Thursday, March 24, 2011

 
ఆరని ఆకలి కాలం..కలికాలం
అవనికి ఆఖరి కాలం..కలికాలం
నీతిని కాల్చే నిప్పుల గోళం
నిలువునా కూల్చే నిష్టుర జాలం
కలికాలం ఆకలి కాలం
కలికాలం ఆఖరి కాలం

ఈ గాలి ఏ జాలి ఎరుగదు
ఈ నేల ఏ పూలు విరియదు
ఈ మూల ఎకాకి ప్రతి మనిషి
ఈ గోల ఎనాడు అణగదు
ఈ జ్వాల ఏవేళ తరగదు
ఈ నింగి పంచేది కటిక నిశి
కూటికోసమేనా ఇంత చేటు బోను
సాటివారిపైనా కాటు వేయు జోరు
మనిషే మృగమై అడవైపోయే నడివీధిలో
కూరిమి కోరని క్రౌర్యం..యుగసారం
ఓరిమి చేరని వైరం..గ్రహచారం
కత్తులు నూరే కర్మాదానం
నెత్తురు పారే అత్యాచారం
కసికాలం..రక్కసికాలం
కలికాలం ఆఖరి కాలం

వాటాల పోటీల నడుమ వేలాడుతుంటారు మనుషులు
వ్యాపారమే వావి వరసులుగా
వేలాల పాఠం విలువలు వేసారిపోతాయి మనసులు
ఏపాటి స్నేహాలు కనపడక
రాగిపైసతోనే వేగుపాశమైనా
అత్యాశతోనే అయినవాళ్ళ ప్రేమ..
అడిగే వెలనే చెల్లించాలి అడుగు అడుగున
అంగడి సరుకై పోయే మమకారం
అమ్ముడు పొమ్మని తరిమే పరివారం
తీరని నేరం...ఈ వ్యవహారం
తియాని నేరం..ఈ సంసారం
కనికారం కానని కాలం
కలికాలం ఆకలి కాలం

నీ బ్రతుకు తెల్లారినాకే..
వేరొకరి ఆశలకు వేకువ..
ఈ ఇరుకు లోకాల వాడుక ఇది
ఓ పాడె మేళాల అపశ్రుతి..
ఓ పెళ్ళి కట్నాల ఫలశ్రుతి..
ఏ కరకు ధర్మాల వేడుక ఇది
కాటి కాంతిలోనే బాట చూసుకుంటూ
కాళరాత్రిలోనే చోటు చేసుకుంటూ
బ్రతుకే వెతికే ఏ రాకాసి లోకం ఇది
సంతతి సౌఖ్యం కోసం బలిదానం
అల్లిన ఈ యమ పాశం బహుమానం
ఆశలు అల్లే ఈ విష జాలం
చీకటి పాడే చిచ్చుల గానం
కలికాలం కలతల గాళం
కలికాలం ఆకలి కాలం


ఏనాటి కానాడు నిత్యం వేదించు ఆ పేద గాధకు
ఈనాడు రేటంత పెరిగినది
జీవించినన్నాలు ఎన్నడు
ఊహించలేనంత పెన్నిధి
ఈ వారసత్వానికి ఇచ్చినది
చావుకున్న భీమ..జీవితానికి ఏది
ఊపిరున్న ధీమా..జ్ఞాపకానికి ఏది
కనకే కనకం..కన్నీరేందుకు అంటున్నది
నమ్మినవారికి నష్టం కొనప్రాణం
తప్పక తీరును చస్తే ఋణకాలం
ఆహుతి కాని నిన్నటి రూపం
కంచికి పోని నీ కధ వేగం
అనివార్యం ఈ పరిహారం
కలికాలం ఆకలి కాలం

పైనున్న పున్నామనరకం..
దాటించు పుణ్యాల వరమని..
పుత్రులున్ని కన్న ఫలితమిది
ప్రాణాలు పోయెటిలోపునే..
వెంటాడి వేటాడి నిలువునా..
అంటించి పోతారు తలకొరివి
పాలు పోసి పెంచే..కాల నాగు రూపం.
నోము నోచి పొందే..ఘోరమైన శాపం
బ్రతుకే బరువై..చితినే శరణు వేడే క్షణం
కోరలు చాచిన స్వార్ధం..పరమార్ధం
తీరని కాంక్షల రాజ్యం..ఈ సంఘం
నీతిని కాల్చే..నిప్పుల గోళం
నిలువున కూల్చే..నిష్టుర జాళం
కలికాలం ఆకలి కాలం
కలికాలం ఆఖరి కాలం

