Wednesday, August 6, 2014

 
శ్రీ బాబా శివనందన
మధవ హే కమలాసన
శ్రీ దత్త జ్ఞానేశ్వరా
నీ చరణాలే శరణాలయ్య

సాయి బాబా, సాయి బాబా
సాయి నాధ, శక్తి దాత
సాయి రాం, సాయి రాం

చింతలు తొలగించి కోరిన వరమిచ్చే
దాతవు నీవే కదా..దేవుడు నీవే కదా
ఎవ్వరిది ఏ మతమైన నిను తలచే వేళ
తలచినది నెరవెర్చువే..కడవరకు తోడుందువే
నమ్మిన వారికి శరణము నీవే
బాధలు లేవే నీ బూధిని నమ్మితే
సాయియే శివ రూపము..సాయియే శ్రీ విష్ణువు
సాయియే సర్వేశుడు..సాయియే సన్మార్గము

సర్వత్ర సాయిరాం..సర్వము సాయిరాం
శ్రీ సాయి కరుణాకరా, శ్రీ సాయి పరమేశ్వరా
ద్వారకామాయిలో ఫకీరు వేషమున
దీనులను దయ చూడగా..వచ్చిన గురుదేవరా
నీ నామ కీర్తన...నీ పాద సేవన
నీ రూప స్మరణమే నా సాధన
సూర్యుడే నీ నయనాలయి
గంగే నీ చరణాలయి
భూమి నీ కరకమలాలయి
సాయిమయం ఈ విశ్వము

సినిమా:- గురు పూర్ణిమ
గానం:- బాలు

SrI bAbA Sivanandana
madhava hE kamalaasana
SrI datta jnaanESwaraa
nee charaNaalE SaraNaalayya

sAyi bAbA, sAyi bAbA
sAyi naadha, Sakti daata
sAyi raam, sAyi raam

chintalu tolaginchi kOrina varamicchE
daatavu neevE kadA..dEvuDu neevE kadA
evvaridi E matamaina ninu talachE vELa
talachinadi neraverchuvE..kaDavaraku tODunduvE
nammina vaariki SaraNamu neevE
baadhalu lEvE nee boodhini nammitE
sAyiyE Siva roopamu..sAyiyE SrI vishNuvu
sAyiyE sarvESuDu..sAyiyE sanmaargamu

sarvatra sAyirAm..sarvamu sAyirAm
SrI sAyi karuNAkarA, SrI sAyi paramESwarA
dwArakAmAyilO phakeeru vEshamuna
deenulanu daya chooDagA..vacchina gurudEvarA
nee nAma keertana...nee pAda sEvana
nee roopa smaraNamE naa sAdhana
sooryuDE nee nayanAlayi
gangE nee charaNAlayi
bhoomi nee karakamalAlayi
sAyimayam ee viSwamu

sinimA:- guru poorNima
gaanam:- bAlu

Labels: , , ,


Thursday, July 25, 2013

 
నాద నిలయుడే శివుడు
ఆదిమధ్యాంత లయుడు
ప్రణవ నాద నిలయుడే శివుడు

అఖిల జగత్ వాఙ్మయుడు
సకల కళా తన్మయుడు

 
నాద నిలయుడే శివుడు
ఆదిమధ్యాంత లయుడు
ప్రణవ నాద నిలయుడే శివుడు

అఖిల జగత్ వాఙ్మయుడు
సకల కళా తన్మయుడు

 

వెయ్యిరా ముందడుగు

వెయ్యిరా ముందడుగు ఘరాన వీరుడిలా
జయమే సాధించు జగాన ధీరుడిలా
నీదే గెలుపని, నీతి నమ్ముకొని జీవితాన సాగిపొమ్మురా
నీది మజిలిలేని పయనమురా

