Thursday, May 10, 2018

 
ఏగిరే జెండా మన జనని, ఎమౌంటున్నది మననుగని
పూవులదీవెనలు అందిస్తున్నది తనంత ఎత్తుకు ఎదగమని
వందేమాతరం, వందేమాతరం, వందేమాతరం

తరతరాల భరతసంస్కృత తెలుపును కాషాయం
స్వచ్చమైన శాంతికి సంకేతం మచ్చలేని ఆ తెల్లదనం
తరగని సంపద తనలో కలదని పలుకును పంటల పచ్చదనం
జన్మంతా ఈ విలువలు ముడివేసి నడుపునది అశోకచక్రం
ఆ నీడను నడవమని, ఆ ఘనతను నిలపమని

గాంధిజీ అందించిన సూత్రం కలిపిన భారతిసంతానం
ఎన్నో జాతుల, ఎన్నో రీతుల, ఎన్నో రంగుల విరులవనం
విభేదాలతో విడిపోతే ఆ తల్లికి తీరని సంతాపం
కళకళలాడుతూ కలిసి ఉంటేనే కలుగును కలగను సంతోషం
ఆ వెలుగును అందుకొని, నీ ప్రగతిని పొందమని

సినిమా:- బాలమురళి
సాహిత్యం:- ఆచార్య ఆత్రేయ
సంగీతం:- కె.వి.మహదేవన్
గానం:- పి.సుశీల

EgirE jenDA mana janani, emounTunnadi mananugani
poovuladeevenalu andistunnadi tananta ettuku edagamani
vandEmAtaram, vandEmAtaram, vandEmAtaram

taratarAla bharatasamskRta telupunu kAshAyam
swacchamaina SAntiki sankEtam macchalEni aa telladanam
taragani sampada tanalO kaladani palukunu panTala pacchadanam
janmantA ee viluvalu muDivEsi naDupunadi aSOkachakram
aa neeDanu naDavamani, aa ghanatanu nilapamani

gaandhijI andinchina sootram kalipina bhaaratisantAnam
ennO jaatula, ennO reetula, ennO rangula virulavanam
vibhEdAlatO viDipOtE aa talliki teerani santaapam
kaLakaLalADutU kalisi unTEnE kalugunu kalaganu santOsham
aa velugunu andukoni, nee pragatini pondamani

sinimA:- bAlamuraLi
saahityam:- AchArya AtrEya
sangeetam:- k.v.mahadEvan
gaanam:- p.suSeela 

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]