Tuesday, May 8, 2018

 
కల అయినా, నిజమైనా, కాదన్నా, లేదన్నా, చెబుతున్నా ప్రియతమా
నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు ప్రేమ

నిన్ను పూజించనా, నిన్ను సేవించనా, సర్వమర్పించనా, నిన్ను మెప్పించనా
నీ గుడిలో దీపముగా నా బ్రతుకే వెలిగించి, కొడిగట్టి నేనారిపోనా
నువ్వంటే నాకు ప్రేమ

నిన్ను లాలించనా, నిన్ను పాలించనా, జగతి మరిపించనా, స్వర్గమనిపించనా
నా యెదలో దేవతగా  నీ రూపే నిలుపుకొని, నీ ప్రేమ పూజారి కానా
నువ్వంటే నాకు ప్రేమ

కలిసి జీవించినా, కలలు పండించినా, వలచి విలపించినా, కడకు మరణించినా
నీ జతలో జరగాలి, నీ కధలో నాయికగా మిగలాలి మరుజన్మకైనా
నువ్వంటే నాకు ప్రేమ

సినిమా:- ప్రేమ తరంగాలు
సాహిత్యం:- సినారె
సంగీతం:- చక్రవర్తి
గానం:- పి.సుశీల, బాలు

kala ayinA, nijamainA, kAdannA, lEdannA, chebutunnA priyatamA
nuvvanTE nAku prEma, nuvvanTE nAku prEma

ninnu poojinchanA, ninnu sEvinchanA, sarvamarpinchanA, ninnu meppinchanA
nee guDilO deepamugA naa bratukE veliginchi, koDigaTTi nEnAripOnA
nuvvanTE nAku prEma

ninnu lAlinchanA, ninnu pAlinchanA, jagati maripinchanA, swargamanipinchanA
nA yedalO dEvatagA  nee roopE nilupukoni, nee prEma poojAri kAnA
nuvvanTE nAku prEma

kalisi jeevinchinA, kalalu panDinchinA, valachi vilapinchinA, kaDaku maraNinchinA
nee jatalO jaragAli, nee kadhalO naayikagA migalAli marujanmakainA
nuvvanTE nAku prEma

sinimA:- prEma tarangAlu
saahityam:- sinAre
sangeetam:- chakravarti
gaanam:- p.suSeela, bAlu 

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]