Thursday, March 31, 2011

 
అ:
ఏనాడో నీకు నాకు రాసిపెట్టాడు
ఈనాడే నిన్ను నన్ను కలుపుతున్నాడు
ఆ:
చిలక గోరింకై
చుక్క నెలవంకై
చూసేవాళ్ళకి కన్నులవిందు చెయ్యమన్నాడు
అ:
ఎవరు
ఆ:
ఆ పైవాడు


ఆ:
వయసు వచ్చి మనసు నాకు ఇచ్చి పోయింది
మనసు పడితే మనసు నీకే ఇచ్చుకోమంది
అ:
మల్లేపువ్వు కుట్టి నన్ను కోసుకోమంది
వాలుజడలో పెట్టి నిన్నే కోరుకోమంది
ఆ:
చూపు పడితే చుక్క ఉంది
అ:
కన్ను కొడితే కటుక ఉంది
ఆ:
ఈడు జోడంటే
అ:
నువ్వు నేనంటూ
ఆ:
పిల్లాపాప అందరి పెళ్ళి చెయ్యమన్నాడు
అ:
ఎవరు
ఆ:
ఆ పైవాడు


అ:
సొగసులోన మొగలిరేకు వాసనేసింది
మసకవేళ మనసులాగే మంత్రమేసింది
ఆ:
బుసలు కొట్టే నిన్ను చూసి పడగ విప్పింది
వెన్నెలొచ్చి వెచ్చనైన వేణువూదింది
అ:
చేయి కలిపే చెలిమి ఉంది
ఆ:
కరిగిపోని కలిమి ఉంది
అ:
నింగి నేలంటే
ఆ:
నువ్వు నేనంటూ
అ:
తారలుకోసి తలంబ్రాలుగా చెయ్యమన్నాడు
ఆ:
ఎవరు
అ:
ఆ పైవాడు

సినిమా:- రామ రాజ్యంలో భీమ రాజ్యం
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు, సుశీల

a:
EnaaDO neeku nAku raasipeTTADu
eenaaDE ninnu nannu kaluputunnADu
A:
chilaka gOrinkai
chukka nelavankai
choosEvALLaki kannulavindu cheyyamannADu
a:
evaru
A:
aa paivADu


A:
vayasu vacchi manasu nAku icchi pOyindi
manasu paDitE manasu neekE icchukOmandi
a:
mallEpuvvu kuTTi nannu kOsukOmandi
vAlujaDalO peTTi ninnE kOrukOmandi
A:
choopu paDitE chukka undi
a:
kannu koDitE kaTuka undi
A:
eeDu jODanTE
a:
nuvvu nEnanTU
A:
pillApaapa andari peLLi cheyyamannADu
a:
evaru
A:
aa paivADu


a:
sogasulOna mogalirEku vaasanEsindi
masakavELa manasulAgE mantramEsindi
A:
busalu koTTE ninnu choosi paDaga vippindi
vennelocchi vecchanaina vENuvoodindi
a:
chEyi kalipE chelimi undi
A:
karigipOni kalimi undi
a:
ningi nElanTE
A:
nuvvu nEnanTU
a:
tAralukOsi talambrAlugaa cheyyamannADu
A:
evaru
a:
aa paivADu

sinimaa:- rAma rAjyamlO bheema rAjyam
saahityam:- vETUri
sangeetam:- chakravarti
gAnam:- bAlu, suSeela

Labels: , , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]