ఈ మాయ భందాలు నమ్మకు
ఈ పరుగు పందాల ఆగకు
నీ బాట నీదేరా కడవరకు
ఏ గాలిని దారి అడగకు
ఏ జాలికి ఎదురు చూడకు
నీ నీడే నీ తోడనుకో
ఓడలాగ నిన్ను..వాడుకున్న వారు
తీరమందగానే..తిరిగి చూడబోరు
పడవై బ్రతికి నది ఓడిలోనే నిలిచి ఉండకు
ఏరయి పారే కాలం ఏమైనా
సాక్షిగ నిలిచిన గట్టు కరిగేనా
వేసవి కాని..వెల్లువ రాని
శాశ్వత స్నేహం అల్లుకుపోని
చెదిరేనా పండిన భంధం
చెరిపేనా ఏ కలికాలం

సినిమా:- కలికాలం
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- విద్యాసాగర్
గానం:- బాలు

aarani aakali kaalam..kalikAlam
avaniki aakhari kaalam..kalikAlam
neetini kaalchE nippula gOLam
niluvunA koolchE nishTura jAlam
kalikAlam aakali kAlam
kalikAlam aakhari kAlam

ee gAli E jAli erugadu
ee nEla E poolu viriyadu
ee moola ekAki prati manishi
ee gOla enaaDu aNagadu
ee jwAla EvELa taragadu
ee ningi panchEdi kaTika niSi
kooTikOsamEnA inta chETu bOnu
saaTivAripainA kaaTu vEyu jOru
manishE mRgamai aDavaipOyE naDiveedhilO
koorimi kOrani krouryam..yugasAram
Orimi chErani vairam..grahachAram
kattulu noorE karmAdaanam
netturu paarE atyaachAram
kasikAlam..rakkasikAlam
kalikAlam aakhari kAlam

vATala pOTIla naDuma vElADutunTAru manushulu
vyaapaaramE vaavi varasulugaa
vElaala paaTHam viluvalu vEsaaripOtaayi manasulu
EpaaTi snEhaalu kanapaDaka
raagipaisatOnE vEgupASamainA
atyaaSatOnE ayinavaaLLa prEma..
aDigE velanE chellinchaali aDugu aDuguna
angaDi sarukai pOyE mamakaaram
ammuDu pommani tarimE parivaaram
teerani nEram...ee vyavahaaram
tiyaani nEram..ee samsaaram
kanikaaram kaanani kaalam
kalikaalam aakali kaalam

nee bratuku tellaarinaakE..
vErokari aaSalaku vEkuva..
ee iruku lOkaala vaaDuka idi
O paaDe mELaala apaSruti..
O peLLi kaTnaala phalaSruti..
E karaku dharmaala vEDuka idi
kaaTi kaantilOnE baaTa choosukunTU
kaaLaraatrilOnE chOTu chEsukunTU
bratukE vetikE E raakaasi lOkam idi
santati soukhyam kOsam balidaanam
allina ee yama paaSam bahumaanam
aaSalu allE ee visha jaalam
cheekaTi paaDE chicchula gaanam
kalikaalam kalatala gaaLam
kalikaalam aakali kaalam


EnaaTi kaanaaDu nityam vEdinchu aa pEda gaadhaku
eenaaDu rETanta periginadi
jeevinchinannaalu ennaDu
oohinchalEnanta pennidhi
ee vaarasatvaaniki icchinadi
chaavukunna bheema..jeevitaaniki Edi
oopirunna dheemA..jnaapakaaniki Edi
kanakE kanakam..kannIrEnduku anTunnadi
namminavaariki nashTam konapraaNam
tappaka teerunu chastE RNakaalam
aahuti kaani ninnaTi roopam
kanchiki pOni nee kadha vEgam
anivaaryam ee parihaaram
kalikaalam aakali kaalam

painunna punnaamanarakam..
daaTinchu puNyaala varamani..
putrulunni kanna phalitamidi
praaNaalu pOyeTilOpunE..
venTaaDi vETaaDi niluvunaa..
anTinchi pOtaaru talakorivi
paalu pOsi penchE..kaala naagu roopam.
nOmu nOchi pondE..ghOramaina Saapam
bratukE baruvai..chitinE SaraNu vEDE kshaNam
kOralu chaachina swaardham..paramaardham
teerani kaankshala raajyam..ee sangham
neetini kaalchE..nippula gOLam
niluvuna koolchE..nishTura jaaLam
kalikaalam aakali kaalam
kalikaalam aakhari kaalam

ee maaya bhandaalu nammaku
ee parugu pandaala aagaku
nee baaTa needEraa kaDavaraku
E gaalini daari aDagaku
E jaaliki eduru chooDaku
nee neeDE nee tODanukO
ODalaaga ninnu..vaaDukunna vaaru
teeramandagaanE..tirigi chooDabOru
paDavai bratiki nadi ODilOnE nilichi unDaku
Erayi paarE kaalam Emainaa
saakshiga nilichina gaTTu karigEnaa
vEsavi kaani..velluva raani
SaaSwata snEham allukupOni
chedirEnaa panDina bhandham
cheripEnaa E kalikaalam

sinimaa:- kalikaalam
saahityam:- sirivennela
sangeetam:- vidyaasaagar
gaanam:- bAlu

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]