Tuesday, November 28, 2006

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-28

సాహిత్యం:- ???
సంగీతం:- సత్యం
గానం:- సుశీల,బాలు

పల్లవి
వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చె పున్నమి రోజు
దీపావళి రోజు..దీపావళి రోజు..

చరణం
పెద్దలంతా పిల్లలుగా మారే రోజు
పల్లెదో పట్టణమెదో తెలియని రోజు
పల్లెదో పట్టణమెదో తెలియని రోజు
దీపావళి రోజు..దీపావళి రోజు..
వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు

చరణం
చంటి పాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు
చంటి పాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు
మింట నున్న తారకలు ఇంటింట వెలిగే రోజు
మింట నున్న తారకలు ఇంటింట వెలిగే దీపావళి రోజు..
దీపావళి రోజు..వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు

చరణం
జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది
గువ్వలే బ్రతకాలని తారజువ్వ చెబుతుంది
నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని
నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని
తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]