Saturday, March 26, 2011

 
ఆ:
రివ్వున ఎగిరే గువ్వా..నీ పరుగులు ఎక్కడికమ్మా (2)
మంచును తడిసిన పువ్వా..నీ నవ్వులు ఎవ్వరివమ్మా
నీ రాజు ఎవ్వరంటా?
ఈ రోజే చెప్పమంటా
నీ రాజు ఎవ్వరంటా?
ఈ రోజే చెప్పమంటా

---

ఆ:
అల్లరి పిల్లకు నేడు..వెయ్యాలి ఇక మెళ్ళొ తాడు
ముడివేసే సిరిగల మొనగాడు..ఎవ్వరే వాడు
అ:
చక్కని రాముడు వీడు..నీ వరసకు మొగుడవుతాడు
ఆ:
ఇల్లాలిని వదిలిన ఆ ఘనుడు..ఈ పిరోకోడు
ఆ క్రిష్ణుని అంశన వీడే నీ కొరకే ఇలా పుట్టాడే
గొపికలే వస్తే అటే పరిగేడతాడే
అ:
ఓ గడసరి పిల్లా..నీ కడుపున కొడుకై పుడ్తానే
ఆ:
కుతురుగా పుట్టు..నీ పేరే పెడతాలే
అ:
గొడవెందుకు బావతో వెళ్ళతావా?
ఆ:
పద బావా..పాల కోవా

---

అ:
చిటపట చినుకులు రాలి..అవి చివరకు ఎటు చేరాలి
సెలయేరులు పారే దారుల్లో కొలువుండాలి
నిండుగ నదులే ఉరికే..అవి చేరును ఏ దరికి
కలకాలం కడలిని చేరంగా పరిగెడతాయి
అట్టాగే నాతో నీవు..నీతో నేను ఉండాలి
బ్రతుకంతా ఒకటై ఇలా జత కావాలి
మన బొమ్మల పెళ్ళి..నువ్వే తాళిని కడతావా?
మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా?
ఓ బావా ఒట్టే పెడుతున్నా
నేను కుడా ఒట్టేస్తున్నా

నా రాజు నువ్వేనంటా
ఈ రోజే తెలిసిండంటా

సినిమా:- జానకి వెడ్స్ శ్రీరాం
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- ఘంటాడి క్రిష్ణ
గానం:- ఘంటాడి, సునీత, ఉష, వరికుప్పల్ యాదగిరి

A:
rivvuna egirE guvvaa..nee parugulu ekkaDikammaa (2)
manchunu taDisina puvvaa..nee navvulu evvarivammaa
nee rAju evvaranTA?
ee rOjE cheppamanTA
nee rAju evvaranTA?
ee rOjE cheppamanTA

---

A:
allari pillaku nEDu..veyyAli ika meLLo taaDu
muDivEsE sirigala monagaaDu..evvarE vaaDu
a:
chakkani rAmuDu veeDu..nee varasaku moguDavutaaDu
A:
illAlini vadilina aa ghanuDu..ee pirOkODu
aa krishNuni amSana veeDE nee korakE ilA puTTADE
gopikalE vastE aTE parigEDatADE
a:
O gaDasari pillA..nee kaDupuna koDukai puDtAnE
A:
kuturugA puTTu..nee pErE peDatAlE
a:
goDavenduku bAvatO veLLatAvA?
A:
pada bAvA..pAla kOvA

---

a:
chiTapaTa chinukulu rAli..avi chivaraku eTu chErAli
selayErulu pArE dArullO koluvunDAli
ninDuga nadulE urikE..avi chErunu E dariki
kalakaalam kaDalini chErangaa parigeDatAyi
aTTAgE naatO neevu..neetO nEnu unDAli
bratukantA okaTai ilA jata kAvAli
mana bommala peLLi..nuvvE taaLini kaDatAvaa?
maru janmaku kUDA ilA tODunTAvA?
O bAvA oTTE peDutunnA
nEnu kuDA oTTEstunnaa

nA rAju nuvvEnanTA
ee rOjE telisinDanTA

sinimaa:- jAnaki veDs SrIrAm
saahityam:- sirivennela
sangeetam:- ghanTADi krishNa
gAnam:- ghanTADi, sunIta, usha, varikuppal yAdagiri

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]