Thursday, March 31, 2011

 
ఎదురు తిరిగి నిలువలేక
వేరే దిక్కేవ్వరులేక
పతితముద్ర పడకుండా పదసన్నిధికి వచ్చాను
నువ్వు దిద్దిన నుదిటిబొట్టు నేలపాలు కాకముందే
చెలరేగిన దానవతకు శీలం బలి కాకముందే
ప్రళయకాల మేఘంలా
పెనుతుఫాను కెరటంలా
రా రా కదలిరా కదలిరా

కడుపుచిచ్చు చల్లారకముందే
నిప్పులచెరలో నిలేపేవమ్మా
క్షుద్రశక్తిని ఆపే శక్తి నాలో లేదమ్మా
ఉందో లేదో తెలియని స్దితిలో ప్రాణం ఉందమ్మా
ఉప్పెనలాగా ముంచుకు వచ్చే ముప్పును తప్పించి
ఆదిశక్తిలా కాకపోయినా ఆమ్మగ రక్షించి
నా పసుపుకుంకుమ నిలుపగ రావమ్మా
రా రా కదలిరా కదలిరా

ఆలయాన ఒక మూగబొమ్మవై శిలగా నిలిచేవే
చేసిన కర్మను అనుభవమించమని నన్ను వదిలేసావే
ఐతే నీకు ఈ మొక్కులు ఎందుకు
ఏటేటా ఈ జాతరలెందుకు
ఇంక నీకు ఈ గుడిఎందుకు
ఆ గోపురమెందుకు
ఆగకముందే నా ఆక్రోశం అగ్నిగా మారకముందే
ఆ దావానలజ్వాలలో నేను ఆహుతి కాకముందే
దుర్గవై..చండివై..దురితవినాశంకరివై
అంబవై..అభయవై..అగ్రహోతగ్రవై
చూపులెడి బాకులుగా
పాపత్ముల గుండే చీల్చి
పెల్లుబికిన రక్తంలో
తల్లీ నువ్వు జలకమాడి
సత్యమేవ జయతే అని లోకానికి చాటింపగా
రా రా కదలిరా కదలిరా

సినిమా:- అమ్మోరు
సాహిత్యం:- ????
సంగీతం:- చక్రవర్తి
గానం:- చిత్ర

eduru tirigi niluvalEka
vErE dikkEvvarulEka
patitamudra paDakunDA padasannidhiki vacchAnu
nuvvu diddina nudiTiboTTu nElapAlu kAkamundE
chelarEgina dAnavataku SIlam bali kAkamundE
praLayakAla mEghamlA
penutuphaanu keraTamlA
rA rA kadalirA kadalirA

kaDupuchicchu challArakamundE
nippulacheralO nilEpEvammaa
kshudraSaktini aapE Sakti naalO lEdammaa
undO lEdO teliyani sditilO prANam undammaa
uppenalAgA munchuku vacchE muppunu tappinchi
aadiSaktilA kAkapOyinA aammaga rakshinchi
naa pasupukumkuma nilupaga rAvammaa
rA rA kadalirA kadalirA

aalayaana oka moogabommavai Silagaa nilichEvE
chEsina karmanu anubhavaminchamani nannu vadilEsAvE
aitE neeku ee mokkulu enduku
ETETA ee jaataralenduku
inka neeku ee guDienduku
aa gOpuramenduku
aagakamundE naa aakrOSam agnigaa maarakamundE
aa daavaanalajwaalalO nEnu aahuti kaakamundE
durgavai..chanDivai..duritavinaaSankarivai
ambavai..abhayavai..agrahOtagravai
choopuleDi baakulugaa
paapatmula gunDE cheelchi
pellubikina raktamlO
tallI nuvvu jalakamADi
satyamEva jayatE ani lOkAniki chaaTimpagaa
rA rA kadalirA kadalirA

sinimaa:- ammOru
saahityam:- ????
sangeetam:- chakravarti
gAnam:- chitra

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]