఎంచి
అర్ధభాగమే పంచి..లాలించమా
ఆ:
మగాళ్ళ పని పడతాను
మా అడొళ్ళ మేలుకొలుపుతాను
అ:
పొయిలో తొంగుంది పిల్లి
దాన్ని ముందుగా మేలుకొలుపు తల్లి
ACకై వెర్రులలో గోచినోచని గోడును కనరు
ఆస్తి మూరెడు ఆశ బారెడు
ఆస్తి మూరెడు ఆశ బారెడు

ఆ:
fridge, VCR, TV
mixie, grinder ఏవి
వాయిదాలలోనైనా కొని పెట్టరా
అ:
చక్రవడ్డి వడ్డించి
నడ్డి విరగగొట్టించి
తలలు గుండుకొట్టించి..వెంటాడరా
ఆ:
convent చదువంట ముప్పా
మన పిల్లల్ని పంపమంటే తప్పా
అ:
వద్దమ్మా పిల్లి చూసి వాట
ఆరు నూరైనా మారదమ్మ రాత
ఏనుగుపై సవ్వారి ఎంతో గొప్పే..మెపిక ముప్పే
ఆస్తి మూరెడు ఆశ బారెడు
ఆస్తి మూరెడు ఆశ బారెడు

సినిమా:- ఆస్తి మూరెడు ఆశ బారెడు
సాహిత్యం:- ????
సంగీతం:- రాజ్-కోటి
గానం:- బాలు, చిత్ర

anaganagaa kadhalu aa kaaSi majiLeelu
gajibijigaa gadulu ee jeevita majiLeelu
naDakE raanivADu naTTETlO eedutADu
uTTE andanODu swargaannE kOratADu
mabbullO neeLLakani unna muntanE ompEstADu
tOka guppeDu gorre gampeDu
aasti mooreDu aaSa bAreDu

A:
pAllavALLatO pEchi..paipunILLatO pEchi..
pakka iLLatO pEchi..paDi bratakamA
a:
andukE mari
aaDadaanni poojinchi..aadiSaktigA enchi
ardhabhAgamE panchi..lAlinchamA
A:
magALLa pani paDatAnu
mA aDoLLa mElukoluputAnu
a:
poyilO tongundi pilli
daanni mundugA mElukolupu talli
#AC#kai verrulalO gOchinOchani gODunu kanaru
aasti mooreDu aaSa bAreDu
aasti mooreDu aaSa bAreDu

A:
#fridge, VCR, TV#
#mixie, grinder# Evi
vAyidAlalOnainA koni peTTarA
a:
chakravaDDi vaDDinchi
naDDi viragagoTTinchi
talalu gunDukoTTinchi..venTADaraa
A:
#convent# chaduvanTa muppA
mana pillalni pampamanTE tappA
a:
vaddammaa pilli choosi vaaTa
aaru noorainaa mAradamma raata
Enugupai savvAri entO goppE..mepika muppE
aasti mooreDu aaSa bAreDu
aasti mooreDu aaSa bAreDu

sinimaa:- aasti mooreDu aaSa bAreDu
saahityam:- ????
sangeetam:- rAj-kOTi
gAnam:- bAlu, chitra

Labels: , , ,


 
బంగారు బొమ్మ..మందర కొమ్మ
పేరంటానికి రారమ్మ
చామంతి పువ్వు..గోరింక నవ్వు
సీమంతమాడెను చూడమ్మ

అనగనగా ఓ చిన్న కధగా
వినవమ్మ చెబుతా గువ్వ కధ
పాలగువ్వ ఒకటి..పూలగువ్వ ఒకటి
జంటగ కలిసిన శుభవేళ
చెరిసగమై ఆడుకోగా
చిరుగాలే పాడే అనందలాలి జోల పాట

ఒకరికొకరు చెరిసగాల శ్రుతిలయజతలవు బ్రతుకులోన
విధికి వెధకు లొంగిపోని సాహసగుణమవు జీవితాలయి
ప్రణయమైన రూపమొకరుగా
ప్రమిధలోని దీపమొకరుగా
కలలన్ని నెలలు నిండగా
కనిపేంచే వలపు పంటగా
మురిసే ఆ జంట
మైమరచే దేవి సీమంతం ఆడువేళ

కపట విధికి వికటమైన ప్రళయం గూడే కూల్చిపోగా
సొంతమైన జంటగువ్వ రూపమదేదో పోల్చలేక
ఎదరున్నది పాలగువ్వని
ఎదనమ్మిన ముద్దుగుమ్మని
ఒదార్చే తీరు తెలియక
లోలోపల గుండె పగులగా
ఎడ్చే ఈ స్నేహం
జత చేర్చే దారి ఏమౌనో కానరాక

గానం:- జేసుదాస్


bangAru bomma..mandara komma
pEranTAniki rAramma
chAmanti puvvu..gOrinka navvu
seemantamADenu chooDamma

anaganagaa O chinna kadhagaa
vinavamma chebutA guvva kadha
paalaguvva okaTi..poolaguvva okaTi
janTaga kalisina SubhavELa
cherisagamai ADukOgaa
chirugAlE paaDE anandalAli jOla pATa

okarikokaru cherisagAla Srutilayajatalavu bratukulOna
vidhiki vedhaku longipOni saahasaguNamavu jeevitAlayi
praNayamaina roopamokarugA
pramidhalOni deepamokarugaa
kalalanni nelalu ninDagA
kanipEnchE valapu panTagA
murisE aa janTa
maimarachE dEvi seemantam aaDuvELa

kapaTa vidhiki vikaTamaina praLayam gooDE koolchipOgA
sontamaina janTaguvva roopamadEdO pOlchalEka
edarunnadi pAlaguvvani
edanammina muddugummani
odaarchE teeru teliyaka
lOlOpala gunDe pagulagA
eDchE ee snEham
jata chErchE daari EmounO kAnarAka

gAnam:- jEsudAs

Labels:


 
అ:
ఏనాడో నీకు నాకు రాసిపెట్టాడు
ఈనాడే నిన్ను నన్ను కలుపుతున్నాడు
ఆ:
చిలక గోరింకై
చుక్క నెలవంకై
చూసేవాళ్ళకి కన్నులవిందు చెయ్యమన్నాడు
అ:
ఎవరు
ఆ:
ఆ పైవాడు


ఆ:
వయసు వచ్చి మనసు నాకు ఇచ్చి పోయింది
మనసు పడితే మనసు నీకే ఇచ్చుకోమంది
అ:
మల్లేపువ్వు కుట్టి నన్ను కోసుకోమంది
వాలుజడలో పెట్టి నిన్నే కోరుకోమంది
ఆ:
చూపు పడితే చుక్క ఉంది
అ:
కన్ను కొడితే కటుక ఉంది
ఆ:
ఈడు జోడంటే
అ:
నువ్వు నేనంటూ
ఆ:
పిల్లాపాప అందరి పెళ్ళి చెయ్యమన్నాడు
అ:
ఎవరు
ఆ:
ఆ పైవాడు


అ:
సొగసులోన మొగలిరేకు వాసనేసింది
మసకవేళ మనసులాగే మంత్రమేసింది
ఆ:
బుసలు కొట్టే నిన్ను చూసి పడగ విప్పింది
వెన్నెలొచ్చి వెచ్చనైన వేణువూదింది
అ:
చేయి కలిపే చెలిమి ఉంది
ఆ:
కరిగిపోని కలిమి ఉంది
అ:
నింగి నేలంటే
ఆ:
నువ్వు నేనంటూ
అ:
తారలుకోసి తలంబ్రాలుగా చెయ్యమన్నాడు
ఆ:
ఎవరు
అ:
ఆ పైవాడు

సినిమా:- రామ రాజ్యంలో భీమ రాజ్యం
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు, సుశీల

a:
EnaaDO neeku nAku raasipeTTADu
eenaaDE ninnu nannu kaluputunnADu
A:
chilaka gOrinkai
chukka nelavankai
choosEvALLaki kannulavindu cheyyamannADu
a:
evaru
A:
aa paivADu


A:
vayasu vacchi manasu nAku icchi pOyindi
manasu paDitE manasu neekE icchukOmandi
a:
mallEpuvvu kuTTi nannu kOsukOmandi
vAlujaDalO peTTi ninnE kOrukOmandi
A:
choopu paDitE chukka undi
a:
kannu koDitE kaTuka undi
A:
eeDu jODanTE
a:
nuvvu nEnanTU
A:
pillApaapa andari peLLi cheyyamannADu
a:
evaru
A:
aa paivADu


a:
sogasulOna mogalirEku vaasanEsindi
masakavELa manasulAgE mantramEsindi
A:
busalu koTTE ninnu choosi paDaga vippindi
vennelocchi vecchanaina vENuvoodindi
a:
chEyi kalipE chelimi undi
A:
karigipOni kalimi undi
a:
ningi nElanTE
A:
nuvvu nEnanTU
a:
tAralukOsi talambrAlugaa cheyyamannADu
A:
evaru
a:
aa paivADu

sinimaa:- rAma rAjyamlO bheema rAjyam
saahityam:- vETUri
sangeetam:- chakravarti
gAnam:- bAlu, suSeela

Labels: , , , ,


 
ఎదురు తిరిగి నిలువలేక
వేరే దిక్కేవ్వరులేక
పతితముద్ర పడకుండా పదసన్నిధికి వచ్చాను
నువ్వు దిద్దిన నుదిటిబొట్టు నేలపాలు కాకముందే
చెలరేగిన దానవతకు శీలం బలి కాకముందే
ప్రళయకాల మేఘంలా
పెనుతుఫాను కెరటంలా
రా రా కదలిరా కదలిరా

కడుపుచిచ్చు చల్లారకముందే
నిప్పులచెరలో నిలేపేవమ్మా
క్షుద్రశక్తిని ఆపే శక్తి నాలో లేదమ్మా
ఉందో లేదో తెలియని స్దితిలో ప్రాణం ఉందమ్మా
ఉప్పెనలాగా ముంచుకు వచ్చే ముప్పును తప్పించి
ఆదిశక్తిలా కాకపోయినా ఆమ్మగ రక్షించి
నా పసుపుకుంకుమ నిలుపగ రావమ్మా
రా రా కదలిరా కదలిరా

ఆలయాన ఒక మూగబొమ్మవై శిలగా నిలిచేవే
చేసిన కర్మను అనుభవమించమని నన్ను వదిలేసావే
ఐతే నీకు ఈ మొక్కులు ఎందుకు
ఏటేటా ఈ జాతరలెందుకు
ఇంక నీకు ఈ గుడిఎందుకు
ఆ గోపురమెందుకు
ఆగకముందే నా ఆక్రోశం అగ్నిగా మారకముందే
ఆ దావానలజ్వాలలో నేను ఆహుతి కాకముందే
దుర్గవై..చండివై..దురితవినాశంకరివై
అంబవై..అభయవై..అగ్రహోతగ్రవై
చూపులెడి బాకులుగా
పాపత్ముల గుండే చీల్చి
పెల్లుబికిన రక్తంలో
తల్లీ నువ్వు జలకమాడి
సత్యమేవ జయతే అని లోకానికి చాటింపగా
రా రా కదలిరా కదలిరా

సినిమా:- అమ్మోరు
సాహిత్యం:- ????
సంగీతం:- చక్రవర్తి
గానం:- చిత్ర

eduru tirigi niluvalEka
vErE dikkEvvarulEka
patitamudra paDakunDA padasannidhiki vacchAnu
nuvvu diddina nudiTiboTTu nElapAlu kAkamundE
chelarEgina dAnavataku SIlam bali kAkamundE
praLayakAla mEghamlA
penutuphaanu keraTamlA
rA rA kadalirA kadalirA

kaDupuchicchu challArakamundE
nippulacheralO nilEpEvammaa
kshudraSaktini aapE Sakti naalO lEdammaa
undO lEdO teliyani sditilO prANam undammaa
uppenalAgA munchuku vacchE muppunu tappinchi
aadiSaktilA kAkapOyinA aammaga rakshinchi
naa pasupukumkuma nilupaga rAvammaa
rA rA kadalirA kadalirA

aalayaana oka moogabommavai Silagaa nilichEvE
chEsina karmanu anubhavaminchamani nannu vadilEsAvE
aitE neeku ee mokkulu enduku
ETETA ee jaataralenduku
inka neeku ee guDienduku
aa gOpuramenduku
aagakamundE naa aakrOSam agnigaa maarakamundE
aa daavaanalajwaalalO nEnu aahuti kaakamundE
durgavai..chanDivai..duritavinaaSankarivai
ambavai..abhayavai..agrahOtagravai
choopuleDi baakulugaa
paapatmula gunDE cheelchi
pellubikina raktamlO
tallI nuvvu jalakamADi
satyamEva jayatE ani lOkAniki chaaTimpagaa
rA rA kadalirA kadalirA

sinimaa:- ammOru
saahityam:- ????
sangeetam:- chakravarti
gAnam:- chitra

Labels: , ,


 
అమ్మా..అమ్మోరు తల్లో
మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లో
ఆదిశక్తివి నువ్వేనంట
అపరశక్తివి నువ్వేనంట
దుష్టశక్తులను ఖతం చేసే పరాశక్తివి నువ్వేనంట

నీ కళ్ళలో సూర్యుడు చంద్రుడు నిత్యం వెలుగుతూ ఉంటారంట
వేదాలన్ని నీ నాలుకపై ఎపుడూ చిందులు వేస్తాయంట
నింగి నీకు గొడుగంట
నేల నీకు పీఠమంట
నిన్ను నమ్మినవాళ్ళ నొములు పంటకు నారు నీరు నువ్వేనంట

పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలవమ్మా
జిత్తులమారి నక్కల మధ్య దిక్కేదో తోచని దీనులవమ్మా
బ్రతుకు మాకు సుడిగుండం
ప్రతిరోజు ఆకలిగండం
గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడమ్మా

సినిమా:- అమ్మోరు
సాహిత్యం:- ????
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

ammA..ammOru tallO
maa ammalaganna ammA bangAru tallO
aadiSaktivi nuvvEnanTa
aparaSaktivi nuvvEnanTa
dushTaSaktulanu khatam chEsE parASaktivi nuvvEnanTa

nee kaLLalO sooryuDu chandruDu nityam velugutU unTAranTa
vEdAlanni nee nAlukapai epuDU chindulu vEstAyanTa
ningi neeku goDuganTa
nEla neeku peeThamanTa
ninnu namminavALLa nomulu panTaku nAru neeru nuvvEnanTa

paDagalu ettina pAmula madhya paalaku EDchE pApalavammaa
jittulamAri nakkala madhya dikkEdO tOchani deenulavammaa
bratuku mAku suDigunDam
pratirOju AkaliganDam
gAlivAnalO reparepalADE deepAlanu nuvvu kApADammaa

sinimaa:- ammOru
saahityam:- ????
sangeetam:- chakravarti
gAnam:- bAlu

Labels: , ,


 
దేవుని దయ ఉంటే దొరబాబులం
స్వయంగా పనిచేస్తే యజమానులం
నిన్నటి గరీబులం
రేపటి అమీరులం
మనలో మనం..అంతా సమం
ఒకటే కుటుంబము

స్వదేశమైనా విదేశమైనా సమానమనుకోరా
పాటు పడ్డచో కూటికెన్నడు లోటురాదు కదరా
చదువుసంధ్యలున్నా..ఉద్యోగాలు సున్నా
శ్రమయే సుఖం..చమటే ధనం
స్వశక్తి ప్రధానము

విహారయాత్రలు వినోదయాత్రలు వికాసమిస్తాయి
కొత్తచోటుల కొత్తమనుషుల పరిచయాలు తెస్తాయి
మంచివారికెప్పుడు మంచి జరుగుతుంది
జనతారధం..సమతాపధం
ప్రగతే ప్రయాణము

సినిమా:- అమెరికా అబ్బాయి
సాహిత్యం:- అరుద్ర
సంగీతం:- సాలూరి రాజేశ్వరరావు
గానం:- బాలు

dEVuni daya unTE dorabaabulam
swayamgaa panichEstE yajamaanulam
ninnaTi gareebulam
rEpaTi ameerulam
manalO manam..antaa samam
okaTE kuTumbamu

swadESamainaa vidESamainaa samAnamanukOraa
paaTu paDDachO kooTikennaDu lOTuraadu kadaraa
chaduvusandhyalunnA..udyOgAlu sunnaa
SramayE sukham..chamaTE dhanam
swaSakti pradhAnamu

vihArayaatralu vinOdayaatralu vikaasamistaayi
kottachOTula kottamanushula parichayaalu testaayi
manchivaarikeppuDu manchi jarugutundi
janataaradham..samataapadham
pragatE prayANamu

sinimaa:- amerikA abbAyi
saahityam:- arudra
sangeetam:- saalUri rAjESwararAvu
gAnam:- bAlu

Labels: , ,


 
ఓదార్పుకన్న చల్లనిది
నిట్టూర్పుకన్న వెచ్చనిది
గగనాలకన్న మౌనమిది
అర్చనగా..ద ద ద ని
అర్పనగా..ని ద ని స
దీవెనగా..లాలనగా
వెలిగే ప్రేమ

వేదాలకైన మూలమది
నాదాలలోన భావమది
దైవాలకైన ఊయ్యలది
కాలాలకన్న వేదమది
కన్నీళ్ళు మింగి బ్రతికేది
అదిలేనినాడు బ్రతుకేది
నీకై జీవించి
నిన్నే దీవించి
నీకై మరణించు
జన్మజన్మల ఋణమీ ప్రేమ

లయమైన శ్రుష్టి కల్పములో
చివురించు లేత పల్లవిది
గతమైనగాని రేపటిది
అమ్మలుగన్న అమ్మ ఇది
పూలెన్ని రాలిపోతున్నా
పులకించు ఆత్మగంధమిది
నిన్నే ఆశించి
నిన్నే సేవించి
కలలె అర్పించు
బ్రతుకు చాలని బంధం ప్రేమ

సినిమా:- అమరజీవి
సాహిత్యం:- వేటురి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు, జానకి

Odaarpukanna challanidi
niTTUrpukanna vecchanidi
gaganaalakanna mounamidi
archanagaa..da da da ni
arpanagaa..ni da ni sa
deevenagaa..laalanagaa
veligE prEma

vEdAlakaina moolamadi
nAdAlalOna bhaavamadi
daivAlakaina ooyyaladi
kaalaalakanna vEdamadi
kannILLu mingi bratikEdi
adilEninaaDu bratukEdi
neekai jeevinchi
ninnE deevinchi
neekai maraNinchu
janmajanmala RNamI prEma

layamaina SrushTi kalpamulO
chivurinchu lEta pallavidi
gatamainagaani rEpaTidi
ammaluganna amma idi
poolenni raalipOtunnaa
pulakinchu aatmagandhamidi
ninnE aaSinchi
ninnE sEvinchi
kalale arpinchu
bratuku chaalani bandham prEma

sinimaa:- amarajeevi
saahityam:- vETuri
sangeetam:- chakravarti
gAnam:- bAlu, jAnaki

Labels: , , ,


 
ఆలనగా పాలనగా
అలసిన వేళలో అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా..దేవి
పాలించు నా రాణిగా

నీ చిరునవ్వే తోడై ఉంటే
నే గెలిచేను లోకాలన్ని
అరఘడియయినా నీ ఎడబటు
వెన్నెలకూడ చీకటి నాకు
లాలించు ఇల్లాలిగా..దేవి
పాలించు నా రాణిగా

మోమున మెరిసే కుంకుమ తిలకం
నింగిని వెలిగే జాబిల్లి కిరణం
నేనంటే నీ మంగళసూత్రం
నువ్వంటే నా ఆరోప్రాణం
లాలించు ఇల్లాలిగా..దేవి
పాలించు నా రాణిగా

గానం:- జేసుదాస్

aalanagaa paalanagaa
alasina vELalO ammavugaa
laalinchu illaaligaa..dEvi
paalinchu naa raaNigaa

nee chirunavvE tODai unTE
nE gelichEnu lOkAlanni
araghaDiyayinaa nee eDabaTu
vennelakooDa cheekaTi naaku
laalinchu illaaligaa..dEvi
paalinchu naa raaNigaa

mOmuna merisE kumkuma tilakam
ningini veligE jaabilli kiraNam
nEnanTE nee mangaLasootram
nuvvanTE naa aarOprANam
laalinchu illaaligaa..dEvi
paalinchu naa raaNigaa

gAnam:- jEsudAs

Labels:


 
ఆలనగా పాలనగా
అలసిన వేళలో అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా..దేవి
పాలించు నా రాణిగా

నీ చిరునవ్వే తోడై ఉంటే
నే గెలిచేను లోకాలన్ని
అరఘడియయినా నీ ఎడబటు
వెన్నెలకూడ చీకటి నాకు
లాలించు ఇల్లాలిగా..దేవి
పాలించు నా రాణిగా

మోమున మెరిసే కుంకుమ తిలకం
నింగిని వెలిగే జాబిల్లి కిరణం
నేనంటే నీ మంగళసూత్రం
నువ్వంటే నా ఆరోప్రాణం
లాలించు ఇల్లాలిగా..దేవి
పాలించు నా రాణిగా

గానం:- జేసుదాస్

aalanagaa paalanagaa
alasina vELalO ammavugaa
laalinchu illaaligaa..dEvi
paalinchu naa raaNigaa

nee chirunavvE tODai unTE
nE gelichEnu lOkAlanni
araghaDiyayinaa nee eDabaTu
vennelakooDa cheekaTi naaku
laalinchu illaaligaa..dEvi
paalinchu naa raaNigaa

mOmuna merisE kumkuma tilakam
ningini veligE jaabilli kiraNam
nEnanTE nee mangaLasootram
nuvvanTE naa aarOprANam
laalinchu illaaligaa..dEvi
paalinchu naa raaNigaa

gAnam:- jEsudAs

Labels:


 
అక్కా బావ మా అమ్మ నాన్న
ఎక్కువకాదా మా ప్రాణం కన్నా
కన్నవారులేని మాకు అంతకన్న మిన్నగా
దిగివచ్చిన శివపార్వతులే
అక్కా అక్కా..నీ రెక్కల చలువ
బావా బావా..నీ మమతల విలువ
పెంచుకున్న మొక్కలు మేమే

అక్క లాలన..బావా పాలన
పూల ఊయలై పెరిగాం మేము
చిక్కులేమితో చింతలేమితో
ఒక్కనాటికి ఎరుగము మేము
అక్క మాట వేదవాక్కు ఎప్పటికైనా
బావగారి చూపంటే సుగ్రీవ ఆగ్జ్ఞ
మీరు గీసే గీతను మీరము మేము
మీకు నచ్చనిదేది కోరము మేము

జన్మజన్మకు మీ పిల్లలమై
మీ ఒడిలోనే మేం జన్మిస్తాం
కాలు నేలపై మోపనివ్వక
పూల తేరులో ఊరేగిస్తాం
ఏమిచ్చి తీర్చగలం మీ ఋణభారం
కన్నీటి పన్నీరుతో మీ కాళ్ళు కడుగుతాం
మా బ్రతుకులు మీ కోసం అంకితమిస్తాం
మీ బరువులు మోసేందుకే మేం జీవిస్తాం

సినిమా:- శ్రీమతి ఒక బహుమతి
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- శంకర్-గణేష్
గానం:- బాలు, ????

akkA baaVa maa amma naanna
ekkuvakaadaa maa prANam kannaa
kannavaarulEni maaku antakanna minnagaa
digivacchina SivapaarvatulE
akkA akkA..nee rekkala chaluva
bAvA bAvA..nee mamatala viluva
penchukunna mokkalu mEmE

akka laalana..bAvA pAlana
poola ooyalai perigAm mEmu
chikkulEmitO chintalEmitO
okkanaaTiki erugamu mEmu
akka mATa vEdavaakku eppaTikainaa
bAvagAri choopanTE sugreeva aagj~na
meeru geesE geetanu meeramu mEmu
meeku nacchanidEdi kOramu mEmu

janmajanmaku mee pillalamai
mee oDilOnE mEm janmistaam
kaalu nElapai mOpanivvaka
poola tErulO oorEgistaam
Emicchi teerchagalam mee RNabhaaram
kanneeTi pannIrutO mee kaaLLu kaDugutaam
maa bratukulu mee kOsam ankitamistaam
mee baruvulu mOsEndukE mEm jeevistaam

sinimaa:- SrImati oka bahumati
saahityam:- sirivennela
sangeetam:- Sankar-gaNEsh
gAnam:- bAlu, ????

Labels: , ,


 
ఏ బంధం ఎన్నాళ్ళొ
ఈ మమతలెన్నినాళ్ళో
ఈ మమతలెన్నినాళ్ళో
ఋణమేదో తీరేను
నీకేల కనులనీరు

కొమ్మకి పువ్వే సొంతం కాదు
తల్లికి బిడ్డే తోడై రాడు
వెలుగేలేని చీకటి వేళ
నీ నీడైనా
నీ నీడైనా నీతో రాదు
బ్రతుకంటేనే తీపి చేదు

అమ్మవు నువై..నాన్నను నేనై
బొమ్మలాటలే ఆడామనుకో
నువ్వు నేనే మిగిలామనుకో
ఆ వేదనతో
అన్ని మరచి సేదతీర్చుకో
దీనికి పేరే జీవితమనుకో

గానం:- జేసుదాస్, సుశీల

E bandham ennALLo
ee mamatalenninALLO
ee mamatalenninALLO
RNamEdO teerEnu
neekEla kanulaneeru

kommaki puvvE sontam kaadu
talliki biDDE tODai raaDu
velugElEni cheekaTi vELa
nee neeDainaa
nee neeDainaa neetO raadu
bratukanTEnE teepi chEdu

ammavu nuvai..naannanu nEnai
bommalaaTalE aaDaamanukO
nuvvu nEnE migilaamanukO
aa vEdanatO
anni marachi sEdateerchukO
deeniki pErE jeevitamanukO

gAnam:- jEsudAs, suSeela

Labels: ,


 
అభివందనం ఓ సౌందర్యమా
హరిచందనం ఓ లావణ్యమా
కలలో నా ఎల కోయిల
ఇల చేరవే వెన్నెల కాయగా

ఏ జన్మ గానం
ప్రదిక్షనం..ప్రతి క్షణం
పెంచింది నాలో
ఏ చంద్ర జాలం
ప్రభంజనం..ప్రతి క్షణం
రేపింది నాలో
నువ్వు రాగాలే సుగందాల వాన
నవ రాగాలే రచించింది లోన
మెల్లగ అల్లిన మల్లికలా అంట
మురిపించుతున్న

చిన్నారి జింక
నిశాలకై నిరీక్షణ
ఎన్నాళ్ళు ఇంకా?
బంగారు గువ్వా
ఉషారులో ఉషోదయం
చిందాడనీవా?
పిలుపందించే రహస్యాల రాజ్యం
కలపండించే నరాలాడు నాట్యం
మేనక మేనికి తాకగనే
ఎదో మధురాగ వేల

