Tuesday, May 8, 2018

 
మన జీవితం ఒక తోట, అనురాగమే ఒక పాట
ఆ పాట మనలో కరిగి, అణువణువు తియ్యగ కదలి
ఉదయించే చిన్నారి నాన్న, వీడు ఎదగాలి గగనాల కన్న

ఎన్నో దిక్కులున్నా వెలుగిచ్చే సూర్యుడొకడే
ఎన్నో చుక్కలున్నా కళలిచ్చే చంద్రుడొకడే
అ వెలుగే జగతికి ఆభరణం, ఈ బాబే మన ఆశా కిరణం

పూచే ప్రతి పువ్వు మా బాబు చిరు చిరు నవ్వు
వీచే ప్రతి గాలి మా బాబు వేసే అడుగు
మా నాన్న చిరునవ్వులోన, మ్రోగాలి మాణిక్యవీణ

ఎన్నో జన్మలున్నా ఈ జన్మే తీయ్యని వరము
ఎన్నో మమతలున్నా ఈ బాబే వీడని బంధము
ఈ బంధమే మన ఊపిరిగా, ఉందాము బ్రతుకె పున్నమిగా

సినిమా:- love marriage
సాహిత్యం:- సినారె
సంగీతం:- టి.చలపతిరావు
గానం:- పి.సుశీల, బాలు  


mana jeevitam oka tOTa, anurAgamE oka pATa
aa pATa manalO karigi, aNuvaNuvu tiyyaga kadali
udayinchE chinnAri nAnna, veeDu edagAli gaganAla kanna

ennO dikkulunnA velugicchE sooryuDokaDE
ennO chukkalunnA kaLalicchE chandruDokaDE
a velugE jagatiki aabharaNam, ee bAbE mana aaSA kiraNam

poochE prati puvvu mA bAbu chiru chiru navvu
veechE prati gAli mA bAbu vEsE aDugu
mA nAnna chirunavvulOna, mrOgAli maaNikyaveeNa

ennO janmalunnA ee janmE teeyyani varamu
ennO mamatalunnA ee bAbE veeDani bandhamu
ee bandhamE mana oopirigA, undAmu bratuke punnamigA

sinimA:-  love marriage
saahityam:- sinAre
sangeetam:- T.chalapatirAvu
gaanam:- p.suSeela, bAlu  


Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]