Thursday, March 31, 2011

 
దేవుని దయ ఉంటే దొరబాబులం
స్వయంగా పనిచేస్తే యజమానులం
నిన్నటి గరీబులం
రేపటి అమీరులం
మనలో మనం..అంతా సమం
ఒకటే కుటుంబము

స్వదేశమైనా విదేశమైనా సమానమనుకోరా
పాటు పడ్డచో కూటికెన్నడు లోటురాదు కదరా
చదువుసంధ్యలున్నా..ఉద్యోగాలు సున్నా
శ్రమయే సుఖం..చమటే ధనం
స్వశక్తి ప్రధానము

విహారయాత్రలు వినోదయాత్రలు వికాసమిస్తాయి
కొత్తచోటుల కొత్తమనుషుల పరిచయాలు తెస్తాయి
మంచివారికెప్పుడు మంచి జరుగుతుంది
జనతారధం..సమతాపధం
ప్రగతే ప్రయాణము

సినిమా:- అమెరికా అబ్బాయి
సాహిత్యం:- అరుద్ర
సంగీతం:- సాలూరి రాజేశ్వరరావు
గానం:- బాలు

dEVuni daya unTE dorabaabulam
swayamgaa panichEstE yajamaanulam
ninnaTi gareebulam
rEpaTi ameerulam
manalO manam..antaa samam
okaTE kuTumbamu

swadESamainaa vidESamainaa samAnamanukOraa
paaTu paDDachO kooTikennaDu lOTuraadu kadaraa
chaduvusandhyalunnA..udyOgAlu sunnaa
SramayE sukham..chamaTE dhanam
swaSakti pradhAnamu

vihArayaatralu vinOdayaatralu vikaasamistaayi
kottachOTula kottamanushula parichayaalu testaayi
manchivaarikeppuDu manchi jarugutundi
janataaradham..samataapadham
pragatE prayANamu

sinimaa:- amerikA abbAyi
saahityam:- arudra
sangeetam:- saalUri rAjESwararAvu
gAnam:- bAlu

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]