Tuesday, May 8, 2018

 
దేవుడు తాను ఆడుకొనేందుకు ఆలుమగలను సృష్టించాడు
ఆ ఇద్దరు కలసి ఆడుకొనేందుకు ముద్దుల బిడ్డను ఇచ్చాడు
తారంగం, తారంగం, తాండవకృష్ణ తారంగం

మోసిననాడు తెలియవురా ఈ ముద్దుమురిపాలు
కన్ననాడు చూడలేదు ఈ కంటి నవ్వులు
ప్రేమతోటి తినిపించాను గోరుముద్దలు
వాటితోనే పెంచుకున్న అన్ని పాశాలు
ఏనుగొచ్చింది ఏనుగు, ఎక్కడికొచ్చింది ఏనుగు?
మా వూరొచ్చింది ఏనుగు, మంచినీళ్ళు తాగింది ఏనుగు

ఎవ్వరు నీవు, ఎవ్వరు నేనో పూర్వ జన్మలో
ఎవ్వరి పుణ్యం ఇలా పండెనో ఈ జన్మలో
తీరిపోయే మమత కాదిది ఈ పుట్టుకతో
మరల నీకు తల్లినవుతా ఇదే తీపితో
తప్పేట్లోయి, తాళాలోయి, దేవుడి గుళ్ళో భాజాలోయి
తప్పేట్లోయి, తాళాలోయి, దేవుడి గుళ్ళో భాజాలోయి

పాలకోసం ఏద్చిననాడు ఎవరు పలికారు
పడ్డనడు ఎవరు నీకు ఊతమిచ్చారు
కన్నకడుపుకు తెలుసునా నీ కంటినీరు
ఉన్నవారని నిన్ను నన్ను వేరు చేసారు

సినిమా:- స్వర్గ సీమ
సంగీతం:- కె.వి.మహదేవన్
గానం:- పి.సుశీల



dEvuDu tAnu aaDukonEnduku aalumagalanu sRshTinchADu
aa iddaru kalasi aaDukonEnduku muddula biDDanu icchADu
tArangam, tArangam, tAnDavakRshNa tArangam

mOsinanADu teliyavurA ee muddumuripAlu
kannanADu chooDalEdu ee kanTi navvulu
prEmatOTi tinipinchAnu gOrumuddalu
vaaTitOnE penchukunna anni pASAlu
Enugocchindi Enugu, ekkaDikocchindi Enugu?
maa voorocchindi Enugu, manchinILLu taagindi Enugu

evvaru neevu, evvaru nEnO poorva janmalO
evvari puNyam ilA panDenO ee janmalO
teeripOyE mamata kaadidi ee puTTukatO
marala neeku tallinavutA idE teepitO
tappETlOyi, tALAlOyi, dEvuDi guLLO bhAjAlOyi
tappETlOyi, tALAlOyi, dEvuDi guLLO bhAjAlOyi

pAlakOsam EdchinanADu evaru palikAru
paDDanaDu evaru neeku ootamicchAru
kannakaDupuku telusunA nee kanTinIru
unnavArani ninnu nannu vEru chEsAru

sinimA:- swarga seema
sangeetam:- k.v.mahadEvan
gaanam:- p.suSeela 

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]