Tuesday, May 15, 2018

 
నల్లనయ్యా, ఎవరని అడిగావా నన్ను
మురళిని కాలేను, పించమైనా కాను
ఎవరని చెప్పాలి నేను? ఏమని చెప్పాలి నేను?

వలచిన రాధమ్మను విరహాన దించావు
పెంచినమ్మ యశొదమ్మను శోకాన ముంచావు
నీవు నేర్చినదొక్కటే, నిన్ను వలపించుకోవడం
నాకు తెలియనదొక్కటే, నా మనసుదాచుకోవడం
ఏమని చెప్పాలి నేను? ఎవరని చెప్పాలి నేను?

వెన్నయినా, మన్నయినా ఒకటే అన్నావు
దొంగవైన కాని దొరవై నిలిచావు
ఎంత మరవాలన్నా మనసును వీడిపోనంటావు
ఎంత కలవరించినా కంటికి కానరాకున్నావు
ఏమని చెప్పాలి నేను? ఎవరని చెప్పాలి నేను?

సినిమా:- మా ఇద్దరి కధ
సంగీతం:- చక్రవర్తి
గానం:- పి.సుశీల

nallanayyA, evarani aDigAvA nannu
muraLini kAlEnu, pinchamainA kAnu
evarani cheppAli nEnu? Emani cheppAli nEnu?

valachina rAdhammanu virahAna dinchAvu
penchinamma yaSodammanu SOkAna munchAvu
neevu nErchinadokkaTE, ninnu valapinchukOvaDam
nAku teliyanadokkaTE, nA manasudAchukOvaDam
Emani cheppAli nEnu? evarani cheppAli nEnu?

vennayinA, mannayinA okaTE annAvu
dongavaina kAni doravai nilichAvu
enta maravAlannA manasunu veeDipOnanTAvu
enta kalavarinchinA kanTiki kaanarAkunnAvu
Emani cheppAli nEnu? evarani cheppAli nEnu?

sinimA:- mA iddari kadha
sangeetam:- chakravarti
gaanam:- p.suSeela 

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]