తొలి యవ్వనం కనువిందియ్యవా
నవ నందనం ఎదలో దించవా
తెర తీయ్యవా చిరు వయ్యారమా
ఒడి వాలవా తడి సింగారమా

గానం:- జేసుదాస్, మనో


abhivandanam O soundaryamA
harichandanam O lAvaNyamA
kalalO naa ela kOyila
ila chEravE vennela kAyagA

E janma gAnam
pradikshanam..prati kshaNam
penchindi nAlO
E chandra jAlam
prabhanjanam..prati kshaNam
rEpindi nAlO
nuvvu rAgAlE sugandAla vaana
nava rAgAlE rachinchindi lOna
mellaga allina mallikalA anTa
muripinchutunna

chinnAri jinka
niSAlakai nireekshaNa
ennALLu inkA?
bangAru guvvA
ushArulO ushOdayam
chindADaneevA?
pilupandinchE rahasyAla rAjyam
kalapanDinchE narAlADu nATyam
mEnaka mEniki taakaganE
edO madhuraaga vEla

toli yavvanam kanuvindiyyavA
nava nandanam edalO dinchavA
tera teeyyavA chiru vayyaaramaa
oDi vAlavA taDi singAramaa

gAnam:- jEsudAs, manO

Labels: ,


 
ఆకాశానికి రవికిరణం ఆరని హారతి
కడలికి పున్నమి జాబిల్లి వెన్నెల హారతి
త్యాగం మనిషికి ఆభరణం
అది జీవన జ్యోతి
కల్లాకపటం తెలియని హ్రుదయం
కర్పూర జ్యోతి..వెలిగే కర్పూర జ్యోతి

పుట్టినరోజుకు పాపకు తల్లి పట్టేదే తొలి హారతి
కొత్తకోడలకు ముత్తైదువులు ఇచ్చేదే శుభ హారతి
నిండు మనసుతో దేవుని కొలిచి వెలిగిచేదే శ్రీ హారతి
నిండు మనసుతో దేవుని కొలిచి వెలిగిచేదే శ్రీ హారతి
కరిగి కరిగినా కాంతి తరగని మంగళ హారతి ఆ జ్యోతి
కల్లాకపటం తెలియని హ్రుదయం
కర్పూర జ్యోతి

విరిసిన కుసుమం వాడిపోయినా..పిందె గురుతుగా మిగిలేను
పండిన ఫలము నేలరాలినా..విత్తనమైనా మిగిలేను
ఆయువు తీరి మనిషి పోయినా
ఆయువు తీరి మనిషి పోయినా..సంతతి అయినా మిగిలేను
వయసులేనిదే, వాడిపోనిదే మ్రుతిగా మాత్రం మిగిలేది
కల్లాకపటం తెలియని హ్రుదయం
కర్పూర జ్యోతి

సినిమా:- సంగీత
సాహిత్యం:- ????
సంగీతం:- ????
గానం:- జానకి

aakASAniki ravikiraNam aarani haarati
kaDaliki punnami jAbilli vennela haarati
tyaagam manishiki aabharaNam
adi jeevana jyOti
kallAkapaTam teliyani hrudayam
karpoora jyOti..veligE karpoora jyOti

puTTinarOjuku pApaku talli paTTEdE toli haarati
kottakODalaku muttaiduvulu icchEdE Subha haarati
ninDu manasutO dEvuni kolichi veligichEdE Sree haarati
ninDu manasutO dEvuni kolichi veligichEdE Sree haarati
karigi kariginA kaanti taragani mangaLa haarati aa jyOti
kallAkapaTam teliyani hrudayam
karpoora jyOti

virisina kusumam vADipOyinA..pinde gurutugA migilEnu
panDina phalamu nElaraalinA..vittanamainA migilEnu
aayuvu teeri manishi pOyinA
aayuvu teeri manishi pOyinA..santati ayinA migilEnu
vayasulEnidE, vADipOnidE mrutigA maatram migilEdi
kallAkapaTam teliyani hrudayam
karpoora jyOti

sinimaa:- sangeeta
saahityam:- ????
sangeetam:- ????
gAnam:- jAnaki

Labels:


 
ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి
తనకో ముద్ద..నాకో ముద్ద (2)
తినిపించువాడొచ్చే వేళయింది
వళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది
ఇలా ఇలా ఇలా
ఇలా ఇలా ఇలా

అతగడే జతగాడు అనుకున్నది
అనుకున్నదే కలలు కంటున్నది (2)
కలలోని విందు కనులవిందవునా (2)
మనసులోని ఆశ మాంగళ్యమవునా
ఇలా ఇలా ఇలా
ఇలా ఇలా ఇలా

ఇది కల కల కల
మనమిలా ఇలా ఇలా
గాలిలా పువ్వులా తావిలా
కలిసి ఉన్నాము కలవకనే
కలుసుకున్నాము తెలియకనే
వెలుగుకు నీడకు చెలిమిలా
ఒక్కటైనాము కలవకనే
ఒదిగిఉన్నాము కరగకనే
ఈ ప్రేమపత్రము..ఈ జన్మకు చెల్లువేయ్యుము
ప్రతి జన్మజన్మకు..మరల తిరగ వ్రాసుకుందము
ఎలా ఎలా ఎలా
ఇలా ఇలా ఇలా

ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది, ఆశ ఉంది

వెన్నెల కలువలా చెలువలా
మందగించాము జతలుగ
విందులవుదాము కధలుగా
కన్నుల పాపలా చూపులా
చూచుకుందాము సొగసులుగా
పగలు రేయిగా..రేయి పగలుగా
ఈ రాగసూత్రము..మూడుముళ్ళు వేసుకుందము
ఈ మూగమంత్రము..దీవెనగా చేసుకుందము
ఎలా ఎలా ఎలా
ఇలా ఇలా ఇలా
ఇలా ఇలా ఇలా

ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది, ఆశ ఉంది

సినిమా:- అభిమన్యు
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- మహదేవన్
గానం:- బాలు, సుశీల


AkEsi pappEsi buvvEsi neyyEsi
tanakO mudda..naakO mudda (2)
tinipinchuvADocchE vELayindi
vaLLantA kaLLugA edurocchindi
ilA ilA ilA
ilA ilA ilA

atagaDE jatagADu anukunnadi
anukunnadE kalalu kanTunnadi (2)
kalalOni vindu kanulavindavunA (2)
manasulOni aaSa mAngaLyamavunA
ilA ilA ilA
ilA ilA ilA

idi kala kala kala
manamilaa ilA ilA
gAlilA puvvulA tAvilA
kalisi unnAmu kalavakanE
kalusukunnAmu teliyakanE
veluguku neeDaku chelimilA
okkaTainAmu kalavakanE
odigiunnAmu karagakanE
ee prEmapatramu..ee janmaku chelluvEyyumu
prati janmajanmaku..marala tiraga vraasukundamu
elA elA elA
ilA ilA ilA

aakundi pappundi buvvundi neyyundi
aakali undi, aaSa undi

vennela kaluvalA cheluvalA
mandaginchAmu jataluga
vindulavudAmu kadhalugA
kannula pApalA choopulA
choochukundAmu sogasulugA
pagalu rEyigA..rEyi pagalugA
ee raagasootramu..mooDumuLLu vEsukundamu
ee moogamantramu..deevenagA chEsukundamu
elA elA elA
ilA ilA ilA
ilA ilA ilA

aakundi pappundi buvvundi neyyundi
aakali undi, aaSa undi

sinimaa:- abhimanyu
saahityam:- aatrEya
sangeetam:- mahadEvan
gAnam:- bAlu, suSeela

Labels: , , ,


 
అరవైకి ఆరేళ్ళకి ఏమిటి అనుబంధం
దీపానికి దేవుడికి ఉండే సంబంధం

పొద్దుగుంకిపోతున్న తరణంలో
నే చందమామ కావాలని కోరానా? (2)
వద్దన్నా వచ్చింది వెన్నెల (2)
కరిగిపొమ్మన్నా పోకుంది ఈనాడు ఆ కల

అప్పుడు నీ అల్లరితో మురిపించావు
ఇప్పుడు నా బ్రతుకునే అల్లరి చేసావు (2)
మనిషికి ఒకటే శిక్ష..పెద్దతనం
తెలియని శ్రీరామ రక్ష..పసితనం

సినిమా:- రా రా క్రిష్ణయ్య
సాహిత్యం:- మల్లెవరపు గోపి
సంగీతం:- బాలు
గానం:- బాలు

aravaiki ArELLaki EmiTi anubandham
deepAniki dEvuDiki unDE sambandham

poddugunkipOtunna taraNamlO
nE chandamAma kAvAlani kOrAnA? (2)
vaddannA vacchindi vennela (2)
karigipommannA pOkundi eenADu A kala

appuDu nee allaritO muripinchAvu
ippuDu nA bratukunE allari chEsAvu (2)
manishiki okaTE Siksha..peddatanam
teliyani SreerAma raksha..pasitanam

sinimaa:- rA rA krishNayya
saahityam:- mallevarapu gOpi
sangeetam:- bAlu
gAnam:- bAlu

Labels: , ,


 
ఆ వన్నెలు ఎక్కడివి తూర్పుకాంత మోములో
ప్రణయమో..బిడియమో
తల్లినవుతానని గర్వమో

తల్లిని చెస్తాడని మగడిపైన వలపు
నెలతప్పిన నాటి నుంచి బిడ్డడిదే తలపు
అమ్మా...
అమ్మా అని విన్నపుడే ఆడబ్రతుకు గెలుపు
అందుకనే ప్రతినిత్యం ప్రసవించును తూరుపు
ప్రసవించును తూరుపు

నన్నయ్యకు ఏమి తెలుసు యశొదమ్మ మనసు
ఆ ఎదపై నిదురించిన కన్నయ్యకు తెలుసు
మగవాడికి ఆడగుండె అవసరమే తెలుసు
పాపాయికి ఆ రొమ్ముల అమ్మతనం తెలుసు

సినిమా:- రా రా క్రిష్ణయ్య
సాహిత్యం:- మల్లెవరపు గోపి
సంగీతం:- బాలు
గానం:- బాలు, సుశీల



A vannelu ekkaDivi toorpukAnta mOmulO
praNayamO..biDiyamO
tallinavutAnani garvamO

tallini chestADani magaDipaina valapu
nelatappina nATi nunchi biDDaDidE talapu
ammA...
ammA ani vinnapuDE aaDabratuku gelupu
andukanE pratinityam prasavinchunu toorupu
prasavinchunu toorupu

nannayyaku Emi telusu yaSodamma manasu
aa edapai nidurinchina kannayyaku telusu
magavADiki aaDagunDe avasaramE telusu
pApAyiki aa rommula ammatanam telusu

sinimaa:- rA rA krishNayya
saahityam:- mallevarapu gOpi
sangeetam:- bAlu
gAnam:- bAlu, suSeela

Labels: , ,


 
ఆగిపోనికే రసఝరి
అందల మందిన ఆనందలహరి
మందారపాదాల మంజీరనాదాల మందాకిని
మృదుమృదంగాల లాహిరి

ప్రతి వేకువ ప్రకృతి రసవేదిక
నీలాల యౌవనిక
అలవోకగా తొలగి తెలివాకగ వెలుగు
ఎలనాగ చెలరేగ కలలూరగా
తరుల తలలూగగ
ప్రతి వేకువ ప్రకృతి రసవేదిక
సుఖసారిక సఖుల కలక కలి
శ్రుతుల కమనీయ కవనాలు గమకించగా
జగతి గమనించగా
కిరణ మంజీర చరణ సంచార సింజిని బిని
నిదురించిన హ్రుదయము
కంజాతముగా కంగలించి
శతధళముల సంధ్యావందనమిడగా

మలిసందెగా పగటికల పండగా
కలలేలు కవళిక
కనులారగ కనగ
కరువారగ కరగ శశిరేఖ
రసరాగ నిశిలేఖగా
దిశలు నిను తాకగా
మలిసందెగా పగటికల పండగా
శుభతారక గతులు సభ తీరగా
హతుల హిందొళి సంగతులు రవళించగా
రజని రవనించగా
సంజెకెంజాయ రుచులు రంజిల్లు మరుమంజరిగా
మధురంజనిగా
ఆటవెలది జవనాల జలధి అని
దివిజులు నినుగని ఒహో అనగా

సాహిత్యం:- సిరివెన్నెల
గానం:- జేసుదాస్

aagipOnikE rasajhari
andala mandina Anandalahari
mandArapAdAla manjeeranAdAla mandAkini
mrudumrudangAla lAhiri

prati vEkuva prakruti rasavEdi
neelAla yauvanika
alavOkagA tolagi telivAkaga velugu
elanAga chelarEga kalalooragA
tarula talaloogaga
prati vEkuva prakruti rasavEdika
sukhasArika saKula kalaka kali
Srutula kamaneeya kavanAlu gamakinchagA
jagati gamaninchagA
kiraNa manjeera charaNa sanchAra sinjini bini
nidurinchina hrudayamu
kanjAtamugaa kangalinchi
SatadhaLamula sandhyAvandanamiDagA

malisandegA pagaTikala panDagA
kalalElu kavaLika
kanulAraga kanaga
karuvAraga karaga SaSirEkha
rasarAga niSilEkhagA
diSalu ninu tAkagA
malisandegA pagaTikala panDagA
SubhatAraka gatulu sabha teeragA
hatula hindoLi sangatulu ravaLinchagA
rajani ravaninchagA
sanjekenjAya ruchulu ranjillu marumanjarigA
madhuranjanigA
aaTaveladi javanAla jaladhi ani
divijulu ninugani ohO anagA


sAhityam:- sirivennela
gAnam:- jEsudAs

Labels: ,


Saturday, March 26, 2011

 

Jaladi

తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు
పరుల తెలుసుకున్నవాడు పర్మజ్ఞుడు
అంతు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు
అన్ని తెలిసున్న వాడు అల్పజ్ఞుడు

కన్ను తెరిస్తే ఉయ్యాల
కన్ను మూస్తే మొయ్యలా

ఒక తలరాత రాయడం చెతకాని వాడికి
నాలుగు తలలెందుకో మొయడానికి

చేతి చిటికెనవేలు కలిస్తే కళ్యాణం
కాలి బొటనవేలు కలిస్తే నిర్యానం

 
ఏనాటి సరసమిది..ఎన్నాళ్ళ సమరమిది
కలహాలు విరహాలేనా కాపురం?
ఓనాటి ఇష్ట సఖి..ఈనాటి కష్ట సుఖి
పంతాలు పట్టింప్పులకా జీవితం?
పురుషా పురుషా ఆడది అలుసా?
అభిమానాం నీ సొత్తా?
అవమానాం తన వంతా?

