Tuesday, May 8, 2018

 
దేవుడే కరుణిస్తే మనిషికి
కనురెప్పలు తోడుంటే కలత లేదు కంటికి

శతకోతి వరహలకన్నా, కన్నతల్లికి తన కొడుకెంతో మిన్న
తన బాబు ఎంతెంత వాడైనా, ఆమె కనులందు గారాల పసికూన
వొడిలోన పడుకున్న చాలు, ఆ తల్లి స్వర్గాలు ఇక కోరుకోదు

ఊరికి ఉపకారి నీకా ఇంతటి అన్యాయం..మంచికి ఇదేన సన్మానం
దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి
కనురెప్పలే కాటేస్తే కాపెవ్వరు కంటికి

నీవు నిప్పులాంటివాడివని తనకు తెలిసినా, చాటి చెప్పేందుకు సత్యానికి నోరులేదే
నీకు రక్షగా నిలవాలని తాను తలచినా, కదలి వచ్చెందుకు ధర్మానికి కాళ్ళు లేవే
వేసారు సంకెళ్ళు నీ చేతికి, కాని వెయ్యలేరు చెదిరిపోని నీ నీతికి

చందురునికి ఏ గ్రహణం పట్టినా, వాని పొందువిడిచి వెన్నెలతో వెళ్ళ్గునా
పందిరి సుడిగాలికి పడిపోతున్నా, దాని బంధాన్ని తీగ తెంచుపోగలుగునా
మంచిమనసు వలచేది ఒకేసారి, ఎదిఎమైనా మారునా దానిదారి

సినిమా:- ఊరికి ఉపకారి
సంగీతం:- సత్యం
గానం:- ఘంటసాల, పి.సుశీల


dEvuDE karuNistE manishiki
kanureppalu tODunTE kalata lEdu kanTiki

SatakOti varahalakannA, kannatalliki tana koDukentO minna
tana bAbu ententa vADainA, Ame kanulandu gaarAla pasikoona
voDilOna paDukunna chAlu, aa talli swargAlu ika kOrukOdu

ooriki upakAri neekA intaTi anyAyam..manchiki idEna sanmAnam
dEvuDE pagabaDitE dikkevvaru manishiki
kanureppalE kATEstE kaapevvaru kanTiki

neevu nippulAnTivADivani tanaku telisinA, chATi cheppEnduku satyAniki nOrulEdE
neeku rakshagA nilavAlani tAnu talachinA, kadali vacchenduku dharmAniki kALLu lEvE
vEsAru sankeLLu nee chEtiki, kAni veyyalEru chediripOni nee neetiki

chanduruniki E grahaNam paTTinA, vAni ponduviDichi vennelatO veLLgunA
pandiri suDigAliki paDipOtunnA, dAni bandhAnni teega tenchupOgalugunA
manchimanasu valachEdi okEsAri, ediemainA mArunA dAnidaari

sinimA:- ooriki upakAri
sangeetam:- satyam
gaanam:- ghanTasAla, p.suSeela

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]