Wednesday, March 23, 2011

 
జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి

ప్రజహితం తన విధానమంటూ
జ్వలించే జనించే యువ ప్రభాతం
సమాజ ద్రోహుల సమాధి చేయగా
ప్రతిజ్ఞ చేసే అశోక చక్రం
యజ్ఞగుండమై బుగ బుగలాడిన
జాతిపౌరుషం ఈ చైతన్యం
నిశ్చయ నిర్భయ హిమాలయమై
యువత గుండె గర్జించిన సమయం

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి

ఉరుముల మెరుపుల ఉద్రేకముతో
పిడుగై పడినది చేడుపై లాఠి
పిడికిలి బిగించి విజ్రుభించి
నేరస్తుల పాలిట ప్రళయ దూర్జటి
చీకటి కొండల చీడలా పెరిగిన
కీచక మూకల ప్రకంపం
శివం ఎత్తినది..కదం తొక్కినది
ఖాఖి కట్టిన జంజా పవనం

జండా
గర్జించినది జండా
గంభిరమైన జండా

ప్రచండ స్వభావ విప్లవ సింహం
అయ్యింది ప్రపంచ శాంతి కపోతం
సమాజ శిల్పం చెక్కగ నిలిచెను
తూఫాను గుండెల ప్రభాత దీపం
ప్రజా పీడకుల దురాగతాలకు
అరచాకాలకు సమూల చేదం
స్వదేశ విదేశ వినాశకులపై
ఉక్కుపాదముల ఉల్కాపాదం

జండా
విధి మార్చు జండా

అనలం అనిలం అజ్వం కలిసిన
రాజకీయ ప్రక్షాళన యగ్నం
న్యాయం చట్టం రెక్కలు కాగల
ధర్మ బద్ద రాజ్యాంగ విహంగం
ప్రపంచ భ్రమణం..సముద్ర చలనం
అతిక్రమించే యువ సంచలనం
ధరిత్రి పధమున త్రిమూర్తులు ఒకటై
శ్వాశత ప్రగతికి తపించు తరుణం

జండా


స్వతంత్ర భారతం జాతి పతాకం
దాల్చేను నేడీ విశ్వరూపం
మహా సముద్రం హిమగిరి శిఖరం
మరో ప్రపంచపు జయ సంకేతం
మానవాళికిది శుభపరిణామం
సహస్రాబ్ధికి సువర్ణఘట్టం
కాకుడదు ఇది ఇలలో స్వప్నం
నిలవాలి ఇది కలకాలం
జయ జయ ఘోషలు
రెప రెపలు కాగా
జండా ఎగిరెను గగన సీమలో
సూర్యచంద్రులకు ధీటుగ నిలిచి
ప్రకాశించినది ఆకాశంలో

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ట పెంచాలి


సినిమా:- జండా
సాహిత్యం:- జొన్నవిత్తుల
సంగీతం:- వందేమాతరం శ్రీనివాస్
గానం:- బాలు


janDA
jai hind ani egaraali
mana pratishTha penchaali

prajahitam tana vidhaanamanTU
jwalinchE janinchE yuva prabhaatam
samaaja drOhula samaadhi chEyagaa
pratijna chEsE aSOka chakram
yajnagunDamai buga bugalaaDina
jaatipourusham ee chaitanyam
niSchaya nirbhaya himaalayamai
yuvata gunDe garjinchina samayam

janDA
jai hind ani egaraali
mana pratishTha penchaali

urumula merupula udrEkamutO
piDugai paDinadi chEDupai laaTHi
piDikili biginchi vijrubhinchi
nErastula paaliTa praLaya doorjaTi
cheekaTi konDala cheeDalaa perigina
keechaka mookala prakanpam
Sivam ettinadi..kadam tokkinadi
khaakhi kaTTina janjaa pavanam

janDA
garjinchinadi janDA
gambhiramaina janDA

prachanDa swabhaava viplava si&Mham
ayyindi prapancha Saanti kapOtam
samaaja Silpam chekkaga nilichenu
toophaanu gunDela prabhaata deepam
prajaa peeDakula duraagataalaku
arachaakaalaku samoola chEdam
swadESa vidESa vinaaSakulapai
ukkupaadamula ulkaapaadam

janDA
vidhi maarchu janDA

analam anilam ajwam kalisina
raajakeeya prakshaaLana yagnam
nyaayam chaTTam rekkalu kaagala
dharma badda raajyaanga vihangam
prapancha bhramaNam..samudra chalanam
atikraminchE yuva sanchalanam
dharitri padhamuna trimoortulu okaTai
SwaaSata pragatiki tapinchu taruNam

janDA


swatantra bhaaratam jaati pataakam
daalchEnu nEDI viSwaroopam
mahaa samudram himagiri Sikharam
marO prapanchapu jaya sankEtam
maanavaaLikidi SubhapariNaamam
sahasraabdhiki suvarNaghaTTam
kaakuDadu idi ilalO swapnam
nilavaali idi kalakaalam
jaya jaya ghOshalu
repa repalu kaagaa
janDA egirenu gagana seemalO
sooryachandrulaku dheeTuga nilichi
prakaaSinchinadi aakaaSamlO

janDA
jai hind ani egaraali
mana pratishTa penchaali


sinimaa:- janDA
saahityam:- jonnavittula
sangeetam:- vandEmaataram SrInivaas
gaanam:- bAlu

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]