Wednesday, May 9, 2018

 
జై భజరంగభళి
రంగ భళి, భజరంగభళి, భజరంగభళి

నమో నమో హనుమంత, మహిత గుణవంత
మహా బలవంత, స్వామి నీ ముందు మేమంత
నీ భక్తి భళి, భుజశక్తి భళి, రఘురామ భక్త భజరంగభళి

సూర్యుని మించును నీ తేజం, పవననుని మించును నీ వేగం
అగ్నిని మించును నీ రౌద్రం, అమృతమయం నీ హృదయం
ఓ సుజన మందరా, ఓ దనుజ సంహారా
నీ దివ్య చరణం, పాప హరణం, స్వామి శరణం
మమ్ము కరుణించవయ్యా

శ్రీరామ కార్యం చేపట్టినావు, సీతమ్మ జాడ కనిపెట్టినావు
లంకిణీని దెబ్బకు పడగొట్టినావు, లంకాపురిని తగలబెట్టినావు
ఒంటితలల రావణులు ఊరురా ఉన్నారు, కంట కనిపెట్టి, తోక చుట్టి, విసిరి కొట్టి
మమ్ము కాపాడవయ్యా

సినిమా:- కలియుగ రావణసురుడు
సాహిత్యం:- సినారె
సంగీతం:- కె.వి.మహదేవన్
గానం:- బాలు

jai bhajarangabhaLi
ranga bhaLi, bhajarangabhaLi, bhajarangabhaLi

namO namO hanumanta, mahita guNavanta
mahA balavanta, swAmi nee mundu mEmanta
nee bhakti bhaLi, bhujaSakti bhaLi, raghurAma bhakta bhajarangabhaLi

sooryuni minchunu nee tEjam, pavananuni minchunu nee vEgam
agnini minchunu nee roudram, amRtamayam nee hRdayam
O sujana mandarA, O danuja saMhArA
nee divya charaNam, pApa haraNam, swAmi SaraNam
mammu karuNinchavayyA

SrIrAma kaaryam chEpaTTinAvu, seetamma jADa kanipeTTinAvu
lankiNIni debbaku paDagoTTinAvu, lankApurini tagalabeTTinAvu
onTitalala rAvaNulu oorurA unnAru, kanTa kanipeTTi, tOka chuTTi, visiri koTTi
mammu kApADavayyA

sinimA:- kaliyuga rAvaNasuruDu
saahityam:- sinAre
sangeetam:- k.v.mahadEvan
gaanam:- bAlu 

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]