Thursday, March 31, 2011

 
బంగారు బొమ్మ..మందర కొమ్మ
పేరంటానికి రారమ్మ
చామంతి పువ్వు..గోరింక నవ్వు
సీమంతమాడెను చూడమ్మ

అనగనగా ఓ చిన్న కధగా
వినవమ్మ చెబుతా గువ్వ కధ
పాలగువ్వ ఒకటి..పూలగువ్వ ఒకటి
జంటగ కలిసిన శుభవేళ
చెరిసగమై ఆడుకోగా
చిరుగాలే పాడే అనందలాలి జోల పాట

ఒకరికొకరు చెరిసగాల శ్రుతిలయజతలవు బ్రతుకులోన
విధికి వెధకు లొంగిపోని సాహసగుణమవు జీవితాలయి
ప్రణయమైన రూపమొకరుగా
ప్రమిధలోని దీపమొకరుగా
కలలన్ని నెలలు నిండగా
కనిపేంచే వలపు పంటగా
మురిసే ఆ జంట
మైమరచే దేవి సీమంతం ఆడువేళ

కపట విధికి వికటమైన ప్రళయం గూడే కూల్చిపోగా
సొంతమైన జంటగువ్వ రూపమదేదో పోల్చలేక
ఎదరున్నది పాలగువ్వని
ఎదనమ్మిన ముద్దుగుమ్మని
ఒదార్చే తీరు తెలియక
లోలోపల గుండె పగులగా
ఎడ్చే ఈ స్నేహం
జత చేర్చే దారి ఏమౌనో కానరాక

గానం:- జేసుదాస్


bangAru bomma..mandara komma
pEranTAniki rAramma
chAmanti puvvu..gOrinka navvu
seemantamADenu chooDamma

anaganagaa O chinna kadhagaa
vinavamma chebutA guvva kadha
paalaguvva okaTi..poolaguvva okaTi
janTaga kalisina SubhavELa
cherisagamai ADukOgaa
chirugAlE paaDE anandalAli jOla pATa

okarikokaru cherisagAla Srutilayajatalavu bratukulOna
vidhiki vedhaku longipOni saahasaguNamavu jeevitAlayi
praNayamaina roopamokarugA
pramidhalOni deepamokarugaa
kalalanni nelalu ninDagA
kanipEnchE valapu panTagA
murisE aa janTa
maimarachE dEvi seemantam aaDuvELa

kapaTa vidhiki vikaTamaina praLayam gooDE koolchipOgA
sontamaina janTaguvva roopamadEdO pOlchalEka
edarunnadi pAlaguvvani
edanammina muddugummani
odaarchE teeru teliyaka
lOlOpala gunDe pagulagA
eDchE ee snEham
jata chErchE daari EmounO kAnarAka

gAnam:- jEsudAs

Labels:


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]