Saturday, April 28, 2018

 
ఇంత అందం...ఎప్పుడూ చూడ లేదే... ఇంత కాలం ఎవరూ చెప్ప లేదే. ఇది కల అనుకోనా... వరమనుకో... కలవరమనుకోనా ఇది చెలిమనుకోనా... చెలి అనుకోనా... చెరిసగమనుకోనా... తోడు అనుకో...నీకో నీడననుకో రాగమనుకో...నీలో భాగమనుకో ఇంత అందం...ఎప్పుడూ చూడ లేదే ఇంత కాలం ఎవరూ చెప్ప లేదే ఆ బ్రహ్మ దేవుడే తన పేరు చరితలో నిలవాలని నీ రూపమే సృష్టించెనే ఆ నింగి చంద్రుడే ఆకాశ చెరలలో నిలవొద్దని నీ స్నేహమై నను చేరెనే స్నేహ సీమలో కొత్తగా ప్రేమ పూవులే పూయగా ప్రేమ సీమలో తీయగా తేనె స్థానమే చేయగా తలవంచక తప్పదు స్వర్గం ప్రతి నిమిషం నీ కాలి గోటిపై నా గుండె వాలగా కసిరేయక విసిరేయక కాపాడవా నీ కంటి గోటిపై కలపాప చేరగా విదిలించక వదిలేయక నడిపించవా నిన్న దాక నా జీవితం కవిత లేని ఓ కాగితం నువ్వు లేని నా యవ్వనం దివ్వె లేని ఓ ఆలయం మన అనుబంధానికి మనసే తొలి సాక్ష్యం

సినిమా:- నిరీక్షణ
సంగీతం:- ఎం.ఎం.శ్రీలేఖ 
గానం:- బాలు, చిత్ర 

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]