Saturday, March 26, 2011

 
Dear Friends
ఇప్పుడు నేను పాడబొయే ఈ పాట ఓ అందమైన ప్రేమ కధ. రెండు గువ్వలు - చిలుక గోరింక, రెండు రవ్వలు - తార నెలవంక కలలు కన్నాయి, కధలు చెప్పుకున్నయి. భూదేవి సాక్షిగా పసి వయసులో బొమ్మల పెళ్ళి చేసుకున్నాయి. కడవరకు నిలవాలని బాసల వీలునామ రాసుకున్నాయి. ఇంతలో కాలం కన్నెర్ర చేసింది. ఆ జంటను విడదీసింది. ఇక ఒకే వెతుకులాట. ఇప్పుడు అదే నా ఈ పాట.

రివ్వున ఎగిరే గువ్వా..నీ పరుగులు ఎక్కడికమ్మా (2)
నా పెదవుల చిరునవ్వా..నిను ఎక్కడ వెతికేదమ్మా?
తిరిగొచ్చే దారే మరిచావా?
ఇకనైనా గూటికి రావా?

వీచే గాలుల వెంట..నా వెచ్చని ఊపిరినంతా
పంపించానే అది ఏ చోట నిను తాకనే లేదా?
పూచే పువ్వులా నిండా..మన తీయ్యని జ్ఞాపకమంతా
నిలిపుంచానే నువ్వు ఏ పూట చూడనే లేదా?
నీ జాడను చూపించంటూ..ఉబికే నా ఈ కన్నీరు
ఎనాడు ఇలపై అది ఇంకి పోలేదు
ప్రతి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూడు
అవి నీకై వెలిగే నా చూపుల దీపాలు
ఆ దారిని తూరుపువై రావా
నా గుండెకు ఊపిరివై రావా

కిన్నెరసాని నడక..నీకెందుకే అంతటి అలక
నన్నొదిలేస్తావా కడ దాక తోడై రాక
బ్రతుకే బరువైపోగా..మిగిలున్నా ఒంటరి శిలగా
మన బాసల ఊసులన్ని కరిగాయా ఆ కలగా
ఎన్నేన్నో జన్మల దాకా ముడివేసిన మన అనుబంధం
తెగిపోయిందంటే నమ్మదుగా నా ప్రాణం
ఆయువుతో ఉన్నది అంటే ఇంకా ఈ నా దేహం
క్షేమంగా ఉన్నట్టే తను కూడా నా స్నేహం
ఎడబాటే వారధిగా చేస్తా
త్వరలో నీ జతగా వస్తా

సినిమా:- జానకి వెడ్స్ శ్రీరాం
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ఘంటాడి క్రిష్ణ
గాణం:- బాలు

#Dear Friends#
ippuDu nEnu pADaboyE ee paaTa O andamaina prEma kadha. renDu
guvvalu - chiluka gOrinka, renDu ravvalu - tAra nelavanka
kalalu kannAyi, kadhalu cheppukunnayi. bhoodEvi saakshigaa
pasi vayasulO bommala peLLi chEsukunnAyi. kaDavaraku
nilavAlani bAsala veelunAma raasukunnAyi. intalO kaalam
kannerra chEsindi. A janTanu viDadeesindi. ika okE
vetukulATa. ippuDu adE naa ee pATa.

rivvuna egirE guvvaa..nee parugulu ekkaDikammaa (2)
nA pedavula chirunavvA..ninu ekkaDa vetikEdammA?
tirigocchE dArE marichAvA?
ikanainA gooTiki rAvA?

veechE gAlula venTa..nA vecchani oopirinantA
pampinchAnE adi E chOTa ninu tAkanE lEdA?
poochE puvvulA ninDA..mana teeyyani jnaapakamantA
nilipunchAnE nuvvu E pooTa chooDanE lEdA?
nee jADanu choopinchanTU..ubikE naa ee kannIru
enADu ilapai adi inki pOlEdu
prati rAtri AkASamlO nakshatrAlanu chooDu
avi neekai veligE naa choopula deepAlu
aa dArini toorupuvai rAvA
naa gunDeku oopirivai rAvA

kinnerasAni naDaka..neekendukE antaTi alaka
nannodilEstAvA kaDa daaka tODai rAka
bratukE baruvaipOgA..migilunnA onTari SilagA
mana bAsala oosulanni karigAyA aa kalagA
ennEnnO janmala dAkA muDivEsina mana anubandham
tegipOyindanTE nammadugaa nA praaNam
aayuvutO unnadi anTE inkA ee nA dEham
kshEmangaa unnaTTE tanu kooDA nA snEham
eDabATE vaaradhigA chEstA
twaralO nee jatagaa vastA

sinimaa:- jAnaki veDs SrIrAm
saahityam:- sirivennela
sangeetam:- ghanTADi krishNa
gANam:- bAlu

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]