Friday, March 25, 2011

 
జాబిలమ్మ ఆగవమ్మా ఆలకించవా మదిలో మాట
రేగిపొయే మూగ ప్రేమ విన్నవించే ఈ ఎదకోత
అమావాస్యకే బలై మన కధ
ఎటెళ్ళుతున్నదో నీకు తెలియాదా
నా బ్రతుకున బ్రతుకై ముడిపడిపోయిన ఓ ప్రియతమా

నీ మనసునే తన కొలువంటూ..నిను చేరిన నా మది
అనురాగపు మణిదీపముగా..ఆ గుడిలో ఉన్నది
ఏ కలతల సుడిగాలులకి..ఆరని వెలుగే అది
నువ్వు వెలి వెయ్యాలనుకున్న..నీ నీడై ఉన్నది
ప్రాణమే ఇలా..నిన్ను చేరగా
తనువు మాత్రము..శిలై ఉన్నది
ఈ శిల చిగురించే చినుకే నీలో దాగున్నది

కనివిని ఎరుగని కలయికగా..అనిపించిన జీవితం
ఎడబాటున జరిగిన గతమై..చినబొయేను ఈ క్షణం
విషజ్వాలలు విసిరిన అహమే..మసిచేసెను కాపురం
ఏ మసకల ముసుగులు లేని..మమకారమే శాశ్వతం
ప్రణయమన్నది ఇదేనా అని
మనని అడగదా లోకమన్నది
బదులీయపోతే ప్రేమకి విలువే పోదా మరి


సినిమా:- శుభవార్త
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- కోటి
గానం:- బాలు



jaabilamma aagavammaa aalakinchavaa madilO maaTa
rEgipoyE mooga prEma vinnavinchE ee edakOta
amaavaasyakE balai mana kadha
eTeLLutunnadO neeku teliyaadaa
naa bratukuna bratukai muDipaDipOyina O priyatamaa

nee manasunE tana koluvanTU..ninu chErina naa madi
anuraagapu maNideepamugaa..aa guDilO unnadi
E kalatala suDigaalulaki..aarani velugE adi
nuvvu veli veyyaalanukunna..nee neeDai unnadi
praaNamE ilaa..ninnu chEragaa
tanuvu maatramu..Silai unnadi
ee Sila chigurinchE chinukE neelO daagunnadi

kanivini erugani kalayikagaa..anipinchina jeevitam
eDabaaTuna jarigina gatamai..chinaboyEnu ee kshaNam
vishajwaalalu visirina ahamE..masichEsenu kaapuram
E masakala musugulu lEni..mamakaaramE SaaSwatam
praNayamannadi idEnaa ani
manani aDagadaa lOkamannadi
baduleeyapOtE prEmaki viluvE pOdaa mari


sinimaa:- Subhavaarta
saahityam:- sirivennela
sangeetam:- kOTi
gaanam:- bAlu

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]