Wednesday, April 25, 2018

 
అర్ధరాత్రి జాబిలికి అమ్మలిద్దరు
ఒకరు తూరుపు..ఒకరు పడమర
కడుపు చించుకొని కన్నానని ఒక తల్లి
నెత్తురుగుడ్డుకు ఊపిరి పోసానని ఒక తల్లి
హై అల్లా..ఓ జీసస్..హే కృష్ణా
కన్నది ఎవరో..ఇంతకు కన్నది ఎవరో
తెలిసుంటే చెప్పు నీ జడ్జిమెంటు
మనుషులకే ఎందుకింత సెంటిమెంటు

ఎఱ్ఱని తన రక్తంతో నల్లని నీ కాళ్ళుకడగి
తెల్లని నీ తీర్పు అడిగి తపిస్తున్నది ఒక తల్లి
పొర్లువచ్చు దుఖంతో పొర్లిదండమే పెడుతూ
చల్లని నీ చూపు కొరకు జ్వలిస్తున్నది ఒక తల్లి
హే కృష్ణా..కన్నతల్లి దేవకికి కన్నీటిని తుడిచావా
వెన్నతల్లి యశొదకి వెన్నయినా నిమిరావా
ఇద్దరు తల్లుల బిడ్డవి నీకుందా సెంటిమెంటు
ఉంటే మనసుంటే చెప్పు నీ జడ్జిమెంటు

ఆడుకోకు అమ్మలతో బొమ్మలుగా నీవు తలచి
శపిస్తారు నిన్ను తిరిగి అమ్మ మనసు విరిగి
తాళిబొట్టు తల్లిపేగు రెంటిని పెనవేసి
నిన్నే ఉరితీయగలరు అమ్మతనం అలిగి
పరమేశా..రాతిని నాతిగ చేసిన రామపాదమే ఓ శిల
ఒ అమ్మకు పుట్టని నీ పురాణమే ఒ కల
అమ్మలేని నీ జన్మకు ఎక్కడుంది సెంటిమెంటు
ఉంటే నువ్వుంటే చెప్పు నీ జడ్జిమెంటు

సినిమా:- జడ్జిమెంటు
సాహిత్యం:- వేటూరి
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు


ardharaatri jaabiliki ammaliddaru
okaru toorupu..okaru paDamara
kaDupu chinchukoni kannAnani oka talli
netturuguDDuku oopiri pOsAnani oka talli
hai allaa..O jeesas..hE kRshNA
kannadi evarO..intaku kannadi evarO 
telisunTE cheppu nee jaDjimenTu 
manushulakE endukinta senTimenTu

e~r~rani tana raktamtO nallani nee kaaLLukaDagi 
tellani nee teerpu aDigi tapistunnadi oka talli
porluvacchu dukhamtO porlidanDamE peDutU
challani nee choopu koraku jwalistunnadi oka talli
hE kRshNA..kannatalli dEvakiki kannITini tuDichaavaa
vennatalli yaSodaki vennayinaa nimiraavaa 
iddaru tallula biDDavi neekundA senTimenTu
unTE manasunTE cheppu nee jaDjimenTu 

aaDukOku ammalatO bommalugaa neevu talachi
Sapistaaru ninnu tirigi amma manasu virigi
taaLiboTTu tallipEgu renTini penavEsi 
ninnE uriteeyagalaru ammatanam aligi 
paramESaa..raatini naatiga chEsina raamapaadamE O Sila
o ammaku puTTani nee purANamE o kala
ammalEni nee janmaku ekkaDundi senTimenTu
unTE nuvvunTE cheppu nee jaDjimenTu 

sinimaa:- jaDjimenTu  (judgement - usha kiran movies)
saahityam:- vETUri
sangeetam:- chakravarti
gaanam:- bAlu 

Labels: ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]