Tuesday, April 24, 2018

 
అక్షరాల ఆశయాలు..ఉద్యమాల లక్ష్యాలు
చింపబొతే చిరగబోవురో..చంపబొతే చావబోవురో

రాజకీయ పిశాచాలు స్వతంత్రంగా కులకాలని
కులం పేరు కుప్పించి..మతం మందు ఎక్కించి
బుద్ధినిచ్చే చదువు మీద బురద చల్లుతునారు
కుఱ్ఱోలను వెఱ్ఱోలుగా కూడతిప్పుతున్నారు
ఆ వెంటబొతే అంటుజబ్బురో..అది అంటుకుంటే కుంటిబ్రతుకురో

దేశమన్న నేలమీద ధ్యానమన్న మొక్క నాటి
భాగ్యాలను పండించే విద్యార్ధుల విలువలని
దోపిడీకి బలిపెట్టి..దోచుకునే దొంగలంతా
నిరుద్యోగమన్న బిక్ష నీకు చేతికిస్తుంటే
భవితవ్యం బాట మూతరో..చైతన్యం చీకటేనురో

వోటులకై మంత్రులంతా..బూతులతో ఒకరినొకరు
అమ్మ ఆలి పరువు తీసి అంగడిలో పెడుతుంటే
సంస్కారం ఎక్కడుంది..సమసామ్యం ఏముంది
ఈ పందుల కుమ్ములాటలో..ఎందుకొరకు వోటులెస్స్తరో

చదువుతల్లి బిడ్డలైన విద్యార్ధుల లోకంలో
బ్రుచ్చులొచ్చి ఉచ్చు రేపి..విచ్చిణ్ణం చేయబొతే
అల్లూరులు, ఝాన్సీలు, భగత్ సింగ్ సుకదేవులు
శ్రీశ్రీలు గురజాడలు మాలోనే బయలుదేరి
పిడుగుల్లా ప్రతిఘటించి గడగడలాడిస్తారు
ఖబర్దార్ ద్రోహులరా..
ఖబర్దార్...ఖబర్దార్...ఖబర్దార్

సినిమా:- ఇదా ప్రపంచం
సాహిత్యం:- వెన్నెలకంటి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు, మనో

aksharaala aaSayaalu..udyamaala lakshyaalu
chimpabotE chiragabOvurO..champabotE chaavabOvurO

raajakeeya piSaachaalu swatantrangaa kulakaalani
kulam pEru kuppinchi..matam mandu ekkinchi
buddhinicchE chaduvu meeda burada challutunaaru
ku~r~rOlanu ve~r~rOlugaa kooDatipputunnaaru
aa venTabotE anTujabburO..adi anTukunTE kunTibratukurO

dESamanna nElameeda dhyaanamanna mokka naaTi
bhaagyaalanu panDinchE vidyaardhula viluvalani
dOpiDeeki balipeTTi..dOchukunE dongalantaa
nirudyOgamanna biksha neeku chEtikistunTE
bhavitavyam baaTa mootarO..chaitanyam cheekaTEnurO

vOTulakai mantrulantaa..bootulatO okarinokaru
amma aali paruvu teesi angaDilO peDutunTE
samskaaram ekkaDundi..samasaamyam Emundi
ee pandula kummulaaTalO..endukoraku vOTulesstarO

chaduvutalli biDDalaina vidyaardhula lOkamlO
brucchulocchi ucchu rEpi..vicchiNNam chEyabotE
allUrulu, jhaanseelu, bhagat sing sukadEvulu
SrISreelu gurajaaDalu maalOnE bayaludEri
piDugullaa pratighaTinchi gaDagaDalaaDistaaru
khabardaar drOhularaa..
khabardaar...khabardaar...khabardaar

sinimaa:- idA prapancham
saahityam:- vennelakanTi
sangeetam:- chakravarti
gaanam:- bAlu, manO

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]