Saturday, April 28, 2018

 
కోర్టుకెళ్ళబోకురా సోదరా
కోర్టుపక్షి కాబోకురా

చట్టానికి చెవులేకాని కళ్ళులేవురా
లాయర్లకు law తప్ప నిజాలొద్దురా
జడ్గ్జీలకు సాక్ష్యాలే ఆయుధాలురా
దున్నపోతు ఈనిందనన్న సాక్ష్యులుంటే చాలురా    

తిరుపతికి పోయేవాడు తలనిండుగ పోతాడు
గోవిందా అంటూ గుండు చేసుకొస్తాడు
కోర్టుకు పొయేవాడు జెబులెగరేసుకు పోతాడు
ఉన్నదంతా ఊడ్చిపెట్టి గుండెపోటుతో పడిపోతాడు

తాతాలనాడు ఈ కోర్టులేవ్విరా
కొట్టుకున్న చెట్టుకిందే తీర్పురా
బుద్దుడికి బోధించిన బోధిచెట్టురా..నాయనా
వీడి బొధ వింటే నువ్వు బుద్ధుడి అవుతావురా

సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు

kOrTukeLLabOkuraa sOdaraa
kOrTupakshi kaabOkuraa

chaTTAniki chevulEkaani kaLLulEvuraa
lAyarlaku #law# tappa nijAloddurA
jaDgjIlaku sAkshyAlE AyudhaalurA
dunnapOtu eenindananna saakshyulunTE chAlurA    

tirupatiki pOyEvaaDu talaninDuga pOtaaDu
gOvindA anTU gunDu chEsukostADu
kOrTuku poyEvaaDu jebulegarEsuku pOtADu
unnadantA ooDchipeTTi gunDepOTutO paDipOtADu

tAtAlanADu ee kOrTulEvvirA
koTTukunna cheTTukindE teerpurA
budduDiki bOdhinchina bOdhicheTTurA..naayanaa
veeDi bodha vinTE nuvvu buddhuDi avutAvurA

sangeetam:- chakravarti
gaanam:- bAlu

Labels: , ,


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]