ఆడది మనిషే కాదా?
ఆమెది మనసేగా
సమ భావం నీకుంటే...ఆమె నీ మనిషేగా
ఏ ఎండమావులలో ఒంటరిగానే ఎదురీత
నిన్నడిగి రాసాడా బ్రహ్మ నీ తలరత
తరిగెనేమో సంస్కారం
తిరగబడెను సంసారం
శయనేషు రంభలట, బోజ్యేషు మాతలట
కరనేషు మంత్రులు మాత్రం కారట

నింగిలో తారల కోసం శ్రీవారి పోరాటం
ఇంటిలో వెన్నెల కోసం శ్రీమతికి ఆరాటం
ఏ సవాలు ఎదురైనా నీ శక్తికదే ఉరిపిరి రాయి
ఓనమాలు దిద్దుకు చూడు ఒద్దికలో ఉన్నది హాయి
చెప్పలేని అనురాగాం
చెయ్యమంటే ఈ త్యాగం
హక్కున్న శ్రీమతిగా..????? పార్వతిగా
కార్యేషు దాసివి ఇకపై కావుగా

సినిమా:- కలిసి నాడుద్దాం
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- ?????
గానం:- చిత్ర

EnATi sarasamidi..ennALLa samaramidi
kalahAlu virahAlEnA kApuram?
OnATi ishTa sakhi..eenATi kashTa sukhi
pantAlu paTTimppulakA jeevitam?
purushA purushA ADadi alusaa?
abhimAnAm nee sottA?
avamAnAm tana vantA?

ADadi manishE kAdA?
Amedi manasEgaa
sama bhAvam neekunTE...Ame nee manishEgA
E enDamaavulalO onTarigAnE edureeta
ninnaDigi rAsADA brahma nee talarata
tarigenEmO samskAram
tiragabaDenu samsAram
SayanEshu rambhalaTa, bOjyEshu mAtalaTa
karanEshu mantrulu mAtram kAraTa

ningilO tArala kOsam SreevAri pOrATam
inTilO vennela kOsam Sreematiki ArATam
E savAlu edurainA nee SaktikadE uripiri rAyi
OnamAlu didduku chooDu oddikalO unnadi hAyi
cheppalEni anurAgAm
cheyyamanTE ee tyAgam
hakkunna SreematigA..????? pArvatigA
kAryEshu daasivi ikapai kAvugaa

sinimA:- kalisi nADuddAm
saahityam:- vETUri
sangeetam:- ?????
gAnam:- chitra

 
Dear Friends
ఇప్పుడు నేను పాడబొయే ఈ పాట ఓ అందమైన ప్రేమ కధ. రెండు గువ్వలు - చిలుక గోరింక, రెండు రవ్వలు - తార నెలవంక కలలు కన్నాయి, కధలు చెప్పుకున్నయి. భూదేవి సాక్షిగా పసి వయసులో బొమ్మల పెళ్ళి చేసుకున్నాయి. కడవరకు నిలవాలని బాసల వీలునామ రాసుకున్నాయి. ఇంతలో కాలం కన్నెర్ర చేసింది. ఆ జంటను విడదీసింది. ఇక ఒకే వెతుకులాట. ఇప్పుడు అదే నా ఈ పాట.

రివ్వున ఎగిరే గువ్వా..నీ పరుగులు ఎక్కడికమ్మా (2)
నా పెదవుల చిరునవ్వా..నిను ఎక్కడ వెతికేదమ్మా?
తిరిగొచ్చే దారే మరిచావా?
ఇకనైనా గూటికి రావా?

వీచే గాలుల వెంట..నా వెచ్చని ఊపిరినంతా
పంపించానే అది ఏ చోట నిను తాకనే లేదా?
పూచే పువ్వులా నిండా..మన తీయ్యని జ్ఞాపకమంతా
నిలిపుంచానే నువ్వు ఏ పూట చూడనే లేదా?
నీ జాడను చూపించంటూ..ఉబికే నా ఈ కన్నీరు
ఎనాడు ఇలపై అది ఇంకి పోలేదు
ప్రతి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూడు
అవి నీకై వెలిగే నా చూపుల దీపాలు
ఆ దారిని తూరుపువై రావా
నా గుండెకు ఊపిరివై రావా

కిన్నెరసాని నడక..నీకెందుకే అంతటి అలక
నన్నొదిలేస్తావా కడ దాక తోడై రాక
బ్రతుకే బరువైపోగా..మిగిలున్నా ఒంటరి శిలగా
మన బాసల ఊసులన్ని కరిగాయా ఆ కలగా
ఎన్నేన్నో జన్మల దాకా ముడివేసిన మన అనుబంధం
తెగిపోయిందంటే నమ్మదుగా నా ప్రాణం
ఆయువుతో ఉన్నది అంటే ఇంకా ఈ నా దేహం
క్షేమంగా ఉన్నట్టే తను కూడా నా స్నేహం
ఎడబాటే వారధిగా చేస్తా
త్వరలో నీ జతగా వస్తా

సినిమా:- జానకి వెడ్స్ శ్రీరాం
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ఘంటాడి క్రిష్ణ
గాణం:- బాలు

#Dear Friends#
ippuDu nEnu pADaboyE ee paaTa O andamaina prEma kadha. renDu
guvvalu - chiluka gOrinka, renDu ravvalu - tAra nelavanka
kalalu kannAyi, kadhalu cheppukunnayi. bhoodEvi saakshigaa
pasi vayasulO bommala peLLi chEsukunnAyi. kaDavaraku
nilavAlani bAsala veelunAma raasukunnAyi. intalO kaalam
kannerra chEsindi. A janTanu viDadeesindi. ika okE
vetukulATa. ippuDu adE naa ee pATa.

rivvuna egirE guvvaa..nee parugulu ekkaDikammaa (2)
nA pedavula chirunavvA..ninu ekkaDa vetikEdammA?
tirigocchE dArE marichAvA?
ikanainA gooTiki rAvA?

veechE gAlula venTa..nA vecchani oopirinantA
pampinchAnE adi E chOTa ninu tAkanE lEdA?
poochE puvvulA ninDA..mana teeyyani jnaapakamantA
nilipunchAnE nuvvu E pooTa chooDanE lEdA?
nee jADanu choopinchanTU..ubikE naa ee kannIru
enADu ilapai adi inki pOlEdu
prati rAtri AkASamlO nakshatrAlanu chooDu
avi neekai veligE naa choopula deepAlu
aa dArini toorupuvai rAvA
naa gunDeku oopirivai rAvA

kinnerasAni naDaka..neekendukE antaTi alaka
nannodilEstAvA kaDa daaka tODai rAka
bratukE baruvaipOgA..migilunnA onTari SilagA
mana bAsala oosulanni karigAyA aa kalagA
ennEnnO janmala dAkA muDivEsina mana anubandham
tegipOyindanTE nammadugaa nA praaNam
aayuvutO unnadi anTE inkA ee nA dEham
kshEmangaa unnaTTE tanu kooDA nA snEham
eDabATE vaaradhigA chEstA
twaralO nee jatagaa vastA

sinimaa:- jAnaki veDs SrIrAm
saahityam:- sirivennela
sangeetam:- ghanTADi krishNa
gANam:- bAlu

 
ఆ:
రివ్వున ఎగిరే గువ్వా..నీ పరుగులు ఎక్కడికమ్మా (2)
మంచును తడిసిన పువ్వా..నీ నవ్వులు ఎవ్వరివమ్మా
నీ రాజు ఎవ్వరంటా?
ఈ రోజే చెప్పమంటా
నీ రాజు ఎవ్వరంటా?
ఈ రోజే చెప్పమంటా

---

ఆ:
అల్లరి పిల్లకు నేడు..వెయ్యాలి ఇక మెళ్ళొ తాడు
ముడివేసే సిరిగల మొనగాడు..ఎవ్వరే వాడు
అ:
చక్కని రాముడు వీడు..నీ వరసకు మొగుడవుతాడు
ఆ:
ఇల్లాలిని వదిలిన ఆ ఘనుడు..ఈ పిరోకోడు
ఆ క్రిష్ణుని అంశన వీడే నీ కొరకే ఇలా పుట్టాడే
గొపికలే వస్తే అటే పరిగేడతాడే
అ:
ఓ గడసరి పిల్లా..నీ కడుపున కొడుకై పుడ్తానే
ఆ:
కుతురుగా పుట్టు..నీ పేరే పెడతాలే
అ:
గొడవెందుకు బావతో వెళ్ళతావా?
ఆ:
పద బావా..పాల కోవా

---

అ:
చిటపట చినుకులు రాలి..అవి చివరకు ఎటు చేరాలి
సెలయేరులు పారే దారుల్లో కొలువుండాలి
నిండుగ నదులే ఉరికే..అవి చేరును ఏ దరికి
కలకాలం కడలిని చేరంగా పరిగెడతాయి
అట్టాగే నాతో నీవు..నీతో నేను ఉండాలి
బ్రతుకంతా ఒకటై ఇలా జత కావాలి
మన బొమ్మల పెళ్ళి..నువ్వే తాళిని కడతావా?
మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా?
ఓ బావా ఒట్టే పెడుతున్నా
నేను కుడా ఒట్టేస్తున్నా

నా రాజు నువ్వేనంటా
ఈ రోజే తెలిసిండంటా

సినిమా:- జానకి వెడ్స్ శ్రీరాం
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ఘంటాడి క్రిష్ణ
గానం:- ఘంటాడి, సునీత, ఉష, వరికుప్పల్ యాదగిరి

A:
rivvuna egirE guvvaa..nee parugulu ekkaDikammaa (2)
manchunu taDisina puvvaa..nee navvulu evvarivammaa
nee rAju evvaranTA?
ee rOjE cheppamanTA
nee rAju evvaranTA?
ee rOjE cheppamanTA

---

A:
allari pillaku nEDu..veyyAli ika meLLo taaDu
muDivEsE sirigala monagaaDu..evvarE vaaDu
a:
chakkani rAmuDu veeDu..nee varasaku moguDavutaaDu
A:
illAlini vadilina aa ghanuDu..ee pirOkODu
aa krishNuni amSana veeDE nee korakE ilA puTTADE
gopikalE vastE aTE parigEDatADE
a:
O gaDasari pillA..nee kaDupuna koDukai puDtAnE
A:
kuturugA puTTu..nee pErE peDatAlE
a:
goDavenduku bAvatO veLLatAvA?
A:
pada bAvA..pAla kOvA

---

a:
chiTapaTa chinukulu rAli..avi chivaraku eTu chErAli
selayErulu pArE dArullO koluvunDAli
ninDuga nadulE urikE..avi chErunu E dariki
kalakaalam kaDalini chErangaa parigeDatAyi
aTTAgE naatO neevu..neetO nEnu unDAli
bratukantA okaTai ilA jata kAvAli
mana bommala peLLi..nuvvE taaLini kaDatAvaa?
maru janmaku kUDA ilA tODunTAvA?
O bAvA oTTE peDutunnA
nEnu kuDA oTTEstunnaa

nA rAju nuvvEnanTA
ee rOjE telisinDanTA

sinimaa:- jAnaki veDs SrIrAm
saahityam:- sirivennela
sangeetam:- ghanTADi krishNa
gAnam:- ghanTADi, sunIta, usha, varikuppal yAdagiri

Friday, March 25, 2011

 
ఆ:
ఓ మనసా తొందర పడకే
పదిమందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచం వినవే
వరమిచ్చిన దేవుని చూసే
సుముహూర్తం వస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర
అ:
ఓ మనసా తొందర పడకే
పదిమందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచం వినవే
చిరునవ్వుల దేవిని చూసే
సుముహూర్తం వస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర

కోరుస్(ఆ)
చెప్పవమ్మ చెప్పవమ్మ ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట

కోరుస్(అ)
చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట

---

అ:
తాజా గులాబి కన్నా
మురిపించు మల్లెల కన్నా
మెరిసే తార కన్నా
తన తలపే నాకు మిన్న
ఆ:
వేదాల ఘోష కన్నా
చిరుగాలి పాట కన్నా
ప్రియమార నన్ను తలిచే
తన మనసే నాకు మిన్న
అ:
మోహం, తొలి మోహం
కనుగీటుతున్న వేళ
ఆ:
రాగం, అనురాగం
ఎదపొంగుతున్న వేళ
చెప్పాలి ఒక చిన్న మాట

