Thursday, April 26, 2018

 
వేగుచుక్క మొలిచింది..వేకువ పొడసూపింది
తూరుపు తెలతెలవారక ముందే కాలం మాటేసింది
నా కళ్ళను కాటేసింది

జీవితమంటే కల

కాదు..అది కవులు రచించే కధ కాదు
కనుమరుగైనది సిరి కాదు..అది మనదని తలచుట సరికాదు 
కుడియెడమైతే పొరపాటు లేదను నానుడి సత్యం కాదు
ఇది అందరికర్ధం కాదు

ఎండిన మల్లెకు వెల లేదు..మండే గుండెకు చలి లేదు
మంచిని మించిన జత లేదు..విధి వంచనకన్నా వెత లేదు
మనసే మనిషికి చిరుచేదైతే మనుగడకర్ధం లేదు
ఇది అందరికర్ధం కాదు

సినిమా:- కళ్యాణవీణ
సాహిత్యం:- మల్లేమాల
సంగీతం:- సత్యం
గానం:- యేసుదాస్

vEguchukka molichindi..vEkuva poDasoopindi 
toorupu telatelavaaraka mundE kaalam maaTEsindi
naa kaLLanu kaaTEsindi

jeevitamanTE kala kaadu..adi kavulu rachinchE kadha kaadu
kanumarugainadi siri kaadu..adi manadani talachuTa sarikaadu 
kuDiyeDamaitE porapaaTu lEdanu naanuDi satyam kaadu
idi andarikardham kaadu

enDina malleku vela lEdu..manDE gunDeku chali lEdu
manchini minchina jata lEdu..vidhi vanchanakannaa veta lEdu
manasE manishiki chiruchEdaitE manugaDakardham lEdu
idi andarikardham kaadu

sinimaa:- kaLyaaNaveeNa
saahityam:- mallEmaala
sangeetam:- satyam
gaanam:- yEsudaas 

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]