Thursday, March 31, 2011

 
అక్కా బావ మా అమ్మ నాన్న
ఎక్కువకాదా మా ప్రాణం కన్నా
కన్నవారులేని మాకు అంతకన్న మిన్నగా
దిగివచ్చిన శివపార్వతులే
అక్కా అక్కా..నీ రెక్కల చలువ
బావా బావా..నీ మమతల విలువ
పెంచుకున్న మొక్కలు మేమే

అక్క లాలన..బావా పాలన
పూల ఊయలై పెరిగాం మేము
చిక్కులేమితో చింతలేమితో
ఒక్కనాటికి ఎరుగము మేము
అక్క మాట వేదవాక్కు ఎప్పటికైనా
బావగారి చూపంటే సుగ్రీవ ఆగ్జ్ఞ
మీరు గీసే గీతను మీరము మేము
మీకు నచ్చనిదేది కోరము మేము

జన్మజన్మకు మీ పిల్లలమై
మీ ఒడిలోనే మేం జన్మిస్తాం
కాలు నేలపై మోపనివ్వక
పూల తేరులో ఊరేగిస్తాం
ఏమిచ్చి తీర్చగలం మీ ఋణభారం
కన్నీటి పన్నీరుతో మీ కాళ్ళు కడుగుతాం
మా బ్రతుకులు మీ కోసం అంకితమిస్తాం
మీ బరువులు మోసేందుకే మేం జీవిస్తాం

సినిమా:- శ్రీమతి ఒక బహుమతి
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- శంకర్-గణేష్
గానం:- బాలు, ????

akkA baaVa maa amma naanna
ekkuvakaadaa maa prANam kannaa
kannavaarulEni maaku antakanna minnagaa
digivacchina SivapaarvatulE
akkA akkA..nee rekkala chaluva
bAvA bAvA..nee mamatala viluva
penchukunna mokkalu mEmE

akka laalana..bAvA pAlana
poola ooyalai perigAm mEmu
chikkulEmitO chintalEmitO
okkanaaTiki erugamu mEmu
akka mATa vEdavaakku eppaTikainaa
bAvagAri choopanTE sugreeva aagj~na
meeru geesE geetanu meeramu mEmu
meeku nacchanidEdi kOramu mEmu

janmajanmaku mee pillalamai
mee oDilOnE mEm janmistaam
kaalu nElapai mOpanivvaka
poola tErulO oorEgistaam
Emicchi teerchagalam mee RNabhaaram
kanneeTi pannIrutO mee kaaLLu kaDugutaam
maa bratukulu mee kOsam ankitamistaam
mee baruvulu mOsEndukE mEm jeevistaam

sinimaa:- SrImati oka bahumati
saahityam:- sirivennela
sangeetam:- Sankar-gaNEsh
gAnam:- bAlu, ????

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]