Thursday, November 30, 2006

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-31

సాహిత్యం:- జొన్నవిత్తుల
సంగీతం:- వందేమాతరం శ్రీనివాస్
గానం:- స్వర్ణలత, సుజాత

పల్లవి
సిరుల నొసగు సుఖశాంతులను కూర్చును శిరిడి సాయి కధ
మధుర మధుర మహిమాన్విత బొధ సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ

చరణం
శిరిడీ గ్రామంలో..ఒక బాలుని రూపంలో
వేప చెట్టు కింద..వేదాంతిగా కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
అనందమే ఆహారం..చేదు చెట్టు నీడయె గురుపీఠం
ఏండకు వానకు..ఈ చెట్టుకిందనే ఉండకు
సాయి.సాయి రా మసీదుకు అన్న మహల్సాపతి పిలుపుకు
మసిదుకు మారను సాయిఅదే అయ్యినది ద్వారకామాయి
అక్కడ అందరు బాయి బాయి
బాబా బొధలే నిలయమనోయి

చరణం
ఖూరను, బైబిలు, గీత ఒకటని
కులమతం భేదం వద్దని
గాలి వాననొక క్షణమున ఆపే
ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులుగా చేసే నీటీ దీపమలు వెలిగించే
పచ్చి కుండలో నీటిని తెచ్చి..పూల మొక్కలకు పోసి
లెండీ వనం పెంచి..అఖండ జ్యొతిని వెలిగించె

కప్పకు పాముకు స్నేహం కలిపె
బల్లి బాషకు అర్ధం తెలిపె

ఆర్తుల రోగలు తనుహరియించె
భక్తుల భాదలు తాను భరించె

ప్రేమ సహనం రెండువైపుల ఉన్న నాణెం గురుదక్షిణ అడిగె
మరణం జీవికి మార్పని తెలిపె
మరణించి తను మరల బ్రతికె
సాయిరాం..సాయిరాం..సాయిరాం..
సాయిరాం..సాయిరాం..సాయిరాం..
నీదని నాదని అనుకోవద్దని
ధునిలొ ఊది విభూధిగ నిచ్చె
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు
చావడి ఉత్స్తవమై సాగగా
కంకడ హారతులందుకొని
కలి పాపలను కడుగగా
సకల దేవత స్వరూపుడై
వేద శాస్త్రముల కతీతుడై
సద్గురువై..జగద్గురువై
సత్యం చాటె దత్తాత్రేయుడై
జీవన సహచరి అని చాటిన తన ఇటుకరాయి
త్రుటిలోన పగులగా
పరిపూర్ణుడై..గురుపూర్ణిమై
భక్తుల మనసున చిరంజీవై
దేహం విడిచెను సాయి
సమాధి అయ్యెను సాయి
సాయిరాం..సాయిరాం..సాయిరాం..
సాయిరాం..సాయిరాం..సాయిరాం..

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]