బాధలు పొంగే కష్టములోను..ఎన్నడు కలతే చెందకురా
పడమరే కుంగే పొద్దులలోను..వెన్నెల ఆశలు వీడకురా
ధర్యముంటే నీలోన..ఏది అడ్డు రాబోదు
తలచుకుంటే లోకాన..కానిదంటు లేదు
మదికే చెడునా ఎదురైతే
మరలా రాసేయి విధిరాతే

నీ ప్రతి మాట..నిలిచే దాక..నీవిక నిదురే పోకుమురా
నీ ప్రతి చేత..పదుగురి నోట..మెప్పును పొందిన చాలునురా
దేనిలోన నీకెవ్వరు..సాటిలేరనిపించు
మనసులోని మమతలతో..మానవతను పెంచు
నిజమే పలికే నీ కోసం
ఇలకే దిగడా ఆ దైవం

సాహిత్యం:- సాహితి
గానం:- చిత్ర

veyyirA mundaDugu gharaana veeruDilA
jayamE saadhinchu jagaana dheeruDilA
needE gelupani, neeti nammukoni jeevitaana saagipommurA
needi majililEni payanamurA

baadhalu pongE kashTamulOnu..ennaDu kalatE chendakurA
paDamarE kungE poddulalOnu..vennela aaSalu veeDakurA
dharyamunTE neelOna..Edi aDDu raabOdu
talachukunTE lOkAna..kAnidanTu lEdu
madikE cheDunA eduraitE
maralA raasEyi vidhiraatE

nee prati mATa..nilichE daaka..neevika nidurE pOkumurA
nee prati chEta..paduguri nOTa..meppunu pondina chaalunurA
dEnilOna neekevvaru..saaTilEranipinchu
manasulOni mamatalatO..maanavatanu penchu
nijamE palikE nee kOsam
ilakE digaDA aa daivam

saahityam:- saahiti
gaanam:- chitra

Labels: ,


 

గుండె బండగా మారితే ఎంత బాగుండేది

గుండె బండగా మారితే ఎంత బాగుండేది
ఈ బ్రతుకు నేటితో ఆగితే ఇంకెంత బాగుండేది
జీవితమా ఆగిపో ఆగిపో ఆగిపో

నన్నంటి సాగే నీడే నన్నే విడిపోతుంటే
నా అద్దంలో నా ముఖమే
నా అద్దంలో నా ముఖమే నన్నే వెక్కిరిస్తుంటే
కుడి కంటిని పొడవాలని..ఎడమ కన్ను తలపెడితే
నా వేదన అరణ్యరోదన
నా చింతన ఆత్మవంచన

నేలగొంతు తడిపే నీరే నేలనే కోసేస్తుంటే
చిగురులు తొడిగే వసంతఋతువే
చిగురులు తొడిగే వసంతఋతువే చిగురులునే రాల్చేస్తుంటే
తొలి పొద్దును మింగాలని..తూరుపు పంతం పడితే
ఈ సృష్టికి అర్ధం వ్యర్ధం
నా దృష్టికి గమ్యం శూన్యం

సినిమా:- ఏమండోయి శ్రీమతిగారు
సాహిత్యం:- సినారె
గానం:- బాలు

gunDe banDagA maaritE enta baagunDEdi
ee bratuku nETitO aagitE inkenta baagunDEdi
jeevitamA aagipO aagipO aagipO

nannanTi saagE neeDE nannE viDipOtunTE
naa addamlO naa mukhamE
naa addamlO naa mukhamE nannE vekkiristunTE
kuDi kanTini poDavaalani..eDama kannu talapeDitE
naa vEdana araNyarOdana
naa chintana aatmavanchana

nElagontu taDipE neerE nElanE kOsEstunTE
chigurulu toDigE vasantaRtuvE
chigurulu toDigE vasantaRtuvE chigurulunE raalchEstunTE
toli poddunu mingaalani..toorupu pantam paDitE
ee sRshTiki ardham vyardham
naa dRshTiki gamyam Soonyam

sinimaa:- EmanDOyi SreematigAru
saahityam:- sinAre
gaanam:- bAlu  

Labels: ,


 
Do love Mother India

You too love India

జనని, జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం
ఎది అది ఎక్కడో వెతకమంటున్నది గురుకులం
గుండె పిండుకొని దాగిన గుక్కెడు పాలగులుకులేనెప్పుడు
పోత పాలసీసాల కోసమై పరుగలాటలే ఎపుడూ