కోరుస్(ఆ)
చెప్పవమ్మ చెప్పవమ్మ ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట

కోరుస్(అ)
చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట

----

ఆ:
నాలోని ఆశ తానై
తనలోని శ్వాస నేనై
రవలించు రాగమేదో
పలికింది ఈ క్షణాన
అ:
నా కంటి పాప తానై
తన గుండె చూపు నేనై
పాడేటి ఊసులన్ని
మెదిలాయి ఈ క్షణాన
ఆ:
గాలి, చిరుగాలి
కబురైనా చేర్చలేవా
అ:
చెలిని, నెచ్చెలని
ఒకమారు చూపలేవా
విరహాన వేచే క్షణాన

కోరుస్(ఆ)
చెప్పవయ్య చెప్పవయ్య ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట

కోరుస్(అ)
చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట

సినిమా:- ఒక చిన్న మాట
సాహిత్యం:- భువనచంద్ర
సంగీతం:- రమణి భరద్వాజ్
గానం:- బాలు, చిత్ర

A:
O manasaa tondara paDakE
padimandilO allari tagadE
kanu choopulu kalisE vELa
naa mATalu koncham vinavE
varamicchina dEvuni choosE
sumuhoortam vastunna vELa
neekendukE ee tondara
a:
O manasaa tondara paDakE
padimandilO allari tagadE
kanu choopulu kalisE vELa
naa mATalu koncham vinavE
chirunavvula dEvini choosE
sumuhoortam vastunna vELa
neekendukE ee tondara

kOrus(A)
cheppavamma cheppavamma oka chinna mATa
chinnavaaDi manasu neetO anna mATa

kOrus(a)
cheppu cheppu oka chinna mATa
chinnadaani manasu neetO anna mATa

---

a:
taajA gulaabi kannA
muripinchu mallela kannA
merisE taara kannA
tana talapE naaku minna
A:
vEdaala ghOsha kannA
chirugaali paaTa kannA
priyamaara nannu talichE
tana manasE naaku minna
a:
mOham, toli mOham
kanugeeTutunna vELa
A:
raagam, anuraagam
edapongutunna vELa
cheppAli oka chinna mATa

kOrus(A)
cheppavamma cheppavamma oka chinna maaTa
chinnavaaDi manasu neetO anna maaTa

kOrus(a)
cheppu cheppu oka chinna maaTa
chinnadaani manasu neetO anna maaTa

----

A:
naalOni aaSa taanai
tanalOni Swaasa nEnai
ravalinchu raagamEdO
palikindi ee kshaNAna
a:
naa kanTi paapa taanai
tana gunDe choopu nEnai
paaDETi oosulanni
medilaayi ee kshaNAna
A:
gaali, chirugaali
kaburainaa chErchalEvaa
a:
chelini, necchelani
okamaaru choopalEvaa
virahAna vEchE kshaNAna

kOrus(A)
cheppavayya cheppavayya oka chinna maaTa
chinnadaani manasu neetO anna maaTa

kOrus(a)
cheppu cheppu oka chinna maaTa
chinnavaaDi manasu neetO anna maaTa

sinimaa:- oka chinna mATa
saahityam:- bhuvanachandra
sangeetam:- ramaNi bharadwaaj
gaanam:- bAlu, chitra

 
జాబిలమ్మ ఆగవమ్మా ఆలకించవా మదిలో మాట
రేగిపొయే మూగ ప్రేమ విన్నవించే ఈ ఎదకోత
అమావాస్యకే బలై మన కధ
ఎటెళ్ళుతున్నదో నీకు తెలియాదా
నా బ్రతుకున బ్రతుకై ముడిపడిపోయిన ఓ ప్రియతమా

నీ మనసునే తన కొలువంటూ..నిను చేరిన నా మది
అనురాగపు మణిదీపముగా..ఆ గుడిలో ఉన్నది
ఏ కలతల సుడిగాలులకి..ఆరని వెలుగే అది
నువ్వు వెలి వెయ్యాలనుకున్న..నీ నీడై ఉన్నది
ప్రాణమే ఇలా..నిన్ను చేరగా
తనువు మాత్రము..శిలై ఉన్నది
ఈ శిల చిగురించే చినుకే నీలో దాగున్నది

కనివిని ఎరుగని కలయికగా..అనిపించిన జీవితం
ఎడబాటున జరిగిన గతమై..చినబొయేను ఈ క్షణం
విషజ్వాలలు విసిరిన అహమే..మసిచేసెను కాపురం
ఏ మసకల ముసుగులు లేని..మమకారమే శాశ్వతం
ప్రణయమన్నది ఇదేనా అని
మనని అడగదా లోకమన్నది
బదులీయపోతే ప్రేమకి విలువే పోదా మరి


సినిమా:- శుభవార్త
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- కోటి
గానం:- బాలు



jaabilamma aagavammaa aalakinchavaa madilO maaTa
rEgipoyE mooga prEma vinnavinchE ee edakOta
amaavaasyakE balai mana kadha
eTeLLutunnadO neeku teliyaadaa
naa bratukuna bratukai muDipaDipOyina O priyatamaa

nee manasunE tana koluvanTU..ninu chErina naa madi
anuraagapu maNideepamugaa..aa guDilO unnadi
E kalatala suDigaalulaki..aarani velugE adi
nuvvu veli veyyaalanukunna..nee neeDai unnadi
praaNamE ilaa..ninnu chEragaa
tanuvu maatramu..Silai unnadi
ee Sila chigurinchE chinukE neelO daagunnadi

kanivini erugani kalayikagaa..anipinchina jeevitam
eDabaaTuna jarigina gatamai..chinaboyEnu ee kshaNam
vishajwaalalu visirina ahamE..masichEsenu kaapuram
E masakala musugulu lEni..mamakaaramE SaaSwatam
praNayamannadi idEnaa ani
manani aDagadaa lOkamannadi
baduleeyapOtE prEmaki viluvE pOdaa mari


sinimaa:- Subhavaarta
saahityam:- sirivennela
sangeetam:- kOTi
gaanam:- bAlu

 
జాబిలమ్మ ఆగవమ్మ ఆలకించవా ఈ శుభవార్త
జంట ప్రేమ చాటెనమ్మ వేలవన్నెల ఈ శుభవార్త
కలే తీయ్యగా ఫలించేనని
వరాలే ఇలా వరించేనని
ఈ కనివిని ఎరుగని కళ్యాణం అపురూపం అని

అ:
రతిమదనులు తొలి అతిధులుగా..కదిలొచ్చే కాలమని
శ్రుతిముదిరిన తహతహలన్ని..ఆహ్వానం పాడని
ఆ:
మన కలయిక కలలకు కలగా..అనిపించే సమయమని
కునుకెరుగక ప్రతి నిమిషాన్ని..కౌగిల్లో సాగని
అ:
చెరోసగమయే సరాగాలతో
ఒకే ప్రాణమై ఉందాం రమ్మని
ఆ:
ఎడబాటే లేని ఏకాంతన్ని అందించని


ఆ:
కలతెరుగని తలపుల హ్రుదయం..తను కోరిన కోవ్వెలని
కళతరగని వలపుల దీపం..మన ఎదలో చేరని
అ:
ఏ ఋతువున చేదరని స్నేహం..మన బ్రతుకున ఉన్నదని
మన పెదవుల నిలిచిన చైత్రం..చిరునవ్వులు పూయని
ఆ:
సదా ఈ జత..ఇదే తీరుగా
ప్రతి ఊహని..నిజం చెయ్యగా
అ:
నీ తీయని చెలిమే తీరని రునమై జీవించని

సినిమా:- శుభవార్త
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- కోటి
గానం:- బాలు, చిత్ర

jaabilamma aagavamma aalakinchavaa ee Subhavaarta
janTa prEma chaaTenamma vElavannela ee Subhavaarta
kalE teeyyagaa phalinchEnani
varaalE ilaa varinchEnani
ee kanivini erugani kaLyaaNam apuroopam ani

a:
ratimadanulu toli atidhulugaa..kadilocchE kaalamani
Srutimudirina tahatahalanni..aahvaanam paaDani
A:
mana kalayika kalalaku kalagaa..anipinchE samayamani
kunukerugaka prati nimishaanni..kougillO saagani
a:
cherOsagamayE saraagaalatO
okE praaNamai undaam rammani
A:
eDabaaTE lEni Ekaantanni andinchani


A:
kalaterugani talapula hrudayam..tanu kOrina kOvvelani
kaLataragani valapula deepam..mana edalO chErani
a:
E Rtuvuna chEdarani snEham..mana bratukuna unnadani
mana pedavula nilichina chaitram..chirunavvulu pooyani
A:
sadaa ee jata..idE teerugaa
prati oohani..nijam cheyyagaa
a:
nee teeyani chelimE teerani runamai jeevinchani

sinimaa:- Subhavaarta
saahityam:- sirivennela
sangeetam:- kOTi
gaanam:- bAlu, chitra

Thursday, March 24, 2011

 
ఆరని ఆకలి కాలం..కలికాలం
అవనికి ఆఖరి కాలం..కలికాలం
నీతిని కాల్చే నిప్పుల గోళం
నిలువునా కూల్చే నిష్టుర జాలం
కలికాలం ఆకలి కాలం
కలికాలం ఆఖరి కాలం

ఈ గాలి ఏ జాలి ఎరుగదు
ఈ నేల ఏ పూలు విరియదు
ఈ మూల ఎకాకి ప్రతి మనిషి
ఈ గోల ఎనాడు అణగదు
ఈ జ్వాల ఏవేళ తరగదు
ఈ నింగి పంచేది కటిక నిశి
కూటికోసమేనా ఇంత చేటు బోను
సాటివారిపైనా కాటు వేయు జోరు
మనిషే మృగమై అడవైపోయే నడివీధిలో
కూరిమి కోరని క్రౌర్యం..యుగసారం
ఓరిమి చేరని వైరం..గ్రహచారం
కత్తులు నూరే కర్మాదానం
నెత్తురు పారే అత్యాచారం
కసికాలం..రక్కసికాలం
కలికాలం ఆఖరి కాలం

వాటాల పోటీల నడుమ వేలాడుతుంటారు మనుషులు
వ్యాపారమే వావి వరసులుగా
వేలాల పాఠం విలువలు వేసారిపోతాయి మనసులు
ఏపాటి స్నేహాలు కనపడక
రాగిపైసతోనే వేగుపాశమైనా
అత్యాశతోనే అయినవాళ్ళ ప్రేమ..
అడిగే వెలనే చెల్లించాలి అడుగు అడుగున
అంగడి సరుకై పోయే మమకారం
అమ్ముడు పొమ్మని తరిమే పరివారం
తీరని నేరం...ఈ వ్యవహారం
తియాని నేరం..ఈ సంసారం
కనికారం కానని కాలం
కలికాలం ఆకలి కాలం

నీ బ్రతుకు తెల్లారినాకే..
వేరొకరి ఆశలకు వేకువ..
ఈ ఇరుకు లోకాల వాడుక ఇది
ఓ పాడె మేళాల అపశ్రుతి..
ఓ పెళ్ళి కట్నాల ఫలశ్రుతి..
ఏ కరకు ధర్మాల వేడుక ఇది
కాటి కాంతిలోనే బాట చూసుకుంటూ
కాళరాత్రిలోనే చోటు చేసుకుంటూ
బ్రతుకే వెతికే ఏ రాకాసి లోకం ఇది
సంతతి సౌఖ్యం కోసం బలిదానం
అల్లిన ఈ యమ పాశం బహుమానం
ఆశలు అల్లే ఈ విష జాలం
చీకటి పాడే చిచ్చుల గానం
కలికాలం కలతల గాళం
కలికాలం ఆకలి కాలం


ఏనాటి కానాడు నిత్యం వేదించు ఆ పేద గాధకు
ఈనాడు రేటంత పెరిగినది
జీవించినన్నాలు ఎన్నడు
ఊహించలేనంత పెన్నిధి
ఈ వారసత్వానికి ఇచ్చినది
చావుకున్న భీమ..జీవితానికి ఏది
ఊపిరున్న ధీమా..జ్ఞాపకానికి ఏది
కనకే కనకం..కన్నీరేందుకు అంటున్నది
నమ్మినవారికి నష్టం కొనప్రాణం
తప్పక తీరును చస్తే ఋణకాలం
ఆహుతి కాని నిన్నటి రూపం
కంచికి పోని నీ కధ వేగం
అనివార్యం ఈ పరిహారం
కలికాలం ఆకలి కాలం

పైనున్న పున్నామనరకం..
దాటించు పుణ్యాల వరమని..
పుత్రులున్ని కన్న ఫలితమిది
ప్రాణాలు పోయెటిలోపునే..
వెంటాడి వేటాడి నిలువునా..
అంటించి పోతారు తలకొరివి
పాలు పోసి పెంచే..కాల నాగు రూపం.
నోము నోచి పొందే..ఘోరమైన శాపం
బ్రతుకే బరువై..చితినే శరణు వేడే క్షణం
కోరలు చాచిన స్వార్ధం..పరమార్ధం
తీరని కాంక్షల రాజ్యం..ఈ సంఘం
నీతిని కాల్చే..నిప్పుల గోళం
నిలువున కూల్చే..నిష్టుర జాళం
కలికాలం ఆకలి కాలం
కలికాలం ఆఖరి కాలం

