Saturday, April 28, 2018

 
ఏమి కధ చెప్పనురా ముద్దల కన్న
సీతకధ చెబుతాను వినరా నాన్న
సీతమ్మకి నిత్య వనవాసమే
రామయకి తాను కడుదూరమే
తీరదులే ఆ సీత గుండెకోత

కాపురాలనే గాలిగోపురాలుగా చేసుకున్నది చేతులారా
కారుచీకటే కంటికాటుకవ్వగా దూరమైనది తన పతికే
అయోధ్యాభవనాల స్వర్ణసీతలు..ఆడవిలో వెన్నెలలే సీత జాడలు
జరిగిన కధవిని జాలిగా చూడకు
మారదులే అ సీత నొసటిరాత

పుణ్యమాతలే పురుడుపోయగా తాను కన్నది తనయులనే
ఆదికవితలే జోలపాడగా పెంచుకున్నది మమతలనే
అయినాడు రామయ్య శ్రీకృష్ణుడు..ఆ పైన ఓ భామ ప్రేమదాశుడు
ఈ కధ ఎవరిదో వివరమే అడగకు
ఆరదులే ఆ సీత అగ్నిగీత

సినిమా:- శ్రావణ మేఘలు
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- పి.సుశీల


Emi kadha cheppanurA muddala kanna
seetakadha chebutAnu vinarA nAnna 
seetammaki nitya vanavAsamE 
raamayaki taanu kaDudooramE  
teeradulE aa seeta gunDekOta

kaapurAlanE gaaligOpuraalugA chEsukunnadi chEtulArA 
kArucheekaTE kanTikaaTukavvagA dooramainadi tana patikE 
ayOdhyAbhavanAla swarNaseetalu..aaDavilO vennelalE seeta jaaDalu 
jarigina kadhavini jaaligA chooDaku
maaradulE a seeta nosaTiraata

puNyamAtalE puruDupOyagA tAnu kannadi tanayulanE 
aadikavitalE jOlapaaDagA penchukunnadi mamatalanE 
ayinADu raamayya SrIkRshNuDu..aa paina O bhaama prEmadASuDu
ee kadha evaridO vivaramE aDagaku 
aaradulE aa seeta agnigeeta

sinimaa:- SrAvaNa mEghalu 
saahityam:- vETUri
sangeetam:- chakravarti
gAnam:- p.suSeela

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]