Wednesday, May 9, 2018

 
ఈ తీగ పలికినా, నా గొంతు కలిపినా
ఉదయించే ఆ గీతం నీ కోసం
తీగ మార్చి చూడమంటే, స్వరం మార్చి పాడమంటే
ఆ గీతం నా జీవితానికే చరమగీతం, అదే చివరి గీతం

కడలిలోనిది ఉప్పునీరని కలిసే సెలయేరు తిరిగిపోవునా
కళలు తరిగే జాబిలి అయినా, వెన్నెల దానిని వీడిపోవునా
దాహం తీర్చే మగువే, తన ధర్మపత్ని అని అనుకుంటే
పవిత్ర మంగళసూత్రం ఒక పలుపుతాడని అనుకుంటే
వాడు ఒక మగవాడేనా? వాడిది ఒక బ్రతుకేనా?

కదలలేని శిలపైన ఎందుకో ఆ తీరని మమత
ఆ శిలయే గుడిలో ఉంటే అది కాదా దేవత
కొడిగట్టిన దీపంపైన ఎందుకంత సానుభూతి
ఆరదించే మనసుంటే అది కాదా జీవనజ్యోతి
అది కాదా జీవనజ్యోతి

సినిమా:- మాంగళ్యానికి మరో ముడి
సాహిత్యం:- సినారె
సంగీతం:- కె.వి.మహదేవన్
గానం:- పి.సుశీల, బాలు

ee teega palikinA, nA gontu kalipinA
udayinchE aa geetam nee kOsam
teega maarchi chooDamanTE, swaram maarchi pADamanTE
aa geetam naa jeevitAnikE charamageetam, adE chivari geetam

kaDalilOnidi uppuneerani kalisE selayEru tirigipOvunA
kaLalu tarigE jAbili ayinA, vennela dAnini veeDipOvunA
daaham teerchE maguvE, tana dharmapatni ani anukunTE
pavitra mangaLasootram oka paluputADani anukunTE
vADu oka magavADEnA? vADidi oka bratukEnA?

kadalalEni Silapaina endukO aa teerani mamata
aa SilayE guDilO unTE adi kAdA dEvata
koDigaTTina deepampaina endukanta saanubhooti
aaradinchE manasunTE adi kAdA jeevanajyOti
adi kAdA jeevanajyOti

sinimA:- mAngaLyAniki marO muDi
saahityam:- sinAre
sangeetam:- k.v.mahadEvan
gaanam:- p.suSeela, bAlu 

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]