Monday, March 21, 2011

 
ధిన్ ధిన్ తార..ధిన్ తార..ధిన్ ధిన్ తార..ధిన్ ధిన్ ధిన్నా
అంగరంగ వైభోగంగా పెళ్ళి చేద్దాం రారండి
నిండు పందిరి వేసుందండి నేల పీట ఆయిందండి
బుగ్గ చుక్కతో పెళ్ళికూతురు సిగ్గు మొగ్గ ఆయింది
పక్కవాడితో లగ్గమైతే ఆ మొగ్గ విరియునండి
కొంగుముళ్ళతో పగ్గమెయ్యగా పిల్ల ఎదురయింది
అరె కుదురులేని ఈ కుర్రవాడికి తిక్క కుదురుతుంది
ధిన్ ధిన్ తార..ధిన్ తార..ధిన్ ధిన్ తార..ధిన్ ధిన్ ధిన్నా

అ:
పాలరాతి మేడ కరిగి..నేల మీద కాళ్ళే కడిగి
పేదపెద్దలు అను తేడాలను చెరపాలి
ఆ:
కోటలోని ఆ యువరాణి..తోటరాముడితో జతగూడి
ప్రేమరాజ్యమును కలకాలం పాలించాలి
అ:
కలిమికి చెలిమికి నడుమున నిలిచిన ఇనుప తెరలు కరుగుతూ ఉంటే
కని విని యెరుగని జత ఇదని మన మనసు పాడుతుందే
ఆ:
మనువుతో ముడిపడి విరిసిన మనసులు ఒకరికొకరు అనిపిస్తుంటే
తళతళ వెలుగుల తడిసిన కనులకు సిరులు దొరికినట్లే

ఆ:
ముందుజన్మలో ఋణమంతా తీర్చుకోను కలిసిందంట
బ్రహ్మరాతలకు అర్ధం చెప్పే ఈ జంట
అ:
ముందు ఇద్దరుంటారంట..కలిసి ఒక్కటవుతారంట
లెక్క చూస్తే పైఏటికి మూడవుతారంట
ఆ:
మసకలు, ముసుగులు గుసగుస గోదవులు
ఉరికి ఉరికి తలబడుతుంటే
పరులకు తెలియని పడుచుతనపు కధ వదను తేలుతుందే
అ:
జరిగిన తగువుకు బిడియము భయపడి పరువు విడిచి పరుగేడుతుంటే
తికమక పడి కరిగే సమయము తెల్లవారుతుందే

సినిమా:- నవ్వుతూ బ్రతకాలిరా
సాహితం:- సిరివెన్నెల
సంగీతం:- దేవిశ్రిప్రాసాద్
గానం:- దేవిశ్రిప్రాసాద్, మురళి, సుమంగళి

dhin dhin taara..dhin taara..dhin dhin taara..dhin dhin dhinnaa
angaranga vaibhOgangaa peLLi chEddaam raaranDi
ninDu pandiri vEsundanDi nEla peeTa aayindanDi
bugga chukkatO peLLikUturu siggu mogga aayindi
pakkavaaDitO laggamaitE aa mogga viriyunanDi
kongumuLLatO paggameyyagaa pilla edurayindi
are kudurulEni ee kurravaaDiki tikka kudurutundi
dhin dhin taara..dhin taara..dhin dhin taara..dhin dhin dhinnaa

a:
paalaraati mEDa karigi..nEla meeda kaaLLE kaDigi
pEdapeddalu anu tEDaalanu cherapaali
A:
kOTalOni aa yuvaraaNi..tOTaraamuDitO jatagUDi
prEmaraajyamunu kalakaalam paalinchaali
a:
kalimiki chelimiki naDumuna nilichina inupa teralu karugutU unTE
kani vini yerugani jata idani mana manasu paaDutundE
A:
manuvutO muDipaDi virisina manasulu okarikokaru anipistunTE
taLataLa velugula taDisina kanulaku sirulu dorikinaTlE

A:
mundujanmalO RNamantaa teerchukOnu kalisindanTa
brahmaraatalaku ardham cheppE ee janTa
a:
mundu iddarunTaaranTa..kalisi okkaTavutaaranTa
lekka choostE paiETiki mooDavutaaranTa
A:
masakalu, musugulu gusagusa gOdavulu
uriki uriki talabaDutunTE
parulaku teliyani paDuchutanapu kadha vadanu tElutundE
a:
jarigina taguvuku biDiyamu bhayapaDi paruvu viDichi parugEDutunTE
tikamaka paDi karigE samayamu tellavaarutundE

sinimaa:- navvutU bratakaaliraa
saahitam:- sirivennela
sangeetam:- dEviSripraasaad
gaanam:- dEviSripraasaad, muraLi, sumangaLi

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]