Monday, April 30, 2018

 
రాణి రాణమ్మ అనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని
ఏన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ
రాణి రాణమ్మ అనాటి నవ్వులు ఏవమ్మ

రతనాలమేడలోన నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా నా అరిచేతులుంచాలని
ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను
పన్నీటి బతుకులోన కన్నీటి మంటలేనా


రాణీ రాణమ్మ రాని కన్నీళ్లు రానీయమ్మా
సహనం స్త్రీకి కవచమని శాంతం అందుకు సాక్షమని
ఉన్నాను మౌనంగా కన్నులు దాటని కన్నీరుగా
రాణీ రాణమ్మ రాణీ కన్నీళ్లు రానీయమ్మా

గుండె రగిలిపోతూవుంటే గూడుమేడ ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే ముళ్ళు పూలు ఒకటేలే
ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలితీరం
ఎదురీత ఆగదులే విధిరాత తప్పదులే

సినిమా:- మాపల్లె గొపాలుడు
సాహిత్యం:- సినారె
సంగీతం:- కె.వి.మహదేవన్ 
గానం:- ఎస్.జానకి, బాలు  

Labels: , , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]