Thursday, May 3, 2018

 
సిరిసిరిపూల చెల్లాయిపాప సీమంతమీనాడే
పులకల కోమ్మా, పుణ్యాల రెమ్మా పేరంటేమీనాడే
ఆశగా మధుమాసమే అడిగింది ఈమాట
ఊగక మన ఊయల అలిగింది ఈపూట

మీ అందాలలో నెలవంకా..ఈ నేల వంక వచ్చేనా
శృంగారాలకే శలవింక..జోలాలీలకే నిదురించేనా
పెళ్ళినాటి కుంగిబాటు తల్లినాడు సాగునా
అమ్మచాటు బిడ్డ ముందు అయ్యగారికి ఇవ్వనా
కలలే కన్నారు కమ్మగా..ఇదిగో మీ కానుక
చిలికే వలపే మొలకై మొలిచే కనుపాపలా, కనిపించేలే
కలికి చిలక వొడినే అలికే అనురాగమే, వినిపించెలే  

మా సంసారమే మధుగీతం..పూసే యవ్వన వన జాగాలే
పిల్లాపాపలా అనుభందం..దాచేసిందిలే తొలి బృందాలే
గోకులాన పుట్టినోడు కొంగుచాటు కృష్ణుడే
నందనాల అందమంతా బాలకృష్ణుడొక్కడే  
యెదలో ఉన్నాడు జీవుడు..ఎదురైతే దేవుడు
పలికే మురళి, తలపై నెమలి అది ఆటగా ఇది పాటగా

సినిమా:- గండీవం
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- ఎం.ఎం.కీరవాణి
గానం:- బాలు, చిత్ర, కీరవాణి

sirisiripoola chellAyipaapa seemantameenADE
pulakala kOmmA, puNyAla remmA pEranTEmeenADE
aaSagaa madhumaasamE aDigindi eemaaTa
oogaka mana ooyala aligindi eepooTa

mee andaalalO nelavankA..ee nEla vanka vacchEnA
SRngAraalakE Salavinka..jOlAleelakE nidurinchEnA
peLLinATi kungibATu tallinADu saagunA
ammachaaTu biDDa mundu ayyagAriki ivvanA
kalalE kannAru kammagA..idigO mee kAnuka
chilikE valapE molakai molichE kanupApalA, kanipinchElE
kaliki chilaka voDinE alikE anurAgamE, vinipinchelE  

mA samsAramE madhugeetam..poosE yavvana vana jaagaalE
pillApaapalA anubhandam..daachEsindilE toli bRndAlE
gOkulAna puTTinODu konguchaaTu kRshNuDE
nandanAla andamantA bAlakRshNuDokkaDE  
yedalO unnADu jeevuDu..eduraitE dEvuDu
palikE muraLi, talapai nemali adi aaTagA idi paaTagA

sinimA:- ganDeevam
saahityam:- vETUri
sangeetam:- m.m.keeravANi
gaanam:- bAlu, chitra, keeravANi

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]