Friday, May 4, 2018

 
కాలాల ఎనకాల ఒక ఏంకి ఉండేదటా
ఆ ఏంకి నండూరి పాటల్లో మిగిలిందటా
అది ఏ జాను తెనుగో, అది ఏ జానపదమో
ఆ ఏంకి మనసులో ఎన్నెన్ని ఊసులో, కడకంట ఎన్నెన్ని బాసలో

ఆ ఏంకి ఒకనాడు నా వంక చూసింది
ఆ చూపుతో వేగుచుక్కేదో పొడిచింది
అది కలలాగ ఎదిగి, నా కన్నీట కరిగి
నా ఆశ అకాశమై ఆగిపోయింది
నా ఏంకి తెల్లారి వెన్నెలైపోయింది
ఎదలోని ఆ ఏంకి ఎదురైన వేళ, పదమేది పాడేది ఈవేళ

తెలుగింట ప్రేమదీపాలు పెట్టింది
వెలుగారిపోయాక ఎద చూసుకోమంది
అది నా గుండే నమిలి, నా మనసంత నలిగి
తెలుగోళ్ళకొక పాటాగా ఏంకి మిగిలింది
పాడలేని నాకు పల్లవై పోయింది
ఎదలోని ఆ ఏంకి ఎదురైన వేళ, పదమేది పాడేది ఈవేళ

సినిమా:- ఊహసుందరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

kAlAla enakAla oka Enki unDEdaTA
aa Enki nanDoori paaTallO migilindaTA
adi E jaanu tenugO, adi E jAnapadamO
aa Enki manasulO ennenni oosulO, kaDakanTa ennenni bAsalO

aa Enki okanADu naa vanka choosindi
aa chooputO vEguchukkEdO poDichindi
adi kalalAga edigi, naa kannITa karigi
naa ASa akaaSamai aagipOyindi
naa Enki tellAri vennelaipOyindi
edalOni aa Enki eduraina vELa, padamEdi paaDEdi eevELa

teluginTa prEmadeepAlu peTTindi
velugAripOyAka eda choosukOmandi
adi nA gunDE namili, nA manasanta naligi
telugOLLakoka pATAgA Enki migilindi
paaDalEni naaku pallavai pOyindi
edalOni aa Enki eduraina vELa, padamEdi paaDEdi eevELa

sinimA:- oohasundari
sangeetam:- chakravarti
gAnam:- bAlu 

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]