Tuesday, May 8, 2018

 
ముందుకు ముందుకు ముందుకు, వెనకకు చూడడమెందుకు
సాగిపోదాం, ఊగిపోదాం, మబ్బుల్లో ఊరేగిపోదాం

బాబ్బావు అంటే వినిపించుకోనేది ఎవరు
బాంచెన్ దొర అంటే కరుణించేవారెవరు
ఎన్నాళ్ళీ వెట్టి చకిరి, ఎన్నాళ్ళి మట్టి ఊపిరి
రివ్వున తారాజువ్వలగా రెపరెపలాడుతూ పోదాం పదరా

కనులు మూసుకుంటే దృష్టి లేదు
మనసు మూసుకుంటే సృష్టి లేదు
ఎన్నాళ్ళీ అతుకుల బ్రతుకులు, ఎన్నాళ్ళీ గతుకుల నడకలు
సిమెంటురొడ్డుల, కరెంటుమేడల జిలుగులు చూద్దాం పదరా

బ్రతుకంతా పొగలో గడిపే బానిసతనమొద్దు
మెతుకుల కోసం చేయి చాచే మెతకతనం వద్దు
కండలు కరిగిద్దాం, లక్షలు గడియిద్దాం
కన్నవారిని సుఖపెడదాం, కలిసి అందరం సుఖపడదాం

సినిమా:- ఓ మనిషి తిరిగి చూడు
సాహిత్యం:- సినారె
సంగీతం:- రమేశ్ నాయిడు
గానం:- బాలు, రమేశ్


munduku munduku munduku, venakaku chooDaDamenduku
saagipOdAm, oogipOdAm, mabbullO oorEgipOdAm

bAbbAvu anTE vinipinchukOnEdi evaru
bAnchen dora anTE karuNinchEvArevaru
ennALLI veTTi chakiri, ennALLi maTTi oopiri
rivvuna taarAjuvvalagA reparepalADutU pOdAm padarA

kanulu moosukunTE dRshTi lEdu
manasu moosukunTE sRshTi lEdu
ennALLI atukula bratukulu, ennALLI gatukula naDakalu
simenTuroDDula, karenTumEDala jilugulu chooddAm padarA

bratukantA pogalO gaDipE baanisatanamoddu
metukula kOsam chEyi chaachE metakatanam vaddu
kanDalu karigiddAm, lakshalu gaDiyiddAm
kannavArini sukhapeDadAm, kalisi andaram sukhapaDadAm

sinimA:- O manishi tirigi chooDu
saahityam:- sinAre
sangeetam:- ramESh nAiDu
gaanam:- bAlu, ramESh

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]