Wednesday, March 23, 2011

 
అఖండ భారత జాతి విముక్తికి ప్రభవించిన జండా
వందేమాతరం
దురాక్రమనపై పరాక్రమించిన చరిత్ర ఈ జండా
వందేమాతరం
ప్రపంచ శాంతికి ప్రభాతదీపం ప్రియ భారత జండా
వందేమాతరం
జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి


ఎగరవేయకు నన్ను గగనసీమకు
గౌరవం అను పేర గుండెమంట రేపకు
స్వతంత్ర దినోత్స్తవాన రక్షణ కవచాల వెనుక
జాతి ప్రసంగం చేసే నాయకులను చూడలేను
భారతీయ గౌరవాన్ని..తెలుగు జాతి మర్యాదని
కుక్కలు చింపిన విస్తరి చేస్తుంటే ఆపలేను
దేశ భద్రతను అమ్మే నీచుల శిక్షించలేను
రాజకీయ చదరంగ ఎత్తులను భరించలేను
అర్ధ శతాభ్దము పైన పోందా అవమానాలు
పైనుంచి ఇక చూడలేను జరుగుతున్న ఘోరాలు
స్వతంత్ర యోధులను తెల్ల దొరలు కాల్చినారు
స్వతంత్ర భారతిని నల్ల దొరలు కూల్చె నేడు
రెప రెపలు కావు ఇవి..రేపవల కన్నీళ్ళు
ధగ ధగలు కావు ఇవి..గుండె పగులు మంటలు


జండా ఆఆ
ఎందుకు ఎగరాలి
నేనుదుకు ఎగరాలి

సినిమా:- జండా
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- వందేమాతరం శ్రీనివాస్
గానం:- బాలు, వందేమాతరం శ్రీనివాస్


aKhanDa bhaarata jaati vimuktiki prabhavinchina janDaa
vandEmaataram
duraakramanapai paraakraminchina charitra ee janDaa
vandEmaataram
prapancha Saantiki prabhaatadeepam priya bhaarata janDaa
vandEmaataram
janDA
jai hind ani egaraali
mana pratishTha penchaali


egaravEyaku nannu gaganaseemaku
gouravam anu pEra gunDemanTa rEpaku
swatantra dinOtstavaana rakshaNa kavachaala venuka
jaati prasangam chEsE naayakulanu chooDalEnu
bhaarateeya gouravaanni..telugu jaati maryaadani
kukkalu chimpina vistari chEstunTE aapalEnu
dESa bhadratanu ammE neechula SikshinchalEnu
raajakeeya chadaranga ettulanu bharinchalEnu
ardha Sataabhdamu paina pOndaa avamaanaalu
painunchi ika chooDalEnu jarugutunna ghOraalu
swatantra yOdhulanu tella doralu kaalchinaaru
swatantra bhaaratini nalla doralu koolche nEDu
repa repalu kaavu ivi..rEpavala kanneeLLu
dhaga dhagalu kaavu ivi..gunDe pagulu manTalu

janDA
enduku egaraali
nEnuduku egaraali

sinimaa:- janDA
saahityam:- sirivennela
sangeetam:- vandEmaataram SrInivaas
gaanam:- bAlu, vandEmaataram SrInivaas

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]