ఈ మాయ భందాలు నమ్మకు
ఈ పరుగు పందాల ఆగకు
నీ బాట నీదేరా కడవరకు
ఏ గాలిని దారి అడగకు
ఏ జాలికి ఎదురు చూడకు
నీ నీడే నీ తోడనుకో
ఓడలాగ నిన్ను..వాడుకున్న వారు
తీరమందగానే..తిరిగి చూడబోరు
పడవై బ్రతికి నది ఓడిలోనే నిలిచి ఉండకు
ఏరయి పారే కాలం ఏమైనా
సాక్షిగ నిలిచిన గట్టు కరిగేనా
వేసవి కాని..వెల్లువ రాని
శాశ్వత స్నేహం అల్లుకుపోని
చెదిరేనా పండిన భంధం
చెరిపేనా ఏ కలికాలం

సినిమా:- కలికాలం
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- విద్యాసాగర్
గానం:- బాలు

aarani aakali kaalam..kalikAlam
avaniki aakhari kaalam..kalikAlam
neetini kaalchE nippula gOLam
niluvunA koolchE nishTura jAlam
kalikAlam aakali kAlam
kalikAlam aakhari kAlam

ee gAli E jAli erugadu
ee nEla E poolu viriyadu
ee moola ekAki prati manishi
ee gOla enaaDu aNagadu
ee jwAla EvELa taragadu
ee ningi panchEdi kaTika niSi
kooTikOsamEnA inta chETu bOnu
saaTivAripainA kaaTu vEyu jOru
manishE mRgamai aDavaipOyE naDiveedhilO
koorimi kOrani krouryam..yugasAram
Orimi chErani vairam..grahachAram
kattulu noorE karmAdaanam
netturu paarE atyaachAram
kasikAlam..rakkasikAlam
kalikAlam aakhari kAlam

vATala pOTIla naDuma vElADutunTAru manushulu
vyaapaaramE vaavi varasulugaa
vElaala paaTHam viluvalu vEsaaripOtaayi manasulu
EpaaTi snEhaalu kanapaDaka
raagipaisatOnE vEgupASamainA
atyaaSatOnE ayinavaaLLa prEma..
aDigE velanE chellinchaali aDugu aDuguna
angaDi sarukai pOyE mamakaaram
ammuDu pommani tarimE parivaaram
teerani nEram...ee vyavahaaram
tiyaani nEram..ee samsaaram
kanikaaram kaanani kaalam
kalikaalam aakali kaalam

nee bratuku tellaarinaakE..
vErokari aaSalaku vEkuva..
ee iruku lOkaala vaaDuka idi
O paaDe mELaala apaSruti..
O peLLi kaTnaala phalaSruti..
E karaku dharmaala vEDuka idi
kaaTi kaantilOnE baaTa choosukunTU
kaaLaraatrilOnE chOTu chEsukunTU
bratukE vetikE E raakaasi lOkam idi
santati soukhyam kOsam balidaanam
allina ee yama paaSam bahumaanam
aaSalu allE ee visha jaalam
cheekaTi paaDE chicchula gaanam
kalikaalam kalatala gaaLam
kalikaalam aakali kaalam


EnaaTi kaanaaDu nityam vEdinchu aa pEda gaadhaku
eenaaDu rETanta periginadi
jeevinchinannaalu ennaDu
oohinchalEnanta pennidhi
ee vaarasatvaaniki icchinadi
chaavukunna bheema..jeevitaaniki Edi
oopirunna dheemA..jnaapakaaniki Edi
kanakE kanakam..kannIrEnduku anTunnadi
namminavaariki nashTam konapraaNam
tappaka teerunu chastE RNakaalam
aahuti kaani ninnaTi roopam
kanchiki pOni nee kadha vEgam
anivaaryam ee parihaaram
kalikaalam aakali kaalam

painunna punnaamanarakam..
daaTinchu puNyaala varamani..
putrulunni kanna phalitamidi
praaNaalu pOyeTilOpunE..
venTaaDi vETaaDi niluvunaa..
anTinchi pOtaaru talakorivi
paalu pOsi penchE..kaala naagu roopam.
nOmu nOchi pondE..ghOramaina Saapam
bratukE baruvai..chitinE SaraNu vEDE kshaNam
kOralu chaachina swaardham..paramaardham
teerani kaankshala raajyam..ee sangham
neetini kaalchE..nippula gOLam
niluvuna koolchE..nishTura jaaLam
kalikaalam aakali kaalam
kalikaalam aakhari kaalam

ee maaya bhandaalu nammaku
ee parugu pandaala aagaku
nee baaTa needEraa kaDavaraku
E gaalini daari aDagaku
E jaaliki eduru chooDaku
nee neeDE nee tODanukO
ODalaaga ninnu..vaaDukunna vaaru
teeramandagaanE..tirigi chooDabOru
paDavai bratiki nadi ODilOnE nilichi unDaku
Erayi paarE kaalam Emainaa
saakshiga nilichina gaTTu karigEnaa
vEsavi kaani..velluva raani
SaaSwata snEham allukupOni
chedirEnaa panDina bhandham
cheripEnaa E kalikaalam

sinimaa:- kalikaalam
saahityam:- sirivennela
sangeetam:- vidyaasaagar
gaanam:- bAlu

Labels: , , ,


Wednesday, March 23, 2011

 
జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి

ప్రజహితం తన విధానమంటూ
జ్వలించే జనించే యువ ప్రభాతం
సమాజ ద్రోహుల సమాధి చేయగా
ప్రతిజ్ఞ చేసే అశోక చక్రం
యజ్ఞగుండమై బుగ బుగలాడిన
జాతిపౌరుషం ఈ చైతన్యం
నిశ్చయ నిర్భయ హిమాలయమై
యువత గుండె గర్జించిన సమయం

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి

ఉరుముల మెరుపుల ఉద్రేకముతో
పిడుగై పడినది చేడుపై లాఠి
పిడికిలి బిగించి విజ్రుభించి
నేరస్తుల పాలిట ప్రళయ దూర్జటి
చీకటి కొండల చీడలా పెరిగిన
కీచక మూకల ప్రకంపం
శివం ఎత్తినది..కదం తొక్కినది
ఖాఖి కట్టిన జంజా పవనం

జండా
గర్జించినది జండా
గంభిరమైన జండా

ప్రచండ స్వభావ విప్లవ సింహం
అయ్యింది ప్రపంచ శాంతి కపోతం
సమాజ శిల్పం చెక్కగ నిలిచెను
తూఫాను గుండెల ప్రభాత దీపం
ప్రజా పీడకుల దురాగతాలకు
అరచాకాలకు సమూల చేదం
స్వదేశ విదేశ వినాశకులపై
ఉక్కుపాదముల ఉల్కాపాదం

జండా
విధి మార్చు జండా

అనలం అనిలం అజ్వం కలిసిన
రాజకీయ ప్రక్షాళన యగ్నం
న్యాయం చట్టం రెక్కలు కాగల
ధర్మ బద్ద రాజ్యాంగ విహంగం
ప్రపంచ భ్రమణం..సముద్ర చలనం
అతిక్రమించే యువ సంచలనం
ధరిత్రి పధమున త్రిమూర్తులు ఒకటై
శ్వాశత ప్రగతికి తపించు తరుణం

జండా


స్వతంత్ర భారతం జాతి పతాకం
దాల్చేను నేడీ విశ్వరూపం
మహా సముద్రం హిమగిరి శిఖరం
మరో ప్రపంచపు జయ సంకేతం
మానవాళికిది శుభపరిణామం
సహస్రాబ్ధికి సువర్ణఘట్టం
కాకుడదు ఇది ఇలలో స్వప్నం
నిలవాలి ఇది కలకాలం
జయ జయ ఘోషలు
రెప రెపలు కాగా
జండా ఎగిరెను గగన సీమలో
సూర్యచంద్రులకు ధీటుగ నిలిచి
ప్రకాశించినది ఆకాశంలో

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ట పెంచాలి


సినిమా:- జండా
సాహిత్యం:- జొన్నవిత్తుల
సంగీతం:- వందేమాతరం శ్రీనివాస్
గానం:- బాలు


janDA
jai hind ani egaraali
mana pratishTha penchaali

prajahitam tana vidhaanamanTU
jwalinchE janinchE yuva prabhaatam
samaaja drOhula samaadhi chEyagaa
pratijna chEsE aSOka chakram
yajnagunDamai buga bugalaaDina
jaatipourusham ee chaitanyam
niSchaya nirbhaya himaalayamai
yuvata gunDe garjinchina samayam

janDA
jai hind ani egaraali
mana pratishTha penchaali

urumula merupula udrEkamutO
piDugai paDinadi chEDupai laaTHi
piDikili biginchi vijrubhinchi
nErastula paaliTa praLaya doorjaTi
cheekaTi konDala cheeDalaa perigina
keechaka mookala prakanpam
Sivam ettinadi..kadam tokkinadi
khaakhi kaTTina janjaa pavanam

janDA
garjinchinadi janDA
gambhiramaina janDA

prachanDa swabhaava viplava si&Mham
ayyindi prapancha Saanti kapOtam
samaaja Silpam chekkaga nilichenu
toophaanu gunDela prabhaata deepam
prajaa peeDakula duraagataalaku
arachaakaalaku samoola chEdam
swadESa vidESa vinaaSakulapai
ukkupaadamula ulkaapaadam

janDA
vidhi maarchu janDA

analam anilam ajwam kalisina
raajakeeya prakshaaLana yagnam
nyaayam chaTTam rekkalu kaagala
dharma badda raajyaanga vihangam
prapancha bhramaNam..samudra chalanam
atikraminchE yuva sanchalanam
dharitri padhamuna trimoortulu okaTai
SwaaSata pragatiki tapinchu taruNam

janDA


swatantra bhaaratam jaati pataakam
daalchEnu nEDI viSwaroopam
mahaa samudram himagiri Sikharam
marO prapanchapu jaya sankEtam
maanavaaLikidi SubhapariNaamam
sahasraabdhiki suvarNaghaTTam
kaakuDadu idi ilalO swapnam
nilavaali idi kalakaalam
jaya jaya ghOshalu
repa repalu kaagaa
janDA egirenu gagana seemalO
sooryachandrulaku dheeTuga nilichi
prakaaSinchinadi aakaaSamlO

janDA
jai hind ani egaraali
mana pratishTa penchaali


sinimaa:- janDA
saahityam:- jonnavittula
sangeetam:- vandEmaataram SrInivaas
gaanam:- bAlu

 
జిస్ దేష్ మైన్ గంగ బెహెతి హై
ఇస్ భారత్ కే హం వారస్ హై
తాజ్ మహల్ మా ప్రేమకు గుర్తు
కాశ్మీరం మా కుంకుమ బొట్టు
తలవంచని మా పౌరుషాన్ని చూపించేదే everest
చుక్కలు దాటిన మన చరిత్రని
కుక్కలు చింపిన విస్తరి చేస్తే
వదలం..వదలం..ఎవ్వరినైనా వదలం

కళ్ళకు reban గ్లాసులున్నా
పగటి దొంగలను చూస్తుంటాం
కాళ్ళకు reebook షూస్ ఉన్నా
గుంట నక్కలను తొక్కేస్తాం
లవెర్తో i love you డే అండ్ nighT చెబుతున్నా
గుండె గుండేలో i love bharat అనే మాటాను జపిస్తాం
gold medals ఉన్నా..jobs ఇవ్వమని తిరగం
route చెప్పమని తల్లి తంద్రులను అడగం
problems ఎన్నో ఉన్నా చిరునవ్వుతో సరిచేస్తాం
but
దేశ సంపదను వీధి కుక్కలు పంది కొక్కులా తింటుంటే
పట్ట పగలు నిల దీసి అడుగుతాం
నిప్పుతోటి నిట్ట నిలువునా కడుగుతాం
youth మొత్తం uniform లేని millatry అవుతాం
వదలం..వదలం..ఎవ్వరినైనా వదలం

పదవుల కోసమని ఒకే జాతిని
చీల్చే వాళ్ళని చీలుస్తాం
పులి చర్మాలే నిలువునా వొలిచేస్తున్నా
మానవ పులులను మన్నిచం
శిలాఫలకను వేస్తూ ప్రజలను భ్రమలో పెడితే భరించం
కులాల పేరిట కుంపటి పెట్టే కుళ్ళు పురుగులను క్షమించం
సైనిక శక్తుల నెత్తురు శవపేతికలుగా దోచెస్తే
సహించబోమీ ఘోరం
సవ్యసాచులై ఎదిరిస్తాం
but
జరుగుతున్న ఈ దురాగతం
మీరు పట్టనట్టుగా చూస్తుంటే
స్వాతంత్రం వచ్చింది చాలని నత్తగుల్లలై పడుకుంటే
మీ సోమరి గుండెలలో ఉరుముతూ మేలుకొలుపుతాం
వదలం..వదలం..ఎవ్వరినైనా వదలం

