Thursday, May 3, 2018

 
ఏవో ఏవో ఆశించావు..ఎమిటి చివరకు సాధించావు
ఆకాశాలకు వేసిన నిచ్చెన అనుకోకుండా విరిగింది
ఆవేశం పలుదోవలు తీస్తే అంధకారమే మిగిలింది
అహా వింత పయనం..అయ్యో ఎంత పతనం

కన్నుమిన్ను కనకుండా, ఎవ్వరెన్ని చెప్పినా వినకుండా
అయ్యినవారినే కాదన్నావు, నీ పెడదారే నీదన్నావు
మిసమిసలాడే పూలమాదిరిగా పసిరిక పామును మెడను దాల్చగా
ఫలితం తెలిసివచ్చింది..ప్రళయం ముంచుకొచ్చింది

జీవితమన్నది ప్రవాహమే, అది గట్టుదాటితే ప్రమాదమే
హద్దులోనే అందం వుంది, అయినవారికి ఆనందం వుంది
తెలుపునలుపు తేడా తెలిసి, కలలే భ్రమలై కరిగేసరికి
తరుణం చేయిజారింది, సమయం మించిపోయింది

సినిమా:- ఇల్లే స్వర్గం
సాహిత్యం:- శ్రీ శ్రీ
సంగీతం:- రమేశ్ నాయిడు
గానం:- బాలు

EvO EvO aaSinchAvu..emiTi chivaraku saadhinchAvu
aakASAlaku vEsina nicchena anukOkunDA virigindi
aavESam paludOvalu teestE andhakAramE migilindi
ahaa vinta payanam..ayyO enta patanam

kannuminnu kanakunDA, evvarenni cheppinA vinakunDA
ayyinavArinE kaadannaavu, nee peDadaarE needannaavu
misamisalADE poolamaadirigA pasirika paamunu meDanu daalchagA
phalitam telisivacchindi..praLayam munchukocchindi

jeevitamannadi pravAhamE, adi gaTTudaaTitE pramAdamE
haddulOnE andam vundi, ayinavAriki Anandam vundi
telupunalupu tEDA telisi, kalalE bhramalai karigEsariki
taruNam chEyijaarindi, samayam minchipOyindi

sinimA:- illE swargam
saahityam:- SrI SrI
sangeetam:- ramEShnAiDu
gaanam:- bAlu 

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]