అకాశంలో ఆ సుర్యుడొక్కడే
అభ్యుదయంలో నా దేశమొక్కటే
ఆ సుర్యుడెప్పుడూ తూరుపు దిక్కునే ఎందుకు పుడతాడు
కళ్యాణ తిలకమై కన్న తల్లి వడిలోనే ఉంటాడు
అలంటిదేరా నా భారతదేశం
సనాతనంలో సమిష్ఠి దేశం
ఆ సనాతనంలో గల పునాదిలోనే సంకరమవుతుంటే
నా అభ్యుదయానికి సభ్యసమాజమే సమాధి కడుతుంటే
తరతారల దాస్యం తెంచుకున్న ఈ స్వరాజ్య దేశంలో
యువతరాలు మళ్ళీ పరాయి బిక్షకు పరుగులు తగునా

I Love my India
Lovely Mother India
You too love India
Do love Mother India

పరాయిదేశంలో కిరాయి కోసమని
స్వదేశజ్ఞానం సవారి కడుతుంటే
ఆ కూలి దబ్బు డాలర్లలోనే సుఖజీవనముందంటే
ఆ పాలిగాపు నీ పాలి శ్రతువై తిరిగి వెళ్ళమంటే
కడుపుతీపికే కన్నీటి రోదనై
కన్నతండ్రికే అది మూగ వేదనై
ఆ నారుపోసి నీరెత్తినొళ్ళకు ఫలితం ఏముంది
ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ప్రతిష్ఠ ఏముంది
ఆ కీర్తిప్రతిష్ఠల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి
దురాగతాల అలంకారులు చేయుట న్యాయమా..ధర్మమా

Labels: ,


 

Telugu Lyrics-Bhagya Lakshmi

కృష్ణ శాస్త్రి కవితలా
కృష్ణ వేణి పొంగులా
పాలలా..తేనెలా
దేశభాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు
ఇది తేట తేట తెలుగు

కృష్ణదేవరాయుల కీర్తి వెలుగు తెలుగు
కాకతియ రాజుల పౌరుషాగ్ని తెలుగు
కూచిపూడి నర్తన
త్యాగరజ కీర్తన
అడుగడుగు..అణువణువు
అచ్చ తెలుగు జిలుగు
సంస్క్రుతికే ముందడుగు
తీపి తీపి తెలుగు
ఇది తేట తేట తెలుగు

పోతులూరి వీరబ్రహ్మ్మ సూక్తులన్ని తెలుగు
పొట్టి శ్రీరాముల త్యాగ నిరతి తెలుగు
కందుకూరి సంస్కారం
చిలకమర్తి ప్రహసనం
నేటి తరం..ముందు తరం
అనుసరించు బాట తెలుగు
తీపి తీపి తెలుగు
ఇది తేట తేట తెలుగు

kRshNa SAstri kavitalA
kRshNa vENi pongulA
pAlalA..tEnelA
dESabhaashalandu lessagA
teepi teepi telugu
idi tETa tETa telugu

kRshNadEvarAyula keerti velugu telugu
kAkatiya raajula pourushaagni telugu
koochipooDi nartana
tyAgaraja keertana
aDugaDugu..aNuvaNuvu
accha telugu jilugu
samskrutikE mundaDugu
teepi teepi telugu
idi tETa tETa telugu

pOtuloori veerabrahmma sooktulanni telugu
poTTi SreerAmula tyaaga nirati telugu
kandukoori samskaaram
chilakamarti prahasanam
nETi taram..mundu taram
anusarinchu baaTa telugu
teepi teepi telugu
idi tETa tETa telugu

Labels: ,


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]