సినిమా:- జండా
సాహిత్యం:- సుద్దాల అశొక్ తేజ
సంగీతం:- వందేమాతరం శ్రీనివాస్
గానం:- శంకర్ మహదేవన్



jis dEsh mein ganga beheti hai
is bhaarat kE ham vaaras hai
taaj mahal maa prEmaku gurtu
kaaSmeeram maa kumkuma boTTu
talavanchani maa pourushaanni choopinchEdE #everest#
chukkalu daaTina mana charitrani
kukkalu chimpina vistari chEstE
vadalam..vadalam..evvarinainaa vadalam

kaLLaku #reban# glaasulunnaa
pagaTi dongalanu choostunTaam
kaaLLaku #reebook# shUs unnaa
gunTa nakkalanu tokkEstaam
lavertO #i love you# DE anD #nighT# chebutunnaa
gunDe gunDElO #i love bharat# anE maaTaanu japistaam
#gold medals# unnaa..#jobs# ivvamani tiragam
#route# cheppamani talli tandrulanu aDagam
#problems# ennO unnaa chirunavvutO sarichEstaam
#but#
dESa sampadanu veedhi kukkalu pandi kokkulaa tinTunTE
paTTa pagalu nila deesi aDugutaam
nipputOTi niTTa niluvunaa kaDugutaam
#youth# mottam #uniform# lEni #millatry# avutaam
vadalam..vadalam..evvarinainaa vadalam

padavula kOsamani okE jaatini
cheelchE vaaLLani cheelustaam
puli charmaalE niluvunaa volichEstunnaa
maanava pululanu mannicham
Silaaphalakanu vEstU prajalanu bhramalO peDitE bharincham
kulaala pEriTa kumpaTi peTTE kuLLu purugulanu kshamincham
sainika Saktula netturu SavapEtikalugaa dOchestE
sahinchabOmI ghOram
savyasaachulai ediristaam
#but#
jarugutunna ee duraagatam
meeru paTTanaTTugaa choostunTE
swaatantram vacchindi chaalani nattagullalai paDukunTE
mee sOmari gunDelalO urumutU mElukoluputaam
vadalam..vadalam..evvarinainaa vadalam

sinimaa:- janDA
saahityam:- suddAla aSok tEja
sangeetam:- vandEmaataram SrInivaas
gaanam:- Sankar mahadEvan

 
అఖండ భారత జాతి విముక్తికి ప్రభవించిన జండా
వందేమాతరం
దురాక్రమనపై పరాక్రమించిన చరిత్ర ఈ జండా
వందేమాతరం
ప్రపంచ శాంతికి ప్రభాతదీపం ప్రియ భారత జండా
వందేమాతరం
జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి


ఎగరవేయకు నన్ను గగనసీమకు
గౌరవం అను పేర గుండెమంట రేపకు
స్వతంత్ర దినోత్స్తవాన రక్షణ కవచాల వెనుక
జాతి ప్రసంగం చేసే నాయకులను చూడలేను
భారతీయ గౌరవాన్ని..తెలుగు జాతి మర్యాదని
కుక్కలు చింపిన విస్తరి చేస్తుంటే ఆపలేను
దేశ భద్రతను అమ్మే నీచుల శిక్షించలేను
రాజకీయ చదరంగ ఎత్తులను భరించలేను
అర్ధ శతాభ్దము పైన పోందా అవమానాలు
పైనుంచి ఇక చూడలేను జరుగుతున్న ఘోరాలు
స్వతంత్ర యోధులను తెల్ల దొరలు కాల్చినారు
స్వతంత్ర భారతిని నల్ల దొరలు కూల్చె నేడు
రెప రెపలు కావు ఇవి..రేపవల కన్నీళ్ళు
ధగ ధగలు కావు ఇవి..గుండె పగులు మంటలు


జండా ఆఆ
ఎందుకు ఎగరాలి
నేనుదుకు ఎగరాలి

సినిమా:- జండా
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- వందేమాతరం శ్రీనివాస్
గానం:- బాలు, వందేమాతరం శ్రీనివాస్


aKhanDa bhaarata jaati vimuktiki prabhavinchina janDaa
vandEmaataram
duraakramanapai paraakraminchina charitra ee janDaa
vandEmaataram
prapancha Saantiki prabhaatadeepam priya bhaarata janDaa
vandEmaataram
janDA
jai hind ani egaraali
mana pratishTha penchaali


egaravEyaku nannu gaganaseemaku
gouravam anu pEra gunDemanTa rEpaku
swatantra dinOtstavaana rakshaNa kavachaala venuka
jaati prasangam chEsE naayakulanu chooDalEnu
bhaarateeya gouravaanni..telugu jaati maryaadani
kukkalu chimpina vistari chEstunTE aapalEnu
dESa bhadratanu ammE neechula SikshinchalEnu
raajakeeya chadaranga ettulanu bharinchalEnu
ardha Sataabhdamu paina pOndaa avamaanaalu
painunchi ika chooDalEnu jarugutunna ghOraalu
swatantra yOdhulanu tella doralu kaalchinaaru
swatantra bhaaratini nalla doralu koolche nEDu
repa repalu kaavu ivi..rEpavala kanneeLLu
dhaga dhagalu kaavu ivi..gunDe pagulu manTalu

janDA
enduku egaraali
nEnuduku egaraali

sinimaa:- janDA
saahityam:- sirivennela
sangeetam:- vandEmaataram SrInivaas
gaanam:- bAlu, vandEmaataram SrInivaas

Monday, March 21, 2011

 
ధిన్ ధిన్ తార..ధిన్ తార..ధిన్ ధిన్ తార..ధిన్ ధిన్ ధిన్నా
అంగరంగ వైభోగంగా పెళ్ళి చేద్దాం రారండి
నిండు పందిరి వేసుందండి నేల పీట ఆయిందండి
బుగ్గ చుక్కతో పెళ్ళికూతురు సిగ్గు మొగ్గ ఆయింది
పక్కవాడితో లగ్గమైతే ఆ మొగ్గ విరియునండి
కొంగుముళ్ళతో పగ్గమెయ్యగా పిల్ల ఎదురయింది
అరె కుదురులేని ఈ కుర్రవాడికి తిక్క కుదురుతుంది
ధిన్ ధిన్ తార..ధిన్ తార..ధిన్ ధిన్ తార..ధిన్ ధిన్ ధిన్నా

అ:
పాలరాతి మేడ కరిగి..నేల మీద కాళ్ళే కడిగి
పేదపెద్దలు అను తేడాలను చెరపాలి
ఆ:
కోటలోని ఆ యువరాణి..తోటరాముడితో జతగూడి
ప్రేమరాజ్యమును కలకాలం పాలించాలి
అ:
కలిమికి చెలిమికి నడుమున నిలిచిన ఇనుప తెరలు కరుగుతూ ఉంటే
కని విని యెరుగని జత ఇదని మన మనసు పాడుతుందే
ఆ:
మనువుతో ముడిపడి విరిసిన మనసులు ఒకరికొకరు అనిపిస్తుంటే
తళతళ వెలుగుల తడిసిన కనులకు సిరులు దొరికినట్లే

ఆ:
ముందుజన్మలో ఋణమంతా తీర్చుకోను కలిసిందంట
బ్రహ్మరాతలకు అర్ధం చెప్పే ఈ జంట
అ:
ముందు ఇద్దరుంటారంట..కలిసి ఒక్కటవుతారంట
లెక్క చూస్తే పైఏటికి మూడవుతారంట
ఆ:
మసకలు, ముసుగులు గుసగుస గోదవులు
ఉరికి ఉరికి తలబడుతుంటే
పరులకు తెలియని పడుచుతనపు కధ వదను తేలుతుందే
అ:
జరిగిన తగువుకు బిడియము భయపడి పరువు విడిచి పరుగేడుతుంటే
తికమక పడి కరిగే సమయము తెల్లవారుతుందే

సినిమా:- నవ్వుతూ బ్రతకాలిరా
సాహితం:- సిరివెన్నెల
సంగీతం:- దేవిశ్రిప్రాసాద్
గానం:- దేవిశ్రిప్రాసాద్, మురళి, సుమంగళి

dhin dhin taara..dhin taara..dhin dhin taara..dhin dhin dhinnaa
angaranga vaibhOgangaa peLLi chEddaam raaranDi
ninDu pandiri vEsundanDi nEla peeTa aayindanDi
bugga chukkatO peLLikUturu siggu mogga aayindi
pakkavaaDitO laggamaitE aa mogga viriyunanDi
kongumuLLatO paggameyyagaa pilla edurayindi
are kudurulEni ee kurravaaDiki tikka kudurutundi
dhin dhin taara..dhin taara..dhin dhin taara..dhin dhin dhinnaa

a:
paalaraati mEDa karigi..nEla meeda kaaLLE kaDigi
pEdapeddalu anu tEDaalanu cherapaali
A:
kOTalOni aa yuvaraaNi..tOTaraamuDitO jatagUDi
prEmaraajyamunu kalakaalam paalinchaali
a:
kalimiki chelimiki naDumuna nilichina inupa teralu karugutU unTE
kani vini yerugani jata idani mana manasu paaDutundE
A:
manuvutO muDipaDi virisina manasulu okarikokaru anipistunTE
taLataLa velugula taDisina kanulaku sirulu dorikinaTlE

A:
mundujanmalO RNamantaa teerchukOnu kalisindanTa
brahmaraatalaku ardham cheppE ee janTa
a:
mundu iddarunTaaranTa..kalisi okkaTavutaaranTa
lekka choostE paiETiki mooDavutaaranTa
A:
masakalu, musugulu gusagusa gOdavulu
uriki uriki talabaDutunTE
parulaku teliyani paDuchutanapu kadha vadanu tElutundE
a:
jarigina taguvuku biDiyamu bhayapaDi paruvu viDichi parugEDutunTE
tikamaka paDi karigE samayamu tellavaarutundE

sinimaa:- navvutU bratakaaliraa
saahitam:- sirivennela
sangeetam:- dEviSripraasaad
gaanam:- dEviSripraasaad, muraLi, sumangaLi

 
ధిరనతోం తకిట..ధిరనతోం తకిట..ధిరనతోం తకిట..తా న న
నిదుర ఉండదట..కుదురు ఉండదట..మధురమైన ఈ మైకాన
నిమిషుమైనా ఇక నిలవీనయదట..మొదట అందరికి ఇంతేనా?
తగని తొందరట..చిలిపి చిందులట..అదుపులేని ఆనందాన
వలపు తేన వచ్చి..కలుసుకున్న మది..ఆగనన్నది ఏమైనా

ధిరనతోం తకిట..ధిరనతోం తకిట..ధిరనతోం తకిట..తా న న
నిదుర ఉండదట..కుదురు ఉండదట..మధురమైన ఈ మైకాన

మనసుతో..మనసు ముడిపడినది
కనులతో..కనులు కలిసినవి
వయసుతో..వయసు జతపడినది
వలపుతో..వరస కుదిరినది
చెలియలో..లయలు తికమక పడినవి
కులుకులో..కునుకు చెదిరినది
నడకలో..నడుము నలిగిన బరువిది
బిగువుతో..సొగసు రగిలినది
చలువ నీడ అని..తగిన తోడు అని
వొడికి చేరని అల్లరిని

ధిరనతోం తకిట..ధిరనతోం తకిట..ధిరనతోం తకిట..తా న న
నిదుర ఉండదట..కుదురు ఉండదట..మధురమైన ఈ మైకాన

బిడియమా..అవును సహజము కదా
వదులుకో..ముడుపు తెలియదుగా
తమకమా..తమకు తెలుసును కదా
కలుసుకో..తెగని తగువు కదా
చినుకులా..ఎదను తడిమిన గొడవిది
వరదలా..ఎదిగి తరిమినది
మెరుపులా..మెలిక తిరిగిన కధకళి
తనువులో..తలపు తెలిపినది
అదురుతున్న తడి..పెదవి అలజడి
నిదురలేవని కలలన్ని

సినిమా:- నవ్వుతూ బ్రతకాలిరా
సాహితం:- సిరివెన్నెల
సంగీతం:- దేవిశ్రిప్రాసాద్
గానం:- బాలు, సుమంగళి


dhiranatOm takiTa..dhiranatOm takiTa..dhiranatOm takiTa..taa na na
nidura unDadaTa..kuduru unDadaTa..madhuramaina ee maikaana
nimishumainaa ika nilaveenayadaTa..modaTa andariki intEnaa?
tagani tondaraTa..chilipi chindulaTa..adupulEni aanandaana
valapu tEna vacchi..kalusukunna madi..aaganannadi Emainaa

dhiranatOm takiTa..dhiranatOm takiTa..dhiranatOm takiTa..taa na na
nidura unDadaTa..kuduru unDadaTa..madhuramaina ee maikaana

manasutO..manasu muDipaDinadi
kanulatO..kanulu kalisinavi
vayasutO..vayasu jatapaDinadi
valaputO..varasa kudirinadi
cheliyalO..layalu tikamaka paDinavi
kulukulO..kunuku chedirinadi
naDakalO..naDumu naligina baruvidi
biguvutO..sogasu ragilinadi
chaluva neeDa ani..tagina tODu ani
voDiki chErani allarini

dhiranatOm takiTa..dhiranatOm takiTa..dhiranatOm takiTa..taa na na
nidura unDadaTa..kuduru unDadaTa..madhuramaina ee maikaana

biDiyamaa..avunu sahajamu kadaa
vadulukO..muDupu teliyadugaa
tamakamaa..tamaku telusunu kadaa
kalusukO..tegani taguvu kadaa
chinukulaa..edanu taDimina goDavidi
varadalaa..edigi tariminadi
merupulaa..melika tirigina kadhakaLi
tanuvulO..talapu telipinadi
adurutunna taDi..pedavi alajaDi
niduralEvani kalalanni

sinimaa:- navvutU bratakaaliraa
saahitam:- sirivennela
sangeetam:- dEviSripraasaad
gaanam:- bAlu, sumangaLi

 
ఇదివో రంగుల మేడ..అదివో రాజుల కోట
పదరా అద్దిరబన్న బుద్దులు చెప్పి నిద్దుర లేపాలి
ఇదివో రంగుల మేడ..అదివో రాజుల కోట
పదరా అద్దిరబన్న బుద్దులు చెప్పి నిద్దుర లేపాలి
పక్కనుంటే చక్కని పిట్ట
పట్టుకుంట చీపురు కట్ట
భూజు తీసి నేలకు కొట్ట..చలప్ప బెద్దంట

