Thursday, March 10, 2011

 
చిన్నారి పాపలా..పొన్నారి తోటలో
పూచింది ఒక ముద్దు గులబి
విరభూచింది ఒక ఎర్ర గులబి

పొద్దున్న షికారుకు..పోయాడా తోటకు
గులాబి మావయ్య నెహ్రుజి
ఎర్ర గులబి మావయ్య నెహ్రుజి

చిట్టి గులాబి..చిన్ని గులాబి
ఎర్రదనం అంటెనే చక్కదనం
ఎప్పటికి వాడిపోని కుర్రతనం
అందుకే నువ్వు నాకు కావాలి దినం దినం

చిట్టి మావయ్య్య..చిన్ని మావయ్య
పసిపాప మనసు కల మంచి మావయ్య
ప్రతిరోజు పూస్తాను..నీకొసం చూస్తాను
వస్తావా?
నీ చల్లని గుండెలో వుండనిస్తవా
చిట్టి మావయ్య..చిన్ని మావయ్య
చిట్టి గులాబి..చిన్ని గులాబి


మలిగిపోయిందొక్క రత్నదీపము
మట్టిలో కలిసిపోయింది భారతరత్నము
అలముకున్నది అంధకారము
అలమటించింది గులాబి హ్రుదయము
ఆ హ్రుదయంలో లేదిక పన్నీరు
కుమిలి కుమిలి కురిసిందయా కన్నీరు..కన్నీరు

మావయ్య..మావయ్య
మావయ్య..మావయ్య

కూడదు కూడదు నాకై ఇలా
క్రుంగి కుమిలి పోకూడదు
విడువకూడదు కన్నీరు
మరువకూడదు కర్తవ్యం

వాడిపోదు ఈ ఎర్ర గులబి
ఆరిపోదు ఈ విప్లవ జ్యోతి
విప్లవ జ్యోతి

సినిమా:- నా తమ్ముడు
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- పెండ్యాల
గానం:- బాలు, సుశీల

chinnAri pApalA..ponnAri tOTalO
poochindi oka muddu gulabi
virabhoochindi oka erra gulabi

poddunna shikAruku..pOyADaa tOTaku
gulAbi mAvayya nehruji
erra gulabi mAvayya nehruji

chiTTi gulAbi..chinni gulAbi
erradanam anTenE chakkadanam
eppaTiki vaaDipOni kurratanam
andukE nuvvu naaku kAvAli dinam dinam

chiTTi mAvayyya..chinni mAvayya
pasipaapa manasu kala manchi mAvayya
pratirOju poostAnu..neekosam choostAnu
vastAvaa?
nee challani gunDelO vunDanistavaa
chiTTi mAvayya..chinni mAvayya
chiTTi gulAbi..chinni gulAbi


maligipOyindokka ratnadeepamu
maTTilO kalisipOyindi bhaarataratnamu
alamukunnadi andhakaaramu
alamaTinchindi gulAbi hrudayamu
aa hrudayamlO lEdika pannIru
kumili kumili kurisindayaa kannIru..kannIru

mavayyaa..mavayyaa
mavayyaa..mavayyaa

kooDadu kooDadu naakai ilaa
krungi kumili pOkooDadu
viDuvakooDadu kannIru
maruvakooDadu kartavyam

vaaDipOdu ee erra gulabi
aaripOdu ee viplava jyOti
viplava jyOti

sinimaa:- nA tammuDu
saahityam:- aatrEya
sangeetam:- penDyaala
gaanam:- bAlu, suSeela

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]