Thursday, April 26, 2018

 
గ్యాంగోళ్ళమండి బాబు..గ్యాంగోళ్ళమండి బాబు
గ్యాంగోళ్ళమండి బాబు..గ్యాంగోళ్ళమండి బాబు
మా రక్తమంత ధారపోసి రైలుపట్టాలేస్తాము

పట్టాలపై పోయే పొగబళ్ళలో సాగే
ఏడాది మనుషులను సూత్తుంటాము
వాళ్ళ ఎడుపులు నవ్వులు వింటుంటాము
ఇటునుంచి వస్తాది ఓ బండి
అటునుంచి వస్తాది ఓ బండి
ఏ బండి ఆగినా..ఏ బండి సాగినా
ఆగకుండా సాగాలి బ్రతుకులబళ్ళు
అవి ఆగేనా నూకలు సెల్లు

మనుషుల్ని చేసింది దేవుడయినా
దేవుడ్ని నమ్మింది మనుషులయినా
నువ్వు చేసే పని ఒకటే నీకు దేవుడు
అనుకుంటే లోటు రాదు నీకేప్పుడు
అందుకే నవ్వుతూ బ్రతకాలిరా
ఆ బ్రతుకులొనే కొండంత తృప్తి ఉందిరా
నవ్వు తృప్తి కలిస్నప్పుడే జీవితంరా
అదిలేనినాడు చీకటి నీ లోకంరా

ఎక్కడో పుడతారు మనుషులు
ఎక్కడికో చేరుతాయి బ్రతుకులు
అడుగడున అంతరంగ సంఘర్షణలే
అనుక్షణం అంతులేని సంక్షోబాలే
దూరపు కొండలు నునుపని
మెరిసేదంతా మెలిమి అనుకోని
స్వర్గాలకే నిచ్చెనలు వేస్తూంటారు
ఆత్మబలం చాలక పడిపోతుంటారు
చివరకు ఓడిపోయి చావుతోవ పడుతుంటారు

సినిమా:- స్టేషన్ మాస్టర్
సాహిత్యం:- సినారె
సంగీతం:- చక్రవర్తి
గానం:- మనో, వందేమాత్రం


gyaangOLLamanDi bAbu..gyaangOLLamanDi bAbu
gyaangOLLamanDi bAbu..gyaangOLLamanDi bAbu
maa raktamanta dhaarapOsi railupaTTaalEstaamu

paTTaalapai pOyE pogabaLLalO saagE
EDaadi manushulanu soottunTaamu
vaaLLa eDupulu navvulu vinTunTaamu
iTununchi vastaadi O banDi
aTununchi vastaadi O banDi
E banDi aaginaa..E banDi saaginaa
aagakunDaa saagaali bratukulabaLLu
avi aagEnaa nookalu sellu

manushulni chEsindi dEvuDayinaa
dEvuDni nammindi manushulayinaa
nuvvu chEsE pani okaTE neeku dEvuDu
anukunTE lOTu raadu neekEppuDu
andukE navvutU bratakaaliraa
aa bratukulonE konDanta tRpti undiraa
navvu tRpti kalisnappuDE jeevitaMraa
adilEninaaDu cheekaTi nee lOkaMraa

ekkaDO puDataaru manushulu
ekkaDikO chErutaayi bratukulu
aDugaDuna antaranga sangharshaNalE
anukshaNam antulEni sankshObaalE
doorapu konDalu nunupani
merisEdantaa melimi anukOni
swargaalakE nicchenalu vEstUnTaaru
aatmabalam chaalaka paDipOtunTaaru
chivaraku ODipOyi chaavutOva paDutunTaaru

sinimaa:- Station Master
saahityam:- sinaare
sangeetam:- chakravarti
gaanam:- manO, vandEmaatram

Labels: , , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]