అ:
వేగలేక వెర్రెక్కితే..తాగినోడు కిర్రెక్కితే
చూడగానే చుర్రెక్కి చురకేస్తా
చుంపనాతి బుద్దులన్ని చెర్గేస్తా
ఆ:
తాళిలేని బుచ్చెమ్మకి
రాణివాస పిచ్చెక్కితే
రాజమండ్రి వీధుల్లో నడిపిస్తా
మోజులన్ని గోదాట్లో కలిపేస్తా
అ:
జత కలిసిందే..
ఓడలమ్మ పౌడరు డబ్బ
వేటగాడి ఈటెల దెబ్బ
పిండికొట్టి రోటిలో రుబ్బ..చలప్ప బెద్దంట

ఆ:
ఊరిమీద అప్పంట
ఇంటిలోన పప్పంట
తప్పులేని ఇల్లాలే నిప్పంట
చెప్పలేని కష్టాలే ముప్పంట
అ:
అస్వమేధ యాగలు
ఆరునొక్క రాగలు
జాకు పాట్ జన్మల్లో రాజంట
గుండెపోటు గుమ్మల్లో గుంజంట
ఆ:
కధ ముదిరింధే...
అల్లుడంటే తెల్లని కాకి
ఇల్లు మీద తీరని బాకి
వెడి దూది మెత్తగ ఏకి..బాజుల తుపాకి


సినిమా:- ఇరుగిల్లు పొరుగిల్లు
సాహితం:- ?????
సంగీతం:- రాజ్ కోటి
గానం:- బాలు, చిత్ర

idivO rangula mEDa..adivO raajula kOTa
padaraa addirabanna buddulu cheppi niddura lEpaali
idivO rangula mEDa..adivO raajula kOTa
padaraa addirabanna buddulu cheppi niddura lEpaali
pakkanunTE chakkani piTTa
paTTukunTa cheepuru kaTTa
bhooju teesi nElaku koTTa..chalappa beddanTa

a:
vEgalEka verrekkitE..taaginODu kirrekkitE
chooDagaanE churrekki churakEstaa
chumpanAti buddulanni chergEstaa
A:
taaLilEni bucchemmaki
raaNivaasa picchekkitE
raajamanDri veedhullO naDipistaa
mOjulanni gOdaaTlO kalipEstaa
a:
jata kalisindE..
ODalamma powDaru Dabba
vETagaaDi eeTela debba
pinDikoTTi rOTilO rubba..chalappa beddanTa

A:
oorimeeda appanTa
inTilOna pappanTa
tappulEni illaalE nippanTa
cheppalEni kashTaalE muppanTa
a:
aswamEdha yaagalu
aarunokka raagalu
jaaku pAT janmallO raajanTa
gunDepOTu gummallO gunjanTa
A:
kadha mudirindhE...
alluDanTE tellani kaaki
illu meeda teerani baaki
veDi doodi mettaga Eki..baajula tupaaki


sinimaa:- irugillu porugillu
saahitam:- ?????
sangeetam:- raaj kOTi
gaanam:- bAlu, chitra

 
అనురాగం విరిసిన రోజు
ఇల్లే కోవ్వెల ఈ రోజు
అరవైలొ నవ వాసంతం
అడుగిడి మురిసెను ఈ రోజు

పొద్దెమో వాలింది..ముద్దొచ్చి మెరిసింది
వద్దన్నా ఆనందం వరదై పొంగింది
పొద్దెమో వాలింది..ముద్దొచ్చి మెరిసింది
వద్దన్నా ఆనందం వరదై పొంగింది
దరహాసానికి పరిహాసం దాసోహం అనే ఈ రోజు

చీకటిలో వెలుతురును చూస్తున్నాం మనమంతా
లోకంలో వెలుగంతా చూసేను మన వంక
చీకటిలో వెలుతురును చూస్తున్నాం మనమంతా
లోకంలో వెలుగంతా చూసేను మన వంక
మమకరాం ఆలంబనగా మనుగడ సాగాలి ఇక రోజు

సినిమా:- చిన్న కోడలు
సాహితం:- ?????
సంగీతం:- బప్పిలహరి
గానం:- సుశీల, మనో


anuraagam virisina rOju
illE kOvvela ee rOju
aravailo nava vaasantam
aDugiDi murisenu ee rOju

poddemO vaalindi..muddocchi merisindi
vaddannaa aanandam varadai pongindi
poddemO vaalindi..muddocchi merisindi
vaddannaa aanandam varadai pongindi
darahaasaaniki parihaasam daasOham anE ee rOju

cheekaTilO veluturunu choostunnaam manamantaa
lOkamlO velugantaa choosEnu mana vanka
cheekaTilO veluturunu choostunnaam manamantaa
lOkamlO velugantaa choosEnu mana vanka
mamakaraam aalambanagaa manugaDa saagaali ika rOju

sinimaa:- chinna kODalu
saahitam:- ?????
sangeetam:- bappilahari
gaanam:- suSeela, manO

 
పూజలు పొందే పరమాత్మ..బదులే పలకవా
పువ్వులు సేవలేగాని..వేదన్లే వినవా
శిలవా సదాశివా?

నవ్వే క్షణాలు చూసి..నువ్వే సహించలేవు
ఎదో తుఫాను రేపి..ఇట్టే దహించుతావు
నవ్వే క్షణాలు చూసి..నువ్వే సహించలేవు
ఎదో తుఫాను రేపి..ఇట్టే దహించుతావు
అంతా సుఖాన ఉంటే..నిన్నింక స్మరించరేమోననా?

ఇచ్చే వరాలు దోచి..చిచ్చును రగిల్చినావే
చల్లని ఈ కోవ్వెలలో..చీకటి మిగిల్చినావే
ఇచ్చే వరాలు దోచి..చిచ్చును రగిల్చినావే
చల్లని ఈ కోవ్వెలలో..చీకటి మిగిల్చినావే
స్వామి ఇదేమి లీలావినొదమంటే మాటాడవా?

సినిమా:- చిన్న కోడలు
సాహితం:- ?????
సంగీతం:- బప్పిలహరి
గానం:- సుశీల

poojalu pondE paramaatma..badulE palakavaa
puvvulu sEvalEgaani..vEdanlE vinavaa
Silavaa sadaaSivaa?

navvE kshaNaalu choosi..nuvvE sahinchalEvu
edO tuphaanu rEpi..iTTE dahinchutaavu
navvE kshaNaalu choosi..nuvvE sahinchalEvu
edO tuphaanu rEpi..iTTE dahinchutaavu
antaa sukhaana unTE..ninnimka smarincharEmOnanaa?

icchE varaalu dOchi..chicchunu ragilchinaavE
challani ee kOvvelalO..cheekaTi migilchinaavE
icchE varaalu dOchi..chicchunu ragilchinaavE
challani ee kOvvelalO..cheekaTi migilchinaavE
swaami idEmi leelaavinodamanTE maaTaaDavaa?

sinimaa:- chinna kODalu
saahitam:- ?????
sangeetam:- bappilahari
gaanam:- suSeela

 
అయ్యప్ప శరణమయ్యా
ఈల కొట్టి తోలవయ్య
కొత్త రధం కదెలనయ్యా
వెనకడుగే వెయ్యదయ్యా
చీకటని చిక్కులని ఆగకురా భాయి
సుడిగాలులతో వానలతో చెయ్యి లడాయి
కొండలని కోనలని చూడకురా భాయి
అడుగేయనిదే తీరమే నీకు ఎదురు రాదోయి

దీవేనలిచ్చే ఆ దేవుడికైనా కోవ్వెల కట్టి దీపమెట్టాలి
అన్నము పెట్టే యజమానికి మనం కండలతొటి కంచె కట్టాలి
పనినిచ్చి మన బ్రతుకులు నడిపించే వాడు
తన చక్రముని చేతికిచ్చి తిప్పమన్నాడు
చీడలని చేరకుండ చేట్టున్నవాడు (????)
ఆ నీడని నీకున్నదిరా చల్లని గూడు


చినుకు పడందే నువ్వు దున్నే చేలొ తనకు తనే పైరు వస్తుందా
కునుకు వీడందే కలలన్ని నిజం చేసేటందుకు వీలు వింటుందా
చెమట చిందే శ్రమను నమ్మి బ్రతుకు బండిని తొయ్యి
అలుపు అనే మాట అనక అడుగులు వెయ్యి
ముందుకెళ్ళే దారులన్ని తెలుసుకోరా భాయి
నీవెనకే నలుగురిని తీసుకెళ్ళాలి

సినిమా:- నవ్వుతూ బ్రతకాలిరా
సాహితం:- సిరివెన్నెల
సంగీతం:- దేవిశ్రీప్రసాద్
గానం:- బాలు


ayyappa SaraNamayyaa
eela koTTi tOlavayya
kotta radham kadelanayyaa
venakaDugE veyyadayyaa
cheekaTani chikkulani aagakuraa bhaayi
suDigaalulatO vaanalatO cheyyi laDaayi
konDalani kOnalani chooDakuraa bhaayi
aDugEyanidE teeramE neeku eduru raadOyi

deevEnalicchE aa dEvuDikainaa kOvvela kaTTi deepameTTAli
annamu peTTE yajamaaniki manam kanDalatoTi kanche kaTTAli
paninicchi mana bratukulu naDipinchE vaaDu
tana chakramuni chEtikicchi tippamannADu
cheeDalani chErakunDa chETTunnavaaDu (????)
aa nIDani neekunnadiraa challani gooDu


chinuku paDandE nuvvu dunnE chElo tanaku tanE pairu vastundaa
kunuku veeDandE kalalanni nijam chEsETanduku veelu vinTundaa
chemaTa chindE Sramanu nammi bratuku banDini toyyi
alupu anE maaTa anaka aDugulu veyyi
mundukeLLE daarulanni telusukOraa bhaayi
neevenakE nalugurini teesukeLLaali

sinimaa:- navvutU bratakaaliraa
saahitam:- sirivennela
sangeetam:- dEviSrIprasaad
gaanam:- bAlu

Thursday, March 10, 2011

 
చిన్నారి పాపలా..పొన్నారి తోటలో
పూచింది ఒక ముద్దు గులబి
విరభూచింది ఒక ఎర్ర గులబి

పొద్దున్న షికారుకు..పోయాడా తోటకు
గులాబి మావయ్య నెహ్రుజి
ఎర్ర గులబి మావయ్య నెహ్రుజి

చిట్టి గులాబి..చిన్ని గులాబి
ఎర్రదనం అంటెనే చక్కదనం
ఎప్పటికి వాడిపోని కుర్రతనం
అందుకే నువ్వు నాకు కావాలి దినం దినం

చిట్టి మావయ్య్య..చిన్ని మావయ్య
పసిపాప మనసు కల మంచి మావయ్య
ప్రతిరోజు పూస్తాను..నీకొసం చూస్తాను
వస్తావా?
నీ చల్లని గుండెలో వుండనిస్తవా
చిట్టి మావయ్య..చిన్ని మావయ్య
చిట్టి గులాబి..చిన్ని గులాబి


మలిగిపోయిందొక్క రత్నదీపము
మట్టిలో కలిసిపోయింది భారతరత్నము
అలముకున్నది అంధకారము
అలమటించింది గులాబి హ్రుదయము
ఆ హ్రుదయంలో లేదిక పన్నీరు
కుమిలి కుమిలి కురిసిందయా కన్నీరు..కన్నీరు

మావయ్య..మావయ్య
మావయ్య..మావయ్య

కూడదు కూడదు నాకై ఇలా
క్రుంగి కుమిలి పోకూడదు
విడువకూడదు కన్నీరు
మరువకూడదు కర్తవ్యం

వాడిపోదు ఈ ఎర్ర గులబి
ఆరిపోదు ఈ విప్లవ జ్యోతి
విప్లవ జ్యోతి

సినిమా:- నా తమ్ముడు
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- పెండ్యాల
గానం:- బాలు, సుశీల

chinnAri pApalA..ponnAri tOTalO
poochindi oka muddu gulabi
virabhoochindi oka erra gulabi

poddunna shikAruku..pOyADaa tOTaku
gulAbi mAvayya nehruji
erra gulabi mAvayya nehruji

chiTTi gulAbi..chinni gulAbi
erradanam anTenE chakkadanam
eppaTiki vaaDipOni kurratanam
andukE nuvvu naaku kAvAli dinam dinam

chiTTi mAvayyya..chinni mAvayya
pasipaapa manasu kala manchi mAvayya
pratirOju poostAnu..neekosam choostAnu
vastAvaa?
nee challani gunDelO vunDanistavaa
chiTTi mAvayya..chinni mAvayya
chiTTi gulAbi..chinni gulAbi


maligipOyindokka ratnadeepamu
maTTilO kalisipOyindi bhaarataratnamu
alamukunnadi andhakaaramu
alamaTinchindi gulAbi hrudayamu
aa hrudayamlO lEdika pannIru
kumili kumili kurisindayaa kannIru..kannIru

mavayyaa..mavayyaa
mavayyaa..mavayyaa

kooDadu kooDadu naakai ilaa
krungi kumili pOkooDadu
viDuvakooDadu kannIru
maruvakooDadu kartavyam

vaaDipOdu ee erra gulabi
aaripOdu ee viplava jyOti
viplava jyOti

sinimaa:- nA tammuDu
saahityam:- aatrEya
sangeetam:- penDyaala
gaanam:- bAlu, suSeela

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]